చిరంజీవి ఆచార్య : కొరటాల శివ మతోన్మాదం 

 చిరంజీవి ఆచార్య : కొరటాల శివ మతోన్మాదం 

               ఎటు చూసినా చిరంజీవి సినిమా ‘ఆచార్య’ గురించి మాట్లాడుకొంటున్నారు.  కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం చేసాడు. ధర్మ స్థలి అనే ఊరు ఒక దేవత కు పవిత్ర స్థలము గా ఉంది. అది ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి. 

     ఈ ఆయుర్వేద వైద్యానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దానిని ‘వైద్యం’ అని పిలవటం తప్పు. అది ప్రజలను మోసం చేసినట్లే. తెలుగు చిత్రాల్లో ఈ మధ్యలో మతోన్మాదం కూడా  పెరిగిపోయింది. బాల కృష్ణ ‘అఘోర’ లో ఒక అఘోర గా కనిపించి ఎంతో రక్తపాతం చూపించాడు. ఇప్పుడు చిరంజీవి నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్లుగా ఒక ఆచార్య గా ఎంతో హింస ను సృష్టించడం ఈ సినిమాలో చూపిస్తున్నారు. 

నాకు మదర్ తెరెసా అంటే ఇష్టం. ఆమె లాగా నేను కూడా సేవ చేస్తాను, మంచి చేస్తాను అని చిరంజీవి అంటూ ఉంటాడు. అయితే మదర్ తెరెసా శాంతి, క్షమాపణ లను బోధించింది. హింస, రక్తపాతం ఆమె బోధించలేదు. 

    దర్శకుడు కొరటాల శివకు పిచ్చి బాగా ముదిరింది. మతోన్మాదం, నక్సలిజం – ఈ రెండిటిని కలిపాడు. నక్సలిజం కమ్యూనిజం నుండి పుట్టింది. కమ్యూనిజం ఒక నాస్తిక వాదం. వారు దేవుడు లేడు అని అంటారు. కొరటాల శివ పూర్వికులు కమ్యూనిజం లో వున్నారు. అయితే కొరటాల శివ నాస్తికత్వం వదలి వేసి హిందూ మతస్తునిగా మారాడు. అందులో తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే నక్సలిజం ను, మతం ను ఈ సినిమాలో కలిపాడు. కామ్రేడ్ లు తుపాకులు తీసుకొని మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ఇప్పుడే చూస్తున్నాము. 

     అది చాలా ప్రమాదకరం. నక్స లైట్లు ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు. అనేక మంది పోలీసులను, సైనికులను వారు హత్య చేశారు. వారికి లాగా వేషాలు వేసుకొని ఈ తండ్రి కొడుకులు సినిమా తీయడం ఇప్పుడు అవసరమా? మతం, నక్సలిజం, రక్తపాతం అవి చాలా డేంజరస్ కాంబినేషన్. ఒక ఆచార్య శాంతి ప్రవచనాలు బోధించాలా? కత్తులు, గొడ్డళ్లు తీసుకొని నరుక్కుంటూ తిరగాలా? 

   ‘ధర్మ స్థలి’ ఆ వూరు కేవలం హిందువులు మాత్రమే వుంటారు అని చెబుతున్నారు. అందులో హిందూ దేవాలయం మాత్రమే చూపించారు. ముస్లిములు కానీ, క్రైస్తవులు కానీ ఆ వూరిలో కనిపించరు. అది కూడా మంచిది కాదు. sanctity of place చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఇది ఒక పవిత్ర స్థలం. ఇందులో ఒక మతస్తులే ఉండాలి. ఇతర మతస్తులు అక్కడికి వెళ్తే అది అపవిత్రం అయిపోతుంది అనే భావన ఈ రోజు మన దేశములో ఎంతో హింసను ప్రేరేపిస్తున్నది.  నేటి భారత దేశములో మత సామరస్యం కరువయ్యింది. ఈ వూరు మా వూరు, మా వూరిలో మా దేవాలయం మాత్రమే ఉండాలి. వేరే మత ఆలయాలు వుండకూడదు అనే ఆలోచనలు ఇప్పుడు అన్ని చోట్ల పెరిగిపోయినాయి. బుల్ డోజర్లు తీసుకొని వెళ్లి ఇతర మతస్తుల ప్రదేశాలను కూల్చివేస్తున్నారు. ‘ధర్మ స్థలి’ లో కేవలం ఒక మతస్తులు వుంటారు అనే భావం పెరిగిపోవడం వలన మత సామరస్యం తగ్గుతుంది కానీ పెరుగదు. 

    ఈ రోజున ఎటు చూసినా మత కల్లోలాలు పెరిగిపోవటం మనం చూస్తున్నాము. పాటియాలా లో ఈ రోజు కర్ఫ్యూ పెట్టారు. రెండు మత వర్గాల మధ్య అల్లర్లు అక్కడ చూస్తున్నాము. ధర్మ సంసద్ అనే పేరుతొ కొంత మంది సభలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో యతి నర్సింగానంద్ ఈ మధ్యలో ఒక మత వర్గము మీద హింస, దాడులు చేయాలని పిలుపు నిచ్చాడు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. బెయిలు మీద బయటికి వచ్చి ఢిల్లీ లో ఇంకో మీటింగ్ పెట్టి అక్కడ కూడా అలాంటి ప్రసంగాలే చేసాడు. మెజారిటీ మతస్తులలో ఒక లాంటి అభద్రతా భావం వీరు సృష్టిస్తున్నారు. దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఎవరి హక్కులకు అయినా భంగము కలిగితే రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధముగా వాటిని పరిష్కరించుకోవాలి. ఇలాంటి సినిమాల వలన ఆ దృక్పధం ప్రజలలో కనుమరుగు అటుతుంది, మా ఆలయాల భూములు ఆక్రమణకు గురయితే మేము చట్టప్రకారం వాటి కోసం పోరాడం, మేమే హింస ద్వారా వాటిని సాధించుకొంటాము అనే సందేశం ఈ సినిమా ద్వారా వెళ్ళింది. ‘ప్రకృతి’ ‘పర్వావరణం’ పేరుల మీద సినిమాలు తీసిన కొరటాల శివ ఇప్పుడు ప్రజలను మతోన్మాదం వైపు నడిపించడం బాగాలేదు. 

        చిరంజీవి వ్యక్తిగతముగా మంచి వ్యక్తే. ఒక బ్లడ్ బ్యాంకు పెట్టాడు. రక్తం అవసరం అయిన వారికి రక్తం ఇస్తున్నాడు. ఇంకా తుఫానులు, వరదలు వచ్చినప్పుడు బాధితులకు సహాయం చేస్తున్నాడు. అయితే ఆత్మ రక్షణ పొందాలంటే అవి సరిపోవు. 

‘యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును’ అని బైబిల్ మనకు చెబుతున్నది. యేసు క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడని మన హృదయములో నమ్మాలి. ఆయన సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి, మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని మనం నమ్మాలి. యేసు క్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించాలి. అప్పుడే మనకు రక్షణ లభిస్తుంది. చిరంజీవి గారు చేయవలసిన ముఖ్యమైన పని ఆత్మ రక్షణ పొందడం. ఆయన మెగా స్టార్ కావచ్చు, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవచ్చు, వేల కోట్లు ఆస్తిపాస్తులు సంపాయించుకోవచ్చు. అయితే అవి ఏవీ ఆయనకు రక్షణ ఇవ్వలేవు. అవి ఏవీ ఆయనను పరలోకం తీసుకొని వెళ్ళలేవు. అవి ఏవీ నరకం నుండి ఆయనను రక్షించలేవు. 

Leave a Reply