క్రైస్తవ సంఘము ఎలా ఉండాలి? డాక్టర్ పాల్ కట్టుపల్లి

దేవుడు నిర్మించిన మరొక గొప్ప వ్యవస్థ క్రైస్తవ సంఘము. ఆ సంఘము సత్యమునకు స్థంభమును, ఆధారమునై ఉన్నది (1 తిమోతి 3:15). అది జీవముగల దేవుని సంఘము. దానిని మనము ఆషామాషీగా పరిగణించకూడదు. అది pillar and ground of truth. సత్యము విశ్వవిద్యాలయాల్లో కానీ, ప్రభుత్వములో కానీ, మరొక వ్యవస్థలో కానీ కొంత మేరకు ఉండవచ్చు. అయితే అవి సత్యమునకు స్థంబాలు కావు. అవి ఎప్పటికీ సత్యాన్వేషణ లోనే ఉంటాయి. డార్వినిజం, సోషలిజం, కమ్యూనిజం, నాస్తికత్వము లాంటి అసత్యాలు కూడా ఆ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తాయి.అయితే, క్రైస్తవ సంఘము దేవుడు బయలుపరచిన సత్యము మీద నిర్మితమైంది. 

దేవుడు ప్రేమించి తన స్వరక్తము ను  ధార పోసి ఈ క్రైస్తవ సంఘమును నిర్మించాడు. తన స్వరక్తమిచ్చి దేవుడు సంపాదించిన తన సంఘము (అపో.కార్యములు 20:28). దేవుడు తన రక్తము చిందించాడంటే అది ఎంత విలువైనదో మీరొక సారి ఆలోచించండి. ‘తన సంఘము’: క్రైస్తవ సంఘము ఏ భక్తునిదో కాదు, ఏ డేనామినేషన్ దో కాదు, ఏ దేవ దూతదో కాదు, ఇది దేవుని సంఘము.

Church in the mind of Christ 

     ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో జీవించిన రోజుల్లో యెరూషలేములో హేరోదు రాజు నిర్మించిన గొప్ప దేవాలయము ఉండేది. ఆ దేవాలయాన్ని యూదులు ఎంతో పవిత్రముగా భావించేవారు.

John 2 19. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.20. యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దిన ములలో దానిని లేపుదువా అనిరి.21. అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను.22. ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి.

ఒక రోజు ప్రభువైన యేసు క్రీస్తు ఆ దేవాలయము దగ్గర ప్రజలతో ఏమన్నాడంటే, ‘ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును’.వారంతా ఆశ్చర్యపోయారు. గొప్ప ఇంజినీర్లు 46 సంవత్సరాలు కడితే ఈ దేవాలయము నిర్మించబడింది. మూడు రోజుల్లో దానిని ఎలా లేపుతావు? అని ఆయనను ప్రశ్నించారు. అయితే ఆయన తన శరీరము అనే దేవాలయము గూర్చి మాటలాడుచున్నాడు అనే సత్యము వారు గ్రహించలేకపోయారు.

   రోమన్లకు ప్రీతిపాత్రుడైన హేరోదు నీడలో ఆ ఆలయము కొనసాగుచున్నది. ఆ మహా ఆలయము కూల్చివేయబడుతుంది అనే ఆలోచనే వారి ఊహకు అందనిది. కానీ కాలము మన చేతుల్లో ఉండదు కదా! క్రీ.శ 70 లో రోమన్ జనరల్ టైటస్ ఆ ఆలయాన్ని నేలమట్టము చేశాడు. అంతకు 40 సంవత్సరాలకు మునుపు రోమన్లు యేసు క్రీస్తు ను కూడా హతమార్చి నేలమట్టము చేశారు. ఆ రెండు ఆలయాల్లో చివరికి ఏది మిగిలింది. రాతితో చేయబడిన దేవాలయము ఇంకా రాళ్లు గానే ఆ ప్రదేశములో పడి ఉంది. కానీ ప్రభువైన యేసు క్రీస్తు సమాధి నుండి తిరిగి లేచి ఆయన కట్టే ఆలయము ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. రోమన్ సామ్రాజ్యము ఆయన సంఘాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని ప్రయత్నించి విఫలమయ్యింది. చివరకు రోమన్ సామ్రాజ్యాధిపతే క్రీస్తు దాసునిగా మారాడు.

      భూలోక సామ్రాజ్యాలే కాదు, సాతాను సామ్రాజ్యము, నరకపు శక్తులు కూడా ఈ క్రైస్తవ సంఘాన్ని నాశనము చేయలేవు. ఆయన పేతురుతో అన్నాడు, “మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.” మత్తయి 16:18 

      మీ మాటల అర్ధము ఆయన పేతురు మీద తన సంఘాన్ని కట్టుట మొదలుపెట్టాడని కాదు. పేతురు అంటే ‘పెట్ర’ అంటే రాయి అని అర్థము. ప్రతి విశ్వాసీ ఈ క్రైస్తవ సంఘములో ఒక సజీవమైన రాయిగా ఉన్నాడు. యేసు క్రీస్తు నా మీద సంఘాన్ని కట్టాడు అని పేతురు గారు తన పత్రికలలో ఎక్కడా వ్రాయలేదు. 

యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు 

ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు 

పరిశుద్ధయాజ కులుగా ఉండునట్లు, 

మీరును సజీవమైన రాళ్లవలెనుండి 

ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

                                                             1 పేతురు 2:5 

     ప్రతి విశ్వాసి ఒక సజీవ మైన రాయే. అపొస్తలుల కార్యములు 4:11,12 లో యేసు క్రీస్తు తల రాయిగా పిలవబడ్డాడు.‘ఆ రాయి మూలకు తలరాయి ఆయెను’. ఎఫెసీ 5:23 లో క్రీస్తు సంఘమునకు శిరస్సు అని పిలువ బడ్డాడు. ‘క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నాడు’.

     క్రీస్తే సంఘమునకు తలరాయి, శిరస్సు కాబట్టి మనము పేతురుని, అపొస్తలులను, భక్తులను, బిషప్ లను, పోప్ లను సంఘమునకు శిరస్సు అని పిలువకూడదు.

Church will be powerful because of Christ 

క్రైస్తవ సంఘానికి దేవుడు ఎంతో  శక్తిని అనుగ్రహించాడు. పరలోకమునకు తిరిగివెళ్ళే సమయములో ప్రభువైన యేసు క్రీస్తు అన్నాడు: 

అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును

 భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.

కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; 

తండ్రియొక్కయు కుమారునియొక్కయు 

పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి

 వారికి బాప్తిస్మ మిచ్చుచు, నేను మీకు ఏ యే 

సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని

 గైకొన వలెనని వారికి బోధించుడి. 

ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము 

మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. (మత్తయి 28:18-20) 

పరలోకములో, భూమి మీద తనకు ఉన్న  శక్తిని ప్రభువైన యేసు క్రీస్తు క్రైస్తవ సంఘమును దృఢపరచుటకు అనుగ్రహించాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి చాలా సామాన్యముగా కనిపించ వచ్చు. కానీ ప్రభుత్వ శక్తి అతని వెనుక ఉంటుంది. అతనికి హాని చేస్తే ప్రభుత్వాన్ని ధిక్కరించినట్లే. అతని తరుపున ప్రభుత్వ యంత్రాంగము మొత్తము దిగివచ్చే అవకాశము ఉంది. దేవుడు కూడా తన అధికారాన్ని క్రైస్తవ సంఘమునకు ఇచ్చాడు. దానిలో చేరేవారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు – త్రియేక దేవుని నామములో అందులో చేరుతున్నారు. 

ప్రభువైన యేసు పేతురుతో అన్నాడు: 

మరియు నీవు పేతురువు; 

ఈ బండమీద నా సంఘమును కట్టుదును, 

పాతాళలోక ద్వారములు దాని యెదుట

 నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి 16:18 

పేతురు తన మట్టుకు చేపలు పట్టుకొనే జాలరి మాత్రమే. కానీ అతను పాలుపొందే క్రైస్తవ సంఘము పాతాళ లోక ద్వారములు కూడా దాని ఎదుట నిలువలేనంత శక్తి కలదిగా ఉంటుంది. 

Church could be small 

స్థానిక సంఘము చిన్నదిగా ఉండవచ్చును: సంఘము అంటే వేలాది మంది కూడుకొనే ఒక పెద్ద భవంతిలా ఉండాలి అని మనము కొన్నిసార్లు అనుకొంటాము. పెద్ద పెద్ద సంఘాలు మన మధ్యలో ఉంటే వాటిని బట్టి దేవుని స్తుతించాల్సిందే. అయితే సంఘము చిన్నదిగా ఉన్నప్పటికీ దానికి కూడా ప్రభువైన యేసు సన్నిధి ఉంటుంది. 

మత్తయి 18:20 లో మనము చదువుతాము. 

ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున

ఎక్కడ కూడి యుందురో అక్కడ

నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. 

మనము ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడుకొంటే ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుంది. 

Church should be respected 

క్రైస్తవ సంఘము పట్ల మనకు గౌరవము ఉండాలి: 

విచారకరముగా చాలా మంది క్రెస్తవులకు కూడా నేడు క్రైస్తవ సంఘము పట్ల గౌరవము లేదు. ఇటీవల ఒక పాస్టర్ గారు నా దగ్గరకు చికిత్స కోసమువచ్చారు. ఆయనకు ఛాతీ మీద గాయము అయ్యింది. అది ఎలా జరిగింది అని నేను ఆయనను అడిగాను. ‘ఇద్దరు వ్యక్తులు చర్చి లో నా ముందు వాగ్యుద్ధానికి దిగారు. ఒకరిని ఒకరు కొట్టుకొనే పరిస్థితి వచ్చింది. వారిని సముదాయించుదామని వెళ్లిన నాకు కూడా దెబ్బలు తగిలాయి.’ 

     దేవుని సన్నిధిలో కూడా మనుష్యులకు ఎలాంటి భయము లేకుండా పోయింది. ఆది సంఘస్తులు ప్రభువు నందు భయము కలిగి జీవించారు. 

కావున యూదయ గలిలయ సమరయ 

దేశములం దంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు

 సమాధానము కలిగియుండెను; 

మరియు ప్రభువునందు భయమును

 పరిశు ద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు

 విస్తరించుచుండెను. అపొస్తలుల కార్యములు 9:31 

ఆది సంఘము విస్తరించింది, ఎందుకంటే వారు సమాధానము కలిగి ఉన్నారు. వారికి దేవుని భయము, పరిశుద్ధాత్మ ఆదరణ ఉన్నాయి. దేవుని యెడల భయము కలిగిఉంటే మనకు ఆయన సంఘము పట్ల కూడా గౌరవము ఉంటుంది. 

Church should be continuous 

క్రైస్తవ సంఘము నిరంతరముగా ఉండాలి: దేవుని భయము, సంఘము పట్ల గౌరవము మనకు ఎక్కువగా ఉండాలంటే అప్పుడప్పుడూ చుట్టపు చూపులాగా సంఘానికి వెళ్లకుండా మనము దాని కార్యక్రమాల్లో, విధుల్లో నిరంతరము పాల్గొనవలెను.  

వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, 

రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును 

ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. అపోస్తలుల కార్యములు 2:42-43

క్రైస్తవులు అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుటయందు

ఎడతెగక కొనసాగవలెనని దేవుడు కోరుకొంటున్నాడు.

Church should be compassionate 

క్రైస్తవ సంఘము లో దేవుని ప్రేమ, కరుణ ఉండాలి. 

విశ్వసించినవారందరు ఏకముగా కూడి 

తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి.

ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, 

అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.

మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో

 తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు,

 దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన

 దయపొందినవారై 

ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను

 ఆహారము పుచ్చుకొనుచుండిరి. 

మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని

 అనుదినము వారితో చేర్చుచుండెను. అపోస్తలుల కార్యములు 2:44-47 

ఇతరులకు ఒక పూట భోజనము కూడా పెట్టని క్రైస్తవులు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. తమ చరస్థిరాస్తులను అమ్మి సహితము ఇతరులకు మేలు చేసిన క్రైస్తవులు పైన వాక్యభాగములో మనకు కనిపిస్తున్నారు. సణుగు కొనకుండా వారు సంతోషముతో దేవుని స్తుతించుచూ ఇతరులకు సహాయము చేశారు. వారి హృదయాల్లో కల్మషము, కపటము లేవు. దేవుని ఆనందము వారికి లభించింది. అటువంటి క్రైస్తవులను చూసి అన్యులు కూడా ఆకర్షింప బడి రక్షణ పొందారు.

Church should be universal 

క్రైస్తవ సంఘము విశ్వజనీనమైనది 

‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి’ అని యేసు ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు.

ఈ ప్రపంచములో ఎక్కడైనా, ఎవరికైనా మనము సువార్త ప్రకటించవచ్చును. వారందరి ఆత్మలు దేవుని దృష్టిలో ప్రశస్తమైనవే.

Church is the prototype of the human family 

క్రైస్తవ సంఘము మానవ కుటుంబానికి ఆదర్శము. క్రైస్తవ సంఘము దేవుడు ఈ చీకటి లోకములో పెట్టిన పరలోకపు వెలుగు కాలనీ.అందరూ దీనిని చూచి తమ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలను క్రమబద్దీకరించుకోవాలని దేవుని ప్రణాళిక.

 1. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున 

పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. 

క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

 1. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా 

భార్యలుకూడ ప్రతి విషయములోను 

తమ పురుషులకు లోబడవలెను.

 1. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి.

 అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, 

 1. అది కళంకమైనను ముడతయైనను 

అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

 1. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను 

ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, 

వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,

 పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీ 5 

క్రీస్తు సంఘమునకు శిరస్సు, అదే విధముగా పురుషుడు భార్యకు శిరస్సు.

సంఘము క్రీస్తుకు లోబడి ఉండాలి, అదే విధముగా భార్య భర్తకు లోబడి ఉండాలి.

క్రీస్తు ప్రాణము పెట్టనంతగా సంఘమును ప్రేమించాడు, అదే విధముగా పురుషుడు తన ప్రాణము కంటే అధికముగా భార్యను ప్రేమించాలి.

కట్న కానుకల కోసము భార్యలను రాచి రంపాన పెట్టే మన సంస్కృతి లో పైన దేవుడు బోధించిన సత్యాలను వివాహములో, కుటుంబములో ఆచరించడము చాలా ముఖ్యము.

Church: Unity in diversity; Unity in function; Unity in composition

క్రైస్తవ సంఘములో ఐక్యత ఉండాలి.

   ‘భిన్నత్వములో ఏకత్వము’ అనేది దేవుడు ఈ విశ్వములో పెట్టిన ప్రధాన సూత్రము. ఈ విశ్వమును 4 శక్తుల మీద నిర్మించాడు.

1.గురుత్వాకర్షణ (Gravity)

2.ఎలక్ట్రో మాగ్నెటిక్ శక్తి (Electromagnetism)

 1. బలహీన న్యూక్లియర్ శక్తి (Weak Nuclear Force) 

4.బలమైన న్యూక్లియర్ శక్తి (Strong Nuclear Force) 

   గురుత్వాకర్షణ ఒకో ప్రాంతానికి ఒకో రకముగా ఉంటుంది అని చాలా కాలము భావించారు. సర్ ఐసాక్ న్యూటన్ ఒక్క గురుత్వాకర్షణే విశ్వమంతా వ్యాపించి ఉంది అని సూత్రీకరించాడు. విద్యుత్తు శక్తి, అయస్కాంత శక్తి ఒకటే నని జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ సూత్రీకరించాడు. బలహీన న్యూక్లియర్ శక్తి, బలమైన న్యూక్లియర్ శక్తి ల మధ్య కూడా ఏకత్వము చూపించుటకు నేటి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ‘సమస్త సిద్ధాంతము’ (Theory of Everything) పేరట విశ్వములోని ఈ నాలుగు విభిన్న  శక్తుల మధ్య ఏకత్వాన్ని చూపించాలని భౌతిక శాస్త్రవేత్తలు అహరహం శ్రమిస్తున్నారు. 

      మన సమాజములో కూడా అనేక వర్గాలు, కులాలు, ప్రాంతాలు గా విడిపోయిన ప్రజల మధ్య ఐకమత్యము సాధించాలని రాజనీతిజ్ఞులు శ్రమిస్తారు. భిన్నత్వములో ఏకత్వము సాధించుటకు మనిషి పడే ఈ వేదన వెనుక దేవుడు పెట్టిన సృష్టి రహస్యము దాగి ఉంది.

 క్రైస్తవ సంఘము ద్వారా ప్రపంచానికి ఏకత్వాన్ని చూపించాలని దేవుని కోరిక.

 1. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, 

యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, 

ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

 1. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను,

 స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు. 1 కోరిందీ 12 

శరీరములో అనేక అవయవముల మధ్య సమన్వయము, ఐక్యత ఉన్నట్లే అనేక వర్గాల నుండి సమకూర్చబడిన విశ్వాసుల మధ్య సమన్వయము, ఐక్యత ఉండాలి. వారు చేసే పనులు విభిన్నమైనవి అయినప్పటికీ వాటి యొక్క ప్రధాన గురి సంఘము యొక్క ఐకమత్యము, క్షేమాభివృద్ధి మాత్రమే.

13.పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, 

పరిచర్య ధర్మము జరుగుటకును, 

ఆయన కొందరిని అపొస్తలులనుగాను, 

కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను,

 కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

 1. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి,

 మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను,

 తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, 

గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి 

ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు 

అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక 

 1. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు,

 మనమన్ని విషయములలో ఎదుగుదము.

 1. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి

 సర్వశరీరము చక్కగా అమర్చ బడి, 

తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున

 పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి,

 ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు

 శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది. ఎఫెసీ 4 

సంఘములోని విశ్వాసులకు దేవుడు విభిన్నమైన పనులు అప్పగించాడు. ఆయన ఉద్దేశ్యము, మనము  ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండి అన్ని విషయములలో ఎదుగుట. 

Leave a Reply