సాతాను ఎవరు? Who is Satan

సాతాను గురించి మనం తెలుసుకొనవలసిన సత్యాలు

-ఆదియందు దేవదూతలుగా ఉన్న సాతానుడు, అతని అనుచరులు దేవునికి విరోధముగా పాపము చేసి పతనం చెందారు (2 పేతురు 2:4)

-గర్వమే సాతాను పడిపోవుటకు దారితీసింది (యెషయా 14:12-15; యెహెఙ్కేలు 28:1-26)

-ఆది దంపతులు ఆదాము, హవ్వలను మోసం చేసింది సాతానుడే (ఆదికాండము 3:1)

-సాతాను ఆది నుండి నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు (యోహాను 8:44)

-సాతాను సర్వలోకమును మోసము చేయుచున్న ఆది మహా ఘట సర్పము (ప్రకటన 12:9)

-అతను వాయుమండల సంబంధమైన అధిపతి (ఎఫెసీ 2:2)

-దేవ దూతలతో పోట్లాడే అలవాటు సాతానుకి ఉంది (యూదా 1:6-9)

-ఈ యుగ సంబంధమైన దేవతగా, లోకాధికారిగా అవిశ్వాసుల మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తాడు (2 కొరింథీ 4:4; యోహాను 12:31)

-హవ్వను మోసం చేసిన సాతానుడే నేటికి మనుష్యులను మోసం చేస్తున్నాడు (2 కొరింథీ 11:3)

-ఈ లోకము సాతాను వశములో ఉన్నది (1 యోహాను 5:19)

-సాతాను దొంగతనాలు, హత్యలు, నాశనములు చేసేవాడు (మత్తయి 13:19; యోహాను 10:10)

-సాతాను మరణము యొక్క బలము గలవాడు (హెబ్రీ 2:14-15)

-సాతాను కోసమే నిత్యాగ్నినరకం సిద్ధం చేయబడింది (మత్తయి 25:41)

-సాతాను క్రియలు లయపరచుటకే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు (1 యోహాను 3:8)

-సాతాను చేత పీడింపబడేవారికి విముక్తి ఇవ్వటానికి యేసు క్రీస్తు వచ్చాడు (అపొస్తలుల 10:38)

-యేసు క్రీస్తును సిలువ వేయించటానికి సాతాను యూదా ఇస్కరియోతును ప్రేరేపించాడు (లూకా 22:1-6)

-యేసు క్రీస్తు కాళ్ళ క్రింద త్రొక్క బడిన సాతాను విశ్వాసుల కాళ్ళ క్రింద కూడా చితుక త్రొక్కించబడతాడు (రోమా 16:20)

-సాతాను వెలుగు దూత వేషం ధరించుకొని అనేక మందిని మోసం చేయుచున్నాడు (2 కొరింథీ 11:14)

-క్రైస్తవ సంఘములోనికి సాతాను తన అనుచరులను పంపిస్తాడు (ప్రకటన 2:9; 1 తిమోతి 1:20; 5:15)

-ఎదిరిస్తే సాతాను మన యొద్ద నుండి పారిపోతాడు (యాకోబు 4:7)

-సాతానుకు చోటియ్యకుండా వాని తంత్రములను ఎదిరించుటకు దేవుడు ఇచ్చే సర్వాంగకవచము ధరించుకోవాలి (ఎఫెసీ 4:27; 6:10)

-మనము దేవుని ప్రణాళికకు అడ్డువస్తే సాతాను పని చేస్తున్నట్లే (మత్తయి 16:23)

-సాతాను దేవుని పిల్లలను కూడా చెడు కార్యములకు ప్రోత్సహించే అవకాశం ఉంది (1 దినవృ 21:1; 1 కొరింథీ 7:5; అపో.కార్య 5:3)

-దేవుని పిల్లలను మోసపరచుటకు సాతాను ఎప్పుడూ తంత్రములు రచిస్తూనే ఉంటాడు (2 కొరింథీ 2:5-11)

-సాతాను ఎవరిని మ్రింగుదునా అని ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాడు గనుక మనం మెలకువగా ఉండాలి (1 పేతురు 5:8; యోబు 1:7)

-దేవుని పిల్లలు సాతాను తో సహవాసం, సంబంధం పెట్టుకోకూడదు (2 కొరింథీ 6:15)

-దేవుని పిల్లలకు అభ్యంతరాలు కలుగజేస్తాడు (1 థెస్స 2:18)

-దేవుని పిల్లల మీద నెపములు మోపుతాడు (జెకర్యా 3:1-5; యోబు 2:4-5)

-దేవుని పిల్లలను శ్రమ పెట్టగలడు (ప్రకటన 2:10)

-దేవుని భక్తులు సాతాను దూతల వలన శ్రమలకు గురి కావచ్చును (2 కొరింథీ 12: 1-10)

-సాతాను బలము మీద దేవుని పిల్లలకు అధికారము ఇవ్వబడింది (లూకా 10:19)

-విశ్వాసులు చేసే అసలు యుద్ధం సాతాను యొక్క అదృశ్యమైన దురాత్మల సమూహములతోనే (ఎఫెసీ 6:12)

-రాబోయే ధర్మ విరోధి సాతానుని చేత ప్రేరేపించబడి, బలపరచబడుతాడు (2 థెస్స 2;8-12)

-నశించుచున్న వారిలో సాతాను తన బలమును చూపిస్తాడు (2 థెస్స 2:10)

-ప్రపంచపు ఆఖరి మహా యుద్ధం కోసం ఇహ లోక సైన్యాలను దేవునికి వ్యతిరేకముగా కూడగడతాడు; కానీ యేసు క్రీస్తు ప్రభువు చేతిలో ఓడిపోతాడు (ప్రకటన 20:7-10)  

-సాతానుని తుది స్థానము: అగ్ని గంధకములతో మండు నిత్యాగ్నిగుండము (ప్రకటన 20:10)

One thought

  1. Praise the Lord Brother, సాతాను గూర్చి చక్కని వివరణ ఇచ్చారు.దేవునికే మహిమ.

Leave a Reply