క్రీస్తు కోసం మీ హృదయం

    హృదయం వేరు, మైండ్ వేరు అని మనం అనుకొంటాము. అయితే, ఆ భావము బైబిల్ నుండి వచ్చింది కాదు. బైబిల్ హృదయం గురించి పదే పదే ప్రస్తావిస్తుంది. పాత నిబంధన గ్రంథములో ‘లెబాబ్’ అనే పదం, క్రొత్త నిబంధనలో ‘కార్డియా’ అనే పదము వాడబడింది. బైబిల్ ప్రస్తావించే ‘హృదయం’ ఏమిటి? అని మనం ఆలోచించాలి. హృదయం అంటే మన ఛాతీలో ఉండే ‘గుండె’ అని కాదు.

మన ఛాతీలో ఉండే గుండె ఒక శరీర అవయవం. అది కొట్టుకొంటూ శరీరమంతటికీ రక్తాన్ని ప్రసారం చేస్తుంది. మన తలకాయలో ‘మెదడు’ ఉంటుంది. మెదడు, గుండె వేరు వేరుగా పనిచేయలేవు. గుండె కొట్టుకొంటేనే మెదడు పనిచేస్తుంది. మెదడు పనిచేస్తేనే గుండె కొట్టుకొంటుంది. నేను MBBS చదివే రోజుల్లో అనాటమీ ల్యాబ్ లో చాలా సమయము గడుపుతూ ఉండేవాణ్ణి.ఒక వారము రోజులు మనిషి గుండెను స్టడీ చేసాను. గుండెలో ఒక్కొక్క భాగాన్ని కోసుకొంటూ వెళ్ళాను. అనేక రక్తనాళాలు నాకు కనిపించాయి. కొన్ని చోట్ల నరములు కనిపించాయి. మన గుండెలో రక్తనాళాలు, నరములు రెండూ ఉన్నాయి అని అప్పుడు గ్రహించాను. మెదడులో రక్తనాళాలు, గుండెలో నరములు మనము చూస్తాము. ఎందుకంటే మెదడు పనిచేయాలంటే గుండె కావాలి, గుండె పనిచేయాలంటే మెదడు కావాలి.దేవుడు వాటిని ఇంటెగ్రేట్ చేశాడు.వాటి మధ్య సమన్వయము ఉంచాడు. 

    బైబిల్ లో ఉన్న హృదయము ఒక్క భావోద్రేకాలు మాత్రమే కాదు లేక ఒక్క హేతుబద్ధమైన ఆలోచనలు మాత్రమే కాదు. బైబిల్ చెప్పే ‘హృదయము’ లో భావోద్రేకాలు, ఆలోచనలు రెండూ ఉంటాయి. మెదడు ఒక అవయవం, గుండె ఒక అవయవం, అయితే ‘హృదయం’ ఒక అవయవం కాదు. అది ఒక శరీర భాగం కాదు. బైబిల్ చెప్పే హృదయం భావోద్రేకాలు, ఆలోచనలు, హేతువు ల యొక్క కలగలుపు.అది మన కంటికి కనిపించేది కాదు.మన శరీరము తెరిస్తే అది మనకు కనిపించదు. మన శరీరములో మెదడు కనిపిస్తుంది, కానీ మనస్సు కనిపించదు. మన శరీరములో గుండె కనిపిస్తుంది. కానీ హృదయం కనిపించదు. అయితే దానిలో భావోద్రేకాలు, తెలివి, హేతువు, ఆలోచన, జ్ఞానము ఉంటాయి. మన కంటికి కనిపించక పోయినప్పటికీ ‘హృదయం’ మన శరీరం, మన మనస్సు, మన ఆత్మ లలో నుండి జనించే కలయిక గా ఉంది. 

    దేవుడు ప్రత్యేకమైన హృదయాన్ని మనిషికి ఇచ్చాడు. జంతువులకు ఇలాంటి హృదయం ఉండదు.జంతువులకు గుండె ఉంటుంది, భావోద్రేకాలు ఉంటాయి. అయితే మనిషికి ఉండే హృదయము వాటికి ఉండదు.ప్రసంగి 3:11 లో మనము చదువుతాము: 

ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరులహృదయమందుంచి యున్నాడు.  ప్రసంగి 3:11

He has also set eternity in their hearts

    మనుష్యుల హృదయములో దేవుడు శాశ్వత కాల జ్ఞానమును పెట్టాడు.నిత్యత్వాన్ని పెట్టాడు. జంతువులకు అది లేదు. ఈ మధ్యలో transhumanism ట్రాన్స్ హ్యూమనిజం అని ఒకటి బయలుదేరింది. మరణాన్ని అధికమించాలి, టెక్నాలజీ లో మనిషిని అనుసంధానం చేయాలి, అర్టిఫీసియల్ ఇంటెలిజెన్సు ద్వారా మనుష్యులను రోబోలుగా చేయాలి, రోబోలను మనుష్యులుగా చేయాలి అని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో చాలామందికి దేవుని మీద నమ్మకం ఉండదు. అయితే, మరణాన్ని అధికమించాలి అనే కోరిక వీరికి ఎందుకు కలిగింది? ఎందుకంటే, దేవుడు శాశ్వత కాల జ్ఞానమును మనుష్యుల హృదయములో పెట్టాడు. 

     కొన్ని రోజుల క్రితం SpaceX అనే కంపెనీ అమెరికా లో నాసా అంతరిక్ష సంస్థ ద్వారా ఇద్దరు ఆస్ట్రోనాట్ లను అంతరిక్షంలోకి పంపింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయము ఏమిటంటే, వీరిని అంతరిక్షం లోకి తీసుకువెళ్లిన రాకెట్ తిరిగి భూమి మీదకు తిరిగి వచ్చింది. ఇప్పటి వరకు రాకెట్లు ఆకాశము లోనే కాలిపోయి ఈ బంగాళా ఖాతం లోనో, పసిఫిక్ మహాసముద్రం లోనో పడిపోయేవి.అయితే, ఇప్పుడు ఈ రాకెట్ లు అలా కాలిపోకుండా, భూమి మీదకు తిరిగి వస్తున్నాయి.ఒక బస్సు లాగా అటు ఇటు మనుష్యులను తిప్పే రాకెట్లను ఇప్పుడు తయారుచేస్తున్నారు. SpaceX ఒక ప్రైవేట్ కంపెనీ. అంతరిక్షములో మనుష్యుల కాలనీ లను పెట్టాలి అని ఈ ప్రైవేట్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. 

    ఈ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ ఏమంటాడంటే, ఒక వైరస్, ఒక అణు యుద్ధం, వాతావరణ కాలుష్యం ఏదో ఒక కారణము వలన భూమి మీద మనిషి మనుగడ అంతరించే ప్రమాదం ఉంది. అంతరిక్షములో మనము కాలనీలు నిర్మించాలి అని అంటున్నాడు. దేవుడు లేని ఈ నాస్తికుడు కూడా మానవ జాతి బ్రతకాలి అంటున్నాడు. ఎందుకంటే మనుష్యుల హృదయములో దేవుడు శాశ్వత కాల జ్ఞానమును పెట్టాడు. అది మనిషి ప్రత్యేకత. మనిషి హృదయములోనే దేవుడు తన నిత్యత్వాన్ని పెట్టాడు, మనిషి హృదయము మీద తన నైతికత ను ముద్రించాడు,  మనిషికి అనేక ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని పంపించాడు. యేసు క్రీస్తు రూపములో మనిషికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నాకు నీ హృదయం కావాలి.పిచ్చి, పిచ్చివి నాకు పడెయ్యవద్దు. 

నాకు నీ హృదయం కావాలి

I want your heart 

ద్వితీయోప దేశ కాండము 6 అధ్యాయములో మనం చదువుతాము: ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.

                                                    ద్వితీ దేశ కాండము 6:5

And thou shalt love the Lord thy God with, all thine heart, and with all thy soul, and with all thy might.

నీ పూర్ణ హృదయం, నీ  పూర్ణాత్మ, నీ పూర్ణ శక్తి. ముందు నీ పూర్ణ హృదయం నాకు కావాలి. సాతానుడు ఏమంటున్నాడంటే నాకు కూడా అదే కావాలి. 

Your heart is the  most coveted real estate space in the entire universe 

దేవుడు సాతాను ఇద్దరూ మీ హృదయం కోసము పోరాడుతున్నారు. నీ హృదయం నాకు కావాలి అని దేవుడు అంటున్నాడు.కాదు నాకు కావాలి అని సాతానుడు అంటున్నాడు. నీ హృదయాన్ని ఎవరికి ఇస్తావా? దేవా, నా హృదయాన్ని ఏలుకో అని దేవుని పిలుస్తావా? లేక సాతానా, నా హృదయాన్ని ఏలుకో అని సాతానుని పిలుస్తావా? మీ జీవితములో అన్నిటి కంటే ముఖ్యమైన ప్రశ్న ఇది. చాలా మంది సాతానుకు తమ హృదయాన్ని వ్రాసి ఇస్తున్నారు. ఈ హృదయము గురించి దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చూద్దాము. 

1.It’s the source of sin

     మొట్టమొదటిగా ‘హృదయం’ పాపానికి పుట్టినిల్లు గా ఉంది. It’s the source of sin. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు.

కీర్తన 14:1 

The fool hath said in his heart, There is no God. 

They are corrupt, they have done abominable works

    దేవుడు లేడు, ఉన్నా కానీ నా జీవితములో లేడు అని మనము అనుకొన్న తరువాత అసహ్యమైన  కార్యములు చేయడం మొదలుపెడుతాము. జల ప్రళయమునకు ముందు మనుష్యుల పరిస్థితి ఎలా ఉంది? 

నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. 

                                      (ఆదికాండము 6: 5) 

And God saw that the wickedness of man was great in the earth, and

 that every imagination of the thoughts of his heart was only evil continually.

మనుష్యుల హృదయము యొక్క తలంపుల లోని ఊహలు పాపముతో నిండిఉన్నాయి. అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడంటే, మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును,వ్యభి చారములును లోభములును,చెడుతనములును కృత్రిమమును,కామవికారమును మత్సరమును, దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.

మార్కు 7:21-22 

21 For from within, out of the heart of men, proceed evil thoughts, adulteries, fornications, murders, 22 Thefts, covetousness, wickedness, deceit, lasciviousness, an evil eye, blasphemy, pride, foolishness:23 All these evil things come from within, and defile the man.

    యేసు ప్రభువు మాటలు మీరు గమనించండి. సమస్త పాపములు మనుష్యుల హృదయములో నుండి వస్తాయి అని ఆయన చెప్పాడు. సమస్త పాపములకు పుట్టినిల్లు మన హృదయమే. అమెరికా దేశములో కొన్ని రోజుల క్రితం ఒక సంచలన ఘటన జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక నల్ల జాతి యువకుని మెడ మీద తన మోకాలు పెట్టి వత్తాడు. గాలి ఆడక ఆ యువకుడు చనిపోయాడు. ఆ పోలీస్ ఆఫీసర్ తెల్ల జాతీయుడు, ఆయన  జాత్యహంకారముతోనే ఈ పని చేశాడు అని చాలా మంది ఆయనను విమర్శిస్తున్నారు. దానితో అక్కడ అనేక చోట్ల అల్లర్లు మొదలయినాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో భూ గర్భములో ఒక బంకర్ లో దాక్కొనవలసి వచ్చింది.

     జాత్యహంకారం కూడా ఒక పాపమే.ఎందుకంటే, దేవుడు పెట్టిన సమానత్వాన్ని మేము గుర్తించము అనే మనిషి అహంకారములో నుండే జాత్యహంకారం పుట్టింది. ప్రకటన గ్రంథము 5:9 లో మనం చదువుతాము. పరలోకము లో ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి జనము, ప్రతి ప్రాంతము ప్రజలు మనకు కనిపిస్తున్నారు. 

for thou wast slain, and hast redeemed us to God by thy blood out of every kindred, and tongue, and people, and nation;

    పరలోకము లో ఉన్న ఆ కల్చర్ ని మనం భూమి మీద కూడా నేర్చుకోవాలి. జాత్యహంకారం, కులతత్వము, మత విద్వేషాలు మన హృదయములో పుట్టే పాపాలే. యిర్మీయా 17:9 లో మనం చదువుతాము: 

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

                            యిర్మీయా 17:9 

The heart is deceitful above all things, and desperately wicked: who can know it?

                                                 Jeremiah 17:9

మన హృదయము గురించి మనకు పూర్తిగా తెలియదు. దానికి ఘోరమైన వ్యాధి ఉంది. నా దగ్గరకు ఒకాయన వచ్చాడు. నేను ఆయనను పరీక్షించి ‘నీకు గుండె జబ్బు ఉంది’ అని చెప్పాను. ఆయన నా మాటలు నమ్మలేదు. ‘నాకు అంత బాగానే ఉంది’ అని వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తరువాత మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. ‘అప్పుడు, మీరు చెప్పింది కరెక్ట్. పోయిన వారం నాకు ఛాతీలో నొప్పి వచ్చింది. పరీక్షలు చేయించుకున్నాను. ‘గుండె జబ్బు’ అని తేలింది అన్నాడు. దేవుడు మనతో, ‘నీ హృదయములో పాపపు రోగం’ అని చెపుతున్నాడు. మనకు ఆ మాటలు నమ్మబుద్ధి కాదు. ‘నా హృదయము చాలా బావుంది’ అని మనం అనుకొంటాము. దేవుడు మనతో, ‘నా మాట విను. నీ హృదయములో పాప రోగం ఉంది. క్రీస్తు దగ్గరకు రా రక్షణ పొందు’ అంటున్నాడు. 

2. It’s the Seat of Salvation 

    రక్షణ కార్యము కూడా మన హృదయములోనే మొదలవుతుంది. రోమా 10:9 లో మనం చదువుతాము: 

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని,దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

                                రోమా 10:9 

That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved.

రక్షణ  ఎలా పొందగలము? రెండు పనులు చేయాలి. యేసు ప్రభువని మన  నోటితో ఒప్పుకోవాలి. ఆయన మృతులలో నుండి లేచాడు అని మన హృదయములో విశ్వసించాలి. మన హృదయములోనే పాపము మొదలవుతుంది, మన హృదయములోనే రక్షణ మొదలవుతుంది. 

నీ హృదయము సమస్త పాపములకు పుట్టినిల్లు గా ఉంది, నేను దానిని రక్షణకు మెట్టినిల్లు గా చేస్తాను అని దేవుడు మనతో అంటున్నాడు. 1 పేతురు 3:15 లో మనం చదువుతాము: 

మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి

                                   1 పేతురు 3:15

But sanctify the Lord God in your hearts 1 Peter 3:15 

    యేసు క్రీస్తును మీ హృదయముల యందుప్రభువుగా ప్రతిష్ఠించుడి. నా హృదయానికి నేనే రాజును అని మనం అనుకొంటాము. క్రీస్తును మన హృదయముల యందు ప్రభువుగా ప్రతిష్టించుట మనకు ఇష్టం ఉండదు. అలెక్సండర్ సోల్జేనిత్సైన్ అనే మేధావి ఒక మాట అన్నాడు.

But the line dividing good and evil cuts through the heart of every human being. And who is willing to destroy a piece of his own heart?

    మంచి చెడుల మధ్య ఉండే గీత ప్రతి హృదయములో గుండా వెళ్లుచున్నది. తమ హృదయాన్ని త్యాగం చేసేది ఎవరు? మంచి, చెడుల మధ్య ఉండే గీత మన హృదయములో గుండా వెళ్లుచున్నది. నా గీతలు నేను గీసుకొంటాను అనేది మనిషి తత్వము. అయితే ఆ తత్వము నుండి మనము బయటపడాలి. యేసు క్రీస్తును మన హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్టించాలి.

3. Scale of Sincerity 

నిజాయితీ కి కొలమానం దేవుడు బైబిల్ లో అనేక చోట్ల ఒక మాట చెప్పాడు. నేను హృదయాన్ని పరీక్షించే దేవుణ్ణి.

సామెతలు 17:3 లో మనము చదువుతాము: వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే

                                       సామెతలు 17:3

The fining pot is for silver, and the furnace for gold: but the Lord trieth the hearts.

    వెండి, బంగారము కొలిమిలో పెట్టితేనే  ఫర్నేస్ లో పెడితేనే వాటి నాణ్యత తెలిసేది. 

అదే విధముగా నేను హృదయ పరిశోధకుణ్ణి అని దేవుడు మనతో అంటున్నాడు. దేవుడు సమూయేలు ను యెష్షయి ఇంటికి పంపాడు. యెష్షయి కుమారులలో నుండి ఇశ్రాయేలు కు రాజును ఎంపిక చేయాలి. సమూయేలు యెష్షయి కుమారులలో ఒక్కొక్కన్ని చూస్తూ ‘దేవుడు ఎన్నుకొంది’ ఇతన్నే అనుకొన్నాడు. అప్పుడు సమూయేలు తో దేవుడు ఒక మాట అన్నాడు.

మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.

                          1 సమూయేలు 16:7 

for man looketh on the outward appearance, but the Lord looketh on the heart.

    మనం పై రూపం చూసి నిర్ణయాలు తీసు కొంటాము, అయితే దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుని హృదయములో దావీదు ఉన్నాడు ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుని హృదయములో దావీదు ఉన్నాడు. దావీదు హృదయములో దేవుడు ఉన్నాడు. వారి ఇద్దరి హృదయాలు కలిసినాయి. దావీదు ధైర్యముగా దేవునితో అన్నాడు 

23 Search me, O God, and know my heart: try me, and know my thoughts

దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము

 (కీర్తన139:23) 

నా హృదయం నీకు తెలుసు, నా ఆలోచనలు నీకు తెలుసు 

    బ్లెయిస్ పాస్కల్ అనే గొప్ప శాస్త్రవేత్త, తత్వవేత్త ఉండేవాడు. ఆయన ఒక  మాట అన్నాడు: 

“God who was after relationship would be willing to appear openly to those who seek Him with all their heart, and to be hidden from those who flee from Him with all their heart”

“తమ హృదయముతో ఆయనను వెదికే వారికి దేవుడు ప్రత్యక్షమగుతాడు.తమ హృదయములో ఆయనను ఇష్టపడని వారి నుండి దేవుడు దాగుకొంటాడు” 

దేవా, నన్ను విసిగించబాకు అంటే దేవుడు నీ జోలికి రాడు. ఆయన హృదయములను ఎరిగిన దేవుడు (అపో.కార్య 15:8) God, which knoweth the hearts,

యిర్మీయా ప్రవక్త అన్నాడు: యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచు చున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. (యిర్మీయా 12:3) 

3 But thou, O Lord, knowest me: thou hast seen me, and tried mine heart toward thee:

అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నాడు: మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. (1 థెస్స 2:4)  not as pleasing men, but God, which trieth our hearts

6. మను ష్యులను సంతోషపెట్టువారు చేయు నట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరి గించుచు (ఎఫెసీ 6:6) 6 Not with eyeservice, as menpleasers; but as the servants of Christ, doing the will of God from the heart;

2. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు. (సామెతలు 21:2) 

Every way of a man is right in his own eyes: but the Lord pondereth the hearts.

ప్రకటన 2:23 లో యేసు ప్రభువు అన్నాడు: నేను అంతరింద్రియములను, హృదయములను పరీక్షిస్తాను

I am he which searcheth the reins and hearts

మన హృదయములను ఎరిగిన దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకొని, ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యొద్దకు వచ్చి మన పాపములు ఒప్పుకోవాలి. ఈ రోజు ఆయన యొద్దకు వచ్చి మీరు రక్షణ పొందాలని నా మనవి.

Leave a Reply