కరోనా లో అంత్య క్రీస్తు 666 ఉందా?

666corona.png

 మరొక ప్రశ్న, కరోనా లో 666 సంఖ్య ఉందా? ఇది సోషల్ మీడియా లో విపరీతముగా వైరల్ అయ్యింది. CORONA లో 6 అక్షరాలు ఉన్నాయి. ఇంకో వైపు C అంటే 3, O అంటే15, R అంటే18, O అంటే15, N అంటే 14, A అంటే 1, మొత్తం కలిపితే 66. దీనిని బట్టి కరోనా లో 666 ఉంది అని అంటున్నారు. అయితే, కరోనా కి 666 కి ఎలాంటి సంభందం లేదని మనం గ్రహించాలి. ఇలాంటి గణాంకాలు చరిత్రలో చాలా మంది, చాలా సార్లు చేశారు. గ్రీకు, హెబ్రీ, లాటిన్ భాషల్లో అక్షరాలకు సంఖ్యలు పెట్టి 666 ను రకరకాలుగా చూపించవచ్చు. HITLER పేరులో 6 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆయనే అంత్య క్రీస్తు అని చాలా కాలము అన్నారు. నీరో, కలిగ్యుల, డయోక్లిషియన్, హిట్లర్, స్టాలిన్, ముస్సోలిని, జాన్ కెన్నెడీ, డోనాల్డ్ ట్రంప్ ఇలా చాలా మందికి ఈ 666 కలిపి అంత్య క్రీస్తు అని పిలిచారు. మనకు కనిపించే ప్రతి ప్రముఖ నాయకుణ్ణి ఈయనే అంత్య క్రీస్తు అని చెబితే మనం నవ్వుల పాలు అవుతాము తప్ప మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. 666 అనేది అంత్య క్రీస్తు సంఖ్య.  క్రైస్తవ సంఘము భూమి మీద ఉన్నంత కాలము అంత్య క్రీస్తు కనిపించడు. సంఘము ఎత్తబడిన తరువాత ఏడేండ్ల శ్రమలు భూమి మీదకు వస్తాయి. ఈ విషయాలు మీకు సుళువుగా అర్థం కావాలంటే మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి బైబిలు ప్రవచనాలు చార్టులు అనే పేజీ కి వెళ్లి ఈ చార్టు డౌన్ లోడ్ చేసుకోండి. నేను వ్రాసిన ‘ఆఖరి రోజులు’ పుస్తకం చదవండి. 666 ఎప్పుడు వస్తుందో ఈ పుస్తకములో నేను వివరించాను. కొంతమంది పూర్వము నెరవేరిన ప్రవచనాలను ఇప్పుడు కరోనాకు రుద్దుతున్నారు. మరికొంతమంది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనాలను ఇప్పుడు కరోనాకు రుద్దుతున్నారు. రెండుకోణాలు మంచివి కాదు. 

     నిన్న ఒక క్రూజ్ షిప్ సముద్రములో చిక్కుకొంది.అందులో వందలాది మంది ప్రయాణికులుఉన్నారు. వారిలో ఎంతో మందికి కరోనా వైరస్ సోకింది. జ్వరం తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ‘రక్షించండి’ ‘రక్షించండి’ అని అనేక  మంది ఓడ కిటికీలు ఎక్కి కేకలు వేస్తున్నారు. అనేక దేశాలు ఈ ఓడను తమ తీరానికి రావటానికి వీల్లేదు అని తిరస్కరిస్తున్నాయి. వారిని రక్షించేది ఎవరు? ఈ లోకం మొత్తము పాపము అనే వైరస్ తో నిండిన ఓడ వలె ఉంది. మనలను రక్షించేది ఎవరు? యేసు క్రీస్తు సువార్త  అదే.పాప రోగముతో నిండి ఉన్న ఈ ఓడలో నుండి మనలను రక్షించడానికే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువ వేయబడింది అందుకే. మరణించి, తిరిగి లేచింది అందుకే.