జర్మనీ పారిపోయిన డేవిడ్ బూబెంజెర్ 

   భారత దేశంలో డేవిడ్ బూబెంజెర్ చేసిన ‘సేవ’ మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసింది. ‘మిషనరీ’ ల మనే పేరుతో డేవిడ్ బూబెంజెర్, ఫిలిప్ స్వెట్లిక్, ఫిలిప్ బ్రెమెకర్ లు జర్మనీ దేశము నుండి పల్లెకోన వచ్చారు. ‘సాంఘిక సేవ’ అనే పేరుతో భారత వీసాలు తెచ్చుకొన్నారు. కట్టుపల్లి యోహాను గారు పల్లెకోన లో స్థాపించిన అనాథ శరణాలము – పాఠశాల దగ్గరలో ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే వీరి హృదయములో దురాశ మొదలయ్యింది.ఎలాగైనా పల్లెకోన స్కూల్ ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమములో యోహాను గారి కుటుంబము మీద అనేక అబద్ధాలు ప్రచారము చేశారు. డబ్బు కోసము ఏపనైనా చేసే పనికి మాలిన భారతీయులను కొంత మందిని చేరదీశారు. వారి మీద డబ్బులు కుమ్మరించి అడ్డమైన పనులన్నీ చేశారు. తెనాలిలో, పల్లెకోన లో సహవాసమును చీల్చారు. లక్షలకు లక్షలు దిగమింగిన అవినీతి పరులను ప్రోత్సహించారు.

    వీరు చేస్తున్న తప్పుడు పనులను సహించలేక కట్టుపల్లి మాథ్యూ హెన్రీ గారు వీరిని పల్లెకోన నుండి వెళ్ళిపోమన్నాడు. దీనితో డేవిడ్ బూబెంజెర్, ఫిలిప్ బ్రెమెకర్ లు జర్మనీ తిరిగివెళ్ళిపోయారు. ఫిలిప్ స్వెట్లిక్ నెల్లూరు వెళ్ళాడు. అక్కడ నుండి తన సంఘములను చీల్చే పనులు చేస్తున్నాడు. సంఘములు నిర్మించాలి, కట్టాలి కానీ వాటిని చీల్చకూడదు.పూర్వము బ్రిటిష్ వారు అనుసరించిన ‘విభజించు-పాలించు’ అనే సిద్ధాంతాన్ని ఈ జర్మనీ వారు ఇప్పుడు తెలుగు సంఘాల్లో అమలు చేస్తున్నారు. 

    డేవిడ్ బూబెంజెర్, ఫిలిప్ బ్రెమెకర్లకు నిజముగా ‘మిషనరీ’ సేవ చేద్దామని ఉంటే, ఇండియా లో ఏదోఒక చోట చేసేవారే. వీరి దృష్టి పల్లెకోన మీద మాత్రమే ఉంది కాబట్టి, పల్లెకోన తమ చేతులకు రాదని గ్రహించిన తరువాత వీరు పెట్టె, బేడ సర్దుకొని జర్మనీ పారిపోయారు. ఇటువంటి వారి వలన సంఘములకు క్షేమము కలుగదు. బుర్కార్డ్ స్మిత్ కూడా తన పనులతో సంఘములకు హాని చేసాడు.

   డాక్టర్ పాల్ కట్టుపల్లి గారు దేశీయముగా సేవకులను ప్రోత్సహిస్తున్నారు. వారితో సంఘములు వారు కలిస్తే మంచిది కానీ, జర్మనీ వారిని నమ్ముకొంటే మిగిలేది సున్నా. పఠిష్టమైన సంఘాలు నిర్మిద్దాము, మాతో కలిసి రండి.

Leave a Reply