బాబూ గోగినేని, రాధా మనోహర్ దాస్, కరుణా కర్ సుగ్గున: బైబిల్ సైన్స్ కి వ్యతిరేకమా? 

 ప్రేమ సందేశం వీక్షిస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరందరూ దేవుని కృప యందు క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాము. బైబిల్ స్టడీ చేసే వారు మా వెబ్ సైట్ దర్శించండి. www.doctorpaul.org మా వెబ్ సైట్ లో మీరు నేను వ్రాసే బైబిల్ కామెంటరీ ఎప్పటికప్పుడు చదువవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరముగా ఉంటే దీని బ్రాడ్ కాస్టింగ్ కి సహకరించండి. ఇప్పటికే మాకు సహాయం చేస్తున్నవారికి మా హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించాలని మా ప్రార్ధన. 

    మా యూట్యూబ్ ఛానల్ విసిట్ చేయండి. మా సందేశాలు మీరు ఈ ఛానల్ లో వినవచ్చు. మా ఛానల్ లో మెంబెర్ గా చేరి మా మినిస్ట్రీ ని సపోర్ట్ చేయండి. మీరు మెంబెర్స్ ఓన్లీ సందేశాలు కూడా మా యూట్యూబ్ ఛానల్ లో చూడవచ్చు. 

    విమర్శకులకు జవాబులు అనే శీర్షిక మనం చూస్తున్నాము. క్రైస్తవ్యాన్ని విమర్శించే వారు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు ఈ రోజు చూద్దాము. 

ఈ రోజు ప్రశ్న: బైబిల్ సైన్స్ కి వ్యతిరేకమా? 

   చాలా మంచి ప్రశ్న. బాబూ గోగినేని, రాధా మనోహర్ దాస్, కరుణా కర్ సుగ్గున – వీరు చేసే విమర్శ ఏమిటంటే బైబిల్ సైన్స్ కి వ్యతిరేకం. ఈ ముగ్గురికీ కలిపి ఈ  ప్రశ్నకు సమాధానం ఈ రోజు కార్యక్రమములో చూద్దాము. 

   అమెరికా లో సామ్ హర్రీస్ అని ఒక నాస్తికుడు ఉన్నాడు. ఆయన The End of Faith అని ఒక పుస్తకం వ్రాశాడు. అంటే క్రైస్తవ్యం ముగింపు లేక క్రైస్తవ్యం సమాప్తం. క్రైస్తవ్యం సైన్స్ కి వ్యతిరేకం, రీసన్ కి వ్యతిరేకం, ఈ మతం త్వరలో కనుమరుగవుతుంది అని సామ్ హార్రీస్ ఈ పుస్తకములో వ్రాశాడు. ఆయన పుస్తకాలు చదివి మన తెలుగు వారు అదే ఆర్గుమెంట్స్ మనకు చెబుతున్నారు. ఇంగ్లీష్ సినిమాలు చూసి మన వారు తెలుగు లో సినిమాలు చేసినట్లుగా, వీరు కూడా ఇంగ్లీష్ పుస్తకాలు చదివి అవే ఆర్గుమెంట్స్ తెలుగు లో కూడా చేస్తున్నారు. సామ్ హర్రీస్ వ్రాసిన పుస్తకాలను కంచ ఐలయ్య గారు తెలుగు లో అనువాదం చేసి పబ్లిష్ చేస్తున్నాడు. 

    అయితే, ఇంగ్లీష్ పుస్తకాలు చదివారా లేక తెలుగు పుస్తకాలు చదివారా అని కాదు. వీరి ఆర్గుమెంట్స్ లో పస ఉందా? అనే విషయం మనం చూడాలి. వీరి విమర్శలు కొత్త వేమీ కాదు. వీరు డేవిడ్ హ్యూమ్ అనే నాస్తికుడు 250 సంవత్సరాల క్రితం చేసిన వాదనలే తిరిగి మనకు వినిపిస్తున్నారు. డేవిడ్ హ్యూమ్ 1711 – 1776 సంవత్సరముల మధ్య స్కాట్లాండ్ దేశములో జీవించాడు. ఆయన సర్ ఐజాక్ న్యూటన్ వ్రాసిన భౌతిక నియమాల వలన బాగా ప్రభావితం అయ్యాడు. 

       న్యూటన్ చెట్టు మీద నుండి ఒక కాయ క్రింద పడడం చూశాడు. ఈ కాయ ఎందుకు క్రింద పడింది? పైకి ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించాడు. ఎందుకంటే గ్రావిటీ వలన. గ్రావిటీ లేక గురుత్వాకర్షణ వలెనే అది సాధ్యపడింది. అదే గ్రావిటీ విశ్వం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. మన యూనివర్స్ లో ప్రతిదీ ఒక దాని కొకటి గ్రావిటీ శక్తి తో ఆకర్షించ బడుతూ ఉంటాయి. ఆ విషయములో  నీ చేతిలో ఉన్న ఆపిల్ కాయకు, చంద్రునికి తేడా ఏమీ లేదు అన్నాడు. ఆపిల్ కాయను ఆకర్షించే భూమే, చంద్రుని కూడా ఆకర్షిస్తుంది అన్నాడు. అది గొప్ప సంచలనం. ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. న్యూటన్ మూడు గొప్ప భౌతిక నియమాలను కూడా వ్రాశాడు. వీటిని న్యూటన్ మూడు నియమాలు అని పిలుస్తున్నాము. ఇవి ప్రపంచ గమనాన్ని పూర్తిగా మార్చివేశాయి. 

     న్యూటన్ సైన్స్ పరిశోధనలు చేసి దేవుని స్తుతించాడు. నిజంగా దేవుడు యెంత గొప్ప వాడు! ఎంత గొప్ప జ్ఞానముతో ఈ యూనివర్స్ ని దేవుడు సృష్టించాడు అని చెప్పి న్యూటన్ దేవుని ఆరాధించాడు. ఒక వైపు సైన్స్ మీద ఎంత సమయం వెచ్చించాడో బైబిల్ ని స్టడీ చేయడానికి కూడా అంతే సమయం వెచ్చించాడు. 

      న్యూటన్ కోట్లాది మందికి అభిమాన సైంటిస్ట్ అయ్యాడు. అంత వరకు బాగానే ఉంది. అయితే కొంత మందికి అభిమానం వెఱ్ఱితనముగా మారింది. వీరు ఏమన్నారంటే, మాకు దేవుడు లేడు, న్యూటన్ మాకు దేవుడు. న్యూటన్ మొత్తుకొనేవాడు. నేను కూడా మానవుణ్ణే. నన్ను మ్రొక్కకండి. దేవుని వైపు చూడండి అనే వాడు. అయితే వీరు మాత్రం న్యూటన్ ని దేవుని గా మార్చారు. గొప్ప వ్యక్తులను అభిమానించడం లో తప్పు లేదు, అయితే వారిని ఆరాధించకూడదు. కొంతమంది కి ఈ అవగాహన లేదు. ‘మాకు దేవుడు లేడు, మీరే మాకు దేవుడు’ సైంటిస్టులను ఆరాధించే వారు ఉన్నారు. 

    ఇంకా కొంతమంది ప్రకృతి మాకు దేవుడు. ప్రకృతి నియమాలే మాకు దేవుడు అన్నారు. వారిలో ఒకడే ఈ డేవిడ్ హ్యూమ్. హ్యూమ్ ఏమన్నాడంటే, ‘ప్రకృతి నియమాలు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. వాటిని ఉల్లంఘించడం ఎవరి తరం కాదు. దేవుడు కూడా వాటిని అధికమించలేడు. బైబిల్ లో ఉన్న అద్భుతాలు ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తాయి కాబట్టి అవి జరిగి ఉండవు. అవి కట్టుకథలే. వాటిని వ్రాసిన వారు కూడా అబద్ధికులే. జ్ఞానం లేని వారు మాత్రమే ఆ కథలు నమ్ముతారు’ అన్నాడు. 

     పియర్ సిమోన్ లప్లస్ అనే సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, యూనివర్స్ భౌతిక నియమాలకు లోబడి ఉండాల్సిందే. ప్రతి అణువు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఈ నియమాలు శాసిస్తాయి. దీనిని బట్టి ఈ విశ్వం ఒక డిటర్మినిస్టిక్ యూనివర్స్ అన్నాడు. అంటే ప్రతి అణువూ, ప్రతి వస్తువూ నిర్దేశించ బడ్డాయి. వంద సంవత్సరముల క్రితం ఆ ఆటం ఎక్కడ వుందో మనం చెప్పవచ్చు. ఇంకో కోటి సంవత్సరముల తరువాత కూడా ఆ ఆటం ఎక్కడ ఉంటుందో మనం చెప్పవచ్చు అన్నాడు. దీనిని లప్లస్ దెయ్యం అని పిలిచారు. ఆ దెయ్యం ఆధారముగా మనం ప్రతి అణువు ఎప్పుడు, ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. దెయ్యాలు ఉన్నాయని వారు నమ్మలేదు కానీ ఆ ఆలోచనకు వారు ఆ పేరు పెట్టారు. అంటే ప్రకృతి నియమాలు ప్రతి అణువును శాసిస్తాయి, ఎవరూ వాటిని కదిపించలేరు అని దాని భావం. 

      డేవిడ్ హ్యూమ్,  పియర్ సిమోన్ లప్లస్ అన్న మాటలనే ప్రపంచ వ్యాప్తముగా ఉన్న నాస్తికులు, ఇతర మతస్తులు ఇప్పటి వరకు వల్లె వేస్తున్నారు. ఇది డిటర్మినిస్టిక్ యూనివర్స్. ప్రతి ఆటం భౌతిక నియమాల క్రింద ఉండాల్సిందే. దేవుడు కూడా దేనినీ కదిపించలేడు అని వీరు వాదిస్తూ ఉంటారు. 

   అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే, న్యూటన్ చెప్పినట్లు, దేవుడు ప్రకృతికన్నా పైనున్న వాడు. ఆయన ప్రకృతి నియమాలను సృష్టించిన వాడు. వాటిని కాసేపు ప్రక్కన పెట్టి తన కార్యములను ఈ లోకములో చేయడం దేవునికి చాలా తేలికైన పని. నేను పెట్టిన రూల్స్ ని నేను కాసేపు ప్రక్కన పెట్ట లేనా? 

    రెండోది, ప్రకృతి నియమాలు ఉల్లంఘించలేనివి కావు. న్యూటన్ జీవించిన కాలములో ఫిసికల్ లాస్ లేక భౌతిక నియమాలు అబ్సొల్యూట్, అవి ఎవరూ అతిక్రమించలేనివి, అవి ఎప్పుడూ, అన్నిచోట్లా ఒకే రకముగా ప్రవర్తిస్తాయి అనే ఆలోచన ఉండేది. 

    అయితే 20 శతాబ్దములో క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిన తరువాత భౌతిక నియమాల గురించి మన దృక్పథం మారింది. రెండు క్రొత్త సైంటిఫిక్ ఆలోచనలు క్వాంటమ్ ఫిజిక్స్ వలన ప్రపంచం తెలుసుకొంది. ఒకటి, భౌతిక నియమాలు మన ప్రపంచానికి ఒక ఆర్డర్ ని ఇచ్చాయి, అయినప్పటికీ అవి ఎట్టి పరిస్థితులలో, అన్ని ప్రదేశాలలో ఒకేలా ఉంటాయి అని మనం చెప్పలేము. రెండోది ఈ ప్రపంచము ఖచ్చితముగా డిటర్మినిస్టిక్ యూనివర్స్ అని మనం చెప్పలేము. 

ప్రతి భౌతిక నియమానికి మూడు ముఖ్య లక్షణాలు ఉంటాయి. 

Symmetry 

Information 

Probability 

   ఇక్కడ మూడో లక్షణాన్ని మనం గమనించాలి. అది Probability. అంటే ఖచ్చితముగా అని చెప్పలేము. అది జరగ వచ్చు, జరుగక పోవచ్చు. ఖచ్చితముగా ఇలానే జరుగుతుంది అని చెప్పలేము. భౌతిక నియమాలు అబ్సొల్యూట్ లాస్ అని మనం అనుకోకూడదు. కొన్ని పరిస్థితుల్లో వాటి ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, థెర్మోడైనమిక్స్ లాస్ గురించి మనం ఆలోచిస్తే అవి కూడా ప్రాబబిలిటీ లేక ఛాన్స్ మీద ఆధార పడి పనిచేయాల్సిందే. దేవుడు కూడా కదిపించలేని స్థిరత్వం వాటిలో ఉంది అని మనం అనుకోకూడదు. 

   క్వాంటమ్ ఫిజిక్స్ లో హైసెన్బర్గ్ అన్సర్టైన్టీ  ప్రిన్సిపుల్ Heisenberg Uncertainty Principle అని ఒకటి ఉంటుంది. దీని ప్రకారం ఒక కణం తరంగముల రూపములో ప్రయాణిస్తుంది. ఆ తరంగములో అది ఎక్కడైనా ఉండొచ్చు. ఈ క్షణం, ఇది ఇక్కడ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేము. Heisenberg uncertainty principle. ఆ పేరు లోనే ఆ భావం ఉంది. uncertainty. అంటే ఖచ్చితంగా చెప్పలేము. 

      Schrodinger’s Wave Equation కూడా చూడండి. 

   ఒక కణం ఎక్కడ ఉంటుందో దాని తరంగ స్వభావం, సైజు ను బట్టి మనం ఒక అంచనా వేయవచ్చు అని ఈ ఈక్వేషాన్ బట్టి మనం అంచనా వేయవచ్చు. శ్రోడింగర్ ఈక్వేషాన్ మన యూనివర్స్ లోనే గొప్ప ఈక్వేషాన్ అని చెప్పవచ్చు. అది కూడా మనకు చెబుతుంది ఏమిటంటే, ఒక కణం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో మనం అంచనా మాత్రమే వేయగలం, ఖచ్చితంగా చెప్పలేము. 

      డేవిడ్ హ్యూమ్,  పియర్ సిమోన్ లప్లస్ – ఆ నాస్తికులు చెప్పినట్లుగా ప్రకృతి లేదు. ప్రకృతి నియమాలు లేవు. న్యూటన్ ఏమన్నాడు? దేవుడు ఏ విధమైన నియమాలతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడో మనం ఖచ్చితముగా చెప్పలేము. వాటిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలే తప్ప, అవి దేవుడు కూడా ఉల్లంఘించలేనంత స్థిరమైనవి అని మనం అనుకోకూడదు. 

     గత మూడు వందల సంవత్సరాలుగా సైన్స్ లో వచ్చిన ప్రగతి బైబిల్ ని దృఢ పరుస్తున్నాయి అని మనం గమనించాలి. 

డిజైన్ ఆర్గుమెంట్ 

ఆకాశములు దేవుని మహిమను 

వివరించుచున్నవి 

అంతరిక్షము ఆయన 

చేతిపనిని ప్రచురపరచుచున్నది.

                             కీర్తన 19:1 

  ఆకాశములు అంటే ఈ విశ్వం మొత్తం దేవుని మహిమను మనకు వివరిస్తున్నది. అంతరిక్షం దేవుని చేతి పనిని మనకు చూపిస్తున్నది అని బైబిల్ మనకు బోధిస్తున్నది. విలియం పేలీ (1743-1805) అని ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన ఒక మాట అన్నాడు. నువ్వు రోడ్డు మీద నడిచివెళ్తున్నావు. నీకు ఒక వాచ్ దొరికింది. ఆ వాచ్ చూసి దీని డిజైన్ చాలా బాగుంది. దీనిని ఎవరో ఒక తెలివి కలిగిన వ్యక్తి చేసి ఉంటాడు అని మీరు అనుకొంటారు. అంతే కానీ, ‘ఈ వాచ్ దానంతటికి అదే పుట్టింది, ఎవరూ దీనిని చేసి ఉండరు’ అని మీరు అనుకోరు. ఒక అందమైన వాచ్ ఒక తెలివైన డిజైనర్ కి నిదర్శనముగా ఉంటుంది అన్నాడు. 

  అయితే డేవిడ్ హ్యూమ్ విలియం పేలీ ని అపహాస్యం చేశాడు. ‘ఒరేయ్, పేలీ, ఈ ప్రపంచం నీకు అంత అందముగా కనిపిస్తుందా? ఎప్పుడన్నా హాస్పిటల్ కి వెళ్లి చూశావా? అక్కడ ఎన్ని రోగాలు, ఎంత బాధ ఉంటుందో చూశావా? ఎప్పుడన్నా జైలుకు వెళ్లి చూశావా? అక్కడ ఎన్ని ఘోరాలు, నేరాలు చేసిన వారు నీకు కనిపిస్తారు? ఎప్పుడన్నా యుద్ధ భూమికి వెళ్లి చూశావా? అక్కడ ఉండే క్షతగాత్రులను, ప్రాణాలు కోల్పోయిన వారిని చూశావా? ఎప్పుడన్నా సముద్రం లోపల చూసావా? అక్కడ ఎన్ని మునిగిపోయిన ఓడలు మనకు కనిపిస్తాయి? ఇంకా చూడు: కరువులు, భూకంపాలు, తుఫానులు, నియంతృత్వాలు. అవన్నీ చూస్తే ఒక చేత కాని వాడు ఈ ప్రపంచాన్ని సృష్టించినట్లు ఉంటుంది’ అన్నాడు. 

    డేవిడ్ హ్యూమ్ వాదన సరైనదే అని చాలా మంది అనుకొంటారు. మీరు ఒక రోడ్డు మీద నడిచి వెళ్తున్నారని అనుకొందాము. అక్కడ ఒక కారు రోడ్డు ప్రక్కన ఆగి మీకు కనిపించింది. దాని ని డ్రైవ్ చేద్దామని మీరు ప్రయత్నించారు. అది సరిగ్గా స్టార్ట్ కావడం లేదు. చివరకు స్టార్ట్ అయ్యింది. రేడియేటర్ ఒక్క సరిగా వేడెక్కింది. అందులో లైట్స్ పనిచేయడం లేదు. బ్రేక్ సరిగ్గా పనిచేయడం లేదు. యాక్సిలేటర్ సరిగ్గా పనిచేయడం లేదు. కారు పైకి, క్రిందకు కుదుపుతూ ఉంది. ఆ కారు మీద టొయోట క్యాంరీ అని ఉంది. ఆ కారు గురించి మీరు ఏమను కొంటారు? టొయోట కంపెనీ వాడు చాలా దద్దమ్మ అయి ఉంటాడు. ఇలాంటి పిచ్చి కారు ఎందుకు చేశాడు? అని మీరు అనుకొంటారా? 

  టయోటా కంపెనీ ని తిట్టే ముందు మీరు కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. ఈ కారు కొన్న రోజు ఎలా వుంది? ఈ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎలాంటి వాడు? ఆక్సిడెంట్ లు ఏమన్నా చేశాడా? మెయింటనెన్స్ ఎలా చేసాడు? 

    టొయోట కంపెనీ చేసిన కారులు అన్నీ ఇలాగే ఉన్నాయా? ఆ ప్రశ్నలకు ముందు మనం సమాధానము చెప్పాలి. ఆ కారు షో రూమ్ నుండి బయటికి వచ్చిన రోజున అలా లేదు. అదే విధముగా ఈ ప్రపంచం కూడా దేవుడు సృష్టించిన మొదటి రోజున ఇలా లేదు. అది మంచిది అని దేవుడు అనుకొన్నాడు (ఆదికాండము 1:10). దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన మొదటి రోజున ఒక్క హాస్పిటల్ కూడా లేదు, ఒక్క రోగి కూడా లేడు, ఒక్క జైలు కూడా లేదు, ఒక్క నేరస్తుడు కూడా లేడు, ఒక్క యుద్ధ భూమి కూడా లేదు, ఒక్క మరణం కూడా లేదు, ఒక్క స్మశానం కూడా లేదు. 

  దేవుడు మనలను ప్రేమతో సృష్టించాడు. మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసి ఈ ప్రపంచానికి ఈ దుస్థితి తెచ్చాము. ప్రతి సంవత్సరం మథర్స్ డే అని జరుపుకొంటున్నారు. అయితే కొంత మంది తల్లులకు సంతోషం లేదు. నా పిల్లలు నన్ను ఏడిపించుకు తింటున్నారు. ఏమి మథర్స్ డే అని వారు ఆవేదన చెందుతున్నారు. వారు ప్రేమతో నే పిల్లల్ని కన్నారు కానీ ఆ పిల్లల ప్రవర్తన వలన వారికి సంతోషం లేదు. దేవుడు కూడా ప్రేమతోనే మనలను సృష్టించాడు కానీ మనం దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాము. దేవుని హృదయాన్ని బాధించాము. ఈ ప్రపంచాన్ని కూడా పాడు చేశాము. ఈ రోగాలు, మరణాలు, దొంగ తనాలు, అబద్దాలు, రేప్ లు, మర్డర్ లు ఇవ్వన్నీ మనిషి పాపము వలన ఈ లోకములో ప్రవేశించాయి కానీ అవి దేవుని చిత్తము కాదు.  

   ‘టయోటా కారు త్రాగినడిపాడు, చెట్టుకు గుద్దాడు, మెయింటెనెన్సు సరిగ్గా చేయలేదు’ ఆ కారణాలు మనం చూడాలి తప్ప టయోటా కంపెనీ ని మనం తిట్టకూడదు. ప్రతి బ్యాడ్ కారుకు, మంచి కారులు ఎన్నో ఉంటాయి. హాస్పిటల్ లో ఎంత మంది ఉన్నారు? బయట ఎంత మంది వున్నారు? జైళ్లలో ఎంత మంది ఉన్నారు? బయట ఎంత మంది ఉన్నారు? ఈ ప్రపంచము మనిషి పాపముతో ఎంతో చెడిపోయినా, ఈ రోజుకు కూడా అది దేవుని మంచితనాన్ని మనకు చూపిస్తుంది. 

కొన్నిటిని చూస్తే ఇది బ్యాడ్ డిజైన్ అని మనకు అనిపించవచ్చు. అయితే చాలా వాటిలో ఇది  గుడ్ డిజైన్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. 

ఆ తరువాత, ఈ విమర్శకులు ఏమంటారంటే, బైబిలు డార్విన్ సిద్ధాంతము నకు వ్యతిరేకం కాబట్టి అది సైన్స్ కి వ్యతిరేకం అంటారు. డార్విన్ సిద్ధాంతము ఏమంటుందంటే, మనిషి దేవుని చేత ప్రత్యేకముగా సృష్టించబడలేదు. కొన్ని కోట్ల సంవత్సరముల క్రితం జీవం దానంతటికి అదే సృష్టించబడింది. ఆ జీవం లో నుండే ఏకకణ జీవులు, ఆ తరువాత బహుకణ జీవులు, ఆ తరువాత చిన్న, చిన్న జంతువులు, ఆ తరువాత చేపలు, కప్పలు, పక్షులు, చింపాంజీలు, చివరకు మనిషి వచ్చారు అని వారు వాదిస్తారు. 

    DNA, RNA జన్యు పదార్ధాల్లో ఎంతో విషయ పరిజ్ఞానం ఉంది. ఈ పరిజ్ఞానం ఎలా వచ్చింది? సర్ ఆర్థర్ ఎడ్డింగ్టన్ అనే సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, కొన్ని కోతులకు టైపు రైటర్ లు ఇస్తే, అవి బ్రిటిష్ లైబ్రరీ లో ఉన్న వేలాది పుస్తకాలను టైపు చేసి సృష్టించగలవు. 

     ఒక కోతి గ్రుడ్డిగా టైపు చేస్తే పెద్ద పెద్ద గ్రంథాలు, నవలలు పుట్టుకొస్తాయా? అనే ప్రశ్న మనకు రావచ్చు. రిచర్డ్ డాకిన్స్ అన్నాడు, ‘తగినంత సమయం ఇస్తే, ప్రకృతి దానంతటికి అదే ఇంటెలిజెన్సు ని సృష్టించగలదు’. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన ప్రొఫెసర్ మైఖేల్ స్టార్ బర్డ్ మాథెమటికల్ క్యాలిక్యు లేషన్స్ చేసి అది తప్పు అని నిరూపించాడు. 

   షేక్స్ పియర్ వ్రాసిన హామ్లెట్ నవలలో To be or not to be అనే వాక్యం ఉంటుంది. ఒక కోతి టైపు రైటర్ మీద కూర్చొని ఉంది. ఆ టైపు రైటర్ కి 100 కీలు ఉన్నాయి. అంటే 100¹⁸ different 18-character patterns, which is 10³⁶. 

ప్రస్తుత లెక్కల ప్రకారం 13 బిలియన్ సంవత్సరాల క్రితం సృష్టి జరిగింది. కోతి సెకనుకు వంద కోట్లు సార్లు టైపు చేసిన, 1300 కోట్ల సంవత్సరాల తరువాత అది ఒక్క వాక్యం వ్రాయడానికి ఉండే ఛాన్స్ ఎంతంటే వంద కోట్లలో ఒక్క ఛాన్స్. 

     ఆ లెక్క ఒకసారి మీరు ఆలోచించండి. కోతి సెకనుకు వందకోట్ల సార్లు టైపు చేయగలదా? impossible. కానీ మన డిస్కషన్ కోసం వంద కోట్ల సార్లు టైపు చేయగలిగినా, 1300 కోట్ల సంవత్సరాల పాటు ప్రతి సెకండు అది వంద కోట్ల సార్లు టైపు చేయగలిగినా, షేక్స్ పియర్ హామ్లెట్ నవలలో ఒక్క వాక్యం కరెక్ట్ గా టైపు చేయడానికి ఛాన్స్ ఎంతంటే, వందకోట్లలో ఒక్క ఛాన్స్ మాత్రమే. 

   అంటే కోతి ఒక్క సెంటెన్స్ కూడా సృష్టించే అవకాశం లేదు. సెంటెన్స్ లు పెరిగేకొందీ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఆ వాక్యాలు వ్రాసే అవకాశం ఇంకా తగ్గిపోతుంది. ఆ విధముగా దేవుడు లేకుండా జీవము లో ఉన్న ఇంటెలిజెన్సు పుట్టే అవకాశమే లేదు అని ఈ లెక్కల ప్రకారం మనకు అర్థం అవుతుంది. 

     రస్సెల్ గ్రిగ్ గారు ‘కోతులు 23 కీర్తన టైపు చేయగలవా?’ అనే ఆర్టికల్ వ్రాశాడు. ఆయన లెక్కల ప్రకారం 23 కీర్తన మొత్తం వ్రాయడానికి 10¹⁰¹⁷  సంవత్సరాలు పడుతుంది. కోతులు 23 కీర్తన వ్రాసే ఛాన్స్ లేదు ఎందుకంటే సృష్టి జరిగి ఇప్పటికి అంత సమయం లేదు. డార్విన్ వాదులు గ్రుడ్డిగా వాదిస్తూ వుంటారు: సరిపోయినంత సమయం ఇస్తే ప్రకృతి ఇంటెలిజెన్సు ని దానంతటికదే సృష్టిస్తుంది అని వారు అంటారు. అయితే మాథెమటికల్ లెక్కల వెలుగులో చూస్తే తప్పు అని మనకు అర్థం అవుతుంది. 

   DNA కి ఉన్న సామర్థ్యం చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ప్రొఫెసర్ లెనార్డ్ ఆడేల్మన్ DNA ఉపయోగించి కంప్యూటర్ కనిపెట్టాడు. మాథెమటికల్ సమస్యలను DNA ఛేదించగలిగింది. హార్వర్డ్ యూనివర్సిటీ కి చెందిన విస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 1 గ్రామ్ DNA లో 215 పెట బైట్ ల డేటా పెట్టవచ్చు. ఒక పెటా బైట్ అంటే 1000 టెరాబైట్ లు. ఒక టేరా బైట్ లో 1000 గిగా బైట్ లు ఉంటాయి. ఒక్క గ్రామ్ DNA లో అంత సమాచారం మనం స్టోర్ చేయవచ్చు. ప్రపంచం లో ఉన్న డేటా మొత్తం కొన్ని గ్రాముల DNA లో మనం స్టోర్ చేయవచ్చు. దేవుని యొక్క జ్ఞానం మనకు DNA లో కనిపిస్తున్నది. 

   కాబట్టి దేవుడు లేకుండా జీవం సృష్టించబడే అవకాశం లేదు. డార్విన్ సిద్ధాంతము సైన్స్ ముసుగులో ఉన్న ఒక నాస్తిక.  ప్రకృతి వాదం. దేవుడి మాట అంటే గిట్టని వారు దానిని సృష్టించారు. దానికి సైన్స్ లో ఎలాంటి సంబంధం లేదు. నిజమైన సైన్స్ కి బైబిలు వ్యతిరేకం కాదు. 

  అయితే బైబిలు ఎప్పుడు కూడా సమస్త సత్యం నాలోనే ఉంది అని మనకు చెప్పదు. చికెన్ బిర్యాని ఎలా చేయాలో బైబిల్లో ఉండదు. సౌర కుటుంబములో ఎన్ని గ్రహాలు ఉన్నాయో బైబిలు మనకు చెప్పదు. అప్పెండిసైటిస్ కి చికిత్స ఏమిటో బైబిల్ చెప్పదు. సమస్త రోగాలకు నేనే చికిత్స చేస్తాను అని బైబిల్ చెప్పదు. 

    బాబా రాందేవ్ గారు మొన్న సుప్రీమ్ కోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నాడు. ఆయన ‘సర్వ రోగ నివారిణి’ అని చాలా మందులు అమ్మాడు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన మందులను నిషేధించాయి. ఆయన నా మందులు కొనుక్కోండి, మీ జబ్బు తగ్గి పోతుంది అని మోసపూరితమైన అడ్వేర్టీసెమెంట్ లు ఇస్తున్నాడు. కాన్సర్ కూడా తగ్గించే పవర్ నా మందులకు ఉంది అని రాందేవ్ కోతలు కోశాడు. భారత సుప్రీమ్ కోర్టు ఆయనకు చివాట్లు పెట్టింది. ఆయన సుప్రీమ్ కోర్టు ముందు కు వెళ్లి ‘సారీ, సారీ’ అన్నాడు. ‘ఎవరికి కావాలి నీ సారీలు, పోవయ్యా’ అని ఆయనను గద్దించారు. ప్రజల ఆరోగ్యం తో వ్యాపారం చేసుకోవటం చాలా తప్పు. 

   మనకు కూడా బెన్నీ హిన్ లాంటి వారు ఉన్నారు. వీరు సమస్త రోగాలను మేము నయం చేస్తాము అని బీరాలు పలుకుతూ వుంటారు. వారు చేసే ప్రచారాలు బైబిల్ లో నుండి వచ్చినవి కావు. 

    బైబిల్ సైన్స్ కి వ్యతిరేకమా? అనే ప్రశ్న కు సమాధానం ఈ రోజు మనం చూశాము. బైబిల్ సైన్స్ కి పునాది వేసింది కానీ సైన్స్ కి వ్యతిరేకం కాదు. ఆ సత్యం మనం గ్రహించాలి. అదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply