బైబిలు ప్రవచనాల్లో మోషే: డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం

ఈ రోజు  నిర్గమ కాండము లో ఇవ్వబడిన ప్రవచనాలు చూద్దాము. నిర్గమ కాండము ప్రారంభములో

మనము చూస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బానిసత్వములో ఉన్నారు. ప్రాచీన చరిత్రలో ఐగుప్తు దేశము చాలా శక్తికలిగిన దేశము. దాని చక్రవర్తులు ప్రపంచాన్ని శాశిస్తున్నారు. వారు ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకొన్నారు. ఆదికాండము లో దేవుడు మానవుని సృష్టించాడు.

అంతా చక్కగా ఉంది. బైబిల్లో రెండో పుస్తకములోకి వచ్చేసరికే సీన్ మారిపోయింది. మనిషి మరొక మనిషిని బానిసగా చేసుకోవటం వెంటనే మొదలయ్యింది. ప్రాచీన ఈజిప్ట్ అనేక గొప్ప కట్టడాలు

నిర్మించింది. వాటి యొక్క శిథిలాలు ఇప్పుడు కూడా మనము చూడవచ్చు. ఫరో చక్రవర్తి పెద్ద, పెద్ద భవనాలు నిర్మించాలి అనుకొన్నాడు. పెద్ద పెద్ద నగరాలు నిర్మించాలి అనుకొన్నాడు.కార్మికులు కావాలి. ఇశ్రాయేలీయులను వాడుకొందాము అనుకొన్నాడు.వారిని బానిసలుగా చేసుకొన్నాడు. ఫరో హిట్లర్ లాగా ఆలోచించాడు.

    నేను పోలాండ్ దేశము వెళ్ళినప్పుడు అక్కడ హిట్లర్ నిర్మించిన కాన్సంట్రేషన్ క్యాంపులు చూశాను. ఔస్క్ విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపుకు వెళ్ళాను. అక్కడ ఒక వైపు ఫ్యాక్టరీ, ఇంకోపక్కన గ్యాస్ ఛాంబర్ లు

కట్టారు. హిట్లర్ ఏమని ఆలోచించాడంటే, ఈ యూదులను మనము ఎట్లాగూ చావగొడుతున్నాము కదా, వాళ్లకు బలమున్నంతవరకు వాళ్ళను కార్మికులుగా వాడుకొందాము. బలహీనులను గ్యాస్ ఛాంబర్లలో వేసి చావగొట్టండి అన్నాడు. ఫరో కూడా హిట్లర్ లాగానే ఆలోచించాడు.వీళ్ళను వాడుకొంటానే వీళ్ళను నాశనము చేద్దాము. యూదుల చేత మట్టి పనులు, వెట్టి పనులు, కఠినమైన

పనులు చేయించండి. వారికి జీవితము మీద విసుగుపుట్టేటట్టు చేయండి అన్నాడు. ఫరో వారిని ఎంతో శ్రమపెట్టినప్పటికీ వారు విస్తరించారే కానీ తగ్గిపోలేదు (1:12). కఠినమైన పని వలన వారి

ప్రాణములు విసిగిపోయినవి. దేవుడు, దేవుడు అంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు అని వారు నిట్టూర్చారు.

    దేవుడు లేకపోతే స్వాతంత్రము లేదు. దేవుడు ఉంటేనే సమానత్వము, స్వాతంత్రము ఉంటాయి.

దేవుడు లేకపోతే ఒక మనిషి మరొక మనిషి సమానముగా చూడవలసిన భాద్యత ఉండదు. ఫరో మంత్రసానులను పిలిపించాడు. మీరు ఏమి చేస్తారంటే, యూదు స్త్రీలకు జన్మించిన మగపిల్లలను

చంపివేయండి. ఫరో ప్లాన్ ఏమిటంటే, వాళ్ళ మగపిల్లలను చంపి వేయాలి, ఆడపిల్లలను బ్రతకనిచ్చి వారిని మన సేవకురాళ్లుగా చేసుకొందాము, కొంత కాలానికి యూదులు అంతరించిపోతారు.

ఒక గర్భిణీ స్త్రీ పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకొంటుంది. నవ మోసాలు మోసి ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ బ్రతుకుతాడో లేడో అనే పరిస్థితిని ఫరో ఇశ్రాయేలీయులకు కలిగించాడు.

    యేసు ప్రభువు జన్మించిన సమయములో బెత్లెహేము చుట్టుప్రక్కల రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని చంపేయమని హేరోదు రాజు ఆజ్ఞ ఇచ్చాడు (మత్తయి 2:16). రాబోయే రక్షకుడు యూదులలో జన్మిస్తాడు అని సాతానుకు తెలుసు. అందుకనే యూదు జాతిని ఐగుప్తు

దేశములో ఉన్నప్పుడే తుదముట్టించాలని సాతాను పథకం వేశాడు. ఫరో హృదయములో ఈ క్రూరమైన ఆలోచన పెట్టాడు. అయితే మంత్రసానులు ఫరోకు సహకరించలేదు.

నిర్గమ కాండము 1 అధ్యాయము, 17 వచనము చూద్దాము:

అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు

తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుక నిచ్చిరి

                             నిర్గమ 1:17

ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. ఫరో రాజు ఆజ్ఞను వారు పట్టించుకోలేదు. మగపిల్లలను బ్రతుకనిచ్చారు.మనిషికి స్వాతంత్రము ఇచ్చేది అదే. నీకన్నా పైన దేవుడు ఉన్నాడు. దేవుని

భయం నాకు ఉంది. పసిపిల్లల రక్తము చిందించే నీ పాపములో మేము భాగస్వాములం కాలేము అన్నారు. ఈ రోజు నార్త్ కొరియా లో బైబిల్ చదివితే మరణ శిక్ష వేస్తున్నారు. ఆ నియంతలకు తెలుసు. ప్రజలు బైబిల్ చదివితే వారు దేవుని వైపు చూస్తారు.వారు మన నియంతృత్వాన్ని సహించరు.

మోషే తల్లిదండ్రులు కూడా అదే మార్గములో వెళ్లారు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అతని ప్రాణాలు కాపాడుటకు అతని దాచిపెట్టారు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11:23 లో మనము చదువుతాము.

మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు

ఆ శిశువు సుందరుడై యుండుట చూచి,

విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక,

మూడు మాసములు అతని దాచిపెట్టిరి. హెబ్రీ 11:23

 

    మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఏడవాలో, నవ్వాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. బిడ్డ పుట్టినందుకు సంతోషించాలా , లేక ఈ బిడ్డ ఫరో చేతిలో చనిపోతాడు అని దుఃఖించాలా? ఆ సంశయము వారికి కలిగింది. అయితే వారు దేవుని మీద విశ్వాసము పెట్టుకొన్నారు. మూడు నెలలు ఆ బిడ్డను దాచిపెట్టారు. ఆ తరువాత ఒక జమ్ము  పెట్టెలో పెట్టి ఒక ఏటిలో ఉంచారు. ఫరో కుమార్తె స్నానము చేయుటకు వెళ్ళింది. ఆ పెట్టెను తెరచి చూసింది. అందులో మోషే ఆమెకు కనిపించాడు. ఏడుస్తూ ఉన్నాడు. అతని చూసి ఆమెకు జాలి కలిగింది. ఆ బిడ్డను తీసుకొని అంతఃపురానికి తీసుకువెళ్ళింది. ఆమె కుమారునిగా చేసుకొని మోషే అని అతనికి పేరు పెట్టి ఒక రాజకుమారునిగా అతని పెంచింది. ఏ ఫరో ఆ బిడ్డను చంపాలనుకొన్నాడో, అదే ఫరో ఇంట్లో దేవుడు ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తున్నాడు. దేవుని కార్యములు ఎంతో  ఆశ్చర్యకరంగా ఉంటాయి.

    ఒక గొప్ప నాయకుణ్ణి దేవుడు తన ప్రజల కోసం సిద్ధపరుస్తున్నాడు.మోషే దాస్యములోని ప్రజలను బయటకు తీసుకొని వెళ్ళాడు. ఆయన జీవితము ఇప్పటి వరకు మన ప్రపంచాన్ని ప్రభావితము చేస్తూ ఉంది. అమెరికా దేశములో నల్లజాతి వారి హక్కుల కోసం పోరాడిన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆయన ప్రసంగాల్లో మోషే జీవితము గురించి అనేక సార్లు ప్రస్తావించాడు. మోషే పెద్దవాడయినప్పుడు తన ప్రజల యొక్క దీనస్థితిని చూసాడు. ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుని కొట్టుచున్నాడు. మోషే వెళ్లి ఆ ఐగుప్తీయుని చంపి వేశాడు. మోషే తప్పు చేశాడు. దేవుని పని దేవుని పద్దతిలో చేయాలి. అయితే మోషే తొందరపడ్డాడు. దేవుని సమయము కోసము ఎదురు చూడకుండా ఒక హత్య చేశాడు. శవాన్ని ఇసుకలో పూడ్చిపెట్టి వెళ్ళిపోయాడు. అతడు చేసిన హత్య బయటపడింది. ఫరోకు ఆ విషయం తెలిసింది. మోషే ని చంపాలని ఫరో చూశాడు. మోషే ఐగుప్తు దేశము విడిచి మిద్యానుకు పారిపోయాడు. అక్కడ యిత్రో అనే ఒక యాజకుని కుమార్తెను పెండ్లిచేసుకొని అక్కడ స్థిరపడ్డాడు.  ఒక గొఱ్ఱెల కాపరిగా జీవిస్తున్నాడు.

    గొఱ్ఱెల కాపరిగా ఉన్న యోసేపును దేవుడు ఐగుప్తు లో రాజ భవనముకు తీసుకువెళ్లాడు. రాజభవనములో ఉన్న మోషేని పశువుల కాపరిగా చేశాడు. ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగు దేవునికి వినిపించింది. 2 అధ్యాయము, 24 వచనము చూద్దాము.

దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో

తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.

దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను;

దేవుడు  వారియందు లక్ష్యముంచెను.

                                                          నిర్గమ 2:24 -25

    దేవుడు  అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొన్నాడు. అంటే, మరచిపోయి మళ్ళీ గుర్తుచేసుకున్నాడు అని కాదు గాని, ఆ నిబంధన ను లక్ష్యపెట్టుచున్నాడు అని అర్ధము. ఒక పొద నడుమ అగ్నిజ్వాలలో దేవుడు మోషే కు ప్రత్యక్షమయ్యాడు. తన ప్రజల బాధలు వినేవాడు, చూచే వాడు, లక్ష్యపెట్టేవాడు, వారికి ప్రత్యక్షమయ్యేవాడు. దేవుడు మోషేతో చెప్పాడు:

మోషే, నేను నా ప్రజల యొక్క దురవస్థను చూసాను.  వారి బాధలు నాకు తెలుసు.నేను వారిని ఈ దేశమును విడిపించి కనాను దేశమునకు నడిపిస్తాను. మోషే దేవుని అడిగాడు. దేవుడు నన్ను పంపాడు అని చెబితే ప్రజలు ఆ దేవుని పేరు ఏమిటి అని అడుగుతారు. ఏమని చెప్పాలి?

దేవుడు యేమని చెప్పాడంటే,

నేను ఉన్న వాడను అనువాడనై ఉన్నాను

I AM THAT I AM

    ప్రవచన విద్యార్థులు ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. the eternally Self-Existing God అన్ని కాలాల్లో ఏకరీతిగా ఉండేవాడు. సైన్స్ ఫిక్షన్ లో మనం చూస్తాము. ఒక వ్యక్తి గతములోకి వెళ్తాడు, అప్పుడు

జీవించిన వ్యక్తులను కాలుస్తాడు, టైం మెషిన్ లో భవిష్యత్తులోకి వెళ్తారు. అవన్నీ ఊహాజనితమే, అయితే అవి మనిషి యొక్క ఆశను మనకు చూపిస్తున్నాయి. ఒక టైం మెషిన్ లో గతములోకి వెళ్ళాలి, భవిష్యత్తు లోకి వెళ్ళాలి అని మనిషి ఆశపడుతున్నాడు. కానీ విఫలమవుతున్నాడు. అన్ని కాలాల్లో ఉండేవాడు దేవుడు ఒక్కడే. అబ్రాహాముతో ఉన్న దేవుడు ఇస్సాకుతో ఉన్న దేవుడు యాకోబుతో ఉన్న దేవుడు ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చాడు.మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశమునకు తీర్పు తీర్చాడు.

10 తెగుళ్లు ఆ దేశము మీదకు పంపాడు. మోషే నాయకత్వములోఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి

విడిపించి కనాను దేశము వైపుకు నడిపించాడు. మోషే ఒక గొప్ప ప్రవక్త.

హోషేయ 12:13 లో మనము చదువుతాము.

ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు

దేశములోనుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను.

                                                               హోషేయ 12:13

    ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి రక్షించాడు. మరొక ప్రవక్త ద్వారా మనలను ఈ లోకము నుండి దేవుడు ఇప్పుడు రక్షిస్తున్నాడు. దేవుని ప్రజల భవిష్యత్తు ఆయనకు తెలుసు. ఆయన భవిష్యత్తులో రాబోవుచున్న యేసు క్రీస్తును కూడా చూశాడు.

ద్వితీయోప దేశ కాండము 18:16 లో మోషే ఒక ప్రవచనం చేశాడు.

నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును,

ఆయన మాట నీవు వినవలెను.   ద్వితీయోప 18:16

    ఇది మోషే ప్రభువైన యేసు క్రీస్తు గురించి చేసిన ప్రవచనము. దేవుడు నాలాంటి  ప్రవక్తను మీ మధ్యలో పుట్టిస్తాడు. యేసు క్రీస్తు మోషే లాంటి ప్రవక్త, అయితే మోషే కంటే శ్రేష్ఠమైనవాడు.

దేవుడు మోషే ద్వారా పాత నిబంధనను ఇశ్రాయేలీయులకు అనుగ్రహిస్తే, యేసు క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనను ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైనది.    హెబ్రీ 10:1 లో మనము చదువుతాము.

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల

ఛాయగలదియే గాని ఆ వస్తువుల

నిజస్వరూపము గలది కాదు

                  హెబ్రీ 10:1

    దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రము మానవాళికి ఇచ్చాడు. అయితే అది ఒక ఛాయ మాత్రమే. ఒక shadow. అయితే నిజ స్వరూపము ప్రభువైన యేసు క్రీస్తు లో ఉంది. రూపాంతరపు కొండ మీద మోషే, ఏలీయాలు యేసు ప్రభువుతో మాట్లాడారు. అక్కడ ఉన్న ముగ్గురు శిష్యులు మోషే, ఏలీయాలను యేసు ప్రభువుతో సమానముగా చూశారు. అయితే పరలోకములో నుండి దేవుని

స్వరము వారికి వినిపించింది.

‘ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు’

    మోషే గొప్ప ప్రవక్తే కానీ కుమారుడు కాదు. యేసు క్రీస్తు ప్రవక్త, కుమారుడు.

Servant and Son

సేవకుడు – కుమారుడు

    మోషే చేసిన ప్రవచనాలు మనలను ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు నడిపించాలి. లూకా సువార్త 24 అధ్యాయములో మనము చదువుతాము.యేసు ప్రభువును సిలువ వేసిన తరువాత కొన్ని రోజులకు ఇద్దరు శిష్యులు ఎమ్మాయి అనే గ్రామమునకు నడచి వెళ్తున్నారు. ఒక అపరిచితుడు మార్గమధ్యములో వారిని కలిసాడు.ఆ శిష్యులు ఆ వ్యక్తిని గుర్తించ లేకపోయారు. ఆ అపరిచితుడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. అక్కడ మనం యేమని చదువుతాం అంటే,

మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.                                                      లూకా సువార్త 24 : 27

   మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు ఆయన గురించి చేసిన ప్రవచనాలను యేసు క్రీస్తు ఆ శిష్యులకు వివరించాడు.

  1. అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల

గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు

నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన

మాటలు నెరవేరినవని వారితో చెప్పెను

   మోషే మరొక సారి ఈ భూమి మీదకు వస్తాడు. ఆ విషయము మనము ప్రకటన గ్రంథము 11:3 లో చూస్తాము.

నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు

గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది

దినములు ప్రవచింతురు.

                       ప్రకటన గ్రంథము 11:3

    ఇక్కడ ఇద్దరు సాక్షులు మనకు కనిపిస్తున్నారు. వారు ఎవరంటే మోషే, ఏలీయా. ఏడేండ్ల శ్రమల

కాలమును రెండు భాగాలు చేయవచ్చు. మొదట 31/2 సంవత్సరాలు. రెండవ 31/2 సంవత్సరాలు.

ఈ పటము చూస్తే మీకు అర్థము అవుతుంది. ఈ పటము కావలసిన వారు మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి దానిని డౌన్ లోడ్ చేసుకోండి. మోషే, ఏలీయాలు ఈ రెండవ భాగములో, 31/2 సంవత్సరాలు ఈ ప్రపంచానికి తీర్పు తీరుస్తారు.

     దేవుడు యోసేపు ద్వారా ఐగుప్తు దేశమును ఎంతో దీవించాడు. అయితే ఐగుప్తు యోసేపును మరచిపోయింది.అతని వారిని వేధించింది. దేవుడు మోషే ని పంపి, ఐగుప్తు మీద తీర్పులు కుమ్మరించి తన ప్రజలను విడిపించి వాగ్దాన దేశము తీసుకువెళ్ళాడు. భవిష్యత్తులో జరిగేది కూడా అదే. దేవుడు యేసు క్రీస్తు ద్వారా ఈ  ప్రపంచానికి మారు మనస్సు పొందే అవకాశము ఇచ్చాడు. ఆయన ద్వారా మానవ జాతిని దీవించాడు. అయితే ఈ ప్రపంచ ప్రజలు దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా ఉన్నారు. తమ పాపములు విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు.ఏడేండ్ల శ్రమల కాలములో

దేవుడు మరో సారి మోషే ని మరోసారి ఈ ప్రపంచము ముందుకు తీసుకు వస్తాడు. 31/2 సంవత్సరాలు మోషే, ఏలీయాలు  ప్రపంచము మీద తీర్పులు విధిస్తారు. క్రీస్తు విరోధి వారిని హతమారుస్తాడు. మూడున్నర రోజులు వారి శవములు నగరము మధ్యలో పడి ఉంటాయి. వీళ్ళ పీడ వదిలింది అని ప్రపంచమంతా సంబరాలు చేసుకొంటున్నప్పుడు దేవుడు వారిలోకి తన జీవాత్మను పంపి వారిని పరలోకం తీసుకు వెళ్తాడు.

    మోషే ఒక ప్రత్యేకమైన ప్రవక్త. 3500 సంవత్సరాల క్రితము ఐగుప్తు లో జీవించాడు. 2000 సంవత్సరాల క్రితము రూపాంతరపు కొండ మీద యేసు ప్రభువు తో కనిపించాడు.భవిష్యత్తులో ఏడేండ్ల శ్రమల కాలములో మరొక సారి ఈ భూమి మీదకు వస్తాడు. మోషే ద్వారా పాత నిబంధన, ధర్మ శాస్త్రము మనకు అనుగ్రహించబడితే, యేసు క్రీస్తు ద్వారా దేవుని కృప, సత్యము మనకు అనుగ్రహించబడ్డాయి.మోషే ప్రవచించిన ఆ యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి మీరు పాపక్షమాపణ పొందాలన్నదే  నేటి మా ప్రేమ సందేశము.

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00

Leave a Reply