బాబు గోగినేని (Babu Gogineni) మీద 12 కేసులదాకా బుక్ చేశారు. ఆయనను జైలుకు పంపాలి అని కూడా కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. మా నమ్మకాలను విమర్శించాడు అది తప్పు అని కొంతమంది అరుస్తున్నారు. నీ నమ్మకం అంత బలహీనమయినదా? నీ ఐడియాలజీ విమర్శలను తట్టుకోలేదా? విమర్శలను తట్టుకోలేని ఐడియాలజీ నీకసలు ఎందుకు? అవతాల పడేసి, టీవీ చూసుకో.విమర్శలను తట్టుకోలేని ఐడియాలజీ వల్ల టైం వేస్ట్ తప్ప మీకు ఒరిగేది ఏమి ఉండదు. మీ ఐడియాలజీ కి నిజంగా సత్తా ఉంటే, దాని మీద మీకు నిజంగా నమ్మకముంటే విమర్శలను మీరు తట్టుకోవాలి. ‘నా నమ్మకాలను విమర్శించబాకండి, నేను తట్టుకోలేను’: అది చైల్డిష్ బిహేవియర్. దాని నుండి భారతీయులు బయటపడాలి.
భారత దేశం యొక్క గొప్పతనం ఏమిటంటే మనకు మంచి రాజ్యాంగం వుంది. పాకిస్తాన్ లో ఇలాంటి పరిస్థితి లేదు. మహమ్మద్ ప్రవక్తను దూషిస్తే జైలు కు వెళ్లడమే. షరియా ప్రకారం మహమ్మద్ ను విమర్శిస్తే మరణ శిక్ష పొందడమే. వాళ్ళ రాజ్యాంగం వాళ్ళు అలా వ్రాసుకున్నారు. ఇండోనేషియా దేశములో చూడండి. అది ప్రపంచములోనే పెద్ద ముస్లిం దేశం. ఈ మధ్యలో ఒక నాస్తికుడు ఇండోనేషియా లో ఖురాన్ ని Lord of the Rings తో పోల్చాడు. ఆ మాట అన్నందుకు ఆ నాస్తికుణ్ణి 5 సంవత్సరాలు జైల్లో వేశారు. మనం పాకిస్తాన్ లాగా, ఇండోనేషియా లాగా అవుదామా?
ఒక నాస్తికుడు లేక మరొక మతస్తుడు మనల్ని విమర్శిస్తే మనం ఓర్చుకోవాలి. వారి విమర్శని అనలైజ్ చేసి మనం వారికి రెస్పాన్స్ ఇవ్వాలి. అంతా వెర్బల్ లా ఉండాలి. ఫిసికల్ వయోలెన్స్ కి ప్రజాస్వామ్యములో స్తానం లేదు. కాబట్టి, బాబు గోగినేనిని జైలుకు పంపటం తప్పు. ఆయన అభిప్రాయాలు చెప్పుకొనే హక్కు ఆయనకు ఉంది.