పస్కా పండుగలో ప్రభువు రూపం

నిర్గమ కాండము 12,13

12:2 మీ సంవత్సరమునకు మొదటి నెల…ఈ నెల దశమినాడు దేవుడు నిర్ణయించిన సమయములోనే పస్కా ఆచరించాలి  దేవుడునిర్ణయించిన సమయములోనే ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు వధించబడ్డాడు. మత్తయి 26:24; దానియేలు 9:26 
12:3 ఒక్కొక్కడు ప్రతి ఒక్కరూ పస్కా ఆచరించాల్సిందే  ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా ప్రభువైన యేసు నందు విశ్వాసముంచితేనే, రక్షణ వస్తుంది. రోమా 10:9 
12:6 నిర్దోషమైన యేడాది మగపిల్ల నిర్దోషమైన గొఱ్ఱె పిల్లను

మాత్రమే అర్పించాలి

మన ప్రభువైన యేసు క్రీస్తు నిర్దోషమైన, పాపము లేని, పవిత్రమైన దేవుని గొఱ్ఱె పిల్ల. హెబ్రీ 7:26 
12:7  సాయంకాలమందు గొఱ్ఱె పిల్ల సాయంకాలమందు అర్పించబడింది ప్రభువైన యేసు సాయంకాలమందు 3 గంటల సమయములో అర్పించబడ్డాడు.లూకా 23:44-46 
దాని చంపి గొఱ్ఱె పిల్ల చంపబడాలి ప్రభువైన యేసు సిలువ మీద చంపబడ్డాడు 1 పేతురు 3:18-19 
దాని రక్తము యిండ్లద్వారబంధముల మీద చల్లాలి గొఱ్ఱె పిల్ల రక్తము ద్వారానే

రక్షణ, భద్రత 

యేసు రక్తము లేకుండా మనకు రక్షణ లేదు
12:8 అగ్నిచేత కాల్చబడింది  గొఱ్ఱె పిల్ల అగ్ని చేత కాల్చబడింది  దేవుని యొక్క తీవ్రమైన కోపాన్ని ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద భరించాడు 
12:46 దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు. గొఱ్ఱె పిల్లలో ఒక్క ఎముక కూడా విరువబడలేదు యేసు క్రీస్తు శరీరములోఒక్క ఎముక కూడా విరువబడలేదు 

కీర్తన 34:20; యోహాను 19:36 

ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను గొఱ్ఱె పిల్ల వారికి ఆహారము  యేసు క్రీస్తు మన జీవాహారము 

యోహాను 6:35

చేదుకూరలతో దాని తినవలెను చేదు మనకు రుచించదు; మన మానవ నైజానికి 

దేవుని ప్రణాళికలు రుచించవు 

క్రీస్తు సువార్త ఈ లోకానికి రుచించదు 

రోమా 1:16 

1 కొరింథీ 1:18 

12:11  మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను పస్కా తరువాత ప్రయాణానికి సిద్ధపడాలి రక్షణ పొందిన వ్యక్తి దేవునితో పరలోక ప్రయాణానికి సిద్ధపడాలి
అది యెహో వాకు పస్కాబలి. ఇది మానవుల పండుగ కాదు, దేవుడు నియమించినది యేసు క్రీస్తు దేవుడు నియమించిన రక్షణ మార్గము, మానవులు ఏర్పరచినది కాదు
12:12 ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి…హతముచేసి…. తీర్పు తీర్చెదను గొఱ్ఱె పిల్ల రక్తము క్రింద కు

రాని వారి మీదకు దేవుని తీర్పు వచ్చింది

యేసు క్రీస్తు రక్తము క్రిందకు రాని వారి మీదకు దేవుని తీర్పు వస్తుంది 
12:13 మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. సిగ్గుపడకుండా రక్తమును వారి ఇంటి మీద రాసుకున్నారు  సువార్తను గూర్చి మనము సిగ్గుపడకూడదు 
నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను.  గొఱ్ఱె పిల్ల రక్తము క్రిందలేని వారు నశించారు ప్రభువైన యేసు రక్తము క్రిందకు రాని వారు తమ పాపములలోనే నశిస్తారు

రోమా 3:26 

రోమా 5:9 

ఎఫెసీ 1: 7 

1 పేతురు 1:18-19 

1 యోహాను 1:7 

ఎఫెసీ 2:13

హెబ్రీ10:22 

లూకా 22:20 

ప్రకటన 12:11 

తెగులు మీ మీదికి రాదు గొఱ్ఱె పిల్ల రక్తము క్రింద ఉంటే ఏ తెగులు మన మీదకు రాదు యేసు రక్తము క్రింద ఉన్న వారిని సాతాను శక్తులు, నరకపు శక్తులు మరే శక్తీ, తెగులు తాకలేవు
12:14 కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును.  పస్కా జ్ఞాపకార్ధ దినము నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి
మీరు యెహోవాకు పండుగగా దాని నాచ రింపవలెను పస్కా లో ఆనందము కూడా ఉంది  సిలువ దగ్గర రక్షకుడు మన కొరకు పడిన శ్రమను చూసి బాధ, దేవుడు మన పాపములను క్షమించాడు అనే ఆనందము రెండూ కలుగుతాయి
తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచ రింపవలెను. పస్కా పండుగ నిత్యమైన కట్టడ  క్రొత్త నిబంధన నిత్యమైన కట్టడ

యిర్మీయా 31:31

లూకా 22:20 

12:15 ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను గొఱ్ఱె పిల్ల లో పులుపు కు స్థానము లేదు  పులుపు వేషధారణకు, పాపానికి సాదృశ్యము.  

వాటికి మనము దూరముగా ఉండాలి 

గలతీ 5:9

మత్తయి 16:6

12:22 హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి హిస్సోపు పవిత్రతకు సాదృశ్యముగా ఉంది

లేవీయ 14:1-7

 కీర్తన 51:7

ప్రభువైన యేసు క్రీస్తు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తుంది 

1 యోహాను 1:7 

12:43,48 అన్యుడెవ డును దాని తినకూడదు…సున్నతి పొందిన తరువాత తినవచ్చును నిబంధనలో లేని వారికి పస్కా లో భాగము లేదు క్రొత్త నిబంధన లో ఉన్న వారికి మాత్రమే ప్రభువు బల్లలో ప్రవేశము 

1 కొరింథీ 11:23-30

13:3 మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాప కము చేసికొనుడి పస్కా పండుగ తరువాత దాస్యము నుండి విడుదల వచ్చింది ప్రభువైన యేసు క్రీస్తు సిలువ దగ్గర మనకు పాప దాస్యము నుండి విడుదల కలిగింది

Leave a Reply