ప్రాయశ్చిత్త దినము The Day of Atonement 

netisandesham2.jpg

ఈ రోజు లేవీయ కాండము 16 అధ్యాయము నుండి ప్రాయశ్చిత్త దినము The Day of Atonement 

గురించి కొన్ని సత్యాలు చూద్దాము. పాత నిబంధనలో అనేక మధురమైన సత్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. రత్నాలు అందరికీ దొరకవు. సమయము తీసుకొని, త్రవ్వే వాడికి, వెదికే వాడికి, శ్రమపడే వాడికే దొరుకుతాయి. పాత నిబంధన లోని రత్నాలు మనకు దొరకాలంటే మనము కూడా సమయము తీసుకొని దేవుని వాక్యాన్ని త్రవ్వాలి.ఈ లేవీయ కాండము 16 అధ్యాయము బైబిల్ గ్రంథములో చాలా ముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటి. మీరు దీనిని ధ్యానిస్తే అనేక రత్నాలు మీకు దొరుకుతాయి.

అది ఒక ప్రాయ శ్చిత్త దినము.The Day of Atonement 

     ఈ సత్యాలు మీకు సులువుగా అర్ధము కావాలంటే ఈ చార్ట్ చూడండి. ఈ చక్కటి చార్ట్ కావలసిన వారు మా వెబ్ సైట్ www.doctorpaul.org  కి వెళ్లి బైబిల్ ప్రవచనాల చార్టులు అనే పేజీ చూడండి. డౌన్ లోడ్ చేసుకోండి. ఇశ్రాయేలీయుల పాప పరిహారార్ధము కోసము దేవుడు ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేక దినము కేటాయించాడు. హెబ్రీ భాషలో దీనిని యోమ్ కిప్పుర్ అన్నారు. ప్రతి సంవత్సరము ఏడవ నెల 10 వ తేదీన ఈ పండుగ జరుగుతుంది. ఆ రోజు ఇశ్రాయేలీయులందరూ దేవుని సన్నిధికి వస్తారు. వారి పాపములు ఒప్పుకొంటారు. ప్రధాన యాజకుడు ప్రజల తరుపున ప్రత్యక్ష గుడారములో బలులు అర్పిస్తాడు.

    ఈ ప్రాయశ్చిత్త దినము గురించి 7 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశ పడుచున్నాను.

1.The Day of Atonement is a Day of the Priest 

     మొదటిగా, ఈ పాప పాయశ్చిత్త దినము ఒక యాజకుని దినము. ఒక ప్రధాన యాజకుడు మనకు కావాలి. పాయశ్చిత్త దినము రోజు ఇశ్రాయేలీయులు అందరూ ప్రత్యక్ష గుడారము దగ్గర కూడుకొన్నారు. వారిలో అనేక గోత్రాల వారు ఉన్నారు, అనేక వర్గాల వారు ఉన్నారు. అనేక ప్రాంతాల వారు ఉన్నారు. అయితే, వారందరికీ ఒక ప్రధాన యాజకుడు అవసరము. ప్రధాన యాజకుడు లేకుండా వారు ఏమీ చేయలేరు. పాయశ్చిత్త దినము అత్యంత పవిత్రమైన దినము, ప్రధాన యాజకుడు అంత్యంత పవిత్రమైన వ్యక్తి, ప్రత్యక్ష గుడారము అత్యంత పవిత్రమైన స్థలము, రక్త ప్రోక్షణ అత్యంత పవిత్ర మైన బలి. కాబట్టి, ఈ రోజు ఇశ్రాయేలీయుల పక్షమున అత్యంత పవిత్రమైన వ్యక్తి, అత్యంత పవిత్రమైన రోజున, వారికి అత్యంత పవిత్రమైన స్థలములో అత్యంత పవిత్రమైన బలిని అర్పిస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు రాబోయే ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ పాయశ్చిత్త దినము రోజున ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకుడు లేకుండా ఒక్క పని కూడా జరుగదు. పాప పరిహారార్థ బలి చేసేది ప్రధాన యాజకుడే, దహన బలి చేసేది ప్రధాన యాజకుడే, ధూపం వేసేది ప్రధాన యాజకుడే, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేది ప్రధాన యాజకుడే, రక్త ప్రోక్షణ చేసేది ప్రధాన యాజకుడే.

     ఈ రోజు మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు క్రీస్తు కూడా అంతే. ఆయన లేకుండా మనకు రక్షణ లేదు, ఆయన లేకుండా మనకు పాపక్షమాపణ లేదు, ఆయన లేకుండా మనకు నిత్యజీవము లేదు, ఆయన లేకుండా మనకు దేవుని ఎదుట ప్రాతినిధ్యము లేదు.

    4 వచనములో చూస్తే, ప్రధాన యాజకుడు తన బట్టలు మార్చుకొంటున్నాడు. సన్న నార బట్టలు కట్టుకొంటున్నాడు. ప్రధాన యాజకుడు తగ్గించుకొంటున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు కూడా తన బట్టలు మార్చుకున్నాడు.తన మహిమ వస్త్రాలు పక్కన పెట్టి మన కోసము దాసుని దుస్తులు ధరించాడు. తన దైవిక మహిమను పక్కన పెట్టి మానవ స్వరూపము ధరించాడు.

2.The Day of Atonement is a Day of Propitiation 

    రెండవదిగా ఈ పాయశ్చిత్త దినము బలుల దినము. రెండు రకాల బలులు అక్కడ జరుగుతున్నాయి. పాప పరిహారార్థ బలులు, దహన బలులు. అవి రెండు వర్గాల వారి కోసము జరుగుతున్నాయి. యాజకులు, ప్రజలు యాజకుడు ముందు తన కోసము, తన ఇంటి వారికోసము బలులు చేస్తున్నాడు. తరువాత ఇశ్రాయేలీయులందరి కోసము బలులు చేస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు తన కోసము బలులు చేసుకోలేదు. ఎందుకంటే ఆయన పాపము లేని,దేవుని పరిశుద్ధుడు. ఆయన సిలువ మీద చేసిన బలి ఆయన కోసము కాదు, అది మన కోసము మాత్రమే. మన పాపముల కోసము మాత్రమే.

    హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మనము చదువుతాము.

“ప్రతి యాజకుడు… పాపములను తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఆయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించెను” (హెబ్రీ 10:11-13) 

    ఈ పాయశ్చిత్త దినము రోజు మీరు ప్రత్యక్ష గుడారము దగ్గర నిలబడితే ఎటు చూసినా బలులే. అక్కడ కోడె దూడలు, పొట్టేళ్లు, మేకలను అర్పిస్తున్నారు. అక్కడ ఎటు చూసినా వాటి రక్తమే మనకు కనిపిస్తున్నది. యాజకుల వస్త్రాల మీద రక్తము కనిపిస్తున్నది, బలి పీఠము దగ్గర రక్తము కనిపిస్తున్నది, ఇత్తడి గంగాళము దగ్గర రక్తము కనిపిస్తున్నది, పరిశుద్ధ స్థలములో రక్తము కనిపిస్తున్నది, అతి పరిశుద్ధ స్థలములో రక్తము కనిపిస్తున్నది, కరుణా పీఠము దగ్గర రక్తము కనిపిస్తున్నది. మన ప్రధాన యాజకుని మీద మనకు రక్తము కనిపిస్తున్నది. కొరడాలతో కొట్టబడిన ఆయన వీపుమీద రక్తము కనిపిస్తున్నది, పెరుకబడిన ఆయన ముఖము మీద రక్తము కనిపిస్తున్నది. ముళ్లకిరీటము మొత్తబడిన ఆ తల మీద రక్తము కనిపిస్తున్నది. మేకులు కొట్టబడిన ఆయన చేతుల్లో, కాళ్లలో రక్తము కనిపిస్తున్నది.

పొడవబడిన ఆయన ప్రక్కలో రక్తము కనిపిస్తున్నది.  రక్తము లేకుండా రక్షణ లేదు. ప్రభువైన

యేసు క్రీస్తు ఒక గిన్నె పట్టుకొని ఏమన్నాడు? 

ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న

 నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన. (లూకా 22:20) 

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయములో పౌలు గారు వ్రాశాడు. “ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు  క్షమాపణ మనకు కలిగియున్నది” (ఎఫెసీ 1:7) రక్తము గురించి మనము సిగ్గుపడకూడదు. రక్తము అవసరము లేదు అనే వారు ఉన్నారు.అది తప్పు. మన శరీరము రక్తము కొన్ని క్షణాలు ఆగిపోయినా మనకు ప్రాణాలు ఉండవు. రక్తము లేకుండా కొన్ని క్షణాలు కూడా మనము దేవుని సన్నిధిలో నిలబడలేము. పాయశ్చిత్త దినము అది ఒక బలులు చేసే దినము, ఎందుకంటే ఆ రక్త ప్రోక్షణ లేకుండా మనము దేవుని సన్నిధిలో ప్రవేశించలేము.

3.The Day of Atonement is a Day of Purification

మూడవదిగా ఈ పాయశ్చిత్త దినము శుద్ధీకరణ దినము. 4 వచనము చూస్తే, ప్రధాన యాజకుడు స్నానము చేసి తన సేవ ప్రారంభించాడు. తన కొరకు బలులు అర్పించాడు, ఇశ్రాయేలీయులకొరకు బలులు అర్పించాడు. ఇశ్రాయేలీయుల కొరకు చేసిన బలిలో రెండు మేక పిల్లలు తీసుకొని వచ్చారు. వాటిమీద రెండు చీట్లు వేశారు.ఒక చీటీ మీద దేవుని కొరకు అని వ్రాశారు.రెండవ చీటీ మీద ‘విడిచిపెట్టుట’ అని వ్రాశారు.‘దేవుని కొరకు’ అని వ్రాయబడిన చీటీ పడిన మేకను పాపపరిహారార్థ బలిగా అర్పించారు.’విడిచిపెట్టుట’ అని వ్రాయబడిన చీటీ పడిన మేకను అరణ్యములో విడిచి పెట్టారు.ఆ మొదటి మేక ‘దేవుని కొరకు’ రెండవ మేక ‘మన కొరకు’. ఈ రెండు మేకలలో మనకు ప్రభువైన యేసు క్రీస్తు రూపము మనకు కనిపిస్తున్నది. ఆయన దేవుని కొరకు, మన కొరకు. దేవుడు పాపాన్ని సహించడు, ఇశ్రాయేలీయుల పాపములు ఆ మేక మీద మోపబడినట్లు, మన పాపములు ప్రభువైన యేసు క్రీస్తు మీద మోపబడినాయి. పాపము యొక్క శిక్షను ఆయన భరించాడు. ఆ కార్యములో దేవుడు మహిమపరచబడినాడు.

-రెండవ మేక విడిచిపెట్టబడింది.ఇశ్రాయేలీయులు ఆ మేక తల మీద చేతులు ఉంచి తమ పాపాలు ఒప్పుకొన్నారు. 22 వచనములో చదువుతున్నాము: 

ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును.

ఆ రోజు దృశ్యాన్ని మీరొకసారి ఊహించండి. ఇశ్రాయేలీయులందరూ అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. ఆ మేక వారి పాపములు మోసుకొని వారికి దూరముగా అరణ్యములోకి వెళ్ళుచూవున్నది.  ఆ మేకను చూస్తూవున్నప్పుడు మనకు యేసు ప్రభువు గుర్తుకురావట్లేదా? బాప్తిస్మమిచ్చు యోహాను మాటలు 

గుర్తుకు రావటల్లేదా? 

ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల (యోహాను 1:29) 

మన పాపములన్నిటినీ ఆయన మోసుకొని వెళ్ళాడు. మనలను నిత్య నరకానికి ఈడ్చుకొని వెళ్ళటానికి ఒక్క పాపము చాలు. ఆయన ఒక్క పాపము వదలిపెట్టినా మనకు నిరీక్షణ ఉండదు. ఆ మేక ఇశ్రాయేలీయుల సమస్త పాపములను వారి యొద్దనుండి మోసుకు వెళ్లినట్లు, ఈయన మన సమస్త పాపములు మన యొద్ద నుండి మోసుకు పోయాడు. 

‘యేసు రక్తము ప్రతి పాపము నుండి 

మనలను పవిత్రులనుగా చేయును’ 1 యోహాను 1:7

పడమటికి తూర్పు ఎంత దూరమో 

ఆయన మన అతిక్రమములను 

మనకు అంత దూర పరచి యున్నాడు కీర్తన 103:12 

4.The Day of Atonement is a Day of Perfection 

నాలుగవదిగా ఈ ప్రాయశ్చిత్త దినము ఒక పరిపూర్ణమైన దినము. 14 వచనము చూద్దాము. అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.

    ప్రధాన యాజకుడు రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న కరుణాపీఠము మీద ఆ రక్తాన్ని ప్రోక్షించి, దాని ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షించాడు. బైబిల్ లో ఏడు అంటే పరిపూర్ణతను సూచిస్తున్నది. ఇది perfect sacrifice. పరిపూర్ణమైన బలి. ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు చేసిన సిలువ యాగము అది పరిపూర్ణ మైనది. సిలువ మీద సమాప్తము అని కేక వేసి ఆయన ప్రాణము విడిచాడు. ఆ సమయములో సమాధులు తెరువబడ్డాయి. దేవాలయపు తెర మధ్యలో చినిగిపోయింది. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక్కసారి కూడా దేవాలయము తెర  చినిగిపోలేదు. ప్రజలకు, దేవునికి మధ్య ఆ తెర శాశ్వతముగా  నిలిచింది, ఎందుకంటే వారి యొక్క ప్రధాన యాజకుడు అర్పించిన బలులు వారి పాపములను తీసివేయలేకపోయినవి. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. అయితే మన ప్రధాన యాజకుడు అటూ ఇటూ తిరుగుటల్లేదు. 

‘ఆకాశమండలము గుండా వెళ్లిన

దేవుని కుమారుడైన యేసు అను గొప్ప 

ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు. (హెబ్రీ 5:1) 

దేవాలయపు తెర చీల్చుకొని వెళ్ళాడు, ఆకాశ మండలమును చీల్చుకొని వెళ్ళాడు, ఎందుకంటే  గొప్ప ప్రధాన యాజకుడు, ఈయన అర్పించిన బలి పరిపూర్ణమైనది, శాశ్వతమైనది. 

5.The Day of Atonement is a Day of Peace 

ఐదవదిగా ఈ ప్రాయశ్చిత్త దినములో సమాధానము ఉంది, ఇందులో విశ్రాంతి ఉంది. 30,31 వచనాలు చూద్దాము. 

  1. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి

 పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచు నట్లు 

మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.

  1. అది మీకు మహా విశ్రాంతి దినము. 

     ఈ ప్రాయశ్చిత్త దినము అది మహా విశ్రాంతి దినము, ఎందుకంటే మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున ప్రాయశ్చిత్తము చేయబడింది. ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకునికి విశ్రాంతి లేదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నాడు, నిత్యమూ రకరకాల బలులు అర్పిస్తూనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూడా నిలబడే ఉన్నాడు. కూర్చొనే హక్కు ఆయనకు లేదు. అయితే మన ప్రధాన యాజకుడు ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాడు. ఆయన విశ్రాంతి లో ఉన్నాడు. పరిపూర్ణమైన  ప్రాయశ్చిత్తము చేశాడు కాబట్టి మనకు ఈ రోజు ఆయన విశ్రాంతి దొరికింది. ఈ రోజు ఈ హృదయానికి విశ్రాంతి ఉందా? దేవుడు నా పాపములు క్షమించాడో లేదో, నేను ఇంకేమి చేయాలి? అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఆయన చేత ప్రార్ధన చేయించుకొంటాను, ఆమె చేత ప్రార్ధన చేయించుకొంటాను. చాలా మందికి విశ్రాంతి లేదు. ఈ ప్రాయ శ్చిత్త దినము మహా విశ్రాంతి దినము, 

ఎందుకంటే దేవుడు మన సమస్త పాపములను కొట్టివేశాడు. 

    13 వచనములో ప్రధాన యాజకుడు వేసిన ధూపము కరుణాపీఠమును కమ్మివేసింది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. 

ఎఫెసీ 5:2 

 క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు 

 మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను

 బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే

 మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.

2 కొరింథీ 2:15 మేము దేవునికి

 క్రీస్తు సువాసనయై యున్నాము.

6.The Day of Atonement is a Day of Penitence 

ఆరవదిగా ఈ ప్రాయశ్చిత్త దినము దుఃఖపడే దినము.31 వచనము చూద్దాము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ye shall afflict your souls

    ఆ ప్రాయశ్చిత్త దినము రోజున ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారము యొద్ద గుమికూడినప్పుడు, వారికి ఏమి కనిపించింది? ఆ కోడెలు, పొట్టేళ్లు, మేకలు వధించబడుట వారు చూశారు, ఆ మేక పిల్లలు తల్లుల నుండి వేరుచేయబడి చంపబడటం వారు చూశారు. వారి పాపముల కొరకు ఎంత గొప్ప వెల చెల్లించబడింది? దేవుడు వారితో ఏమంటున్నాడంటే, అక్కడ నిలబడి దుఃఖపడండి, మీ పాపములను తేలికగా తీసుకోబాకండి, మీ పాపములు చూసి నవ్వుకోబాకండి, మీ పాపములు దుఃఖపడండి. ఈ రోజున సిలువ దగ్గర మనము కూడా మన పాపముల నిమిత్తము దేవుడు ఎంత గొప్ప వెల చెల్లించాడో చూస్తున్నాము. మన పాపములు చూసి మనము కూడా దుఃఖపడాలి. మన పాపములతో మనము దేవుని దుఃఖపరచాము, మన పొరుగు వారిని దుఃఖపరచాము. సిలువ దగ్గర మన పాపములను చూసి మనము దుఃఖించాలి. 

7.The Day of Atonement is a Day of Prophecy 

ఈ ప్రాయశ్చిత్త దినము ఒక ప్రవచన దినము. జెకర్యా 12:10 లో మనము చదువుతాము. 

 దావీదు సంతతివారిమీదను యెరూషలేము

 నివా సులమీదను కరుణ నొందించు 

ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను 

కుమ్మరింపగా వారు తాము పొడిచిన 

నామీద దృష్టియుంచి, యొకడు తన 

యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,

తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు 

ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

DayofAtonementTelugu.jpg

    భవిష్యత్తులోఒక రోజున యూదులు యేసు క్రీస్తును గుర్తిస్తారు. ఆయనను తిరస్కరించి, తృణీకరించి తాము చేసిన పొరపాటును గుర్తించి దుఃఖిస్తారు. యేసుక్రీస్తు సిలువను వారు చూస్తారు.

అప్పుడు దేవుడు యూదులకు ప్రాయశ్చిత్తము చేస్తాడు.

ప్రాయశ్చిత్త దినము గురించి ఈ రోజు మనము ఏడు విషయాలు చూశాము.

The Day of Atonement: 

A Day of the Priest, 

A day of propitiation, 

a day of purification, 

a day of perfection, 

a day of peace, 

a day of penitence, 

a day of prophecy 

ఈ ప్రాయశ్చిత్త దినము ప్రభువైన యేసు క్రీస్తువైపు మనలను చూపిస్తున్నది. ఆయన దగ్గరకు వచ్చి, రక్షణపొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00