దేవుడు సమాధాన కర్త గా మనకు కనిపిస్తున్నాడు. ఆయన శాంతి ని మనకు ఇచ్చేవాడు. ఆయన God of Peace దేవుడు శాంతిని కోరుకొనేవాడు అనే సత్యము అపోస్తలుడు మనకు బోధిస్తున్నాడు.
మన తండ్రియైన దేవునినుండియు,ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక
రోమా 1:3

యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.
కీర్తన 29:11

దేవుడు తన ప్రజలను శాంతి తో ఆశీర్వదిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు కు ఇవ్వబడిన ఒక పేరు – సమాధాన కర్త Prince of Peace. యెషయా 9:6
యేసు క్రీస్తు రాజ్యాంగములో ఒక ముఖ్యమైన అంశం శాంతి, సమాధానం. సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.
మత్తయి 5:9
ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చే శాంతి ఈ లోకసంభంద మైనది కాదు. యోహాను సువార్త లో మనం చదువుతాము. శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను;నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు;
మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. యోహాను 14:27

నేను మీకు ఇచ్చే శాంతి ఈ లోకం మీకు ఇవ్వలేదు. శాంతి ఎలా పొందగలం? అనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది. దానికి చాలా రకాల సమాధానాలు మనం వింటూ ఉంటాము. కాసేపు యోగా చేయి, మెడిటేషన్ చేయి, ఈ టాబ్లెట్ వేసుకో, ఈ మత్తు మందు వాడు, ఈ పుస్తకము చదువు, ఈ క్లబ్ కి వెళ్ళు, ఈ పుణ్య యాత్ర చేయి,ఈ విరాళం ఇవ్వు,ఈ దాన ధర్మాలు చేయి. యేసు క్రీస్తు ఇచ్చే శాంతి అది కాదు. రోమా పత్రికలో దేవుడు ఇచ్చే శాంతి ఎలా మనం పొందగలమో వివరించాడు. 4 రకాలుగా ఈ శాంతి మనకు వస్తుంది.
Positional Peace
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము
రోమా 5:1

ముందు మనం దేవునితో సమాధానం పొందాలి. ఇది ఎలా వస్తుంది? ఇది మనం యేసు క్రీస్తు ను నమ్మటం వలన వస్తుంది. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు
మనం దేవుని ఎదుట నీతి మంతులముగా తీర్చబడుతున్నాము. అప్పుడే మనకు శాంతి వస్తుంది. నీతి లేకుండా శాంతి రాదు. శాంతి ఒక ప్రదేశం కాదు, అది ఒక వ్యక్తి. యేసు క్రీస్తు నందు రక్షించబడిన వారు నీతి మంతులుగా తీర్చబడుతున్నారు.
వారు దేవునితో సమాధాన పరచబడుతున్నారు.
Peace is not about a place,
it is not a program
It is about a person, Lord Jesus Christ.
రెండవది Practical Peace
రోమా 8:5-6 వచనాలు
శరీరాను సారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు
జీవమును సమాధానమునై యున్నది.
రోమా 8:5-6

ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణము, అశాంతి మనకు కలిగిస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ కు లోబడితే మనకు దేవుని జీవం, దేవుని శాంతి దొరుకుతాయి. శాంతి పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చే ఒక కానుక (గలతీ 5:22)
Galatians 5:22 says that peace is a gift of the Holy Spirit.
రోమా 14:17 కూడా చూద్దాము
దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని,నీతియు సమాధానమును
పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.
రోమా 14:17

దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ కు లోబడి జీవించడమే. అందులో నీతి,సమాధానము, ఆనందం ఉన్నాయి. ఆ మూడూ కలిసివెళ్తున్నాయి. వాటిని మనం విడదీయలేము. దేవుని నీతి తో జీవించే వ్యక్తి దేవుని సమాధానం కలిగి ఉంటాడు.
దేవుని ఆనందం కలిగి ఉంటాడు. దేవుని నీతి సమాధానం కలిగిస్తుంది. అలా కాకుండా మనం పాపాన్ని వెంబడిస్తే మనకు శాంతి ఉండదు.
1 థెస్స 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.సామెతలు
కీడు చేయుట మాని మేలు చేయుము
సమాధానము వెదకి దాని వెంటాడుము.
కీర్తన 34:14

కీడు చేసే వ్యక్తికి శాంతి ఉండదు. దేవుని మీద ఆధారపడి, మంచి చేసే వారికే శాంతి దొరుకుతుంది. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు.
యెషయా 26:3
తన మీద ఆధారపడి జీవించేవారికి దేవుడు పూర్ణ శాంతి ని ఇస్తున్నాడు.
మూడవది
Protective Peace
యేసు క్రీస్తు నందు విశ్వాస ముంచి మనం దేవుని ఎదుట నీతి మంతులముగా తీర్చబడి దేవుని శాంతి పొందాము. మనం పరిశుద్ధాత్మ కు లోబడి జీవిస్తూ పరిశుద్ధాత్ముడు ఇచ్చే శాంతి పొందుతాము. అయినప్పటికీ సాతాను మనలను వదలి పెట్టడు. సాతాను అనేక రూపాల్లో అనేక పనుల ద్వారా మన జీవితాల్లో శాంతి లేకుండా చేయాలని ప్రయత్నిస్తాడు. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును.
రోమా 16:20


ఆ మాటలు గమనించండి. సమాధాన కర్తయగు దేవుడు సాతానును ఈ కాళ్ళ క్రింద త్రొక్కించును. ఈ సమాధానం మనకు కావాలంటే మనం దేవుని శక్తి మీద ఆధారపడాలి. సాతానును మనం మన స్వంత శక్తితో ఎదుర్కోలేము. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించాలి. తలకు రక్షణ శిరస్త్రాణం,ఛాతీకి నీతి అనే వస్త్రం,నడుముకు సత్యం అనే దట్టి,ఒక చేతిలో విశ్వాసము అనే డాలు,మరొక చేతిలో దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం,పాదములకు సమాధాన సువార్త వల్లనైన సిద్ధ మనస్సు అనే చెప్పులు తొడుగుకోవాలి. సాతానుని ఎదుర్కోవాలంటే అవన్నీ విశ్వాసి ధరించాలి. విశ్వాసి దేవుని శాంతి అనే చెప్పులు తోడుకొన్నాడు. అవి లేకుండా ఏ విశ్వాసి ముందుకు నడవలేడు. దేవుని శాంతి మనకు లేకపోతే సాతాను ను ఎదుర్కొని ఒక్క అడుగు కూడా మనము ముందుకు వేయలేము. అందుకనే దేవుడు మనకు సమాధాన సువార్త వలన వచ్చే సిద్ధ మనస్సు అనే చెప్పులు ఇచ్చాడు. వాటిని మనం వేసుకొని నడవాలి.

Political Peace నాలుగవదిగా ఇతరులతో సమాధానం
శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
రోమా 12:18

మన సమాజం కూడా మన శాంతికి భగ్నం కలిగించవచ్చు. సాధ్యమైనంత వరకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు అని అపోస్తలుడు వ్రాసాడు. అనేక ప్రదేశాల్లో క్రైస్తవులకు హింస కలుగుతుంది. వారికి శాంతి ఉందా? శ్రమల్లో ఉన్న వారికి కూడా దేవుడు తన శాంతిని ఇస్తాడు. రోమా పత్రికలో నుండి దేవుని గురించి కొన్ని సత్యాలు ఈ రోజు మనం చూశాము. దేవుని శాంతి మనం ఎలా పొందగలం? ముందు మనం యేసు క్రీస్తు నందు విశ్వాస ముంచి దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడాలి. తరువాత పరిశుద్ధాత్మ కు లోబడి జీవించాలి. మూడవదిగా దేవుడు ఇచ్చే రక్షణ వస్త్రాలు ధరించి సాతానును ఎదుర్కోవాలి. దేవుడు ఇచ్చే గొప్ప శాంతిని మీరు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.