నిత్య స్తుతి : Eternal Praise; రచన, స్వర కల్పన: డాక్టర్ పాల్ కట్టుపల్లి

ప = పాడెదను నేనెల్లప్పుడు –

నీ మహిమ గురించి

ప్రభువా – ఎల్లప్పుడు

ఘనత మహిమ నీకేనయ్యా

యుగయుగములు నిను కీర్తించెదన్

  1. ఆకాశ మహాకాశమ్

నీ ఐశ్వర్యము చూపించెను  

భూమియు దాని సంపూర్ణత

నీ జ్ఞానమునే బోధించెను

  1. అల్ఫాయు ఒమెగాయు

ఆది అంతము లేనివాడవు

మానవ జన్మను ఎత్తావయ్యా

దాసుని రూపం పొందావయ్యా

  1. మార్గము, సత్యము, జీవముగా

పరమ వెలుగై  వచ్చావయ్యా

లోక పాపము మోసావయ్యా

ప్రేమను నాకు  చూపావయ్యా

  1. సాతాను వాని బలమంతయు

సిలువ మీద ఓడించినావు

మరణము గెల్చి లేచావయ్యా

నిత్యము మాతో ఉంటావయ్యా

  1. గొర్రెలకు మంచి కాపరివి

ప్రాణ మిచ్చి రక్షించినావు

నీ కృప నాకు చాలునయ్యా  

నీ మాటే నా బలమయ్యా

Leave a Reply