-దేవుని కోపము ఈ పట్టణాలను దహించి వేసింది. ద్వితీయోప 29:23
-ఈ పట్టణాలు తమ ఐశ్వర్యం, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖ స్థితి కలిగి దేవుని మరచిపోయాయి. ప్రస్తుత ఆధునిక సమాజం కూడా అలాగే తయారయ్యింది. యెహెఙ్కేలు 16:48-50
-వ్యభిచారం, స్వలింగ సంపర్కం మొదలగు పాపములకు దేవుడు తీర్పు తీరుస్తాడు అనుటకు దృష్టాంతముగా ఈ పట్టణాలు ఉన్నాయి. యూదా 1:7; యిర్మీయా 23:14; లేవీయ కాండం 18:22;20:13 రోమా 1:26-27
-ప్రస్తుత సమాజము వలే ఈ పట్టణములు తమ పాపం గురించి సిగ్గుపడక బరితెగించాయి. యెషయా 3:9
-దేవుని హెచ్చరికలు ఈ పట్టణాలకు ఇవ్వబడ్డాయి యెషయా 1:10
-లోతు వంటి శరీర సంబంధ మైన విశ్వాసులు సొదొమను ప్రేమించి నష్టపోతారు. ఆదికాండము 13:10; ఆదికాండము 19
-సొదొమ పాపాములు చేసే వారికి దేవుని రాజ్యములో పాలు ఉండదు (1 కొరింథీ 6:9-10)
-ఆ పట్టణములకు తీర్పు తీర్చిన దేవుడే నేటి సమాజమునకు కూడా తీర్పు తీరుస్తాడు. 2 పేతురు 2:6
-ఆ పట్టణముల కంటే తీవ్ర మైన తీర్పు నేటి ప్రపంచము మీదకు రావచ్చు. మత్తయి 10:15
-సొదొమ వలే అంత్య దినాల్లో ప్రపంచం నీతి మంతులను హింసిస్తుంది. ప్రకటన 11:8
-సొదొమలో నశించిన లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా 17:32
-అంత్య దినాల్లో ప్రపంచం సొదొమ, గొమొఱ్ఱా ల వలే తయారవుతుంది. లూకా 17:28
-ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ సమయములో కూడా ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిపించబడతాయి. లూకా 17:29-30