లేవీయ కాండము: పరిచయము, డాక్టర్ పాల్ కట్టుపల్లి

FeastsoftheLordtimesofgentiles.jpg

పరిచయం:

విమోచన….ఆరాధన…పరివర్తన……  పండుగ

    నిర్గమ కాండములో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విమోచించాడు. ఆ తరువాత వారి మధ్య నివసించుటకు ఒక ప్రత్యక్ష గుడారము నిర్మించాడు. వారు ఆయనను ఏ బలులు అర్పించి ఆరాధించాలో లేవీయ కాండములో వివరించాడు. వారిలో పరివర్తన తేవటానికి వారికి తన ఆజ్ఞలు, నియమాలు భోదించి పరిశుద్ధత వారికి ప్రకటించాడు. మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను’ (లేవీయ 19:2) అని వారితో అన్నాడు. మన తల్లి భోజనము పెట్టేముందు, ‘చేతులు కడుక్కొని రా’ అని మనల్ని ఆదేశిస్తుంది. ప్రేమతో భోజనము పెట్టినప్పటికీ, మన చేతుల మీద ఉండే మురికిని ఆమె సహించలేదు. దేవుడు కూడా ప్రేమతో మనల్ని తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. అయినప్పటికీ, ఆయన యొద్దకు వెళ్తున్న మనం కూడా మన పాపపు మురికిని కడిగి వేసుకొని ఆయనను ఆరాధించాలి అని దేవుని ఆజ్ఞ. చేతులు కడుక్కోకుండా భుజిస్తే, ఆ మురికి మన ఆరోగ్యానికి ప్రమాదం, మన తల్లికి కాదు. అదే విధంగా, పాపము వలన నష్టపోయేది మనమే, దేవుడు కాదు (గలతీ 6:7).

  పరిశుద్ధత అంటే విచారము అని, పాపములోనే ఆనందము ఉందని చాలా మంది పొరపడుతారు. దేవుడు ఇశ్రాయేలీయులకు పండుగలు (23 అధ్యాయము) నియమించాడు. వారు ఆనందముగా ఉండాలని కోరుకున్నాడు.

రచయిత: మోషే

వ్రాయబడిన కాలము: క్రీ. పూ 1450 – 1410

వ్రాయబడిన స్థలము: సీనాయి అరణ్యము

ముఖ్య అంశాలు:

పరిశుద్ధత: 66 పుస్తకాలన్నింటిలో అధికముగా, ఈ మాట 152 సార్లు ఈ పుస్తకములో ప్రస్తావించబడింది.

పాపము దేవుని దృష్టిలో భయంకరమయినది అని మనం గుర్తించాలి. ఆ బలులు, అర్పణలు చేయుచూ ఇశ్రాయేలీయులు తమ పాపాన్ని గుర్తించి, దానిని ఒప్పుకొని, విడిచిపెట్టాలని దేవుడు కోరుకున్నాడు.

ముఖ్య వ్యక్తులు: మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు

గ్రంథ విభజన:

-బలులు (1 – 7)

  1. దహన బలి (క్రీస్తు యొక్క పాపము లేని స్వభావము)
  2. నైవేద్య బలి (దేవునికి సంపూర్ణముగా అప్పగించుకొనిన క్రీస్తు)
  3. సమాధాన బలి (క్రీస్తు దేవునితో మన సమాధానము)
  4. పాప పరిహారార్థ బలి (మన పక్షమున మరణించిన క్రీస్తు)
  5. అపరాధ పరిహారార్థ బలి (మన అపరాధముల నుండి విమోచించిన క్రీస్తు)

-యాజకులకు నియమాలు (8 – 9, 21 – 22)

-నాదాబు, అబీహుల మీద దేవుని తీర్పు (10)

-అపవిత్రత గురించి నియమాలు

-అపవిత్ర జంతువులు (11)

-బిడ్డకు జన్మ నిచ్చిన తల్లికి నియమాలు (12)

-అపవిత్ర వ్యాధులు (13 – 16)

-ఆహార నియమాలు (17)

-దేవుడు నిషేధించిన సెక్స్ పాపాలు (18,20)

-పొరుగు వారి పట్ల నియమాలు (19)

-దేవుని పండుగలు (23)

-ప్రత్యక్ష గుడారము (24)

-విశ్రాంతి, జూబిలీ సంవత్సరాలు (25)

-ఆజ్ఞలు పాటించకపోతే వచ్చే నష్టాలు, శాపాలు (26)

-ప్రతిష్ఠిత నియమాలు (27)

ముఖ్య ప్రవచనాలు:

  1. లేవీయ కాండము 23 లోని దేవుని పండుగలలో చక్కని ప్రవచన క్యాలెండర్ మనకు కనిపిస్తున్నది. మనమిప్పుడు అన్యజనుల కాలము లో ఉన్నాము. రాబోయేది బూరల పండుగ. అది క్రీస్తు రెండవ రాకడను సూచించుచున్నది.
  1. లేవీయ కాండము 26 లో తన ఆజ్ఞలను విస్మరిస్తే వచ్చే శాపం గురించి దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు. మెస్సియా, ప్రభువైన యేసు క్రీస్తు వచ్చే వరకు ఈ శాపము తొలగిపోదు (జెకర్యా 14:11)

ప్రభువైన యేసు క్రీస్తు రూపం: లేవీయ కాండములోని బలులు (పైన చూడండి), పండుగలు  యేసు క్రీస్తు మనకొరకు చేసే కార్యాలను సూచించుచున్నవి. ఆయన దేవుడు మన కిచ్చే సమాధానము, శక్తి, విశ్రాంతి గా ఈ పండుగలలో కనిపిస్తున్నాడు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

-ఇశ్రాయేలీయుల పాప నివృత్తి కోసం దేవుడు వారికి బలులు నియమించాడు. మన జీవితాల్లో ఉన్న పాపాన్ని తీసివేయాలని దేవుడు కోరుకొంటున్నాడు.

-క్రైస్తవ సంఘము ఇప్పుడు క్రొత్త నిబంధన  క్రింద ఉన్నదే కానీ పాత నిబంధన క్రింద లేదు (హెబ్రీ 7-10)

-బూరల పండుగ (యేసు క్రీస్తు రెండవ రాకడ) దేవుని క్యాలెండర్ లో తదుపరి ముఖ్య ఘట్టం. ఆయన రాకడ కోసం మనం సిద్ధముగా ఉన్నామా? అని మనం ప్రశ్నించుకొందాం.

-సెక్స్ పాపాలను దేవుడు సీరియస్ గా తీసుకొంటాడు. ఆ విషయం 18,20 అధ్యయాలు మనకు తెలియజేస్తాయి. మీ జీవితములో ఏవయినా సెక్స్ పాపాలు ఉంటే వాటిని ఒప్పుకొని, విడిచిపెట్టండి.

An Introduction to Leviticus by Paul Kattupalli

Leave a Reply