‘క్రీస్తు కోసం మీ హృదయం’: రెండవ భాగం

ఈ రోజు ‘క్రీస్తు కోసం మీ హృదయం’ అనే సందేశములో రెండవ భాగం మీకు అందించాలని నేను ఆశపడుచున్నాను. బైబిల్ గ్రంథం హృదయం గురించి అనేక సత్యాలు మనకు తెలియజేస్తున్నది.మొదటి భాగములో దేవుడు మానవ హృదయాన్ని ప్రత్యేకముగా సృష్టించాడు అని మనం చూశాము. అయితే, పాపము మన హృదయములో ప్రవేశించి మనలను అపవిత్రం చేసింది. ఇప్పుడు మనము రక్షణ పొందాలంటే యేసు ప్రభువును మన హృదయములో నమ్మాలి. మన నిజాయితీ ఎలా ఉందో దేవుడు మన హృదయాలను చూసి నిర్ణయిస్తాడు. ఈ రోజు మరికొన్ని విషయాలు చూద్దాము.

Space of Submission 

మన హృదయాల్లోనే మనము దేవునికి విధేయత చూపించాలి. 

కీర్తన 119:10 లో మనము చదువుతాము: 

నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను. నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుని వెదుకుతున్నావా? నిన్న ఒక గొప్ప శాస్త్రవేత్తతో నేను మాట్లాడాను.ఆయన పేరు డాక్టర్ హ్యూగ్ రాస్. ఆయన ఖగోళ శాస్త్రవేత్త. యేసు ప్రభువును నమ్ముకొన్నాడు.యేసు ప్రభువును ఎలా తెలుసుకొన్నారు? అని నేను ఆయనను అడిగాను. ఆయన ఏమని చెప్పాడంటే, ‘నా చిన్న తనములో నక్షత్రాలను చూశాను. వాటిని గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తి కలిగింది. అంతరిక్ష శాస్త్రము చదవటం మొదలుపెట్టాను. గ్రహాలు గురించి కొంత కాలము చదివాను, బ్లాక్ హోల్ లు, ఐన్ స్టెయిన్ సాపేక్ష సిద్ధాంతము గురించి చదివాను. అప్పుడు ఈ సృష్టి కి ప్రారంభం ఉంది అని నాకు అర్థం అయింది. సృష్టికి ప్రారంభం ఉంటే సృష్టికర్త ఉండాలి అని నాకు అర్థం అయ్యింది. ఆ సృష్టికర్త ఎవరు? ఆ దేవుడు ఎవరు? అని ఆయన కోసం వెదకడం ప్రారంభించాను. మత స్థాపకులందరి గురించి తెలుసుకున్నాను. యేసు ప్రభువు నిజమైన రక్షకుడు అని తెలుసుకొని ఆయనను నమ్ముకున్నాను అని చెప్పాడు. ఈ గొప్ప శాస్త్రవేత్త తన పూర్ణ హృదయముతో దేవుని వెదికాడు, చివరకు యేసు ప్రభువును రక్షకునిగా తన హృదయములో చేర్చుకొన్నాడు. తెలుసు కొంటే సరిపోదు, మన హృదయములో ఆ సత్యానికి లోబడాలి. 

    లూకా 12:34 లో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు: 

మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే 

మీ హృదయము ఉండును.

భూలోక సంబంధమైన ధనము మనం ఆశిస్తే మన హృదయం భూలోకం వైపే చూస్తుంది. అయితే, పరలోక సంబంధమైన ధనం మనం ఆశిస్తే మన హృదయం పరలోకం వైపు చూస్తుంది. యేసు ప్రభువు తన పరిచర్యలో అనేక సార్లు అడిగిన ప్రశ్న: మీరు దేనిని వెదుకుతున్నారు? ఆయన హృదయము చూసి ఎవరి హృదయములో ఏముందో చెప్పేసే వాడు. యోహాను సువార్త 6 అధ్యాయములోచాలా మంది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. ఆయన వారితో ఒక  మాట అన్నాడు: 

యేసు మీరు సూచనలను చూచుటవలన

కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి 

పొందుటవలననే నన్ను వెదకుచున్నారని

మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.యోహాను 6:26 

    మొహమాటం లేకుండా ఆయన వారితో ఒక మాట చెప్పాడు: మీరు నా వెంట ఎందుకు తిరుగుతున్నారు? ఫుడ్ కోసం తిరుగుతున్నారు. మీకు ఆహారం పెట్టడం నాకు సమస్య కాదు. అయితే మీరు క్షయమైపోయే ఆహారం మీద మీ హృదయాన్ని పెట్టుకొన్నారు. నేను ఇచ్చే అక్షయమైన ఆహారం మీరు పొందాలి. అది పొందాలంటే మీరు మీ హృదయములో నన్ను విశ్వసించాలి. మన మన హృదయాల్లో ఆయనకు లోబడాలి అని దేవుడు కోరుకొంటున్నాడు. 

రోమా పత్రిక 6 అధ్యాయములో అపోస్తలుడైన పౌలు వ్రాశాడు.

మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. రోమా 6:17,18 

    పాపమునకు దాసులుగా ఉన్న మీకు దేవుడు తన ఉపదేశ క్రమము ను అప్పగించాడు. మీరు హృదయ పూర్వకముగా లోబడ్డారు. పాపము నుండి విమోచించబడ్డారు, నీతికి దాసులయ్యారు. ఉపదేశ క్రమము అనే మాట అక్కడ మనము చూస్తున్నాము.

Standard of Teaching 

   ఒక ఆటగాడు తన ఆటలో నైపుణ్యము సాధించాలంటే, హృదయపూర్వకముగా ఆ ఆట యొక్క రూల్స్ కి లోబడాలి, ఆ రూల్స్ ప్రకారం ప్రాక్టీస్ చేయాలి, ఆ రూల్స్ ప్రకారమే ఆడాలి.లేకపోతే తన ఆటలో అతడు విజయం సాధించలేడు. క్రైస్తవులు కూడా హృదయపూర్వకముగా దేవుడు పెట్టిన ఉపదేశ క్రమము యొక్క రూల్స్ని పాటించాలి. లేకపోతే అతనికి విజయం ఉండదు.

   దావీదు – ఆయన కుమారుడు సొలొమోను. వారి హృదయాలు ఎలా ఉన్నాయో 1 రాజులు గ్రంథము 11:4 లో మనము చూస్తాము.

    సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను. 1 రాజులు 11:4 

    దావీదు తన జీవితమంతా దేవుని మీదే తన హృదయాన్ని నిలుపుకొన్నాడు. అయితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పివేశారు.

Seed of Sensitivity 

సున్నితమైన హృదయం. 

యెహెఙ్కేలు 36:26 చూద్దాము. 

నూతన హృదయము మీ కిచ్చెదను, 

నూతన స్వభావము మీకు కలుగజేసెదను,

రాతిగుండె మీలోనుండి తీసివేసి 

మాంసపు గుండెను మీకిచ్చెదను. 

                                      యెహెఙ్కేలు 36:26 

    పాపము వలన మన హృదయాలు రాయి వలె గట్టిపడి కఠినముగా మారిపోయాయి. ఆ రాతి గుండెను నేను మార్చాలి అని దేవుడు మనతో అంటున్నాడు. చైనా దేశము చేస్తున్న అఘాయిత్యాలు ఈ వారం మనం చూసాము. విస్తీర్ణములో చైనా ప్రపంచములోనే 3 వ అతి పెద్ద దేశముగా ఉంది. అయినప్పటికీ వారికి సంతృప్తి లేదు.వారు పొరుగు దేశాలను ఆక్రమించుకొనే పనిలో పడ్డారు.భారత దేశంఒక వైపు కరోనా తో పోరాడుచూ ఉన్నది.ఇలాంటి సమయములో చైనా దురాక్రమణకు పాల్పడుతున్నది. భారత సైనికుల మీద చాలా క్రూరముగా దాడులు చేసి చంపడం మనం చూస్తున్నాము. ఆ సైనికుల కుటుంబాలలోతీరని వేదన మిగుల్చుతున్నారు. చైనా నాయకుల హృదయములలో ఉన్న దురాశ దీనికి కారణము.

    రోమా పత్రిక 2 అధ్యాయములో అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.

నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, 

అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను

సమకూర్చు కొనుచున్నావు. రోమా 2:5 

    నీ హృదయాన్ని కఠినం చేసుకొంటే దేవుని తీర్పు నీ మీదకు రావటం ఖాయం, దేవుని ఉగ్రత నీ మీదకు రావటం ఖాయం. దేవునికి దూరమయ్యేకొద్దీ మన హృదయాలు రాయి వలె కఠినముగా గట్టిపడిపోతాయి. 

     మూడు వందల సంవత్సరాల క్రితం డేనియల్ డాఫో అనే రచయిత రాబిన్సన్ క్రూసో అనే నవల వ్రాశాడు.ఈ నవలలో క్రూసో అనే వ్యక్తి ఒక ఓడలో బయలుదేరి సముద్ర ప్రయాణము చేస్తాడు. మధ్యలో ఒక దీవిలో ఆగుతాడు.ఆ దీవిలో ఆయనకు అనేక ఆదిమ జాతుల వారు కనిపిస్తారు.వారు నరమాంస భక్షులుగా జీవిస్తూ ఉంటారు. వారిని చూసి క్రూసో ఆవేదన చెందుతాడు. దేవా, ఈ నరమాంస భక్షకులను ఎలా మార్చాలి? అని ప్రార్ధన చేస్తాడు. ఆ ప్రజలకు బైబిల్ తెరచి దేవుని వాక్యం చెబుతాడు. దేవుని వాక్యము విని వారు మారు మనస్సు పొంది ఇక మనుష్యులను చంపం, నర మాంసం తినము అంటారు.నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని పొందుతారు. దేవుని వాక్యం లేకపోతే మనిషి హృదయం మారదు. కొన్ని ప్రాంతాల్లో అబార్షన్ లు చేసి, ఆ శిశువుల యొక్క శరీర భాగాలు అమ్ముతున్నారు.

    జోనాథన్ స్విఫ్ట్ అనే రచయిత గలివర్ యాత్రలు అనే నవల వ్రాశాడు. మనిషి స్వభావం మారదు అని ఆయన చమత్కారముగా ఆ నవలలు వ్రాశాడు. అందులో చిన్ని, చిన్ని వేలంత మనుష్యులు మనకు కనిపిస్తారు. నా చిన్న తనములో నేను ఆ నవలలు కొన్ని చదివాను. జోనాథన్ స్విఫ్ట్ తన పుస్తకాల్లో మనిషి హృదయం యొక్క కఠినత్వాన్ని వివరించాడు. A Modest Proposal ఒక కథలో పేద తల్లిదండ్రులు తమ పిల్లల్ని పోషించలేక వారిని ధనవంతులకు ఆహారముగా అమ్ముకొంటారు. డబ్బు కోసం ఈ  రోజు  కొన్ని అబార్షన్ సెంటర్లు పసివారి శరీర భాగాలు అమ్ముకొంటున్నాయి. 

మనిషి  యొక్క హృదయ కాఠిన్యము మనకు అక్కడ కనిపిస్తున్నది. పాపము మన హృదయాన్ని కఠినం చేస్తుంది. 

     దావీదు బెత్షెబ అనే ఒక పెళ్ళైన స్త్రీ మీద కన్ను వేస్తాడు. ఆమెను ఎలాగైనా స్వంతం చేసుకోవాలని ప్రణాళిక వేస్తాడు. తన హృదయాన్ని కఠినం చేసుకొంటాడు. ఆమె భర్తను దారుణముగా హత్య చేయిస్తాడు. ఆమెను తన ఇంటికి తెచ్చుకొంటాడు. అయితే దేవుని ఆగ్రహం దావీదు మీదకు వస్తుంది. దావీదు తన పాపాన్ని గ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకొంటాడు. 51 కీర్తనలో

విరిగి నలిగిన హృదయమును 

నీవు అలక్ష్యము చేయవు అని వ్రాశాడు.

    దేవుడు ఆయన పాపాన్ని ఆయనకు చూపించి నప్పుడు, ఆయన హృదయం విరిగింది. ఆయన హృదయం నలిగింది. 

A Seed of Sensitivity 

నీ హృదయం రాయి వలె గట్టిపడి పోయింది. నేను దానిని మార్చాలి, యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకో, నీ అతిక్రమములు ఒప్పుకో, అప్పుడు నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను అని దేవుడు మనతో అంటున్నాడు.

A Spring of Sanctification 

మన హృదయములో పరిశుద్ధత ఈ ప్రపంచానికి పరిశుద్ధత అంటే ఇష్టము ఉండదు.

మనలో నుండి వచ్చేవి మన హృదయ స్థితి మీద ఆధారపడి ఉంటాయి. లూకాసువార్త 6:45 లూకా సువార్తలో యేసు ప్రభువు ఒక మాట అంటాడు.

45. సజ్జనుడు, తన హృద యమను మంచి ధననిధి లోనుండి సద్విషయములను 

బయ టికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయ ములను బయటికి తెచ్చును. హృదయము 

నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.

    హృదయము రెండు రకాలుగా ఉంది. మంచి ధననిధి, చెడ్డ ధననిధి ఇవి రెండు నిధులు. మనము మంచివి వాటిలో పెడితే మంచి విషయాలు అందులో చేరుతాయి, మనము చెడువి వాటిలో పెడితే చెడు విషయాలు అందులో చేరుతాయి. దేవునికి దూరముగా వెళ్లిపోయే వ్యక్తిలో పరిశుద్ధత ఉండదు. 

     రోమా పత్రిక మొదటి అధ్యాయములో మనము చదువుతాము: 

22. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని 

చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

24. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.

    బాలీవుడ్ లో జావేద్ అక్తర్ అని ఒక మాటల రచయిత ఉన్నాడు. ఈయన ఒక నాస్తికుడు. దేవుడు మనకు అక్కరలేదు అని ఈయన ప్రచారము చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో రిచర్డ్ డాకిన్స్ అవార్డు వచ్చింది. ఈ రిచర్డ్ డాకిన్స్ కూడా ఒక నాస్తికుడే. వీరు అవార్డులు తీసుకొని ఇంకా రెచ్చిపోతున్నారు. మేము వివేకవంతులము, మేముజ్ఞానులము, మాకు దేవుడు అక్కరలేదు అని వీరు అంటున్నారు. దేవుడు వారి గురించి యేమని చెబుతున్నాడంటే, 

22. వారి అవివేకహృదయము అంధ కారమయ మాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.వారి హృదయాలు అంధకారముతో నిండుకొన్న తరువాత వారు అక్కడితో ఆగిపోరు. 

24 వచనము: 

వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను

పరస్పరము అవమాన పరచుకొనునట్లు

దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.

     మన హృదయము అపవిత్రం అయిపోయిన తరువాత మన శరీరం కూడా అపవిత్రం అయిపోతుంది. నాస్తికులు పెరిగేకొద్దీ సినిమాల్లో అశ్లీలత పెరిగిపోవడం మనం చూస్తున్నాము. ఈ మధ్యలో OTT ప్లాటుఫార్మ్ లని వచ్చినాయి. వీటిలో వెబ్ సిరీస్ ప్రసారం చేస్తున్నారు. ఆ సినిమాల్లో, సీరియల్ లలో పచ్చి బూతులు తిట్టుకొంటున్నారు, బూతులు, హింస లతో వాటిని నింపివేశారు. అనుష్క శర్మ అనే బాలీవుడ్ నటి  పాతాళ లోకము అనే వెబ్ సిరీస్ నిర్మించింది. అందులో రౌడీలకు, గుండాలకు, వేశ్యలకు, వ్యభిచారులకు క్రైస్తవ పేరులు పెట్టారు. గుండాలకు జాన్, జోసెఫ్ అని, వేశ్యలకు, వ్యభిచారులకు మేరీ, సారా అని పేరులు పెట్టారు. క్రైస్తవులను నెగటివ్ గా చూపించడం వీరు మానుకోలేదు. అది మంచి పద్దతి కాదు. పాతాళ లోకము అని దానికి పేరు పెట్టుకొన్నారు. నరక మార్గములో ఉన్న వారికి అలాంటి ఆలోచనలే వస్తాయి. ఈ మధ్యలో ఒక బాలీవుడ్ నటుడు ఆత్మ హత్య చేసుకొన్నాడు. అతనికి మనశాంతి లేదు. పబ్లిసిటీ ఉంది, పాపులారిటీ ఉంది, గ్లామర్ ఉంది, డబ్బు ఉంది, అయితే మనశాంతి లేదు. అక్కడ జీవం లేదు. క్రైస్తవ యువతీ యువకులు వాటికి దూరముగా ఉండాలి. 

10. దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము అని దావీదు 51 వ కీర్తనలో ప్రార్థన చేశాడు.

పరిశుద్ధమైన హృదయం నాకు ఇవ్వు అని దావీదు ప్రార్థన చేశాడు. 

యేసు ప్రభువు మనతో చెప్పాడు: 

హృదయశుద్ధిగలవారు ధన్యులు

వారు దేవుని చూచెదరు.

                     మత్తయి 5:8 

Blessed are the pure in heart, 

for they shall see

దేవుని చూడాలంటే హృదయ శుద్ధి ఉండాలి. ఐగుప్తు దేశములో పోతీఫరు భార్య యోసేపును పాడు చేయాలని చూసింది. అయితే యోసేపు ఆమె యొక్క శోధనలను తట్టుకొన్నాడు. ఇంగ్లీష్ రచయిత శామ్యూల్ రిచర్డ్ సన్ ‘క్లారిస్సా’ అనే నవల వ్రాశాడు. అందులో క్లారిస్సా అనే యువతి మంచి జీవితము జీవిస్తూ ఉంటుంది. రాబర్ట్ అనే యువకుడు ఆమె మీద కన్ను వేస్తాడు. క్లారిస్సా ని ఎలాగైనా పాడు చేయాలని రాబర్ట్ నిర్ణయించుకొంటాడు.ప్రేమ పేరుతో ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి లొంగ దీసుకోవాలని చూస్తాడు.రాబర్ట్ హృదయము లో ఉన్న పాపపు ఉద్దేశ్యాలను క్లారిస్సా గ్రహిస్తుంది. రాబర్ట్ చెప్పే మాయమాటలకు లొంగకుండా తనను తాను కాపాడుకొంటుంది.మన సమాజములో రాబర్ట్ లాంటి మగవాళ్ళు ఉన్నారు. పోతీఫరు భార్య లాంటి మహిళలు కూడా ఉన్నారు. ఎవరిని పాడు చేద్దామా అనే పాపపు ఉద్దేశాలతో వీరు తిరుగుతూ ఉంటారు. అయితే యోసేపును చూడండి. పోతీఫరు భార్య చెప్పే మాయ మాటలకు ఆయన  లొంగలేదు.ఆమె యొక్క పాపపు ఉద్దేశాలు యోసేపు గ్రహించాడు. ఆమెకు దూరముగా ఉండి తన హృదయమును పరిశుద్ధముగా ఉంచుకొన్నాడు.

ఆదికాండము 49:22 లో మనం చదువుతాము: 

యోసేపు ఫలించెడి కొమ్మ ఊట 

యొద్ద ఫలించెడి

కొమ్మ దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.

    పరిశుద్ధత అనే ఊటలో యోసేపు జీవితం ఒక అందమైన చెట్టు వలె ఎదిగింది. 

ఆయన ఒక Spring of Sanctification 

ఆ తరువాత హృదయం: A Seal of Security 

మీ హృదయములో పరిశుద్ధపు ఊటలు ఫలించాలంటే మీరు ఆ ఊటను మీరు

భద్రపరచుకోవాలి. A Spring of Sanctification కావాలంటే మీ హృదయానికి A Seal of Security కావాలి. సామెతలు గ్రంథం 4:23 లో మనం

చదువుతాము: 

నీ హృదయములోనుండి జీవధారలు 

బయలుదేరును కాబట్టి అన్నిటికంటె

ముఖ్యముగా నీ హృదయమును

భద్రముగా కాపాడుకొనుము

మన హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి. భౌతికముగా, ఆత్మ సంభందముగా రెండు విషయాల్లో ఇది సత్యమే. మన భౌతిక శరీరం అవసరాలకు కావలసిన రక్త ప్రసరణ మొత్తము గుండె నుండే మొదలవుతుంది. మన ఆత్మకు 

కావలసిన జీవధారలు కూడా మన హృదయములోనే బయలుదేరతాయి. అందుకనే, అన్నిటి కంటే ముఖ్యముగా, భద్రముగా నీ హృదయాన్ని కాపాడుకో అంటున్నాడు. 

ఇది ఎలా సాధ్యపడుతుంది? 

ద్వితీయోప 6:6-7 6. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.

వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.యిర్మీయా 31:33 

కీర్తన 119:11 లో మనము చదువుతాము: 

కీర్తన 119:11. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొన్నాను. అది నన్ను పాపము నుండి కాపాడుతున్నది అని కీర్తనా కారుడు అంటున్నాడు.మన హృదయాలను పరీక్షించి, శోధించే శక్తి దేవుని వాక్యమునకు ఉంది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4:12 లో మనము చదువుతాము.

హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము

సజీవమై బలముగలదై 

రెండంచులుగల యెటువంటి 

ఖడ్గముకంటెను వాడిగా ఉండి,

ప్రాణాత్మలను కీళ్లను మూలుగను 

విభజించునంతమట్టుకు దూరుచు,

హృదయముయొక్క 

తలంపులను ఆలోచనలను

 శోధించుచున్నది.

దేవుని వాక్యానికి అటువంటి శక్తి వుంది.అది నిత్యము మన హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను అది పరీక్షించి, శోధిస్తుంది.ప్రతి విశ్వాసి తన హృదయాన్ని ఆ విధముగా భద్రము చేసుకోవాలి. ఈ రోజు మనకు అనేక బాధ్యతలు, ఆకర్షణలు మన చుట్టూ ఉన్నాయి.ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రమ్, వాట్స్ యాప్,టీవీ ఛానెళ్లు అనేక ఆకర్షణలు మన చుట్టూ ఉన్నాయి. అయితే మనం ప్రతి రోజూ కొంతసేపు దేవుని వాక్యం చదవాలి.నేను ప్రతి రోజు ఒక అధ్యాయం బైబిల్ చదువుతాను.ఒక సమయం పెట్టుకొన్నాను. ఆ సమయములో బైబిల్ చదువుతాను.దానియేలు 1:8 లో మనము చదువుతాము.దానియేలు బబులోను ఆచారాలతో తనను అపవిత్రం చేసుకోకూడదు అని తన హృదయములో నిర్ణయించుకున్నాడు.

2 తిమోతి 2:22. నీవు ¸యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.

మాకిన్ టాష్ భక్తుడు ఒక మాట అన్నాడు: 

“The Knowledge of God is

 everything;

 it quickens the soul; 

purifies the heart;

 tranquilizes the conscience; 

elevates the affections; 

sanctifies the entire character

 and conduct” C.H.Mackintosh

దేవుని జ్ఞానము అన్నిటి కంటే ముఖ్యమైనది.

అది మన ఆత్మను ప్రేరేపిస్తుంది, 

హృదయాన్ని పవిత్రపరుస్తుంది

మనస్సాక్షిని మేల్కొలుపుతుంది

కోరికలను శుద్ధి చేస్తుంది

మన వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను 

కడిగివేస్తుంది.

అటువంటి హృదయము క్రీస్తు కొరకు మనము కలిగి యుందము గాక!