-దేవుడు తన స్వరూపమందు మనిషిని సృష్టించాడు (ఆదికాండము 1:27)
-దేవుడు పురుషినిగా, స్త్రీ గా మానవులను సృష్టించాడు (ఆదికాండము 1:27)
-దేవుడు తన సృష్టిని మనిషి ఆధిపత్యం క్రింద ఉంచాడు (ఆదికాండము 1:28)
-దేవుడు నేల మంటితో నరుని సృష్టించాడు (ఆదికాండము 2:7)
-దేవుడు ఆదాములో నుండి స్త్రీ ని సృష్టించాడు (ఆదికాండము 2:22)
-పురుషినికి సాటియైన సహాయముగా స్త్రీ ని సృష్టించాడు (ఆదికాండము 2:18)
-వెల కట్టలేని ఆత్మ ను దేవుడు మనిషిలో ఉంచాడు (కీర్తన 49:9)
-సర్వలోకము కంటే ఆత్మ ముఖ్యమైనది ( మార్కు 8:36)
-జంతువుల కంటే మనుష్యులు దేవునికి శ్రేష్ఠులు (మత్తయి 10:30-32)
-మానవులు దేవునిలో బ్రతుకుచున్నారు, చలించు చున్నారు (అపో. కార్య 17:28)
-మనిషి జీవితం తాత్కాలికం (యాకోబు 4:13-17)
-మనిషిని దేవుడు ప్రేమించాడు (యోహాను 3:16)
-మనిషితో సహవాసం చేయాలని దేవుడు కోరుకున్నాడు (ఆదికాండము 3:8)
-విశ్వ సృష్టికి ముందే దేవుడు మనుష్యులను ప్రేమించాడు (ఎఫెసీ 1:6)
-వారు పుట్టకముందే దేవుడు మనుష్యులను చూస్తాడు (యిర్మీయా 1:4-5)
-మనిషి జీవితములో బాధలు సహజమే (యోబు 14:1)
మనిషి జీవిత దినాలు లెక్కించబడ్డాయి (కీర్తన 90:12)
-మనిషి తల మీద ఎన్ని వెండ్రుకలు ఉన్నాయో దేవునికి తెలుసు. అంత దగ్గరగా దేవుడు మనిషిని చూస్తున్నాడు (మత్తయి 10:30)
-కనీసం వారానికి ఒక రోజన్నా మనిషి తనను గుర్తుచేసుకొని, ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు (ఆదికాండము 2:3; నిర్గమ 20:11)
-దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తరువాత మనిషి పాపి అయ్యాడు (రోమా 3:23)
-పాపము వలనే మానవ జాతిలోకి మరణం ప్రవేశించింది (ఆదికాండము 2:16,17; రోమా 5:12)
-మనిషిని నరకములో వేసే శక్తి దేవునికి ఉంది (మత్తయి 10:28)
-మానవులను రక్షించటానికి దేవుడు కూడా మానవుడు అయ్యాడు (మత్తయి 1:21)
-మనుష్యుల కోసం దేవుడు ఒక పరలోక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు (1 కొరింథీ 5:1; యోహాను 14:2-3)
-రక్షణ పొందని మనుష్యులు నిత్య శిక్షకు, పొందిన వారు నిత్యజీవమునకు వెళ్తారు (మత్తయి 25:46)
-మనిషి తన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశ్యం (సామెతలు 10:27)
-మనిషి తనను పూర్ణ హృదయముతో ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపించాడు (లూకా 10:27)