
ఆపెన్ హైమర్ ఒక యూదు కుటుంబములో జన్మించాడు. అయితే ఇతర మతాల గురించి కూడా ఆసక్తి పెంచుకున్నాడు. అణు బాంబు ను పరీక్ష నప్పుడు ఆయన భగవద్గీత లో ఉన్న ఒక మాట ను చెప్పాడు:
‘Now I am become death,
the destroyer of worlds
ఇప్పుడు నేను మృత్యువును అయ్యాను. ప్రపంచాలను నాశనం చేసే వాడిగా మారాను. ఆపెన్ హైమర్ సినిమా లో మాత్రం దీనిని అసభ్యకరంగా చూపించారు.

ఆపెన్ హైమర్ కు జీన్ టాట్ లోక్ అనే మహిళతో అక్రమ సంబంధం ఉండేది. ఒకరోజు ఆమెతో సన్నిహితముగా గడిపే టప్పుడు వారిద్దరు సెక్స్ చేసుకునేటప్పుడు ఆమె లేచి భగవద్గీత ను తెరచి అతనికి చూపించి ఆ వాక్యాలు చదువు అంటుంది. అతడు వాటిని చదువుతాడు. హిందూ సంఘాలు అది చూసి గొడవ చేశాయి. ఆ చిత్రములో ఈ సన్నివేశం తొలగించాలని ఆందోళనలు చేశాయి. వారి బాధ మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథం ను అలా అసభ్యకరముగా చూపిస్తే మనకు కూడా కోపం వస్తుంది. ఆపెన్ హైమర్ లాంటి సైంటిస్టులు ఒక ఫిలాసఫీ ని ఒంటబట్టించుకొన్నారు.


అంతా ఒక మాయ. నువ్వు ఒక మాయ. ఈ ప్రపంచం ఒక మాయ అని వారు నమ్మారు. ఈ ఫిలాసఫీ ని వృద్ధి చేయడములో వారు క్వాంటమ్ ఫిజిక్స్ ని కూడా వాడుకొన్నారు. క్వాంటమ్ ఫిజిక్స్ మనం కంటితో కూడా చూడలేని ప్రపంచము ను అర్థం చేసుకోవడములో మనకు ఉపయోగపడుతుంది.

1927 లో జర్మన్ శాస్త్రవేత్త వెర్నర్ హైజెన్ బర్గ్ ‘Uncertainty principle’.ప్రతిపాదించాడు. అనిశ్చితి నియమం అని ఇది పిలువబడింది. హైజెన్ బర్గ్ చెప్పిన సైన్స్ నియమాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకొన్నారు. ‘క్వాంటమ్ ఫిజిక్స్ చేసే పరిశోధనలు పరిశోధన చేసే సైంటిస్టు మీద ఆధారపడి ఉంటాయి’ అనే తప్పుడు అభిప్రాయం వేగముగా అభివృద్ధి చెందింది. ‘ఈ ప్రపంచ పరిస్థితి దానిని చూసే వాడి మీద ఆధారపడి ఉంటుంది’ అనే నమ్మకం వేగముగా ప్రబలింది. క్వాంటమ్ కాన్షన్స్ నెస్, క్వాంటమ్ రియాలిటి ఎవరికి వారే నిర్మించుకోవచ్చు అనే భావం పెరిగింది.

అయితే ఇది తప్పు. క్వాంటమ్ ఫిజిక్స్ చూసే వాడి మీద ఆధారపడి మారేది కాదు. ఇతర సైన్స్ ల వలె అది కూడా మన అనుభూతుల మీద ఆధారపడేది కాదు. చాలా మంది ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్ సిద్ధాంతమును కూడా తప్పుగా అర్థం చేసుకొన్నారు. రెలెటివిటీ అంటే రెలెటివిజం అనుకొన్నారు. అంటే అబ్సొల్యూట్స్ లేవు. అంతా మనం కల్పించుకొన్నవే అనే అభిప్రాయం పెరిగింది. ఇది మత విశ్వాసాల మీద కూడా ప్రభావం చూపించింది.

దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనం పట్టించుకోనక్కరలేదు. భౌతిక ప్రపంచములో ఏ ఆజ్ఞలు లేవు కాబట్టి ఆధ్యాతిక ప్రపంచములో కూడా ఏ ఆజ్ఞలు ఉండకూడదు అనే భావం పెరిగింది. సమస్తం మనిషి కల్పించినవే. సైన్స్ కూడా మనిషి కల్పించిన ఒక అభిప్రాయం మాత్రమే. దానికి వాస్తవికత మీద ఎలాంటి ఆధిపత్యం లేదు అనే వారు ఇప్పుడు పెరిగిపోతున్నారు. అయితే క్రైస్తవ్యం వాటిని ఒప్పుకోదు. బైబిల్ వాటిని ఒప్పుకోదు. ‘ఈ ప్రపంచం ఒక మాయ నేనొక మాయ, నువ్వొక మాయ, దేవుడొక మాయ’ అని మనం అనకూడదు. దేవుడు వాస్తవం, నేను వాస్తవం,మీరు వాస్తవం, ఈ ప్రపంచం ఒక వాస్తవం అని బైబిలు మనకు బోధిస్తున్నది.

సైన్స్ ని సృష్టించింది క్రైస్తవ ఆలోచనాపరులే. భౌతిక ప్రపంచం వాస్తవ మైనది అని వారు గుర్తించారు. దానిని అర్థం చేసుకొనే మానసిక, శారీరక అవయవాలను, గ్రహింపు శక్తిని దేవుడు మనిషికి ఇచ్చాడు అని వారు నమ్మారు. భౌతిక ప్రపంచం గందర గోళము లేకుండా కొన్ని నిర్దిష్టమైన నియమాల మీద ఆధారపడి నడుస్తుంది అని వారు నమ్మారు. ఆ నమ్మకాలు లేకపోతే సైన్స్ పుట్టేది కాదు. సైన్స్ కు పునాదులు వేసిన పితామహులు జోహనెస్ కెప్లెర్, ఐజాక్ న్యూటన్, బ్లెయిస్ పాస్కల్, మైఖేల్ ఫారడే, చార్లెస్ బాబేజ్, లూయి అగస్సిజ్, గ్రెగొర్ మెండెల్, లూయీ పాశ్చర్, జేమ్స్ క్లర్క్ మాక్స్ వెల్ – వారందరూ యేసు ప్రభువును నమ్మిన క్రైస్తవులే. దేవుడు ఈ ప్రపంచమును మనం గ్రహించగలిగే టట్లు సృష్టించాడు అని వారు నమ్మారు.











20 శతాబ్దములో క్రొత్తగా వచ్చిన క్వాంటమ్ థియరీ, రెలెటివిటీ థియరీ దేవునికి వ్యతిరేకమైనవి కావు. కంటికి కనిపించిన అణువులో సహితం గొప్ప నిర్మాణం ఉందని క్వాంటమ్ థియరీ మనకు చూపిస్తుంది. అది దేవుని యొక్క గొప్ప జ్ఞానం మనకు చూపిస్తున్నది. సమయం కూడా స్థిరమైనది కాదు అనే సత్యం రెలెటివిటీ థియరీ మనకు తెలియజేసింది. సమయం స్థిరమైనది కాదు కేవలం నిత్యత్వం మాత్రమే స్థిరమైనది అనే సత్యం బైబిలు మనకు తెలియజేస్తుంది.

సాతానుడు అబద్ధాలకు తండ్రి. సమస్త వ్యవస్థలను సాతానుడు అసత్యాలతో నింపి వేశాడు. సైన్స్ కు వదిలిపెట్టలేదు. ప్రజలను దేవుని యొద్ద నుండి వేరుచేయటానికి సాతాను అటువంటి అసత్యాలు నిత్యం సృష్టిస్తాడు. ఆపెన్ హైమర్ ఒక యాటమ్ లో ఉండే గొప్ప శక్తిని బయటకు తీసి ప్రపంచానికి చూపించాడు. మానవాళిని నాశనం చేసే శక్తి ఆ యాటమ్ లలో ఉందని ఆయన నిరూపించాడు. జార్జ్ గమావ్ అనే సైంటిస్ట్ విశ్వమును సృష్టించినప్పుడు ఈ యాటమ్ శక్తి ఉపయోగించబడింది అని ప్రతిపాదించాడు.

దేవుడు ఈ విశ్వమును సృష్టించినప్పుడు ఎంతో గొప్ప శక్తిని వాడాడు. దేవుడు చేసిన పనులను సింగులారిటీస్, రెగులారిటీస్ అని రెండు వర్గాలుగా చెప్పుకోవచ్చు. సింగులారిటీస్ అంటే దేవుడు ఒక్కసారే చేసిన పనులు. ఈ విశ్వమును దేవుడు ఒక్కసారే సృష్టించాడు. మనిషిని దేవుడు ఒక్కసారే సృష్టించాడు. జల ప్రళయం ఒక్కసారే ఈ ప్రపంచాన్ని కబళించింది. అవి సింగులారిటీస్.

రెండవదిగా రెగులారిటీస్. ఇవి ప్రతిరోజూ దేవుడు చేసే కార్యాలు. ఉదాహరణకు ప్రతిరోజూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ప్రతి నెలా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. దేవుని కాపుదల లేకుండా ఈ పనులు జరుగవు. సృష్టిలో జరిగే కార్యాలన్నిటికీ ఎంతో శక్తి కావాలి. అణు శక్తి వాటికి కీలకం. దేవుడు తన జ్ఞానముతో భౌతిక ప్రపంచం సజావుగా పనిచేసేటట్లు నిర్మించాడు.



ఒక యాటమ్ లో ఉన్న గొప్ప శక్తిని మనం చూసినప్పుడు వాటిని సృష్టించిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జ్ఞానం, శక్తి గురించి మనం ఆలోచించాలి. ఆపెన్ హైమర్ లోస్ అలామోస్ దగ్గర నిర్మించిన అణు పరీక్ష కేంద్రానికి ట్రినిటీ అని పేరుపెట్టాడు. దైవిక త్రిత్వం చేత ఆయన ప్రేరేపితుడయ్యాడు. దైవిక త్రిత్వం విశ్వము లో ప్రధాన పాత్ర
వహించారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు – ఈ ముగ్గురు మన విశ్వమును సృష్టించారు. ముగ్గురూ కలిసే మానవ జాతిని సృష్టించారు. ముగ్గురూ కలిసే మానవులను వారి పాపముల నుండి విమోచించారు.

ఈ ముగ్గురూ కలిసే ప్రస్తుతం ఈ విశ్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చివరకు, ఈ ముగ్గురూ కలిసే ఈ విశ్వాన్ని నాశనం చేస్తారు. బైబిల్ లో ఆ సత్యం స్పష్టముగా చెప్పబడింది. 2 పేతురు పత్రిక 3 అధ్యాయం 10 వచనం చూద్దాము.
అయితే ప్రభువు దినము
దొంగవచ్చినట్లు వచ్చును.
ఆ దినమున ఆకాశములు
మహాధ్వనితో గతించి పోవును,
2 పేతురు పత్రిక 3:10
పంచభూతములు మిక్కటమైన
వేండ్రముతో లయమైపోవును,
భూమియు దానిమీద వున్న
కృత్యములును కాలిపోవును.
2 పేతురు పత్రిక 3:11


ఆ మాటలు మీరు గమనించండి. ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఒక దొంగ ఎప్పుడు ఏ ఇంటికి కన్నం వేస్తాడో మనం ఊహించలేము. అదే విధముగా మన ప్రభువైన యేసు క్రీస్తు ఎప్పుడు తిరిగి వస్తాడో మనం ఊహించలేము. ఆయన తిరిగి వచ్చి విశ్వాసులను ఈ ప్రపంచము నుండి వేరు చేస్తాడు. చివరకు ఈ విశ్వం మొత్తం అంతం చేయబడుతుంది. మానవ చరిత్ర మాత్రమే కాకుండా, మన భూమి, సౌర కుటుంబం, నక్షత్ర రాశులు – ఈ విశ్వం మొత్తం గొప్ప విస్ఫోటనములో నశిస్తుంది.
ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీద వున్న కృత్యములును కాలిపోవును. ఆ దృశ్యం ఎలా ఉంటుందో మీరొక సారి ఊహించండి. అయితే దానిని చూడడానికి, వినడానికి ఈ భూమి మీద ఎవరూ ఉండరు.
ప్రభువు దినం – ది డే అఫ్ ది లార్డ్ అలా ఉంటుంది. ఆ రోజున దేవుడు ఈ యూనివర్స్ ని సమూలంగా నాశనం చేస్తాడు. మానవుడు చేసిన లక్షలాది అణు బాంబులు కూడా అటువంటి విస్ఫోటనం సృష్టించలేవు. అయితే అటువంటి దుర్వార్తతో దేవుడు
ఈ ప్రవచనం ముగించలేదు. మనకు ఒక గుడ్ న్యూస్ కూడా దేవుడు ఇచ్చాడు. 13 వచనం చూడండి.
అయినను మనమాయన వాగ్దానమునుబట్టి
క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును
కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.

దేవుడు ఒక క్రొత్త విశ్వం, అందులో ఒక క్రొత్త భూమి ని సృష్టించబోతున్నాడు.
ప్రస్తుతం ఉన్న యూనివర్స్ ని నాశనం చేసి దేవుడు ఒక న్యూ యూనివర్స్ ని సృష్టిస్తాడు. దేవునికి ఎంత గొప్ప శక్తి ఉందో మీరొక సారి ఆలోచించండి. వాటి యందు నీతి నివసించును అని పేతురు గారు వ్రాశాడు.

ఆ నీతి మనం ఎలా పొందగలం? యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు మనం వెళ్ళాలి. మన పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొందాలి. అప్పుడు దేవుడు మనలను క్షమించి మన పాప ఋణాన్ని కొట్టివేస్తాడు. మనలను యేసు క్రీస్తు నందు నీతి మంతులుగా తీరుస్తాడు. నీతి మంతులుగా తీర్చబడిన వారు మాత్రమే ఈ న్యూ యూనివర్స్ లోకి ప్రవేశించగలరు. తమ పాపములలో చనిపోయిన వారు నరకానికి వెళ్తారు. యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చే రక్షణ పొంది మీరు కూడా దేవుడు చేయబోయే న్యూ యూనివర్స్ లోకి వెళ్ళాలి