ప్రసంగి : జీవిత అర్థం – సమయం:నిత్యత్వం

3 అధ్యాయము 1 వచనము: సమయము: ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు (ప్రసంగి 3:1) ప్రతి దానికి సమయము కలదు. ముఖ్యమైన సంఘటనల మీద మనకు నియంత్రణ లేదు. ఈ సత్యము ఈ సమయములో మనకు స్పష్టముగా అర్థమవుతున్నది. ఈ సంవత్సరము ఇలా ఉంటుంది అని మనం ఊహించామా? మన జీవన విధానం అల్లకల్లోలమైంది. కరోనా వైరస్ మన జీవితములో అన్నిటినీ ప్రభావితం చేస్తున్నది. ఒకాయన నా దగ్గరకు వచ్చాడు. ‘డాక్టర్, నాకు కరోనా వచ్చిందేమో. టెస్ట్ చేయండి’ అన్నాడు. సరే కూర్చో అని ఆయనను కూర్చో పెట్టి కరోనా టెస్ట్ చేసాను. రిసల్ట్ వచ్చినప్పుడు ఫోన్ చేసి చెబుతాలే, ఇంటికి వెళ్ళండి అని చెప్పాను. ఆయన రోజంతా నాకు ఫోన్లు చేస్తున్నాడు. ‘డాక్టర్, నాకు పోజిటివా, నెగటివా. నాకు ఆందోళనగా ఉంది’. రిసల్ట్ వచ్చినప్పుడు నేను నీకు ఫోన్ చేసిచెబుతాను. మీరు రెస్ట్ తీసుకోండి’ అన్నాను. అయితే, ఆయనకు నెమ్మది లేదు. ‘ఆ కరోనా నీకు రాకపోవచ్చు. ఈ ఆందోళనతో నీ గుండె ఆగిపోయేటట్టు ఉంది. దేవుని యందు విశ్వాసముంచు, క్రీస్తు నందు విశ్రాంతి తీసుకో.’ అని ఆయనకుచెప్పాను. ప్రసంగి మనకు ఏమని చెబుతున్నాడంటే, 

1. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.

2. పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,

3. చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;4. ఏడ్చుటకు 

నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;

5. రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;

5. రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

6. వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;

4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు

5. రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

6. వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;7. చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;5. రాళ్లను 

పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

6. వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;

7. చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

8. ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.

జీవితానికి అర్థం ఎలా వస్తుంది? 

1. ప్రతిదానికి సమయము కలదు. దేవుడు కాల చక్రములో మనలను బిగించాడు. మనం అనుకొంటాము. ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది. ఈ కరోనా వలన నేను అనుకొన్న పనులు చేయలేక పోయాను. నా ప్రాజెక్టులు ఆగిపోయినాయి. అంతా వేస్ట్. అయితే, ఏదీ వేస్ట్ కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి దానికీ సమయము కలదు. ఈ సంవత్సరం మన ప్రపంచం ఇలా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. ఇది మానవ తప్పిదాల వలన కలిగింది అనుకొన్నప్పటికీ దేవుడు దానిని అనుమతించాడు. ఇది వేస్ట్ అని మనం అనుకోకూడదు. ఈ సమయములో కూడా దేవుడు మనకు తన పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. 

    ‘మీనింగ్ ఆఫ్ లైఫ్’ లో ‘సమయము’ నకు ప్రాధాన్యత ఉంది. ఈ సమయములో నేను నేర్చుకొనేది ఏమీ లేదు అని మనకు అనిపించవచ్చు. నేను ఒక సారి పోలాండ్ దేశములో ఔస్క్ విట్జ్ అనే ఒక కాన్సంట్రేషన్ క్యాంపు కు వెళ్ళాను. రెండో ప్రపంచ యుద్ధ సమయములో దానిని నాజీలు నిర్మించారు. అనేక మంది యూదులను అక్కడ బంధించారు. వందలాది మందిని చిన్న గదుల్లో కుక్కారు. వారికి సరైన ఆహారం పెట్టేవారు కాదు. వారి చేత వెట్టి చాకిరి చేయించేవారు. అక్కడ వారు పడిన బాధలు వర్ణనాతీతం. ఆ ప్రాంతములో నేను నడుస్తూ ఉన్నప్పుడు నాకు విక్టర్ ఫ్రాంకెల్ అనే సైకియాట్రిస్ట్ గుర్తుకు వచ్చాడు. ఆయన Man’s Search for Meaning అనే పుస్తకం వ్రాశాడు. ఆ కాన్సంట్రేషన్ క్యాంపు లో ఆయన కూడా బంధీగా జీవించాడు. ఆ బాధలు పడుతున్నప్పుడే ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది: మనిషి జీవితానికి అర్థం ఉందా? నా జీవితానికి అర్థం ఉందా? 

      ఆ క్యాంపు నుండి బయటపడిన తరువాత విక్టర్ ఫ్రాంకెల్ ‘అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ’ అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం కొన్ని కోట్ల ప్రతులు అమ్ముడుపోయింది.అది మనందరికీ వచ్చే ప్రశ్నే: నా జీవితానికి అర్థం ఉందా? ఒక కాన్సంట్రేషన్ క్యాంపు లో అర్థం ఏమి ఉంది? ఆ బాధలో కూడా అర్థం ఉంది అని విక్టర్ ఫ్రాంకెల్ అన్నాడు.ఒక యూదుడు మాత్రమే అలాంటి పుస్తకం వ్రాయగలడు. సిలువ మీద నజరేయుడైన యేసు మనకు కనిపిస్తున్నాడు. అటువంటి క్రూరమరణాన్ని పొందిన వ్యక్తి జీవితానికి అర్థం ఉందా? అటువంటి సిలువకు కూడా దేవుడు అర్థం ఇస్తాడు. ‘ప్రతిదానికి సమయము కలదు’. దేవుని సమయములో నజరేయుడైన క్రీస్తు సిలువ మీద ఉన్నాడు. దానికి అర్థం ఉంది. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మీరు ఇంట్లో ఉండొచ్చు, పనిలో ఉండొచ్చు, హాస్పిటల్ లో ఉండొచ్చు, జైలులో ఉండొచ్చు, మరొక చోట ఉండొచ్చు.మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దేవునితో మీ సమయాన్ని గడిపితే దానికి అర్థం ఉంది.

మరణపు నీడ: 

ప్రసంగి లో మనకు కనిపించే మరొక అంశం మరణపు నీడ. 

3 అధ్యాయములో ఒక మాట చూద్దాము.

19. నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; 

వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; 

సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు

ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.

20. సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, 

సమస్తము మంటికే తిరిగిపోవును.

21. నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో 

లేదో యెవరికి తెలియును? ప్రసంగి 3:19-21 

ప్రతి ఒక్కరూ, ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా.ఇదంతా ఎందుకు? జంతువుల వలెనె మనుష్యులు కూడా చనిపోతున్నారు.అని వైరాగ్యముతో, విరక్తితో ప్రసంగి ఇక్కడ మాటలాడుచున్నాడు.   పాల్ కళానిధి “When Breath Becomes Air” అని ఒక పుస్తకం వ్రాశాడు. ఆయన ఒక న్యూరో సర్జన్. నేనొక న్యూరో సర్జన్ కావాలి అని ఎన్నో సంవత్సరాలు ఆయనకు మరొక విషయం గురించి పట్టించుకోలేదు. ఆయన న్యూరో సర్జన్ అయిన తరువాత, ‘ఇప్పుడు నేను నా లక్ష్యం సాధించాను.ఇక ఇప్పటి నుండి నా జీవితము ఎలా జీవించాలో తెలుసుకొంటాను’ అన్నాడు. అప్పుడు ఆయనకు ఒక దుర్వార్త అందింది. నీకు కాన్సర్ వ్యాధి వచ్చింది. ఇక నువ్వు బ్రతికేది కొన్ని నెలలు మాత్రమే’. ఆ వార్త విని ఆయన షాక్ తిన్నాడు. ఆ పుస్తకములో, ‘నేనొక  న్యూరో సర్జన్ కావాలని ఇంత కాలం నా జీవితం ఎలా జీవించాలో కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు నా జీవితములో స్థిరపడినప్పుడు, జీవితం ఎలా జీవించాలి అని అనికాకుండా, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి? అని ప్రశ్నకు సమాధానము కోసం వెదుకుతున్నాను’ అన్నాడు. ప్రసంగి గ్రంథములో సొలొమోనుఆ ప్రశ్నే అడుగుతున్నాడు. నువ్వు ఎంతో సాధించావు, శ్రమించావు, ప్రయాస పడ్డావు? అయితే, మరణము ముందు నువ్వు సాధించినవి అన్నీ వ్యర్థం కావా?

      నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; అంటున్నాడు. తరువాత ప్రసంగి మనుష్యులను, జంతువులను పోలుస్తున్నాడు.

     “నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.”దేవుడు లేకపోతే మనిషి కి, జంతువులకు తేడా లేదు. డార్విన్ సిద్ధాంతములో మనిషికి, జంతువులకు తేడా లేదు. మనిషి కూడా ఒక జంతువే. అయితే బైబిల్ దానికి ఒప్పుకోదు. దేవుడు మనిషిని మాత్రమే తన స్వరూపములో, ప్రత్యేకముగా  సృష్టించాడు.జంతువు చనిపోతే అది అంతం అయిపోయినట్లే.అయితే మనిషి చనిపోతే అంతం అయిపోయినట్లు కాదు. మనిషి ఆత్మకు చావు లేదు.

“సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను”

పైకి చూస్తే సూర్యుడు కనిపిస్తున్నాడు. క్రిందకు చూస్తే సమాధి కనిపిస్తున్నది. దేవుడు లేని వ్యక్తికి కనిపించేవి అవే: సూర్యుడు, సమాధి. క్రైస్తవ విశ్వాసి సూర్యుడుకి పైన కూడా చూడగలడు, సమాధికి అవతల కూడా చూడగలడు.నీకు జీవితము అర్థం లేకుండా కనిపిస్తుందా? నీకు జీవితము వ్యర్థముగా కనిపిస్తుందా? నీకు జీవితము గాలి కోసము 

ప్రయాస పడినట్లు కనిపిస్తుందా? సూర్యుడు వైపు కాదు, నీతి సూర్యుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు వైపు చూడు.  

   గ్రీకు రచయిత హోమర్ ‘ఒడిస్సి’ అనే పురాణము వ్రాశాడు. ఈ పురాణములో

 ‘ఒడిస్సియస్’ అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన భార్య పెనలోపి. పెనలోపి 

వృద్ధాప్యములో ఉంది. ‘ఒడిస్సియస్’ ఒక గ్రీకు వీరుడు. ఆ సమయములో కలిపసో 

అనే దేవత అతని మీద కన్ను వేస్తుంది. కలిప్స్లో ‘ఒడిస్సియస్’ ని ఒక ద్వీపానికి

 కిడ్నాప్ చేసి అతని అక్కడ 7 సంవత్సరాలు బంధిస్తుంది. అతనితో ఏమంటుందంటే,

 ‘ఓ మానవా, నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను ఉంచుకొంటాను, నేను నిన్ను పెళ్లి చేసుకొంటాను. నీ భార్యను మరచిపో. నేను దేవతను.నా దగ్గర ఉంటే నీకు మరణము ఉండదు, రోగాలు ఉండవు, బాధలు ఉండవు’.ఒడిస్సియస్ అప్పుడు ఆలోచిస్తాడు. ఈ దేవత దగ్గర అందం, ఆరోగ్యం, సుఖం ఉన్నాయి. భూమి మీద ఉన్న తన భార్య పెనలోపి వృధాప్యములో ఉంది. ఒడిస్సియస్ కలిప్స్లో కోరికను తిరస్కరిస్తాడు.

 ‘నేను నీ సెక్స్ బానిసగా ఉండను. నా భార్య పెనలోపి దగ్గరకు తిరిగి వెళ్తాను’ అంటాడు.గ్రీకులు జీవితానికి అలాంటి కోణములో చూశారు.  ఆ కథ యొక్క భావమేటిటంటే, ప్రేమ లేక పొతే స్వర్గానికి కూడా అర్థం లేదు. మానవ జీవితములో బాధలు, కన్నీళ్లు, మరణం ఉండవచ్చు. అయితే, ప్రేమ ఉంటే వాటికి కూడా అర్థం ఉంది. లాజరు సమాధి దగ్గర యేసు ప్రభువు కన్నీరు పెట్టాడు. దేవుని దృష్టిలో లాజరు 

మరణానికి కూడా విలువ ఉంది. మరణాన్ని దేవుడు మానవ జీవితములో భాగముగా పెట్టాడు. మరణం కూడా మనకు విలువను ఇస్తుంది, మరణం కూడా మనకు అర్థం  ఇస్తుంది . ఈ లోకములో ప్రతి రోజూ మనలను మరణమునకు దగ్గరగా తీసుకు వెళ్తుంది. మరోకోణములో మన రక్షకుడైన యేసు క్రీస్తు ను మనం చూసే రోజును కూడా అది మనకు దగ్గరగా తీసుకువస్తున్నది. మరణము కూడా జీవిత పరమార్థములో భాగమే.

నిత్యత్వము: 

ఆ తరువాత అంశం నిత్యత్వం. 3:11 లో ఒక మాట చదువుదాము.

ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు ( ప్రసంగి 3:11). 

ప్రసంగి ఇక్కడ చాలా ముఖ్యమైన సత్యము మనకు బోధిస్తున్నాడు. దేవుడు ‘నిత్యత్వము’ ను మన హృదయములో ఉంచాడు. జంతువులకు, పక్షులకు, చెట్లకు నిత్యత్వము లేదు. అవి కొంతకాలము ఉండి చనిపోతాయి. వాటికి పునరుత్తానము లేదు. అయితే మనిషి అస్థిత్వము మరణముతో ముగిసేది కాదు. మన హృదయములో దేవుడు తన నిత్యత్వాన్ని ఉంచాడు. దేవుని తెలుసుకోవాలి, దేవుని ఆరాధించాలి అని మనిషి హృదయము ఆరాటపడుతూనే ఉంటుంది. గ్రీకు తత్వవేత్త ప్లేటో మనుష్యులను ఒక గుహలో చిక్కుకొన్న  పోల్చాడు. ఈ బందీలకు ఆ గుహలో ఉన్న చీకటి మాత్రమే కనిపిస్తుంది. వారి ముందు ఉన్న గోడ మీద కొన్ని వస్తువుల, వ్యక్తుల నీడమాత్రమే వారికి కనిపిస్తుంది. ఆ గుహలో చిక్కుకొన్న మనుష్యులకు బయట ఉన్న సూర్యుడు కనిపించుట లేదు. వారికి ఉన్న కొద్దిపాటి వెలుగు సూర్యుని నుండి వచ్చిందే. ఆ గుహలో నుండి బయటపడినప్పుడే వారు సూర్యుని చూడగలరు. జీవిత చక్రములో బంధించబడిన వారు నిత్యత్వాన్ని తెలుసుకోలేకపోవుతున్నారు. వారు బయటకు వచ్చి దేవుని వెలుగును చూడాలి. నీతి సూర్యుడు యేసు క్రీస్తును చూడాలి. అదే నిజమైన విడుదల.

     సెయింట్ అగస్టిన్ తన జీవిత చరిత్ర ‘Confessions’ ‘ఒప్పుకోలు’ లో ఒక మాట వ్రాశాడు.“You stir man to take pleasure in praising you (God), because you have made us for yourself, and our heart is restless until it rests in you” 

‘ఓ దేవా, నిన్ను స్తుతించుటలోనే మనిషికి సంతోషం ఉంది, ఎందుకంటే నీ కోసమే నీవు మనిషిని సృష్టించావు నీలో విశ్రాంతి తీసుకొనే వరకు మా హృదయాలకు విశ్రాంతి లేదు’

     సెయింట్ అగస్టీన్ చెప్పిన ఆ మాటలు మీరు గమనించండి.

ఓ దేవా, నిన్ను స్తుతించుటలోనే

 మనిషికి సంతోషం ఉంది, 

ఎందుకంటే నీ కోసమే నీవు 

మనిషిని సృష్టించావు 

నీలో విశ్రాంతి తీసుకొనే వరకు 

మా హృదయాలకు విశ్రాంతి లేదు.

  మానవ హృదయాన్ని దేవుడు ఆ విధముగా సృష్టించాడు. క్రీస్తును తెలుసు

కొన్నప్పుడే మన హృదయానికి విశ్రాంతి కలుగుతుంది. ఫ్రాన్స్ దేశానికి గొప్ప శాస్త్రవేత్త, తత్వవేత్త బ్లెయిస్ పాస్కల్ (1623-1662). ఆయన ఒక మాట అన్నాడు. మనహృదయములలో ‘దేవుని పోలిన శూన్యత’ ఉంది. God-shaped vacuum. There is a God shaped vacuum in the heart of every man

మన హృదయములలో ‘దేవుని పోలిన శూన్యత’ ఉంది. మన హృదయములో ఉండే ఆశూన్యతను, ఆ ఖాళీ ప్రదేశాన్ని దేవుడు నింపకపోతే మన హృదయానికి విశ్రాంతి ఉండదు. దేవునితో కాకుండా ఈ లోక సంభందమైన వాటితో మన హృదయాల్లో ఉన్నశూన్యతను నింపుకోవాలని చూస్తే మనకు నిరాశ తప్పదు. రష్యా దేశానికి చెందిన గొప్ప నవలా రచయిత ఫోయోడర్ డొస్తావిస్కీ (1821-1881). 1872 లో ఆయన ‘దెయ్యాలు’ అనే నవల వ్రాశాడు. రష్యా దేశములో ప్రజలు తమ హృదయములను దేవునితోకాకుండా ఈ లోక సంభందమైన ఆలోచనలతో నింపుకొంటున్నారు. రష్యా దేశములో ఆత్మ హత్యలు పెరిగి పోవడానికి అదే కారణము అన్నాడు. సాతానుడు, దెయ్యాలు ఈ రోజు మనుష్యుల హృదయాలను వ్యర్థమైన వాటితో నింపివేస్తున్నారు. అందుకనే అనేకమంది డిప్రెషన్ కు గురై ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్థితి మనం చూస్తున్నాము. కొంత సేపటి క్రితం ఒకాయన నా దగ్గరకు వచ్చాడు. ‘డాక్టర్, నాకు సలహా ఇవ్వండి. మా అబ్బాయి డ్రగ్స్ కి బానిసయ్యాడు’. అనేకమంది తల్లిదండ్రులు ఇప్పుడు ఆ వేదన అనుభవిస్తున్నారు.సాతానుడు యువతీయువకుల హృదయాల్లో ఉన్న శూన్యతను డ్రగ్స్ తో నింపి, వారి జీవితాలు పాడుచేస్తున్నాడు. రవి జకరియస్ గారు ఒక మాట అంటూఉండేవాడు.

‘Pleasure without God, 

without the sacred boundaries, 

will actually leave you 

emptier than before’ 

‘దేవుడు లేకుండా నీ కోరికలు నీవు

తీర్చుకొంటూ పోతే, పరిశుద్ధమైన 

హద్దులు లేకుండా నీవు జీవిస్తే, 

నీ హృదయములో శూన్యత 

పెరిగిపోతుంది కానీ తగ్గదు’ 

   శాశ్వత కాలమును దేవుడు మనిషి హృదయములో పెట్టాడు. అశాశ్వతమైన వాటితో నింపుకొంటే మనిషి జీవితానికి అర్థం ఉండదు. 

ఇశ్రాయేలు దేవుడైన 

యెహోవా శాశ్వతకాలమునుండి 

శాశ్వతకాలమువరకు స్తుతింపబడును గాక

ఆమేన్‌       కీర్తన 41:33

ఆమేన్‌. శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు ఉండేది దేవుడు మాత్రమే. ప్రసంగి మనతో ఏమంటున్నాడంటే, దేవుడు తన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయములో ఉంచాడు. కమ్యూనిస్టులకు ఈ జ్ఞానము లేదు. లెనిన్, స్టాలిన్ దేవుడు లేని నాస్తికులు. వారు చనిపోయినప్పుడు వారిని పాతిపెట్టలేదు. వారి మృతదేహాలను కెమికల్స్ లో నింపి ఈజిప్షియన్ మమ్మీ ల వలె చేసి అద్దాల సమాధి పెట్టెల్లో పెట్టారు. అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యమేసింది. మనం అలాంటి పనులు చెయ్యము. వారు మృతదేహాలను అద్దాల పెట్టెల్లో పెట్టుకొన్నారు. దేవుడు లేని ఆ కమ్యూనిస్టులకు శరీరమే శాశ్వతము. నిత్యత్వాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నారు. నిత్యత్వం కోసం సిద్ధపడదాం, పాప క్షమాపణ పొందుదాం అని వారికి అనిపించదు.

   అమెరికా దేశములో ఫ్రాన్సిస్ కొల్లిన్స్ అనే గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన మానవ జీన్స్ మీద గొప్ప పరిశోధనలు చేశాడు. ఇప్పుడు కరోనా కు వాక్సిన్ చేసే పనిలో ఉన్నాడు. ఆయన ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు: “ఒక రోజు నేను ఉదయం పూట కాస్కేడ్ పర్వతాల్లో నడుచుకొంటూ వెళ్తున్నాను. ఒక గొప్ప మార్పు నా హృదయములో కలిగింది. అక్కడే మోకరించి యేసు ప్రభువును స్వీకరించాను. ప్రభువా, ఈ రోజు నుండి శాశ్వత కాలము వరకు నిన్ను వెంబడిస్తాను’ అని ప్రార్ధన చేశాను. ఫ్రాన్సిస్ కొల్లిన్స్ లాంటి గొప్ప సైంటిస్ట్ కూడా తన హృదయములోని శూన్యతను నింపుకోలేడు. అతడు క్రీస్తు యొద్దకు రావాల్సిందే.

     ప్రసంగి గ్రంథములో నుండి జీవితానికి అర్థం అనే అంశం ఈ రోజు చూశాము. ప్రసంగి రెండు విషయాలు ఇక్కడ చెప్పాడు: మొదటిగా, ప్రతి దానికీ సమయము కలదు.రెండవదిగా, దేవుడు శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు అన్నాడు. ఒక ప్రక్క సమయములో మనం బంధించబడిఉన్నాము. మరొక ప్రక్క నిత్యత్వము వైపు ఈడ్వబడుతున్నాము.ఒక ప్రక్క అశాశ్వతమైనవి మన దృష్టిని  

ఆకర్షిస్తున్నాయి. మరొక ప్రక్క, దేవుడు ఇచ్చిన శాశ్వత కాల జ్ఞానము మనలను నడిపిస్తున్నది.మన హృదయాల్లో ఉన్న శూన్యత నింపబడితేనే మన జీవితానికి అర్థం వస్తుంది. అది యేసు క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించి, ఆయన సిలువ యొద్ద మన పాపములను ఒప్పుకొని దేవునితో సంబంధం పెట్టుకోవటం వలన మనకు కలుగుతుంది.ఈ రోజు దానిని మీరు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశము. 

Leave a Reply