యేసు క్రీస్తు ప్రభువు: మన జ్ఞానము, మన నీతి 

కొరింథీయులకు వ్రాసిన పత్రిక లో నుండి  ఈ రోజు ఒక  ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. మొదటి కొరింథీ పత్రిక 1:31 చదువుదాము. 

All Sufficiency of Christ 

దేవుని మూలముగా యేసు క్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయెను.

    మొదటి కొరింథీ పత్రిక 1:31 

ఆ  మాటలు మీరు గమనించండి. యేసు క్రీస్తు ప్రభువు మనకు 4 రకాలుగా ఆపాదించబడ్డాడు. ఆయన మనకు జ్ఞానము,మనకు నీతి,మనకు పరిశుద్ధత,మనకు విమోచనము. ఆ నాలుగు కలిసే వెళ్తాయి. వాటిలో నుండి మనము దేనినీ వేరుచేయలేము. 

మొదటిగా 

యేసు క్రీస్తు ప్రభువు – మనకు జ్ఞానము 

మొదటిగా జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే వాస్తవికత ను తెలుసుకొని దానికి అనుగుణముగా జీవితం మలుచుకోవడం. ఒక కారును మీరు డ్రైవ్ చేయాలనుకొంటారు. మీకు ఎలా డ్రైవ్ చేయాలో తెలిసివుండాలి. ఏ రోడ్డు మీద ఎంత వేగముతో ప్రయాణము చేయాలో మీకు తెలిసి ఉండాలి. మీ కారులో బ్రేక్ ఏదో,యాక్సిలేటర్ ఏదో మీకు తెలిసి ఉండాలి. ఆ జ్ఞానం మీకు లేకపోతే మీ కారుకు ప్రమాదం జరుగుతుంది. 

   ఏ రోడ్డు మీద ఎంత వేగముతో, ఏ వైపు నడపాలో మీకు తెలిసి ఉండాలి. లేకపోతె మీ కారుకు ప్రమాదం జరుగుతుంది. సమాచారం మీరు తెలుసుకోవాలి. దానికి అనుగుణముగా మీ ప్రవర్తన మలచుకోవాలి. అదే జ్ఞానం. కొరింథు సంఘములో ఉన్న గ్రీసు దేశస్తులు జ్ఞానము వెదకు చున్నారు. పౌలు గారు వారితో ఏమంటున్నాడంటే, 

యేసు క్రీస్తు మనకు జ్ఞానం. 

బుద్ధి జ్ఞానముల 

సర్వ సంపదలు

యేసు క్రీస్తు నందే  

గుప్తములై యున్నవి.

       కొలొస్సయులకు 2:3 

కాస్త కూస్తా కాదు అది కొంచెం, ఇది కొంచెం కాదు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు 

యేసు క్రీస్తు నందే మనకు దొరుకుతున్నాయి. గ్రీకు సంస్కృతి అంటేనే అది ఫిలాసఫర్లకు నెలవుగా ఉన్న సంస్కృతి. జ్ఞానాన్వేషణ, జ్ఞాన సముపార్జనలకు వారు జీవితము మొత్తం వెచ్చిస్తారు.సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి గొప్ప మేధావులు జ్ఞానం కోసం తపించారు. సోక్రటీస్ ఒక మాట అంటూ ఉండేవాడు. 

‘the show of wisdom 

without the reality’ 

కొంతమంది షో చేస్తూ ఉంటారంట. వారు జ్ఞానము ఉన్నట్లుగా షో చేస్తారు దానికి రియాలిటీ ఉండదు. వాస్తవికత ఉండదు. 

    గ్రీకులు ‘టి లి యాలజి’ అనే పదం ఉపయోగించేవారు. అంటే పర్పస్. మనిషి జీవితానికి పర్పస్ ఉందా? ఈ ప్రపంచానికి ఒక పర్పస్ ఉందా? ఈ విశ్వానికి ఒక పర్పస్ ఉందా? గ్రీకులు మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉంది అని నమ్మారు. ఈ విశ్వానికి ఒక పర్పస్ ఉంది అని నమ్మారు. దీనిని ‘టిలియాలజి’ అని వారు పిలిచారు. యేసు క్రీస్తు ప్రభువు ఆ టి లి యాలజి ని మనకు బోధించాడు. దేవుడు మనలను సృష్టించింది తన ఆనందం కోసమే, తన మహిమ కోసమే. అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడు. 

మనుష్యుడు రొట్టెవలన మాత్రముకాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును. 

             మత్తయి 4:4 

    నిజమైన జ్ఞానం మనకు కావాలంటే మనం దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. complete reality సంపూర్ణమైన వాస్తవికత దేవుడు మాత్రమే మనకు చెప్పగలడు. సోక్రటీస్ జ్ఞానం కోసం ఎంతో తపించాడు. ఈ ప్రపంచం కేవలం భౌతిక మైన పదార్థం కాదు.ఇందులో ఆత్మ సంబంధమైనవి కూడా ఉన్నాయి అన్నాడు. ఈ విశ్వం ఒక కోణములో భౌతికమైనది. మరొక కోణములో ఆత్మ సంబంధమైనవి కూడా అందులో ఉన్నాయి అని Phaedo లో ఉంది. 

   అయితే సోక్రటీస్ మాటలు అనేకమందికి నచ్చలేదు. తన బోధనలతో సమాజాన్ని పాడు చేస్తున్నాడు అని సోక్రటీస్ మీద నేరం మోపారు. ఆయనకు విషం ఇచ్చి చంపారు. సోక్రటీస్ ఆ విష పాత్ర కూడా సంతోషముగానే త్రాగాడు ఎందుకంటే ఆయన యేమని నమ్మాడంటే, ‘నా ఆత్మ నా శరీరములో బంధించబడి ఉంది. మరణం తరువాత నా శరీరములో నుండి నా ఆత్మ కు స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు  నేను  సంపూర్ణమైన జ్ఞానము పొందుతాను’ అన్నాడు. కొంతవరకు మనం కూడా దానిని నమ్ముతాము. యేసు క్రీస్తు ప్రభువు మనకు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే కాదు, మరణం తరువాత కూడా ఆయన మనకు జ్ఞానమే. మన మరణం తరువాత యేసు క్రీస్తు ప్రభువును మనం చూసినప్పుడు మనకు సంపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది. ఆ రోజు మనం పరిపూర్ణమైన జ్ఞానము పొందుతాము. 

   గ్రీకులు జ్ఞాన సముపార్జన లో రెండు విషయాల గురించి ప్రముఖముగా చెప్పారు. 

మొదటిది Reality and Illusion 

రెండవది Perfection and Imperfection

మొదటిది Reality and Illusion 

ఏది నిజమైనది? ఏది అభూత కల్పన? ప్లేటో రిపబ్లిక్ అనే పుస్తకం వ్రాశాడు. ఇందులో తన సోదరుడు గ్లవ్ కాన్, తన గురువు సోక్రటీస్ ల మధ్య జరిగే సంభాషణ ఆ పుస్తకములో వ్రాశాడు. 

   ఒక గుహ లో కొంతమంది బంధించబడి వుంటారు. వారు సంకెళ్లతో ఆ గుహలో బంధించబడి ఉంటారు. వారి వెనుక ఒక అగ్ని మండుతూ ఉంటుంది. ఆ అగ్ని ముందు కొంతమంది నడుచుకొంటూ వెళ్తారు. వారి యొక్క ఛాయ గుహలో గోడ మీద పడుతుంది. గుహలో వున్న వ్యక్తులు ఆ గోడ వైపు చూస్తూ ఉంటారు. ఆ గోడ మీద పడే ఛాయలు నిజమే అని వారు అనుకొంటూ వుంటారు. మనము కూడా అంతే. ఛాయలే నిజం అని మనం అనుకొంటాము. నీడ ను చూసి అదే వాస్తవం అని మనం అనుకొంటాము. గుహలో బంధించబడిన వ్యక్తి ఆ గొలుసులు వదిలించుకోవాలి. అతడు బయటికి వచ్చి నప్పుడే ‘నేను ఇంత కాలం చూసింది ఛాయ మాత్రమే’ అని గ్రహిస్తాడు. 

అతడు గుహలో ఉన్నంత కాలం సూర్యుడు అతనికి కనిపించడు. బయటికి వెళ్లిన తరువాత ఏది వాస్తవమో తెలుసుకొంటాడు. 

కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు వ్రాశాడు. 

ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. 

                        కొలొస్స 2:17

ఈ ప్రపంచం మనకు అనేక ఛాయలు చూపిస్తుంది. అవి నిజం కాదు. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. సాతానుడు మనకు అనేక ఛాయలు చూపిస్తాడు. అవి నిజం కాదు. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఏదెను వనములో ఆదాము, హవ్వలు ఎంతో సంతోషముగా ఉన్నారు. అయితే సాతాను చెప్పిన అబద్దం వారు నమ్మారు. వారు ఒక illusion లోకి వెళ్లిపోయారు. అంటే ఒక అభూత కల్పనను వారు నమ్మారు. మీరు కూడా దేవుని వలె మారిపోతారు. ఈ కాయ తినండి అని సాతాను వారికి అబద్దం చెప్పాడు. వారు దానిని తిని పతనం చెందారు. సాతాను వారి చుట్టూ ఒక illusion సృష్టించాడు. అప్పుడు వారు రియాలిటీ మరచిపోయారు. దేవుడు మనలను రియాలిటీ వైపు నడిపిస్తే సాతాను మనలను అబద్దాల వైపు నడిపిస్తాడు. 

   ఛాయా లోకములో మనం జీవించకూడదు. అది షాడో వరల్డ్. అందులో మనం జీవించకూడదు. నిజ స్వరూపం క్రీస్తులో వుంది. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. 

ధర్మ శాస్త్రం ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

ప్రవక్తలు ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

ప్రత్యక్ష గుడారం ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

అందులో వారు అర్పించిన బలులు, అర్పణలు ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

పండుగలు ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

దేవాలయం ఒక ఛాయ మాత్రమే. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 

ఆ నిజ స్వరూపం తెలుసుకోవడమే జ్ఞానం. 

రెండవది Perfection and Imperfection

గ్రీకు ఫిలోసోఫేర్లు ఏమన్నారంటే, మనం చూసేవి అసంపూర్ణమైనవి. ఒక triangle మీరు చూడండి. ఒక perfect triangle కి అది ఒక అసంపూర్ణమైన ప్రతిబింబం మాత్రమే. 

పరిపూర్ణమైన triangle కి పరిపూర్ణమైన 3 కోణాలు ఉంటాయి. మనం గీచుకొనే triangle పరిపూర్ణమైనది కాదు. అది సంపూర్ణమైనది. మనం చేసే పనులు కూడా 

అసంపూర్ణమైనవే. పరిపూర్ణత యేసు క్రీస్తు నందు మాత్రమే మనకు దొరుకుతుంది. 

మనం చూపించే ప్రేమ అపరిపూర్ణమైనది. పరిపూర్ణమైన ప్రేమ క్రీస్తులో మాత్రమే 

ఉంది. మనకు ఉన్న శక్తి అపరిపూర్ణమైనది. పరిపూర్ణమైన శక్తి  క్రీస్తులో మాత్రమే 

ఉంది. మనకు ఉన్న జ్ఞానం అపరిపూర్ణమైనది. పరిపూర్ణమైన జ్ఞానం  క్రీస్తులో మాత్రమే 

ఉంది. మనకు ఉన్న సంతోషం అపరిపూర్ణమైనది. పరిపూర్ణమైన సంతోషం  క్రీస్తులో మాత్రమే ఉంది. 

ఆ విధముగా యేసు క్రీస్తు మనకు జ్ఞానం అయ్యాడు. గ్రీకులు illusion లో నుండి రియాలిటీ లోకి వెళ్ళాలి. ఇంపెర్ఫెక్షన్ లో నుండి పర్ఫెక్షన్ లోకి వెళ్ళాలి అని అనుకొన్నారు. 

వాటిని మనకు ఇచ్చేది ఇచ్చేది యేసు క్రీస్తు మాత్రమే. 

Jesus Christ is the perfection of wisdom, 

He is the perfection of all reality 

Without Jesus, you are living in illusion, 

Without Jesus, you are living in imperfection 

జ్ఞానము లేని వాడు బుద్ధిహీనుడు. బుద్ధి హీనుడు ఎలా ఉంటాడో దేవుడు తన 

వాక్యంలో వ్రాశాడు. 

 (కీర్తన 14:1) 

ఒక బుద్ధిహీనుడు దేవుడు లేడు అని తన హృదయములో అనుకొంటాడు

(1 కొరింథీ 1:18) 

ఒక బుద్ధిహీనుడు యేసు క్రీస్తు సిలువను తిరస్కరిస్తాడు 

(1 కొరింథీ 1:20) 

ఒక బుద్ధిహీనుడు ఈ లోక సంబంధమైన సంగతుల యందు అతిశయిస్తాడు 

(సామెతలు 1:7) 

బుద్ధి హీనుడు దేవుని భయం లేకుండా జీవిస్తాడు 

(సామెతలు 12:15) 

బుద్ధి హీనుడు తన దృష్టికి తానే సరియైన వాడు అనుకొంటాడు, ఎవరి సలహాలు తీసుకోడు 

(సామెతలు 14: 16) 

బుద్ధి హీనుడు విఱ్ఱ వీగుతాడు, కీడు చేస్తాడు 

(సామెతలు 24:9)

బుద్ధి హీనుని ఆలోచనలు అతని పాపం వైపు నడిపిస్తాయి 

(సామెతలు 28:26) 

బుద్ధి హీనుడు తన స్వంత మనస్సును ఆధారముగా చేసుకొంటాడు 

(సామెతలు 29:11)

బుద్ధి హీనుడు కోపము అణుచుకోలేడు 

లూకా సువార్త 12:17 లో యేసు ప్రభువు ఒక కథ చెప్పాడు. 

ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.17 అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొనినేనీలాగు చేతును;18 నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినిసమకూర్చుకొని19 నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.20 అయితే దేవుడువెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను. దేవుడు ఆ ధనవంతుని ఫూల్ అని పిలిచాడు. ఒరేయ్, బుద్ధి హీనుడా అని దేవుడు అతని పిలిచాడు. బుద్ధి హీనుడు నిత్యత్వం గురించి ఆలోచించం కుండా ఈ లోకములో పోగు చేసుకోవడమే పనిగా పెట్టుకొన్నాడు. దేవుడు అతనితో ఏమంటాడంటే, వెఱ్ఱి వాడా, ఈ రాత్రి నీ ప్రాణమునునేను అడుగుతున్నాను. నువ్వు సంపాదించింది మొత్తం ఎవరి వశం అవుతుంది? 

జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడు? 

(కీర్తన 14:1) 

జ్ఞాన వంతుడు దేవుడు ఉన్నాడు అని తన హృదయములో నమ్ముతాడు 

(1 కొరింథీ 1:18) 

జ్ఞానవంతుడు యేసు క్రీస్తు సిలువను స్వీకరిస్తాడు 

(1 కొరింథీ 1:20) 

జ్ఞానవంతుడు ఈ లోక సంబంధమైన సంగతుల యందు కాక ఆత్మ సంబంధమైన సంగతుల యందు  అతిశయిస్తాడు 

(సామెతలు 1:7) 

జ్ఞానవంతుడు దేవుని భయముతో జీవిస్తాడు 

(సామెతలు 12:15) 

జ్ఞానవంతుడు తన దృష్టికి తానే సరియైన వాడు అని అనుకోడు. విమర్శలు సహృదయముతో స్వీకరిస్తాడు 

(సామెతలు 14: 16) 

జ్ఞాన వంతుడు విఱ్ఱ వీగడు, కీడు చేయడు 

(సామెతలు 24:9)

జ్ఞానవంతుడి ఆలోచనలు అతని పరిశుద్ధత వైపు నడిపిస్తాయి. 

లూకా సువార్త 12 

జ్ఞానవంతుడు ఈ లోకములో ఆస్తిపాస్తులు కాకుండా పరలోకములో 

ఆస్తి సంపాయించుకొంటాడు. 

యేసు క్రీస్తు మనకు దేవుని జ్ఞానం. 

రెండవదిగా, 

యేసు క్రీస్తు ప్రభువు మనకు దేవుని నీతి

మన స్వంత నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉంది. అది దేవుని ఎదుట మనలను పరిపూర్ణులను చేయలేదు. నీతి ఒక ఆలోచన మాత్రమే కాదు. అది న్యాయము తో ముడిపడి ఉంది. అది చట్టం తో ముడిపడి ఉంది. మన సమాజానికి ఒక నీతి ఉంటుంది. దానిని బట్టి అది చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలు అతిక్రమిస్తే మనకు శిక్ష తప్పదు. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పగలగాలి. 

నీలో నీతి లేదు, నువ్వు ఒక  లంచగొండివి. 

నీలో నీతి లేదు, నువ్వు ఒక రేపిస్ట్ వి. 

నీలో నీతి లేదు, నువ్వు ఒక దొంగవు 

నీలో నీతి లేదు, నువ్వు ఒక నరహంతకుడవు. 

అందుకనే నిన్ను అరెస్ట్ చేశాము. అందుకనే నీ మీద కేసులు పెట్టి ఛార్జ్ షీట్ వ్రాశాము. అందుకనే నీవు కోర్ట్ కి వచ్చి న్యాయమూర్తి ముందు నిలబడాలి. విచారించబడాలి. మనం కోర్ట్ కి వెళ్లి జడ్జి ముందు నిలబడితే, ప్రాసిక్యూటర్ ఏమంటాడు? 

  యువర్ ఆనర్, ఈ నిందితుడు నిజంగానే ఈ నేరాలు చేశాడు. నేను ఈ ఆధారాలు కోర్టు ముందు పెట్టాను. ఈ ముద్దాయిని కఠినముగా శిక్షించండి అంటాడు. అప్పుడు న్యాయమూర్తి మనకు తీర్పు తీర్చి శిక్ష విధిస్తాడు. 

ఆ విధముగా 

నీతి -న్యాయం – తీర్పు : 

ఈ మూడూ కలిసి వెళ్తాయి. 

మానవ సమాజం యొక్క నీతి లో నుండే రాజ్యాంగం, చట్ట వ్యవస్థ పుడతాయి. 

దేవుని నీతి లో నుండి ధర్మశాస్త్రము, దేవుని న్యాయమైన తీర్పులు పుడతాయి. 

దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చడములో మనం విఫలం చెందాము. దేవుని న్యాయ వ్యవస్థ మనకు తీర్పు తీర్చింది. అపోస్తలులు కార్యములు 17 అధ్యాయం లో ఒక మాట చూద్దాము. 

30 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. 

       మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు 

ఎందుకని? 

తాను నియమించిన మనుష్యుని చేత, అంటే యేసు క్రీస్తు ప్రభువు చేత, నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. దేవుని తీర్పు వస్తుందా? దానికి ఆధారం ఏమిటి? మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.అవిశ్వాసులకు దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. దానికి ఆధారం ఏమిటంటే యేసు క్రీస్తు సమాధి నుండి తిరిగి లేవడమే. ఆ తీర్పు నుండి మనలను రక్షించేదెవరు? యేసు క్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆయన మనకు దేవుని నీతి అయ్యాడు. 

విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై 

క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు.

                         రోమా 10:4 

దేవుని ధర్మశాస్త్రం మనకు నీతి ని ఇవ్వలేదు (గలతీ 2:21) 

దేవుని ధర్మశాస్త్రము సంతృప్తి చెందాలి. లేకపోతే మనకు నీతి కలుగదు. 

దేవుని ధర్మశాస్త్రము సమాప్తి చెందాలి. లేకపోతే మనకు నీతి కలుగదు. దేవుని నీతి లో నుండి వచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన ఒక్కడు మాత్రమే పరిపూర్ణముగా నెరవేర్చగలిగిన వాడు ఎందుకంటే ఆయనే దేవుని నీతి. 

ప్రకటన 19:11 11 మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

హల్లెలూయా. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రము నకు సమాప్తియై ఉన్నాడు. 

2 కొరింథీ 5:21 కూడా చూడండి. 

ఎందుకనగా మనమాయనయందు

దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.

                 2 కొరింథీ 5:21

మనలను ఎదుట నీతి మంతులుగా చేయడానికి పాపము లేని మన రక్షకుడు పాపముగా చేయబడ్డాడు. మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడ్డాడు. మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా 4:25. యేసు క్రీస్తు మనకు దేవుని నీతి. అది ఉచితముగా మనకు అందించబడింది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.రోమా 3:24

Leave a Reply