బళ్ళో గుళ్లో, జర్మనీ కి హెల్లో

జర్మనీ వారికి చేదోడు, వాదోడు  గా కొంతమంది ఈ రోజు సహవాసములో తయారయ్యారు. అయితే వీరికి బడిలో ఒక పేరు, గుడిలో మరొక పేరు వుంది.

బళ్ళో సుమన్….గుళ్లో సొలొమోను

బళ్ళో విజయబాబు….గుళ్లో జాన్ విజయబాబు

బళ్ళో రాజేశ్వర రావు…గుళ్లో పాల్ రాజేష్

బళ్ళో ముత్తయ్య….గుళ్లో మత్తయ్య

బళ్ళో అజయ్.. గుళ్లో ఆండ్రూ

బళ్ళో అబ్బురామయ్య….గుళ్లో అబ్రాహాము

బళ్ళో మంత్రయ్య….గుళ్లో లూకా

బళ్ళో ఇతిహాస్…గుళ్లో ఇస్సాకు

బళ్ళో ఏడుకొండలు… గుళ్లో యేసుపాదం

ఒక పేద వాడు ఈ పని చేసినా, అర్ధం చేసుకోవచ్చు. కానీ, వీరంతా ఒక పక్క క్రైస్తవ సేవ పేరుతొ  జర్మనీ వారి దగ్గర డబ్బు నెలా నెలా తీసుకొంటూనే, మరొక ప్రక్క ఉద్యోగాల కోసం, సాంఘిక ప్రయోజనాల కోసం హిందువులమని సర్టిఫికెట్ లో వ్రాసుకొని భారత ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.

ఇటువంటి వారి నడిపింపుతో వెళ్తే, సంఘాలు అభివృద్ధి కావు. సహోదరుడు యోహాను గారు చాలా ఉత్తమ ప్రమాణాలతో మన సంఘాలు నిర్మించారు.

డాక్టర్ పాల్ కట్టుపల్లి గారు…  బళ్ళో, గుళ్లో ఎక్కడయినా ఆయన పేరు ఒక్కటే. ఇండియా లో నయినా, అమెరికా లో నయినా ఆయన పేరు అదే. ప్రభువు పనిలో అయినా, ప్రభుత్వం ముందయినా ఆయన పేరు ఒక్కటే.

ఆయన, ఆయన సోదరుల నడిపింపులో మన సంఘాలు బలంగా ఉంటాయి కానీ, బళ్ళో ఒక పేరు, గుళ్లో ఒక పేరు పెట్టుకొనే వారి నడిపింపులో కాదు. జర్మనీ వారు యెంత కాలం ఇక్కడ ఉంటారో వారికే తెలియదు. వారు ఇచ్చే రెండు వేల రూపాయలకు సంఘాలు అభివృద్ధి చెందవు.

జర్మనీ వారు పల్లెకోనలో ఎంతో విలాసవంతమైన మూడు భవనాలు ఎన్నో కోట్లు వెచ్చించి కట్టుకున్నారు. ఇప్పుడు వాటిని వదలివేసి వెళ్లిపోయారు. దేవుని సొమ్మును ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేసే వారి వలన సంఘములకు క్షేమాభివృద్ధి కలుగదు.

IMG_8776.jpg

పల్లెకోనలో జర్మనీ వారు వదలి వేసి వెళ్లిపోయిన భవనాలు

జర్మనీ డబ్బు కోసము మన భారత నాయకులు తగవులాడుకొని కుక్కలు చింపిన విస్తరిలా మీ సహవాసాన్ని మారుస్తారు. నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు నెలకు పది వేలు కావాలి – ఇలాంటి బిక్షాటనలతోనే వారి జీవితము గడుస్తుంది తప్ప వారు ఎలాంటి దేవుని సేవ చేయలేరు. మనము దేవుని వైపు చూచుచూ శ్రేష్టమైన సంఘములు నిర్మించవచ్చు . 

ఇరవైకి పైగా సంఘాలు మన వైపు ఉన్నాయి. మనము వంద సంఘాలకు పైగా కట్టవచ్చు.

మిత్రులారా, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సొంత గూటికి తిరిగి రండి. 

ఇట్లు,

తెనాలి క్రైస్తవ సంఘం

Leave a Reply