ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్ జీవితములో దేవుని మహిమ

   

 మన ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకడు – ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్. ఈ రోజు ఆయన జీవితములో నుండి కొన్ని సంగతులు చూద్దాము. ఆల్బర్ట్ ఐన్స్టెయిన్ జీవితము నుండి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను.నేను ఒక ట్రైన్ లో ప్రిన్స్ ట న్ నగరానికి బయలుదేరాను. అయిన్ స్టెయిన్ జర్మనీ దేశములో ని ఉర్ అనే పట్టణములో జన్మించాడు. స్విట్జర్లాండ్ లో చదువుకున్నాడు. జీవితములో చివరి రెండు దశాబ్దాలు అమెరికా లోని ప్రిన్స్ ట న్ నగరములో గడిపాడు. నేను ట్రైన్ దిగి స్టేషన్ నుండి నా హోటల్ కి బయలుదేరాను. ట్రైన్ స్టేషన్ లో నిలబడి ఒక ట్రైన్ మన వైపుకు రావడం పోవడం చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది. ఈ ట్రైన్ లను చూసినప్పుడు నాకు అయి న్ స్టెయిన్ గుర్తుకు వచ్చాడు. ట్రైన్ ల కదలిక ల గురించిన ఆలోచనలు ఆయన కు గొప్ప సైంటిఫిక్ సత్యాలు తెలుసుకొనేందుకు సహకరించాయి. 

The power of visualization – ట్రైన్లు, ఎలివేటర్ లు, ఆటలు చాలా సాధారమైనవి గమనించి, అయి న్ స్టెయిన్ అసాధారణమైన సత్యాలు తెలుసుకొన్నాడు. కాసేపటి తరువాత నా హోటల్ చేరుకున్నాను. ప్రిన్స్ ట న్ లోని ఈ హోటల్ పేరు నాసా ఇన్. ఈ హోటల్ లో కూడా నాకు అయి న్ స్టెయిన్ పేరు చాలా చోట్ల కనిపించింది.ఎలివేటర్ లో పైకి వెళ్ళేటప్పుడు కూడా నాకు అయి న్ స్టెయిన్ గుర్తుకు వచ్చాడు. ఎలివేటర్ లో మనం పైకి, క్రిందికి వెళ్ళేటప్పుడు గ్రావిటీ మన మీద ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్న అయి న్ స్టెయిన్ ను థియరీ అఫ్ రిలేటివిటీ వైపు నడిపించింది. 

    ఆధునిక యుగములో అయి న్ స్టెయిన్ అంత ప్రసిద్ధి చెందిన సైంటిస్ట్ మరొకరు లేరు. సైన్స్ లో అయి న్ స్టెయిన్ కనుగొనిన సత్యాలు ఈ రోజు మన ప్రపంచాన్ని ప్రతి క్షణం ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు, ఈ రాత్రి నాకు అయిన్ స్టెయిన్ గారి ఇల్లు ఇంటికి వెళ్ళాలి అనిపించింది. ఆయన ఇల్లు ఈ వూరిలో ఎక్కడ ఉందో నాకుతెలియదు. దాని అడ్రస్ నాకు తెలియదు. డైరెక్షన్స్ తెలియదు. నేను నా మొబైల్ ఫోన్ మీద ఆధారపడ్డాను. అయి న్ స్టెయిన్ ఇంటికి డైరెక్షన్స్ కావాలి అని అడిగితే ఈ యాప్ నాకు డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ ఫాలో అవుతూ నడిచాను . చివరకు అయి న్ స్టెయిన్ ఇంటికి చేరుకున్నాను. ఈ యాప్ ఆధునిక సైన్స్ మనకు ఇచ్చిన బహుమానం. ఈ యాప్ పనిచేయాలంటే ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ పనిచేయాలంటే టెలి కమ్యూనికేషన్స్ కావాలి. టెలి కమ్యూనికేషన్స్ పనిచేయాలంటే పెద్ద పెద్ద ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్స్ కావాలి. ఈ ఫైబర్ ఆప్టిక్ వైర్ లలో సిగ్నల్స్ కాంతి వేగముతో పల్సస్ రూపంలో ప్రవహిస్తాయి.

    ఈ కాంతి లేజర్లు వలనే ఎంతో సమాచారం క్షణాల్లో ప్రపంచం మొత్తం వెళ్లగలుగుతుంది. ఈ లేజర్లు, యాటమ్స్ ల మధ్య జరుగుతున్న క్వాంటమ్ మెకానిక్స్ వలనే ఇది సాధ్య పడింది. దీనికి బీజం వేసింది అయి న్ స్టెయిన్. 1916 లో అయి న్ స్టెయిన్ కనుగొన్న ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని ఆధారం చేసుకొనే ఈ కంప్యూటర్ లు, మొబైల్ ఫోన్ లు, ఇంటర్ నెట్ పనిచేస్తున్నాయి. మనం చేసే ప్రతి ట్వీట్, మనం పంపే ప్రతి ఇమెయిల్, మనం చదివే ప్రతి టెక్స్ట్ మెసేజ్, మనం చూసే ప్రతి వీడియో అయి న్ స్టెయిన్ కనుగొన్న ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వలనే సాధ్యపడుతున్నాయి. మొబైల్ ఆప్ పనిచేయాలంటే ఎన్నో వందల సాటి లైట్లు సక్రమముగా పనిచేయాలి. ఆ సాటి లైట్లు పంపే సమాచారం వలనే ఈ మొబైల్ ఫోన్ ఆప్ నాకు డైరెక్షన్స్ ఇవ్వగలుగు తోంది. అయి న్ స్టెయిన్ యేమని చెప్పాడంటే, గ్రావిటీ వలన టైం స్లో గా నడుస్తుంది అన్నాడు. భూమి మీద కంటే అంతరిక్షంలో శాటిలైట్ మరింత వేగముతో ప్రయాణిస్తుంది. ఎందుకంటే అక్కడ గ్రావిటీ తక్కువ కాబట్టి. అయి న్ స్టెయిన్ థియరీ అఫ్ రిలేటివిటీ ని ఆధారముగా చేసుకొని అంతరిక్షము లోని సాటి లైట్లు, భూమి మీద మొబైల్ ఫోన్ ల మధ్య టైం ని ఎప్పటి కప్పుడు యడ్ జస్ట్ చేసుకోవాలి.లేకపోతే ఈ మొబైల్ యాప్ పనిచేయదు. 

   ఆ విధముగా ఈ రాత్రి  అయి న్ స్టెయిన్ ఇంటికి దారి తెలుసుకోవటానికి 100 సంవత్సరాల క్రితం ఆయన కనుగొన్న ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, థియరీ అఫ్ రిలేటివిటీల టెక్నాలజీ తో నిర్మించబడిన ఈ మొబైల్ ఆప్ నాకు ఉపయోగ పడింది.ఇక్కడ అయి న్  స్టెయిన్ ఇల్లు చాలా సాధారణముగా నాకు కనిపించింది. అంత గొప్ప సైంటిస్ట్ మధ్య తరగతి ఇంటిలో అయి న్ స్టెయిన్ తాను కనుగొన్న వాటి మీద పేటెంట్ లు తీసుకొని ఉంటే ఆయన ప్రపంచములో నే అందరి కన్నా ధనవంతుడు అయి ఉండేవాడు. అయితే ఆయనకు డబ్బు మీద దృష్టి ఉండేది కాదు. దేవుడు చేసిన ఈ సృష్టి రహస్యాలు ఛేదించాలి అనే తపనే ఆయనకు ఎక్కువ ఆనందం ఇచ్చింది. అయి న్ స్టెయిన్ ఆలోచనల ప్రభావం వలన ఎంతో గొప్ప టెక్నాలజీ ఈ రోజు ప్రపంచమంతా పాకింది. మొబైల్ ఫోన్ లు మాత్రమే కాకుండా సెమి కండక్టర్స్, క్వాంటమ్ టన్నెలింగ్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ లాంటివి కూడా అయి న్  స్టెయిన్ యొక్క ఆలోచనల చేత ప్రభావితం అయినవే. 

    టెక్నాలిజీ మాత్రమే కాకుండా అయి న్  స్టెయిన్ పరిశోధనలు ఈ విశ్వము యొక్క పుట్టుక, దాని అంతము లాంటి వాటి గురించి కూడా మనకు ఎంతో సమాచారం అందించాయి. అయి న్  స్టెయిన్ ఇంటి మీద నాకు చక్కటి చంద్రుడు కనిపించాడు. భూమి చుట్టూ చంద్రుడు, సూర్యుని చుట్టూ భూమి, ఇతర గ్రహాలు, అంతరిక్షములోని గాలాక్షీలు వాటిలోని కోట్లాది నక్షత్రాలు వాటి కదలికలు అర్థం చేసుకోవాలంటే అయి న్  స్టెయిన్ థియరీ అఫ్ రెలెటివిటీ మీద మనం ఆధార పడాల్సిందే. 

ఆ విధముగా ఆటమ్ లో ఉండే క్వార్క్ ల దగ్గర నుండి పెద్ద పెద్ద నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ లాంటి వాటి వరకు సమస్తము అయి న్  స్టెయిన్ సిద్ధాంతము వలన వివరించబడుతున్నాయి. (Explanatory Power of Einstein’s Theories). ఈ ప్రిన్స్ ట న్  నగరములో చక్కటి వీధులు, ఎంతో అందమైన చర్చి లు మనకు కనిపిస్తాయి.  ఒక చోట అయి న్  స్టెయిన్ విగ్రహం నాకు కనిపించింది. ఆ విగ్రహం వెనుక అయిన్  స్టెయిన్ చెప్పిన కొన్ని వాక్యాలు వ్రాయబడ్డాయి. 

‘The ideals which have lighted my way and time and after time have given

 me the energy to face life have been Kindness, Beauty, and Truth (1930)’

‘నాకు మార్గం చూపించినవి, నాకు శక్తి ని ఇచ్చినవి మూడు ఉన్నాయి. అవి సత్యము, సౌందర్యము, దయ’ 

‘సత్యము, సౌందర్యము, దయ’

అయిన్  స్టెయిన్ ను ముందుకు నడిపించిన ఆ మూడు సంగతులను గురించి కొద్ది సేపు చూద్దాము. 

మొదటిగా సత్యం: 

    దేవుడు ఈ విశ్వాన్ని మాథెమటికల్ ఆర్డర్ తో ఒక చక్కటి నిర్మాణముతో సృష్టించాడు. దానిని అర్థం చేసుకొనే శక్తి మనిషికి ఇచ్చాడు అని అయిన్  స్టెయిన్ నమ్మాడు. మాథెమటికల్ గా ఆలోచిస్తే యూనివర్స్ రహస్యాలు మనకు తెలుస్తాయి అని ఆయన నమ్మాడు. ఇక్కడ ఒక చోట ఒక పాత భవనం కూల్చివేయడం నాకు కనిపించింది. ఒక పాత భవనం కూల్చివేసి, దాని స్థానములో ఒక క్రొత్త భవనం కట్టడం చాలా కష్టముతో కూడుకొన్న పని. ఈ పాత భవనం ఎందుకు కూల్చాలి? ఇప్పుడు అంత అవసరం ఏమి వచ్చింది? అని మనలను ప్రశ్నించే వారు ఉంటారు. 

    అయిన్  స్టెయిన్ కూడా పాత సైంటిఫిక్ ఆలోచనలను కూల్చివేసి క్రొత్త సైంటిఫిక్ ఆలోచనలు నిర్మించాడు. అయిన్  స్టెయిన్ చేస్తున్న పని తప్పు అని చాలా మంది సైంటిస్టులు, మేధావులు అన్నారు. అయితే అయిన్  స్టెయిన్ మాత్రం, సత్యం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను, ఎవరి నైనా ఎదిరిస్తాను అనే ధైర్యముతో ముందుకు వెళ్ళాడు. సత్యము కోసము అయి న్ స్టెయిన్ చేసిన అన్వేషణ లో నుండి పుట్టినదే థియరీ ఆఫ్ రెలెటివిటీ. 

    ప్రిన్స్ ట న్ లో ఒక కాలువ ప్రక్కన ఉన్న దారిలో ఇప్పుడు నేను నడుస్తున్నాను. అయిన్  స్టెయిన్ జీవించిఉన్న రోజుల్లో ఇక్కడ నడుస్తూ ఉండేవాడు. ఆయన నడిచిన దారిలోనే నడుస్తూ ఆయన సైంటిఫిక్ థియరీ అర్థం చేసుకొందాము. ఈ దారి ప్రక్కన కాలువలో మూడు చిన్న పడవల మీద ముగ్గురు ముందుకు వెళ్తున్నారు. హాయిగా వారు కబుర్లు చెప్పుకొంటూ ఆ పడవల్లో విహరిస్తున్నారు. నేను గట్టు మీద నిలబడి వారిని గమనిస్తున్నాను. నాకు వారు దూరముగా వెళ్లిపోతున్నారు. అయితే వారి ముగ్గురు ఒకరికి ఒకరు దగ్గరగానే ఉన్నారు. అయిన్  స్టెయిన్ చెప్పినది ఏమిటంటే, మా నలుగురి స్థానాలు కాలముతో పాటూ మారిపోతూ ఉంటాయి. అయితే కాంతి వేగం మాత్రం మారదు. దానిలో నుండే అయిన్  స్టెయిన్ స్పెషల్ థియరీ ఆఫ్ రెలెటివిటీ పుట్టింది. 

    1905 లో అయిన్ స్టెయిన్ థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ వ్రాసాడు. Theory of Special Relativity  దానిలో నుండి E = MC2 అనే ప్రఖ్యాత సైన్స్ ఈక్వె షన్ పుట్టింది. ఈ ఈక్వె షన్ కూడా ప్రపంచాన్ని గొప్ప మార్పులకు గురి చేసింది. మేటర్ ని శక్తి గామార్చు కోవచ్చు అని ప్రపంచానికి అర్థం అయింది. న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ వెపన్స్ లాంటివి సృష్టించడం దీనివలన సాధ్యపడింది. 

    ఇద్దరు సైకిళ్ళ మీద నా వైపుకు వచ్చారు. హాయ్, హాయ్ అని వారు నన్ను గ్రీట్ చేశారు. ఆ సైకిళ్ళు నా దగ్గరకు వచ్చేటప్పుడు వారి స్వరం నాకు బిగ్గరగా వినిపించింది. ఆ సైకిళ్ళు నాకు దూరముగా వెళ్లిపోయేటప్పుడు వారి స్వరం తక్కువ శబ్దముతో నాకు వినిపించింది. దీనిని ‘doppler ఎఫెక్ట్’ అన్నారు. -రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫార్మ్ మీద నిలబడితే ట్రైన్ మన వైపుకు వస్తున్నప్పుడు దాని కూత మనకు ఒక రకముగా వినిపిస్తుంది. ట్రైన్ మనకు దూరముగా వెళ్లిపోయేటప్పుడు దాని కూత మనకు వేరే విధముగా వినిపిస్తుంది. అది కూడా doppler ఎఫెక్ట్ వలనే. Doppler Effect ట్రైన్ లో కూర్చున్న వ్యక్తి కి, ప్లాట్ ఫార్మ్ మీద నిలబడిన వ్యక్తి కి ట్రైన్ కూత వేరు వేరుగా వినిపిస్తుంది. మా ఇద్దరికీ ఆ కూత వేరు వేరు ఫ్రీక్వెన్సీ లలో వినిపిస్తుంది. అయినప్పటికీ కాంతి వేగములో మార్పు ఉండదు. మన అనుభూతులు వేరు వేరుగా ఉండవచ్చు కానీ ప్రకృతి నియమాలు మనందరికీ ఒక్కటే. రెలెటివిటీ బోధించే సత్యము అదే.

 టైం ని, స్పేస్ ని, కాంతి వేగాన్ని వేరు వేరు గా చూడలేము అని ఇక్కడ మనకు అర్థం అవుతున్నది. స్పెషల్ థియరీ అఫ్ రెలెటివిటీ లో టైం, స్పేస్, కాంతి వేగం కలసి మెలసి వెళ్తున్నాయి. ఆ తరువాత, జనరల్ థియరీ అఫ్ రెలెటివిటీ ని కూడా మనం అర్ధం చేసుకోవాలి. 

    ఇక్కడ ఒక చక్కటి బ్రిడ్జి మీద నేను నడుస్తున్నాను. క్రింద కాలువలో ఒక వ్యక్తి పడవ మీద వెళ్తున్నాడు. బ్రిడ్జి మీద నుండి నేను అతనిని గమనిస్తున్నాను. అతని బరువు 70 కేజీలు అనుకొందాము. ఈ సాయంకాలం వేళ అతను ఒక్కడే పడవలో విహార యాత్ర చేస్తున్నాడు. భూమి మీద అతని బరువు 70 కేజీలు భూమి మీద ఎంత దూరం వెళ్లినా అతని బరువు మారదు. 70 కేజీలే ఉంటుంది. అయితే అతడు అంతరిక్షము లోకి వెళ్ళిపోయాడు అనుకొందాము. గ్రావిటీ తగ్గేకొంది అతని బరువు తగ్గిపోతుంది. గ్రావిటీ తగ్గి తగ్గీ అతడు అసలు ఏమాత్రం బరువు లేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. స్కేల్ మీద పెట్టి చూస్తే అతని బరువు జీరో కేజీలు అటుతుంది. ఆ స్థితిలో అతని బరువును తిరిగి 70 కేజీలకు తీసుకొని వెళ్లగలమా? గ్రావిటీ లేని పరిస్థితిలో అతని యాక్సిలరేషన్ పెంచితే అతని బరువు పెరుగుతుంది. సెకనుకు 32 అడుగుల చొప్పున ప్రతి సెకను అతని స్పీడ్ పెంచుకొంటూ పోతే అతని బరువు స్కేల్ మీద 70 కేజీలు చూపిస్తుంది. అంటే గ్రావిటీ లేని పరిస్థితిలో కూడా యాక్సిలరేషన్ ఉంటే చాలు – ఒకే బరువు స్కేల్ మీద కనిపిస్తుంది. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ లో అయిన్  స్టెయిన్ చెప్పిన సంచలన వార్త అదే. గ్రావిటీ, యాక్సిలరేషన్ – రెండూ కనెక్ట్ అయి ఉన్నాయి అని అయిన్  స్టెయిన్ చూపించాడు. అవి రెండూ ఒకే నాణెం యొక్క రెండు ముఖాలు అన్నాడు. 

    దానిలో నుండి ఆయన జనరల్ థియరీ ఆఫ్ రెలెటివిటీ పుట్టింది. గ్రావిటీ ని, యాక్సిలరేషన్ ని కలపాలంటే స్పేస్ వంకరగా ఉండాల్సిందే. న్యూటన్ సిద్ధాంతములో స్పేస్, టైం, గ్రావిటీ లు వేరు వేరుగా ఉన్నాయి. న్యూటన్ భవనంలో నాలుగు  గదులు ఉన్నాయి అనుకొందాము. మాటర్, టైం, స్పేస్, గ్రావిటీ ఈ నాలుగు  గదులు ఒక దానితో ఒకటి కలవకుండా ఉన్నాయి. అయిన్  స్టెయిన్ న్యూటన్ భవనం కూల్చివేశాడు. మాటర్, టైం, స్పేస్, గ్రావిటీ – ఈ నాలుగు గదులను అయిన్  స్టెయిన్ కలిపాడు. మేటర్ ని గ్రావిటీ ని వేరు వేరుగా ఇక చూడలేము. టైం ని, స్పేస్ ని వేరు వేరుగా ఇక చూడలేము. 

‘space-time tells matter how to move; 

matter tells space-time how to curve’ 

                                           జాన్ వీలర్ 

    అయిన్  స్టెయిన్ సిద్ధాంతాలు అనేక పరీక్షలను తట్టుకొన్నాయి. సూర్య గ్రహణం, కాంతి ప్రయాణం, గ్రహాల కక్ష్యలు, సమయము ఆలస్యము చెందుట, చంద్రుని మీద మానవులు చేసిన ప్రయోగాలు  అయిన్  స్టెయిన్ సిద్ధాంతాలను నిరూపించాయి. గత వంద సంవత్సరాల్లో ఏ సైంటిస్ట్ అయిన్  స్టెయిన్ రిలేటివిటీ ని తప్పు అని నిరూపించలేకపోయాడు. 

సౌందర్యము: 

    రెండోది బ్యూటీ, సౌందర్యం. సత్యము సౌందర్య వంతముగా ఉంటుంది అని అయిన్  స్టెయిన్ నమ్మాడు.  అయిన్  స్టెయిన్ ఇంటి నుండి నేను ఆయన పని చేసిన ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్సుడ్ స్టడీ అనే సంస్థ వైపు నడవడం ప్రారంభించాను. దాని దగ్గరలో ఒక రోడ్ కి మాక్స్ వెల్ పేరు, మరొక రోడ్ కి గోడెల్ పేరు పెట్టారు. మాక్స్ వెల్ సిద్ధాంతాలు  అయిన్  స్టెయిన్ ని ప్రేరేపిస్తే,  అయిన్  స్టెయిన్ సిద్ధాంతాలు గోడెల్ ని ప్రేరేపించాయి. మాక్స్ వెల్ ఈ క్వే షన్ బాగా చదివి  అయిన్  స్టెయిన్ తన సిద్ధాంతాలు వ్రాశాడు. గోడెల్  అయిన్  స్టెయిన్ ని చదివి టైం డైలేషన్ ని ప్రతిపాదించాడు. ‘టైం ట్రావెల్’ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ లో పెద్ద భాగమయ్యింది. ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్సుడ్ స్టడీ భవనం ముందు చక్కటి చెట్లు నాకు కనిపించాయి. అవి ఒక క్రమ పద్దతిలో నాటబడ్డాయి. ఒక సౌందర్యవంతమైన  ‘సిమ్మెట్రీ’ వాటిలో మనకు కనిపిస్తుంది. 

   అయిన్  స్టెయిన్ సిమ్మెట్రీ ని బలముగా నమ్మాడు. ఒక సైంటిఫిక్ థియరీ లో సౌందర్యము ఉండాలి. లేకపోతే అది తప్పు కావచ్చు. అయిన్  స్టెయిన్ యొక్క స్పెషల్ థియరీ అఫ్ రెలెటివిటీ, జనరల్ థియరీ అఫ్ రెలెటివిటీ రెండూ ‘సిమ్మెట్రీ’ మీద నిర్మించబడినవే. ఆ సిద్ధాంతాలు ఎంతో అందమైనవి గా అయిన్  స్టెయిన్ కి కనిపించాయి. అవి తప్పకుండా పరీక్షలు తట్టుకొంటాయి, మంచి ఫలితాలు ఇస్తాయి అని ఆయన నమ్మాడు. 

    సత్యము లో సిమ్మెట్రీ, సౌందర్యము ఉండాలి అనే అభిప్రాయం అయిన్  స్టెయిన్ తో మొదలయినది కాదు. అయిన్  స్టెయిన్ ఇంటి కి దగ్గరలో ఉన్న ట్రినిటీ చర్చి కి నేను వెళ్ళాను. ఆ చర్చి లో నడుచుకొంటూ వెళ్తే దాని కప్పులో ఒక చక్కటి క్రమం మనకు కనిపిస్తుంది. దాని గోడలలో ఒక క్రమం ప్రజలు కూర్చొనే బల్లలలో ఒక క్రమం ఎటు చూసినా మనకు ఒక చక్కటి క్రమం, సిమ్మెట్రీ, హార్మొనీ మనకు కనిపిస్తాయి. వాటన్నిటి మధ్యలో నాకు యేసు క్రీస్తు సిలువ కనిపించింది. ప్రకృతి లో దేవుడు ఒక చక్కటి క్రమం ఉంచాడు. అందులో మనకు సౌందర్యం కనిపిస్తుంది అని క్రైస్తవులు నమ్మారు. అయిన్  స్టెయిన్ కూడా ఆ నమ్మకము తోనే తన సైన్స్ పరిశోధనలు చేశాడు. అయిన్  స్టెయిన్ ఒక వయోలిన్ వాయిస్తూ ఉండేవాడు. సంగీతములో కూడా ఒక మథెమటికల్ ఆర్డర్ ఉంది, ఒక సౌందర్యం ఉంది అని అనుకొన్నాడు. 

Kindness  

మూడోది kindness – దయ. అయిన్  స్టెయిన్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైంటిస్ట్ అయ్యాడు. ఆయనలో కనిపించే మరొక మంచి లక్షణం దయ. 1933 లో జర్మనీ లో అడాల్ఫ్ హిట్లర్ నాజీ ప్రభుత్వం అధికారములోకి వచ్చింది. వారు చాలా క్రూరత్వముతో పరిపాలన చేశారు. వారి దేశములో నివసిస్తున్న యూదులను శత్రువులుగా వారు చూపించారు. నాజీలు వారి ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే యూదులను బహిష్కరించారు. యూదులు టీచర్లు గా, ప్రొఫెసర్ లుగా ఉండడానికి వీలులేదు. డాక్టర్ లుగా, డెంటిస్ట్ లుగా, లాయర్లు గా ఉండడానికి వీలు లేదు. అయిన్  స్టెయిన్ లాంటి గొప్ప సైంటిస్ట్ లు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జర్మనీ దేశం నుండి పారిపోయారు. నాజీలు యుద్ధము, రక్తపాతం కోరుకున్నారు. అయిన్  స్టెయిన్ శాంతిని కోరుకున్నాడు. యుద్ధాలు లేని ప్రపంచాన్ని కోరుకున్నాడు. 

    మరియన్ ఆండర్సన్ అనే నల్ల జాతి మహిళ ఉండేది. ఆమె గొప్ప గాయకురాలు. ఒక సారి ఆమె ప్రిన్స్ ట న్ నగరం వచ్చింది. ఈ నాస్స ఇన్ హోటల్ లో ఒక రూమ్ కోసం ప్రయత్నించింది. ఆ రోజుల్లో నల్ల జాతి వారికి అమెరికా దేశములో హోటల్ లో రూములు ఇచ్చేవారు కాదు. మరియన్ ఆండర్సన్ కి ఈ హోటల్ లో రూమ్ ఇవ్వడానికి తిరస్కరించారు. అప్పుడు అయిన్  స్టెయిన్, అతని భార్య మరియన్ ఆండర్సన్ ని తమ ఇంటిలో పెట్టుకొన్నారు. 

హిట్లర్ పెట్టే శ్రమలు ఓర్చుకోలేక అనేకమంది యూదులు మాకు కూడా ఒక దేశం కావాలి అని పోరాటం చేశారు. అయిన్  స్టెయిన్ వారితో చేతులు కలిపాడు. ఆధునిక ఇశ్రాయేలు దేశము ఏర్పడడానికి తన వంతు కృషి చేశాడు. 

    Truth, Beauty, Kindness – ఈ మూడు లక్షణాలు అయిన్  స్టెయిన్ లో మనకు కనిపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు దేవుని యొద్ద నుండి మనిషికి లభించినవే. 

రెలెటివిటీ సత్యము: మన అనుభూతులు వేరుగా ఉండవచ్చు కానీ ప్రకృతి నియమాలు మనందరికీ ఒక్కటే. బైబిల్ బోధించేది కూడా అదే. సౌందర్యము: ప్రకృతి దేవుని చేత సృష్టించబడి నది కాబట్టే దానిలో అంత సౌందర్యం మనకు కనిపిస్తున్నది. దయ: దేవుడు ప్రేమయై ఉన్నాడు కాబట్టి మనం ఇతరుల పట్ల దయ చూపించాల్సి ఉంది. 

అయిన్  స్టెయిన్ ఏ దేవుణ్ణి నమ్మాడు? 

   అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. అయిన్  స్టెయిన్ యూదు కుటుంబములో జన్మించినప్పటికీ ఆయన బైబిల్ లో ఉన్న దేవుని నమ్మలేదు. ఆయన ఒకసారి ఏమన్నాడంటే, ‘I believe in Spinoza’s God, who reveals himself in the orderly harmony of what exists’. యూదు తత్వవేత్త బారుక్ స్పినోజా ఏమన్నాడంటే, దేవుడు ప్రకృతి ఒక్కటే. ప్రకృతి లో ఉన్న చక్కటి నిర్మాణమే దేవుడు అన్నాడు. అయిన్  స్టెయిన్ ‘నేను స్పైనోజా దేవుని నమ్ముతాను’ అన్నాడు. ఈ దేవుడు ఒక వ్యక్తి కాదు, ఈ దేవుడు మనిషికి ప్రత్యక్షం కాడు. మనిషి తన ధర్మ శాస్త్రం ఇవ్వడు. మనిషికి తీర్పు తీర్చడు, మనిషితో ఎలాంటి వ్యక్తి గత సంబంధం పెట్టుకోడు. 

   అయిన్  స్టెయిన్ సమాధి ఎక్కడ ఉంది అని నేను ఆసక్తిగా తిరిగాను. అయిన్ స్టెయిన్ సమాధి ఎక్కడా నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆయన మృత దేహానికి క్రెమేషన్ చేసి బూడిదను నదిలో కలిపారు. న్యూటన్, మాక్స్ వెల్, ఫెరడే లాంటి గొప్ప సైంటిస్టులు చర్చి లో సమాధులు కట్టించుకొన్నారు. ఎందుకంటే ఒక రోజు క్రీస్తు నందు మేము సజీవులముగా తిరిగి లేస్తాము అనే నమ్మకము వారికి ఉండేది. అటువంటి నిరీక్షణ అయిన్  స్టెయిన్ లో మనకు కనిపించదు. ప్రకృతి లో నుండి పుట్టాను, ప్రకృతి లోనే కలిసిపోతాను అనే అవిశ్వాసము అయిన్  స్టెయిన్ లో మనకు కనిపిస్తుంది. 

సత్యము, సౌందర్యము, దయ – ఈ రోజు చాలా మంది అయిన్  స్టెయిన్ లానే జీవిస్తున్నారు. మాకు సైన్స్ కావాలి, సత్యము కావాలి, ప్రకృతి సౌందర్యం కావాలి, మేము దయ కలిగి ఉంటాము, అని వారు అనుకొంటారు. అయితే అవి సరిపోవు. 

   సత్యము, సౌందర్యము, దయ – నా జీవితానికి ఈ మూడూ చాలు అని అయి న్ స్టెయిన్ అనుకొన్నాడు. నాలుగవది కూడా కావాలి. అది ఆత్మ రక్షణ. స్పైనోజా వలె, అయిన్  స్టెయిన్ వలె మనం ప్రకృతితో దేవుని కలప కూడదు. దేవుడు ప్రకృతి వేరు. దేవుడు ప్రకృతి ని సృష్టించాడే కానీ దానితో కలిసిపోలేదు. ఆయన ప్రకృతి కి వేరుగా ఉన్నాడు. మానవులకు ప్రత్యక్షం అయ్యాడు. తన ధర్మశాస్త్రం మానవులకు ఇచ్చాడు. 

   ఆల్బర్ట్ అయిన్  స్టెయిన్ జీవితం నుండి మనం నేర్చుకొనవలసిన మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. అయితే ఆయన వలె  రక్షణ లేని స్థితిలో మనం జీవించకూడదు. 

హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మనం చదువుతాము: మనుష్యులు అందరూ మరణించవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును.    

               (హెబ్రీ 9:27) 

   పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు. మరణించిన ప్రతి వ్యక్తి దేవుని తీర్పు ఎదుర్కొంటాడు. అయితే దేవుడు మనకు ఒక ప్రేమ సందేశం పంపాడు. యేసు క్రీస్తు రూపములో  దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనలను రక్షించడానికి సిలువ మరణం పొందాడు. సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచాడు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసితో దేవుడు ఒక వ్యక్తి గత సంబంధం పెట్టుకొంటున్నాడు. ఆ సత్యం మనం గమనించాలి. అదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply