కొంత మంది అజ్ఞానులు నా మీద వ్యతిరేకముగా వుత్తరం వ్రాసారు. అయితే వీరంతా జర్మనీ వారి డబ్బు తీసుకొంటూ దేవుని సేవ చేస్తున్నాం అని చెప్పుకొనేవాళ్లే. వీరంతా ఒక రోజుల్లో మా ఇంటికి వచ్చి, ‘మాకు డబ్బులు కావాలి, వుద్యోగం కావాలి’ అని అడుక్కొన్న వాళ్ళే. ఈ రోజున బూబెంజెర్ గారి అండ చూసుకొని వీరు నా మీద ఉత్తరాలు వ్రాస్తున్నారు. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడకు పారి పోయే ఇలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తులు నా మీద ఎన్ని వ్యాఖ్యలు చేసినా నేను పట్టించు కొను. వారికి నిజముగా నిజాయితీ ఉంటే ముందు జర్మనీ వాళ్ళ డబ్బులు తీసుకోవటం ఆపండి. అప్పుడు నన్ను విమర్శిస్తే అర్ధం ఉంటుంది.