దేవుడు ఎవరు? దేవుని గురించి తెలుసుకోవలసినవి

-దేవుడు సమస్త సృష్టికర్త (ఆదికాండము 1:1)

-దేవుడు అన్నిటికంటే ముందు ఉన్న వాడు (ఆది కాండము 1:1)

-దేవుడు మానవుని తన స్వరూపములో సృష్టించాడు (ఆదికాండము 1:27)

-దేవుడు సర్వశక్తిమంతుడు (యోబు 37:23)

-దేవుడు ఆత్మయై ఉన్నాడు (యోహాను 4:24)

-దేవుడు సమస్తమును కట్టినవాడు (హెబ్రీ 3:3)

-సమస్త జీవరాసుల ప్రాణం, మనుష్యులందరి ఆత్మలు దేవుని వశములో ఉన్నవి (యోబు 12:10)

-దేవుడు సమస్త జీవులను పోషించేవాడు (మత్తయి 6:26)

-దేవుడు అద్వితీయుడు (ద్వితీయోప 6:4-5)

-దేవుని ఉద్దేశముల ప్రకారం సమస్తము జరుగుతాయి (రోమా 8:28)

-దేవుడు ప్రేమయై ఉన్నాడు (1 యోహాను 4:8)

-దేవుడు నమ్మదగిన వాడు (1 కొరింథీ 10:13)

-దేవుడు యదార్ధవంతుడు (కీర్తన 18:30)

-దేవుడు తన మాటకు కట్టుబడి ఉంటాడు (సంఖ్యా 23:19)

-దేవుడు వెలుగై ఉన్నాడు (1 యోహాను 1:5)

-దేవుడు ప్రేమతో త్యాగం చేసేవాడు (యోహాను 3:16)

-దేవుడు చంచలత్వము లేని వాడు, స్థిరమైన వాడు (యాకోబు 1:17)

-దేవుని వాక్యము సజీవమై, బలము గలది (హెబ్రీ 4:12)

-దేవుని ముందు భూలోక రాజులు శక్తిహీనులే (యెషయా 40:23)

-దేవుడు న్యాయం తప్పనివాడు (కీర్తన 50:6)

-దేవుడు వాత్సల్యత గలవాడు (కీర్తన 116:5)

-దేవుడు మన భారములు భరించేవాడు (కీర్తన 68:19)

-దేవుడు కరుణాకటాక్షములు గలవాడు (2 దినవృత్తాంతములు 30:9)

-దేవుడు ఆయన ఆజ్ఞలకు మనం విధేయులము కావాలని కోరుకొంటాడు (యెహోషువ 1:8-9)

-దేవుడు జాలి పడేవాడు (మీకా 7:18,19)

-దేవుడు మనుష్యులందరినీ చూచుచున్నాడు (కీర్తన 33:13)

-దేవుడు తన ప్రజల తరుపున యుద్ధాలు చేసేవాడు (ద్వితీయోప 20:4)

-దేవుడు దహించు అగ్ని (ద్వితీయోప 4:24)

-దేవుడు మన ప్రేమ, భయం రెండింటినీ కోరుకొంటాడు (ద్వితీయోప 10:12-22)

-దేవుని ఎవరూ మోసం చేయలేరు (గలతీ 6:7)

-దేవుని తలంపులు మానవ తలంపులకు వేరుగా ఉన్నవి (యెషయా 55:8)

-దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు (యిర్మీయా 32:27)

-దేవుని ఆలోచన శక్తి ఆశ్చర్యమైనది (యెషయా 28:29)

-దేవుడు సర్వాంతర్యామి, ఆయన లేని చోటు లేదు (కీర్తన 139:1-9; యిర్మీయా 23:24)

-దేవుడు వర్తమాన, భూత, భవిష్యత్కాలములలో ఉండే వాడు (ప్రకటన 1:8)

-దేవుని తీర్పులు శోధించుటకు అశక్యములు (రోమా 11:33)

-ప్రభుత్వములు, అధికారములు దేవుని వలననే నియమించబడినవి (రోమా 13:1)

-దేవుడు యేసు క్రీస్తుగా మానవులకు ప్రత్యక్షమయ్యాడు (యోహాను 1:1-14)

-దేవుడు మాట చొప్పునే బైబిలు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి (2 పేతురు 1:20 – 21)

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply