దేవ దూతలు ఎవరు?

lwjas0063.jpg

-అన్నిటివలె, అందరి వలె దేవ దూతలు కూడా ప్రభువైన యేసు క్రీస్తు చేతే సృష్టించబడ్డారు (కొలొస్స 1:16)

-వారి స్వరూపము మెరుపు వలె ఉంటుంది, వారి వస్త్రాలు హిమమంత తెల్లగా ఉంటాయి (మత్తయి 28:3)

-మనుష్యుల కంటే కొంచెం ఎక్కువ స్థితిలో వారు సృష్టించబడ్డారు (కీర్తన 8:5)

-వారు వివాహం చేసుకోరు, వారికి మరణం ఉండదు (మత్తయి 22:30; లూకా 20:36)

-దేవుని ఆస్తులను వారు కాపాడుతారు (ఆదికాండము 3:24)

-దేవుని సృష్టిని చూసి దేవదూతలు ఆనందించారు (యోబు 38:1-7)

-దేవుని మీద అహంకారముతో తిరుగుబాటు చేసిన దేవదూతలు దెయ్యాలు అయ్యారు (యెషయా 14:12-14; యెహెఙ్కేలు 28:14-16)

-దేవ దూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారికి తీర్పు తీర్చాడు (యోబు 4:18; 2 పేతురు 2:4)

-తిరుగుబాటు చేసిన దేవదూతలు తీర్పు కొరకు నిత్య పాశములతో బంధించబడ్డారు (యూదా 1:6)

-పాపము చేయని దేవదూతలు ఇప్పుడు దెయ్యాలతో పోరాడుచున్నారు (దానియేలు 10:13; యూదా 1:9)

-దేవుని ధర్మశాస్త్రము దేవ దూతల చేత నియమింపబడింది (అపో.కార్య 7:53)

-దేవ దూతలు నిరంతరం దేవుని స్తుతిస్తారు (యెషయా 6:2; ప్రకటన 4:8; 5:11-12)

-దేవుని ప్రణాళికలను వారు మనుష్యులకు తెలియజేస్తారు (దానియేలు 9:21; మత్తయి 1:20; న్యాయాధి 13:1-8; ప్రకటన 1:1; 22:6)

-దేవుని పిల్లలను దేవదూతలు కాపాడుతారు (కీర్తన 91:11-12; 34:7; దానియేలు 6:22; యెషయా 63:9)

-వారు దేవుని చిత్తమును నెరవేర్చుతారు (కీర్తన 103:21)

-దేవుని ప్రజల తరుపున యుద్ధాలు చేస్తారు (2 రాజులు 6:17; 19:35;  కీర్తన 68:17; ప్రకటన 12:7)

-మనుష్యులను చంపే అధికారం దేవదూతలకు ఉంది (2 సమూయేలు 24:16; అపో.కార్య 12:23)

-వారు పరిచారం చేయుటకు పంపబడే సేవకులైన ఆత్మలు (దానియేలు 7:10; హెబ్రీ 1:14)

-దేవదూతలందరూ యేసు ప్రభువును ఆరాధిస్తారు (హెబ్రీ 1:6)

-మనం దేవదూతలను ఆరాధించకూడదు (కొలొస్స 2:18; ప్రకటన 19:10)

-యేసు ప్రభువు జన్మకు కావలసిన ఏర్పాట్లు దేవదూతలు చేశారు (మత్తయి 1:20; లూకా 1:11-20)

-యేసు ప్రభువు జన్మించినప్పుడు వారు ఆనందముతో దేవుని స్తుతించారు (లూకా 2:13)

-దేవదూతలు ప్రభువైన యేసు క్రీస్తు అధికారము క్రింద ఉన్నారు (1 పేతురు 3:22; మత్తయి 26:53

-మానవునిగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు దేవదూతల కంటే తక్కువ స్థానానికి తగ్గించుకున్నాడు (హెబ్రీ 2:5-9)

-దేవదూతలు యేసు క్రీస్తుకు పరిచర్య చేశారు (మత్తయి 4:11; మార్కు 1:13)

-దేవదూతలు యేసు క్రీస్తు ప్రభువు మరణం నుండి తిరిగి లేచిన తరువాత సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలతో మాట్లాడారు (యోహాను 20:11-12)

-యేసు క్రీస్తు పరలోకానికి ఎత్తబడినప్పుడు వారు శిష్యులతో మాట్లాడారు (అపో. కార్య 1:11)

-ఎవరైనా మారుమనస్సు పొంది రక్షణ పొందితే చూసి దేవ దూతలు ఆనందిస్తారు (లూకా 15:10)

-మనం దేవుని కొరకు చేసే కార్యాలు చూడాలని దేవదూతలు ఆసక్తితో తొంగిచూచుచున్నారు (1 పేతురు 1:12)

-పరలోకములో పరిశుద్ధుల ఆనందంలో వారు కూడా పాలుపంచుకొంటారు (హెబ్రీ 12:22-24)

-ఇతర విశ్వాసులను మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే పరలోకములో వారి పక్షాన దేవ దూతలు ఉన్నారు. దేవుడు వారిని ఆజ్ఞాపిస్తే వారు దిగివస్తారు (మత్తయి 18:10)

-దేవదూతలు మారు వేషములో వచ్చి మన ఆతిధ్యము పొందవచ్చును (హెబ్రీ 13:1; ఆదికాండము 18:1)

-సువార్త ప్రకటనలో అపొస్తలులకు దేవదూతలు సహకరించారు (అపో. కార్య 5:19; 8:26)

-దేవదూతలు విశ్వాసులను బలపరుస్తారు (అపో. కార్య 27:23,24)

-క్రైస్తవ సంఘమును చూసి వారు దేవుని జ్ఞానమును తెలుసుకొన్నారు (ఎఫెసీ 3:10)

-మరణించిన విశ్వాసులను వారు దేవుని సన్నిధికి తోడుకొని పోతారు (లూకా 16:22)

-సంఘం ఎత్తబడే సమయములో ప్రభువైన యేసు క్రీస్తు తో పాటు దేవదూతలు కూడా మధ్యాకాశానికి వస్తారు (యోహాను 1:51; 1 థెస్సలొనీక 4:16)

-శ్రమల కాలములో దేవదూత ఈ ప్రపంచానికి నిత్య సువార్త ప్రకటిస్తాడు (ప్రకటన 14:6)

-రెండవ రాకడలో ప్రభువైన యేసు క్రీస్తుతో పాటు దేవదూతలు కూడా వస్తారు (మత్తయి 13:41;  16:27; 24:31-35; మార్కు 8:38; 2 థెస్సలొనీక 1:7)

-దేవదూతలు తీర్పు దినాన విశ్వాసులను, అవిశ్వాసులను వేరు చేస్తారు (మత్తయి 13:49-50)

Leave a Reply