
ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచు చున్నాము. బైబిల్ సమాచారం కోసం మా వెబ్ సైట్ దర్శించండి. http://www.doctorpaul.org . మీరు ఈ సందేశాలు మరో సారి చూడాలంటే లేక మిస్ అయిన సందేశాలు చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. మా యూ ట్యూబ్ ఛానల్ లో అన్ని సందేశాలు అప్ లోడ్ చేసాము. మా కార్యక్రమం యాప్ మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోండి. ఆ యాప్ ద్వారా మీరు మాకు మీ ప్రేయర్ రిక్వెస్ట్ లు పంపించవచ్చు. మీ జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలు మాతో పంచుకోవచ్చు. అందు కోసం మీ మొబైల్ లో మా యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. బైబిల్ పుస్తకాలు పరిచయం అనే అంశం మనం చూస్తున్నాము. పాత నిబంధన మొత్తం ముగించాము. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం మనం ధ్యానిస్తున్నాము. ‘రోమా పత్రికలో కనిపిస్తున్న దేవుడు’ అనే అంశం ఈ రోజు మనం కొనసాగిద్దాము.
ఈ రోజు రోమా పత్రికలో నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. రోమా పత్రికలో మనకు దేవుడు ఎలా కనిపిస్తున్నాడు? ఇంతకు ముందు మనం కొన్ని సంగతులు చూసాము.
God of Preeminence: మన రక్షణ కార్యములో దేవుడు అతి ముఖ్యమైన స్థానము కలిగి ఉన్నాడు.
God of Perpetuity: దేవుడు నిత్యుడైన వాడు. సకల యుగాల్లో ఉండే వాడు. ఆయన కార్యములను మనం అర్ధం చేసుకోవాలంటే ఆ సత్యం గమనించాలి.
God of Perfection: దేవుడు పరిపూర్ణుడు, ఆయన ముందు మనం అపరిపూర్ణముగా ఉన్నాము.
God of Possession: సమస్తము దేవుని ఆధిపత్యములో ఉన్నాయి.
God of Power: దేవుడు సర్వశక్తి మంతుడు. ఆయన శక్తి లేకుండా ఎవరూ రక్షణ పొందలేరు.
God of Preparation: ఎంతో ఆలోచించి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం తన కార్యములు చేస్తాడు.
God of Promise: రక్షణ కార్యములో దేవుడు తాను ముందుగా చేసిన వాగ్దానాలు నెరవేర్చాడు
ఈ రోజు దేవుని గురించి రోమా పత్రికలో కనిపిస్తున్న మరికొన్ని సత్యాలు మనం నేర్చుకొందాము.
8.God of Perseverance – ఆయన పట్టువదలని దేవుడు
రోమా పత్రిక 11 అధ్యాయము చూడండి. అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా వెంబడిస్తున్నాడో అపోస్తలుడైన పౌలు మనకు వివరించాడు. ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం యూదుల పట్ల దేవునికి గల ప్రణాళిక లను అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన ప్రపంచములో పెరిగిపోతున్న ఒక ప్రధాన సమస్య antisemitism. యూదు ద్వేషం. విచారకరముగా కాన్యే వెస్ట్ లాంటి కొంత మంది క్రైస్తవులు కూడా ఈ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రతి అసత్యము ఎప్పటికో ఒకప్పుడు ఎవరో ఒకరిని బాధిస్తుంది. కాబట్టి మనం సత్యం తెలుసుకోవడం ముఖ్యం.

రోమా పత్రిక 11 అధ్యాయములో మనం చూస్తే, అక్కడ పౌలు గారు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. దేవుడు తన ప్రజలను విసర్జించెనా? దేవుడు ఇశ్రాయేలీయులను లేక యూదులను విసర్జించాడా? విసర్జించలేదు అని పౌలు గారు స్పష్టముగా మనకు తెలియజేశాడు.

ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు
రోమా 10:21
ఇశ్రాయేలు ప్రజలు ఎంతో అవిధేయత చూపించారు. అయితే దేవుడు తన చేతులు చూచుకొని వారిని వెంబడించాడు. ఇశ్రాయేలు ప్రజలు తనకు ఎంత దూరముగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు ఓర్పుతో వారిని వెంబడించుట మనం గమనిస్తాము. దేవుడు తన ప్రవక్తలను వారి యొద్దకు పంపాడు. తన కుమారుడైన యేసు క్రీస్తును వారి యొద్దకు పంపాడు. సువార్తలలో చదివితే, యేసు క్రీస్తు ప్రభువు ఇశ్రాయేలు దేశం నలుమూలలా తిరిగి దేవుని సువార్త ప్రకటించడం మనము చూస్తాము. వారి కోసము ఆయన తీవ్రమైన వేదనతో ప్రార్ధన చేయడం మనం చూస్తాము. యెరూషలేము ను చూసి యేసు ప్రభువు కన్నీరు కార్చడం మనం చూస్తాము. అంత వరకు నిజమే కానీ యేసు క్రీస్తును సిలువ వేసిన తరువాత దేవుడు యూదులను విడిచివేశాడు అనే వారు చాలా మంది మనకు కనిపిస్తారు. అయితే అపోస్తలుడైన పౌలు ఈ రోమా పత్రికను యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన తరువాతే రచించాడు అని మనం గమనించాలి.

రోమా 11 అధ్యాయములో ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. ఆయన కొన్ని ఉదాహరణలు మనకు తెలియజేశాడు.
మొదటిగా నన్ను చూడండి అని పౌలు అంటున్నాడు. దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీ యుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.
రోమా 11:1

యేసు క్రీస్తు తన మహిమతో పౌలుకు ప్రత్యక్షం అయ్యాడు. పౌలు తో ఆయన మాట్లాడాడు. ఆ గొప్ప ప్రత్యక్షత వలన పౌలు రక్షించబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభువు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆ విధముగానే ప్రత్యక్షమై వారిని రక్షిస్తాడు. జెకర్యా గ్రంథం స్టడీ చేసినప్పుడు మనం ఆ సత్యం చూశాము. దావీదు సంతతి వారిమీదనుయెరూషలేము నివాసులమీదను, కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచు తారు
జెకర్యా 12:10


దేవుడు తన పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించినప్పుడు యూదులు తాము పొడిచిన యేసు క్రీస్తు ప్రభువును చూస్తారు, తెలుసుకొంటారు అని జెకర్యా ప్రవక్త తెలియజేశాడు. ఇశ్రాయేలు దేశములో ఈ రోజు నెంబర్ 1 సెర్చ్ టర్మ్ ఏమిటంటే ‘యేసు క్రీస్తు’. ఆ దేశములో ప్రజలు ఇంటర్నెట్ లో ఎక్కువగా వెదుకుతున్న పేరు ‘యేసు క్రీస్తు’. రక్షకుడైన యేసు క్రీస్తు గురించి తెలుసుకోవాలని ఎంతో మంది యూదులు ఈ రోజు ఆసక్తి చూపిస్తున్నారు.

రెండో ఉదాహరణ: ఏలీయా ప్రవక్త. ఏలీయా ప్రవక్తను యెజెబెలు రాణి వెంటాడి వేధించింది. ఏలీయా ఎంతో నిరాశ చెందాడు. ‘ఇంత పెద్ద దేశములో నేను ఒక్కడినే దేవుని వెంబడిస్తున్నాను. అందరూ అన్య దేవతల వైపు వెళ్లిపోయారు’ అని ఏలీయా అనుకొన్నాడు. దేవుడు ఏలీయా తో ఒక మాట అన్నాడు. ‘ఏలీయా నీతో పాటు 7000 మంది వ్యక్తులు నన్ను వెంబడిస్తున్నారు’. నేను ఒక్కడినే మిగిలిపోయాను అని ఏలీయా అనుకొన్నాడు. అయితే ఇంకా 7000 మంది దేవుని ప్రజలు ఆ దేశములో ఉన్నారు అని దేవుడు ఏలీయాతో అన్నాడు. అయ్యో, నేను ఒక మైనారిటి అని మనకు అనిపించవచ్చు. అయితే కోటాను కోట్ల మంది ప్రజలు ఈ రోజు యేసు క్రీస్తును వెంబడిస్తున్నారు. లక్షల మంది యూదులు ఈ రోజు యేసు క్రీస్తును వెంబడిస్తున్నారు.


మూడో ఉదాహరణ: అన్యజనులు
ఇశ్రాయేలీయులకు రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను.
రోమా 11:12

అన్యజనులు – దేవుని జ్ఞానం ఏ మాత్రం లేని వారు, వారికి దేవుని వాగ్దానాలు లేవు, వారికి దేవుని ధర్మశాస్త్రం లేదు, దేవుని ఆలయం లేదు, దేవుని ప్రవక్తలు లేరు,దేవుడు పిలిచిన పితరులు లేరు దేవుడు ఇచ్చిన దేశం వారికి లేదు. అటువంటి అన్యజనులనే క్షమించి, రక్షించిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిచిపెడతాడా?
దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు. రోమా 11:23
ఇశ్రాయేలీయులను తిరిగి అంటుకట్టే శక్తి దేవునికి వుంది. అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.
రోమా 11:23

అన్యజనుల ప్రవేశం ముగిసిన తరువాత దేవుడు వారి యొక్క కఠిన మనస్సు తీసివేస్తాడు.
నాలుగో ఉదాహరణ: పితరులు
దేవుడు ఇశ్రాయేలీయుల పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లకు ఇచ్చిన వాగ్దానాలు మరచిపోతాడా? వారితో ఆయన నిత్య నిబంధనలు చేశాడు. వాటిని బట్టి కూడా దేవుడు ఇశ్రాయేలీయులను వదలి పెట్టడు.

ఐదో ఉదాహరణ: దేవుడు
దేవుడు ఇశ్రాయేలీయులను వదలి పెట్టడు అనడానికి ఐదవ కారణం ఏమిటంటే దేవుడే. చరిత్ర లోకి చూడండి. ఎన్ని సార్లు దేవుడు తన విశ్వస నీయత కాపాడుకున్నాడు? ఇశ్రాయేలీయులు దేవునికి దూరముగా వెళ్లిపోవడం, పతనం కావడం, మళ్ళీ దేవుడు వారిని తన యొద్దకు చేరదీయడం…. కొంత కాలం తరువాత వారు తిరిగి విగ్రహారాధన, అన్య దేవతల వైపు వెళ్లిపోవడం, మళ్ళీ దేవుడు వారిని చేరదీయడం. ఐగుప్తు లో వారు దేవుని మరచిపోయారు. దేవుడు తన దాసుడైన మోషే ని వారి యొద్దకు పంపాడు. కనాను లో వారు దేవుని మరచిపోయారు.



దేవుడు తన ప్రవక్తలను వారి యొద్దకు పంపాడు. బబులోను లో వారు దేవుని మరచిపోయారు. దేవుడు తన ప్రవక్తలను వారి యొద్దకు పంపాడు. రోమ్ లో వారు దేవుని మరచిపోయారు. దేవుడు తన అపోస్తలులను వారి యొద్దకు పంపాడు. ఆ విధముగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎప్పుడూ వదలి పెట్టలేదు అని మనం గమనించాలి.