కరోనా : ఇటలీ లోని తోఫెతు లో యిర్మీయా ప్రవచనాలు నెరవేరాయా?

Screen Shot 2020-04-06 at 11.01.04 AM.png

 తరువాత ప్రశ్న: యిర్మీయా గ్రంథము 7:32 లో చెప్పబడిన ప్రవచనము ఇటలీ లోని తోఫెతులో నెరవేరిందా? ఈ ప్రవచనము చూద్దాము: 32. కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.

    కొంతమంది ఏమంటున్నారంటే, ఇటలీ లోని తోఫెతు లో కరోనా వలన చాలా మంది చనిపోయారు. వారిని పాతిపెట్టుటకు కూడా స్థలము లేదు. యిర్మీయా చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది అని అంటున్నారు. అయితే, ఇటలీ లో ఉన్న తోఫెతుకు, యిర్మీయా 7 లో ఉన్న తోఫెతుకు అసలు ఎలాంటి సంబంధము లేదని మనం గ్రహించాలి. ఈ తోఫెతు యెరూషలేము సమీపములో బెన్ హిన్నోము లోయలో ఉంది. ఇశ్రాయేలీయులు ఈ లోయలో మానవ బలులు అర్పిస్తున్నారు. వారు దేవుని వైపు నుండి తొలగిపోయి అన్య జనుల విగ్రహములవైపుకు వెళ్లిపోయారు.31 వచనము లో చదువుతున్నాము.

అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను

 దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న

 తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు. 

   ఆ మాటలు మీరు గమనించండి: బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతు. తోఫెతు అంటే తోఁఫు  అనే పదములో నుండి వచ్చింది. అంటే డ్రమ్ అని అర్థము. ఇశ్రాయేలీయులు ఈ లోయలో మొలెకు అనే సూర్య దేవతకు విగ్రహారాధన చేసేవారు.తమ కుమారులను, కుమార్తెలను ఆ దేవతకు అర్పించేవారు. ఆ చిన్న పిల్లలు పెట్టె కేకలు వినిపించకుండా వారు డ్రమ్ములు వేసేవారు. దానిని బట్టి ఆ ప్రాంతానికి తోఫెతు లేక ‘డ్రమ్ములు’ అనే పేరు వచ్చింది. ఇశ్రాయేలీయులు చేసే ఘోరాలు చూడలేక దేవుడు వారిని తన ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు.వారు దేవుని మాట వినలేదు. అప్పుడు దేవుడు యిర్మీయా ద్వారా ఈ ప్రవచనము చేశాడు. ఆ ప్రవచనము బబులోనీయుల ద్వారా దేవుడు నెర వేర్చాడు. క్రీ పూ 586 లో నెబుకద్నెజ్జరు రాజు యెరూషలేమును ముట్టగించి అక్కడ ఉన్న దేవుని ఆలయాన్ని నాశనం చేసి యూదులను హతమార్చాడు. ఆ విధముగా యిర్మీయా చేసిన ప్రవచనం క్రీ. పూ 586 లో నెరవేరింది. దానికి ప్రస్తుతం ఉన్న కరోనాకి ఎలాంటి సంభందం లేదు. యిర్మీయా 7:32 లో ‘పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును’ అన్న మాటలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇటలీ లో వేల మంది చనిపోయిన మాట వాస్తవమే. అయితే పాతి పెట్టుటకు స్థలము లేనంత ఘోరముగా వారి పరిస్థితి లేదు. వారందరినీ సమాధి పెట్టెల్లో పెట్టి అంతిమ సంస్కారాలు బాగానే చేస్తున్నారు.

కాబట్టి, యిర్మీయా 7:32 కి ఇటలీ లోని తోఫెతుకు ఎలాంటి సంభందము లేదు.