గో మూత్రం: కరోనాను నయం చేయగలదా?

Cowurinedrinking3312020.pn.png

ఒకాయన వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టాడు. గోమూత్రం త్రాగితే కరోనా మన జోలికి రాదు. ఆయన మాటలు నమ్మి కొంతమంది గో మూత్రం త్రాగుతున్నారు. ఆవులు అంటే మనకు ప్రేమ ఉండ వచ్చు. అయితే వాటి యూరిన్ లో ఎలాంటి ఇమ్మ్యూనిటి ఉండదు. ఆ ఆవు కు ఏవన్నా జబ్బులు ఉంటే, ఆ జబ్బులు కూడా మనకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు గోమాత్రానికి దూరముగా ఉంటే మంచిది.ప్రస్తుతము మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం హైడ్రాక్సీ క్లోరోక్విన్, క్లోరోక్విన్, రెండేసివిర్ మందులు ఆశాజనకముగా ఉన్నాయి. నేను హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వ్రాస్తున్నాను. దేవుని కృప వలన ఇలాంటి మందులు కరోనా రోగులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక మంచి వార్త ఏమిటంటే, కరోనా వైరస్ సోకిన వారు అధిక శాతం ప్రాణాలు కోల్పోకుండా బయటపడుతున్నారు. గాలి పీల్చుకోవడం కష్టముగా ఉన్న వారికి వెంటిలేటర్ వాడాల్సి ఉంది.