వివాహము అంటే ఏమిటి?

man and woman holding hands walking on seashore during sunrise

వివాహము అన్ని విషయములలో ఘనమైనది (హెబ్రీ 13:4)

మొదటి వివాహం దేవుడే చేసాడు (ఆదికాండము 2:22)

వివాహము ఒక అద్వితీయ ప్రేమ బంధం (పరమ గీతం 4:10)

ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు (1 కొరింథీ 11:11)

ప్రతి పురుషుడు ఒక్క స్త్రీనే పెండ్లి చేసుకోవాలి (1 తిమోతి 3:2)

పురుషుడు, స్త్రీ వివాహము వరకు తమ కన్యాత్వము కాపాడుకోవాలి (లేవీయ 21:13)

పురుషుడు, స్త్రీ వివాహములో ఏక శరీరం అవుతారు (ఆదికాండము 2:24)

వివాహ బంధము పురుషుడు, స్త్రీ ల మధ్య జరిగేది. పురుషుడు-పురుషుడు, స్త్రీ-స్త్రీ ల మధ్య జరిగేది కాదు. (మార్కు 10:6)

క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు, భర్త భార్యను ప్రేమించాలి (ఎఫెసీ 5:25)

భార్య భర్తకు విధేయురాలై ఉండాలి (ఎఫెసీ 5:22; 1 పేతురు 3:1)

క్రొత్తగా పెళ్ళైన వారికి ఒక సంవత్సరం ఆటవిడుపు ఇవ్వాలి (ద్వితీయోప 24:5)

భార్య, భర్తలను దేవుడు జతపరుస్తాడు, మనుష్యులు వారిని వేరు చేయకూడదు (మత్తయి 19:4-6)

లైంగిక సంభందాలు భార్య,భర్తల మధ్య మాత్రమే ఉండాలి (1 కొరింథీ 7:2; హెబ్రీ 13:4; రోమా 7:1-3)

వివాహము యొక్క ఒక ఉద్దేశ్యం సంతాన ప్రాప్తి (కీర్తన 128:3)

అవిశ్వాసిని పెండ్లి చేసుకోకూడదు (2 కొరింథీ 6:14)

భర్త భార్యను సన్మానించాలి, గౌరవించాలి (1 పేతురు 3:7)

భార్య భర్తలు పోట్లాడుకోవటం మంచిది కాదు (సామెతలు 21:9)

పురుషుడు తన భార్య లో సంతోషించాలి, తృప్తి పొందాలి, ఆమె ప్రేమకు బద్ధుడై ఉండాలి (సామెతలు 5:18-20)

మంచి భార్య భర్తకు కిరీటం, చెడు భార్య అతనికి కీడు (సామెతలు 12:4)

భార్య దేవుని అనుగ్రహము వలన కలిగిన మేలు (సామెతలు 18:22)

సుబుద్ధి గల భార్య దేవుడు ఇచ్చే కానుక (సామెతలు 19:14)

గుణవతియైన భార్య ముత్యముకంటె అమూల్యమైనది. (సామెతలు 31:10)

భార్య భర్తలు సుఖదుఃఖ ములయందు ఒకరికి ఒకరు అండగా ఉండాలి (1 పేతురు 3:8)

భర్త తన భార్యను పరిత్యజింప కూడదు(1 కొరింథీ 7:11)

భార్య భర్తను ఎడబాయకూడదు (1 కొరింథీ 7:10)

తన భార్యను విడనాడు వాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు (మత్తయి 5:32)

భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును (1 కొరింథీ 7:39)

భర్త మృతిపొందిన భార్య తన కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండును (1 కొరింథీ 7:39; రోమా 7:1-3)

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply