క్రీస్తు కొరకు మీ హృదయము’

‘క్రీస్తు కొరకు మీ హృదయము’ అనే అంశాన్ని ఈ రోజు మనము చూద్దాము. ఇంతకు ముందు రెండు కార్యక్రమాల్లో 8 విషయాలు మీ ముందు వుంచాను. 

మొదటిగా, A Stamp of Significance 

మన హృదయము ప్రత్యేకమైనది.దేవుడు మన హృదయాల మీద తన ముద్రను వేసి ప్రత్యేకముగా మనుష్యులను సృష్టించాడు.

రెండోదిగా, A Sign of Sickness 

మన హృదయానికి పాప రోగం అంటుకుంది. మన హృదయము దేవుని యొద్ద నుండి

తొలగిపోయినప్పుడు దానికి పాపపు రోగము అంటుకుంది. ఆ పాప రోగము వలన మన హృదయము, మన శరీరం, మన సమాజం పాడయిపోయినాయి.

మూడోదిగా, A Seat of Salvation 

మన హృదయము రక్షణ నిలయము. మన హృదయములో యేసు ప్రభువును అంగీకరిస్తే దేవుడు మనలను క్షమించి రక్షిస్తున్నాడు.

నాలుగవదిగా, A Scale of Sincerity 

మన హృదయము మన నిజాయితీకి కొలబద్ద. మన హృదయాలు పరీక్షించి దేవుడు మనలను కొలుస్తాడు.

ఐదవదిగా, 

A Space of Submission 

మన హృదయములో విధేయత మన హృదయములో మనము దేవునికి లోబడాలి. నోటి మాటలు చెబితే సరిపోదు.

ఆరవదిగా,  A Seed of Sensitivity 

మెత్తని హృదయము రాయి లాంటి కఠినమైన మన హృదయాలను మెత్తపరచాలని దేవుడు చూస్తున్నాడు.

ఏడవదిగా, A Spring of Sanctification 

మన హృదయములో పరిశుద్ధత. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని యేసు ప్రభువు తన కొండ మీద ప్రసంగములో చెప్పాడు.

ఎనిమిదవదిగా,  A Seal of Security 

మన హృదయములకు భద్రత దేవుని వాక్యముతో మన హృదయములను భద్రపరచుకోవాలి.

ఈ రోజు మిగిలిన నాలుగు చూద్దాము.

తొమ్మిదవదిగా, A Song of Satisfaction 

మన హృదయములో సంతృప్తి.కీర్తన9:1 లో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను.మన స్తుతిలో మనము మన పూర్ణ హృదయాన్ని ఉంచాలి. అన్యమనస్కముగా మనము దేవుని స్తుతించకూడదు.చాలా సార్లు మనము పెదవులతో దేవుని స్తుతిస్తాము కానీ మన హృదయము ఎక్కడోఉంటుంది. మన శరీరము దేవుని సన్నిధిలో మన హృదయము ఎక్కడో షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటే అటువంటి స్తుతి చప్పగా ఉంటుంది. నా పూర్ణ హృదయముతో నేను దేవుని స్తుతించెదను అని కీర్తనకారుడు అంటున్నాడు. అటువంటి స్తుతి మనము దేవునికి చెల్లించాలి. లేకపోతే దేవుని హృదయానికి సంతోషము ఉండదు. 

   మత్తయి 15:8 లో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది’ 

    కెనడా దేశములో జాన్ స్టెయిన్గార్డ్ అనే క్రైస్తవ గాయకుడు ఉన్నాడు. ఆయన అనేక క్రైస్తవ గీతాలు వ్రాశాడు. లక్షల ఆల్బమ్ లు అమ్మాడు. మీ మధ్యలో ‘నాకు దేవుని మీద నమ్మకం’ లేదు అన్నాడు.ఇంత కాలం పాటలు పాడావు, సంగీతము వాయించావు, CD లు అమ్మావు. ఎందుకు ఇప్పుడు దేవుని విడిచిపెట్టావు?  ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది’ వారి హృదయములో దేవుడు లేడు. వారి వ్యక్తిగత జీవితములో దేవునితో సహవాసం లేదు. అందుకనే వారి హృదయములో ఆనందం లేదు. ‘యథార్థహృదయులకొరకు ఆనందము విత్తబడి యున్నది’ అని  కీర్తన 97:11 లో మనము చదువుతాము. 

    సంతృప్తి లేకుండా ఆనందం లేదు. రోమ్ లో అనేక సమాధుల తోటలు ఉన్నాయి. రోమన్ భర్తలు తమ భార్యల సమాధుల మీద జ్ఞాపకార్థముగా కొన్ని మాటలు వ్రాసేవారు.మంచి స్నేహితురాలు, దయకలిగిన వ్యక్తి, విధేయురాలు, ‘ఇంట్లో సంతృప్తి కలిగి ఉండేది’ అని వ్రాసేవారు. ఆమెకు సంతృప్తి ఉంది కాబట్టే, ఆమె భర్తకు ప్రశాంతత దొరికింది.

A joyful heart is good medicine (సామెతలు17:22) 

సంతోషకరమైన హృదయము మంచి మందు మనము దానిని రివర్స్ చేశాము. సంతోషము కోసము మందులు వేసుకొంటున్నాము. ఒక మహిళ నా ఆఫీస్ కి వచ్చింది. ‘డాక్టర్, నాకు సంతోషము లేదు, ఆందోళన తప్ప నాకు ఆనందం లేదు, నాకు మందులు వ్రాయండి’ అంది. ఆమె చాలా ధనవంతురాలు అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు.నేను ఆమెతో ఏమన్నానంటే, ‘సంతోషము మందులతో వచ్చేది కాదు. దేవుడు ఇచ్చే సంతృప్తిలో నుండి మాత్రమే సంతోషం వస్తుంది. బైబిల్ చదవండి, కీర్తన 23 తో మొదలుపెట్టు’ అన్నాను. ఆమె ఏమందంటే, ‘నేను బైబిల్ చదవను, నేను బౌద్ధ మతస్తురాలను’ అంది. ఆమెకు బౌద్ధమతము కూడా సరిగా అర్థం కాలేదు.

    బుద్ధుడు ఈ ప్రపంచములో వున్న సమస్యలను, బాధలను, రోగాలను చూశాడు.తపన చెందాడు, తపస్సు చేశాడు. ఒక మార్గాన్ని నేను మీకు చూపిస్తాను అన్నాడు. మన ఆందోళన,అభద్రతాభావము, విసుగు, బాధ, అనారోగ్యము వీటన్నికి మూలము మనము ఆత్మ ను నమ్మడమే.మనిషికి ఆత్మ లేదు అన్నాడు. మనిషి ఆత్మను నమ్మకూడదు అన్నాడు. ఆత్మను నమ్మితే వచ్చేది ‘దుఃఖ’. తమకు లేని వాటి కోసం మనుష్యులు పరుగెడుతారు. తమకు అవసరం లేని వాటి కోసం వారు ప్రాకు లాడుతారు. అందుకనే వారికి సంతృప్తి లేదు. అందుకనే వారికి ‘దుఃఖం’ కలుగుతుంది. దానికి వ్యతిరేకం ‘సుఖ’ అన్నాడు.‘సుఖ’ లో సంతోషము, సంతృప్తి ఉన్నాయి. అశాశ్వతమైన వాటి కోసము, అర్థం లేని వాటి కోసం మనం ప్రయాసపడుతాము.అందుకనే మనకు సంతోషం లేదు అన్నాడు. ఇది నాకు అవసరం లేదు అనే గ్రహింపు వచ్చినప్పుడే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. బుద్ధుడు ఆ గ్రహింపుతో తన రాజ్యాన్ని కూడా వదలిపెట్టి వెళ్ళాడు. ఇంగ్లీష్ కవి షేక్స్పియర్ హెన్రీ 4 అనే నవల వ్రాశాడు. ఆ నవలలో ప్రిన్స్ హాల్ అనే యువరాజు మనకు కనిపిస్తాడు.

ఆయన నివసిస్తున్న రాజ్యములో రాజులకు, రాజ కుమారులకు అధికారము తప్ప రెండవ యావ లేదు. అధికారము కోసం వారు చేయని పని లేదు. అయితే వారికి మనశాంతి లేని పరిస్థితి వచ్చింది. నిద్ర కూడా పట్టని స్థితి వచ్చింది. షేక్స్ పియర్ యేమని వ్రాస్తాడంటే, 

O sleep, O gentle sleep 

Nature’s soft nurse,

 how have I frightened thee, 

That thou no more wilt

 weight my eyelids down, 

And steep my senses in forgetfulness? 

ఓ నిద్రా, ఓ చల్లని నిద్రా 

ప్రకృతి యొక్క చల్లని తల్లీ, 

నేను నిన్ను భయపెట్టానా? 

నా కనురెప్పలకు భారం కలిగించకుండా, 

నా భావోద్రేకాలను మరుగుచేయకుండా

ఎక్కడకు పారిపోయావు? 

    ప్రిన్స్ హల్ కు ఆ జ్ఞానోదయం కలిగింది.‘కింగ్ హెన్రీ రాజయ్యాడు, సింహాసనం ఎక్కాడు. అయితే అతనికి శాంతి, సంతృప్తి లేవు’ అవి నాకు అక్కర లేదు అన్నాడు.బుద్ధుడు సందేశం అదే: నీకు ఆ రాజ్యము ఎందుకు? కిరీటాలు ఎందుకు? సింహాసనాలు ఎందుకు? కనీసము నిద్ర కూడా పోలేని స్థితిలో నీవు ఉన్నావు. నీ భౌతిక  కోరికలు త్యజించు. యేసు క్రీస్తు ఇచ్చే సంతృప్తి అదికాదు. ఆయన ఇచ్చేది ఇహలోక సంభందమైన కోరికలు త్యజించుట వలన కలిగే సంతృప్తి కాదు. ఆయనతో ఏర్పరచుకొనే వ్యక్తిగత సంభందములోనుండి కలిగే సంతృప్తి. యూదులు ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు ‘షాలోమ్’ అని పలుకరించుకొంటారు. ‘షాలోమ్’ అనే మాటలో‘శాంతి, సంపూర్ణత, సంతృప్తి’ అనే అర్ధాలు ఉన్నాయి. అది దేవునితో సహవాసములో నుండి పుట్టేది. బౌద్ధ మతములో బుద్ధునితో సహవాసము లేదు, ఇస్లాం లో మొహమ్మద్ తో సహవాసం లేదు. యేసు క్రీస్తు ఇచ్చే సహవాసం విశ్వాసికి సంతృప్తిని ఇస్తూ ఉంది.క్రీస్తు యొక్క మహిమలో ఇహలోక సంభందమైనవి మరుగుచేయబడుచున్నవి. 

     అపోస్తలుడైన పౌలు మాటల్లో అది మనకు కనిపిస్తుంది.క్రీస్తు నందు ఆయన హృదయం సంతృప్తి చెందింది. ఇహలోక సంబంధమైన వాటి కోసం ఆయన తాపత్రాయపడలేదు. సంతృప్తి లేని వారు చేసే పాపాలకు హద్దు ఉండదు. హిట్లర్ ఒక రోజుల్లో చాలా అసహనముతో ఉన్నాడు. ఒక్క జర్మనీ ని పాలించడం అతని హృదయానికి సంతృప్తి కలిగించలేదు. బ్రిటన్ ప్రధాని నెవిల్ చాంబర్లిన్ హిట్లర్ తో శాంతి ఒప్పందం చేసుకొన్నాడు. హిట్లర్ కి కూడా తనకు వలె చిన్న, చిన్న కోరికలు ఉంటాయి అని నెవిల్ చాంబర్లిన్ అనుకొన్నాడు. చాంబర్లిన్ చేసిన పెద్ద పొరపాటు అదే. హిట్లర్ హృదయములో ఉన్న లోతైన గొయ్యిని ఆయన చూడలేకపోయాడు. ఒక రాష్ట్రం, ఒక దేశం ఆక్రమించుకొంటే హిట్లర్ కి తృప్తి ఉండదు. అతనికి ప్రపంచం మొత్తం కావాలి. అతని జీవితమంతా అసంతృప్తితో రగిలిపోయాడు. సాతాను కూడా అదే. దేవుడు ఇచ్చినదానితో  ఆ దేవదూత సంతృప్తి చెందలేదు. దేవునితో ఉన్న సంభందముతో అతను సంతృప్తి చెందలేదు. దేవునికి స్తుతులు చెల్లించడం మానివేశాడు. అసంతృప్తితో దేవుని మీద తిరుగుబాటు చేసి చివరకు పతనము చెందాడు. ఆదాము, హవ్వలు కూడా దేవుడు వారికి ఇచ్చిన అపురూపమైన  సహవాసం, చక్కటి ఏదెను తోటలతో సంతృప్తి చెందలేదు.మా కింకా కావాలి ప్రాకులాడారు, పతనం చెందారు. 

    క్రీస్తు నందు ఈ రోజే సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ‘దేవుడు నాకు అది ఇస్తే, నాకు సంతృప్తి కలుగుతుంది, దేవుడు నాకు ఇది ఇస్తే నాకు సంతృప్తి కలుగుతుంది’ అనుకొనే వారికి ఎప్పటికి సంతృప్తి కరమైన హృదయం కలుగదు.ఈ రోజు మీకున్న సంపదలు భవిష్యత్తులో ఇంకా పెరుగవచ్చు, తగ్గిపోవచ్చు, ఇలాగే ఉండవచ్చు, అయితే మీ హృదయం యొక్క సంతృప్తి వాటి మీద ఆధారపడితే ఆ సంతృప్తి ఎక్కువ కాలం నిలువదు.

కీర్తన 37: 4. యెహోవానుబట్టి సంతోషించుము; ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. 

‘దేవుడు ముందు నా హృదయ వాంఛలను తీర్చితే అప్పుడు నేను దేవుని బట్టి సంతోషిస్తాను’ అని మనము అనుకొంటాము. అది పొరపాటు. ముందు మనం దేవుని యందు ఆనందించాలి, అప్పుడు తన కోరికలు మన హృదయములో పెడుతాడు, వాటిని ఆయనే తీర్చి మన సంతోషాన్ని అధికం చేస్తాడు. పాస్టర్ లూయీ గిగ్లియో రవి జకరియస్ గారు చనిపోక ముందు చివరిగా ఆయనను చూడటానికి వెళ్ళాడు. కలిసిన తరువాత ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టాడు. అందులో రవి జకరియస్ ముఖములో సంతోషం మనము చూస్తాము. ఆ దశలో క్రీస్తునందు ఆయన హృదయము ఆనందిస్తూవుంది. అదే A Song of Satisfaction 

పద వదిగా, A Shield of Sobriety 

A Shield of Sobriety 

    మన హృదయాలను దృఢపరచేది ఎవరు? 

సామెతలు12:25 లో మనము చదువుతాము: ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును. ఇంటా, బయటా మనలను అనేక విచారములు కృంగదీస్తున్నాయి. మనకు నెమ్మది ఎలా కలుగుతుంది? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, 

కొలస్స 3:15 

క్రీస్తు అను గ్రహించు సమాధానము

మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి

ఎంత చక్కటి మాట. ఈ రోజు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయమును ఏలితే, మీకు సమాధానము కలుగుతుంది. యోహాను సువార్త 14 లో యేసు ప్రభువు 

కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పాడు: 

 మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు

నాయందును విశ్వాస ముంచుడి.27. శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి,వెరవనియ్యకుడి.

                     యోహాను 14:1,27 

ప్రభువైన యేసు క్రీస్తు మీద గురి పెట్టకపోతే మన హృదయాలు కలవరపడటం ఖాయం. కలవరపడితే మనకు ధైర్యము ఉండదు. ధైర్యము లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం కష్టము. 1940 మే నెలలో రెండవ ప్రపంచ యుద్ధం ఉధృతముగా సాగుతున్నది. నాజీ సైన్యాలు ఫ్రాన్స్ దేశాన్ని ఆక్రమించుకొన్నాయి. డన్ కర్క్ బీచ్ మీద దాదాపు 300,000 మంది మిత్రపక్షాల సైనికులు చిక్కుకుపోయారు. నాజీ సైన్యాలు వారిని హతమార్చడానికి చుట్టుముట్టాయి.అలాంటి సమయములో వారిని ఎలా విడిపించాలోఅర్థం కాని పరిస్థితి కలిగింది. ఇంగ్లాండ్ ప్రజలు తమ దేశములో ఉన్న చిన్న చిన్న బోట్లలో సముద్రములో బయలుదేరారు.హిట్లర్ ని చూసి వారు భయపడలేదు.ఆ చిన్న బోట్లలో వారు సముద్రము దాటి డన్ కర్క్ బీచ్ మీద చిక్కుకుపోయిన  తమ సైనికులను కాపాడుకున్నారు. ఈ రోజుకీ డన్ కర్క్ అనే మాట వినిపిస్తే బ్రిటీష్ వారికి ఎంతో ధైర్యము వస్తుంది.‘క్రీస్తు’ అనే మాట వినిపిస్తే మనకు కూడా ధైర్యము కలుగుతుంది. మన బోటు చిన్నదే కావచ్చు. అయితే ఆయన మన బోటులో ఉన్నాడు. రోడ్నీ స్టార్క్ అనే చరిత్ర కారుడు తన పుస్తకములో వ్రాశాడు.

కరోనాను మించిన ప్లేగ్ వ్యాధులు ప్రపంచాన్ని వణకించినప్పుడు క్రైస్తవులు ధైర్యముగా ఉండి ఇతరులకు సేవ చేశారు. వారు క్రీస్తు వైపు చూచి ధైర్యముగా వున్నారు.

A Scent of Supplication 

నీ హృదయములో ప్రార్థన ఉండాలి. ఫిలిప్పి 4:6-7 మనము చదువుతాము

6. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.

    మన హృదయములలో దేవుని సమాధానం ఉండాలంటే మనము ఏమి చేయాలో అపోస్తలుడైన ఇక్కడ వ్రాస్తున్నాడు: ప్రతి విషయములో కృతజ్ఞతాభావముతో దేవుని మన విన్నపములు తెలియజేయాలి 

119 కీర్తన: 145 వచనము: యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను 

A scent of supplication హృదయపూర్వకముగా మనము చేసే ప్రార్థనలు దేవునికి ఇంపైన సువాసనగా ఉంటున్నాయి.

   మన హృదయములలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన పక్షమున విఙ్ఞాపణ చేస్తున్నాడు. రోమా పత్రిక 8:26-27 లో మనము ఆ సత్యము చదువుతాము. 26. అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు. 27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు.

A Symbol of Sacrifice 

హృదయములో సమర్పణ ఉంది. హృదయములో ప్రేమ ఉంది.ప్రేమకు గుర్తుగా మనము హృదయాన్ని చూపిస్తూ ఉంటాము. 1 తిమోతి 1:5 లో అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.

 ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షినుండియు,నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. 

క్రైస్తవ్యము యొక్క  సారాంశము ఏమిటి ? పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. దేవుడు మనలను తన హృదయములో ప్రేమించాడు. ఆ ప్రేమే ఆయనను భూలోకానికి తెచ్చింది. ఆ ప్రేమే ఆయనకు మానవ రూపం ఇచ్చింది. ఆ ప్రేమే ఆయనను సిలువ మీదకు పంపింది. అది మన కొరకు త్యాగము చేసిన ప్రేమ. క్రైస్తవ హృదయములో ప్రేమ ఉంది. ఆ ప్రేమ త్యాగము చేసే ప్రేమ. 

A Symbol of Sacrifice 

     ఆస్కార్ వైల్డ్ ఒక ప్రఖ్యాత నవలా రచయిత. ఆయన నవలల్లో ఎంతో అశ్లీలత ఉండేది. దానినే ప్రేమగా ఆయన వర్ణించేవాడు. ఆయన సమాధి ఫ్రాన్స్ దేశములో పారిస్ నగరములో ఉంది. ప్రజలు దానిని సందర్శించి దానిని ముద్దు పెట్టుకొంటారు. దాని మీద హృదయం గుర్తువేస్తారు. ఆ సమాధి మీద కూడా అశ్లీలత మనకు కనిపిస్తుంది. ఆస్కార్ వైల్డ్ తన నవలలలో అశ్లీలతనే ప్రేమగా చూపించాడు. అతని ఫిలాసఫీ ఏమిటంటే  నా శరీరం అడిగింది దానికి ఇవ్వాలి. దానికి ఆయన ప్రేమ అని పేరు పెట్టుకొన్నాడు. చాలా మంది ప్రేమకు అలాంటి నిర్వచనమే ఇస్తున్నారు. అందుకనే అతని సమాధి మీద హృదయం గుర్తులు గీస్తున్నారు. దేవుని ప్రేమ అలాంటిది కాదు.అది ఇచ్చేది, అందులో స్వార్ధం లేదు. 

    జార్జ్ ఆర్వెల్ (1903-1953), C.S లూయిస్ (1898 – 1963) గొప్ప రచయితలు.ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాలు వారు వ్రాశారు. కోట్లాది రూపాయలు సంపాదించారు.ప్రేమ కోసం వారి హృదయాలు తపించినాయి.వారి ఇద్దరి జీవితాలు నేను గమనిస్తే, ఇద్దరూ డెత్ బెడ్ పెళ్లిళ్లు చేసుకొన్నారు.జార్జ్ ఆర్వెల్ 1984, ఆనిమల్ ఫార్మ్ లాంటి గొప్ప పుస్తకాలు వ్రాశాడు. 1947 లో ఆయనకు టుబర్ క్యూలోసిస్ వచ్చింది.1949 కల్లా ఆయన ఆరోగ్యం క్షీణించింది.ఆ సంవత్సరం అక్టోబర్ నెల 13 వ తేదీన జార్జ్ ఆర్వెల్ హాస్పిటల్ లో మంచం మీద పండుకొని ఉన్నాడు. సోనియా బ్రౌ నెల్ అనే యువతిని పెండ్లి చేసుకొన్నాడు. మంచం మీద నుండి లేచే శక్తి కూడా ఆయనకు లేదు. ఆయన బ్రతికేది ఇంకో మూడు నెలలే.ఆ స్థితిలో సోనియా ని పెండ్లి చేసుకొన్నాడు. ఆ వివాహానికి వెళ్లిన చాలామంది మనస్సులో కలిగిన ప్రశ్న: జార్జ్ మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. రేపో మాపో చనిపోయే స్థితిలో ఉన్నాడు. సోనియా కి నిజముగా జార్జ్ మీద ప్రేమ ఉందా? లేక అతని ఆస్తి మీద కన్ను వేసిందా? 

     రెండవ డెత్ బెడ్ పెళ్లి C.S. లూయిస్ గారిది. C.S. లూయిస్ క్రానికల్స్ అఫ్ నార్నియా, మియర్ క్రిస్టియానిటీ, స్క్రూ టేప్ లెటర్స్  లాంటి అనేక గొప్ప పుస్తకాలు వ్రాశాడు. జాయ్ గ్రేషమ్ అనే మహిళను ఆయన వివాహం చేసుకొన్నాడు.1957 మార్చ్ 21, ఆమె కాన్సర్ తో బాధపడుతూ హాస్పిటల్ లో బెడ్ మీద ఉంది. ఆ బెడ్ ప్రక్కననిలబడి C.S. లూయిస్ ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. ఆ వివాహానికి వెళ్లిన చాలామంది మనస్సులో కలిగిన ప్రశ్న: ఈమె మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉంది. రేపో మాపో చనిపోయే స్థితిలో ఉంది. లూయిస్  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రచయిత గా ఉన్నాడు. కోటీశ్వరుడుగా ఉన్నాడు.ఈయన జాయ్ ని ఎందుకు పెళ్లి చేసుకొంటున్నాడు? 

నిజముగా ప్రేమ అంటే ఇది అనుకొన్నారు. ఎంతో  గొప్ప సంతోషము లూయిస్ లో ఆ రోజు కనిపించింది అని వారు అన్నారు.’యుక్త వయస్సులో నేను పొందని సంతోషాన్ని ఇప్పుడు పొందుతున్నాను’ అని C.S.లూయిస్ అప్పుడు అన్నాడు. స్వార్ధం లేని ప్రేమలో సంతోషం ఉంది. హృదయము A Symbol of Sacrifice.దేవుడు అలాంటి ప్రేమను మనకు చూపించాడు. యేసు ప్రభువు త్యాగము తో కూడిన ప్రేమను మనకు చూపించాడు. అటువంటి ప్రేమ కలిగిన హృదయము కలిగివుండుటకు  మనము ప్రయత్నించాలి.