
తెనాలి క్రిస్టియన్ మీటింగ్ హాల్ మీద మాథ్యూ హెన్రీ ఒక బిల్ బోర్డు పెట్టాడు. దీని మీద ‘ శ్రీ కట్టుపల్లి యోహాను గారి సంతానము (కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాండ్రు) నకు ట్రస్ట్ ప్రాపర్టీ లపై ఏ విధమైన వారసత్వపు హక్కులు గాని, అధికారములు గాని లేవని విన్నవించడమైనది.’
ఈ మాటల క్రింద ‘అసెంబ్లీ ఆఫ్ బిలీవర్స్ ట్రస్ట్, తెనాలి అని వ్రాయబడింది. ఈ ట్రస్టులో మెయిన్ మెంబర్లు మాథ్యూ హెన్రీ, ఆయన మామ VR. జయప్రకాశ రావు గారు, మాథ్యూ హెన్రీ ఇద్దరు స్నేహితులు. ఒక వైపు యోహాను గారి కుమారుడు అయి ఉండి ‘శ్రీ కట్టుపల్లి యోహాను గారి సంతానము (కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాండ్రు) నకు ట్రస్ట్ ప్రాపర్టీ లపై ఏ విధమైన వారసత్వపు హక్కులు గాని, అధికారములు గాని లేవని విన్నవించడమైనది.’ అని వ్రాసుకోవడం మాథ్యూ హెన్రీ వేషధారణకు నిదర్శనం.
శ్రీ కట్టుపల్లి యోహాను గారు స్థాపించిన సంస్థలను తన జీవనోపాధికి ఉపయోగించుకొంటున్నది ఒక్క మాథ్యూ హెన్రీ మాత్రమే. ‘నాన్న, నాకు చదువు లేదు. నేనెలా బ్రతకాలి’ అని యోహాను గారి ముందు నిలబడి మాథ్యూ హెన్రీ ఏడుస్తూ ఉండేవాడు. ‘ఒరేయ్, వెళ్లి బుక్ రూమ్ లో బైబిళ్లు అమ్ముకోరా బడుద్ధాయి’ అని యోహాను గారు మాథ్యూ హెన్రీ ని బుక్ రూమ్ లో పెట్టాడు.
కాలక్రమములో యోహాను గారు స్థాపించిన బుక్ రూమ్, ప్రింటింగ్ ప్రెస్, గెస్ట్ హౌస్, క్రిస్టియన్ మీటింగ్ హాల్, క్రిస్టియన్ మిషన్ హాస్పిటల్, క్రిస్టియన్ ఓల్డ్ ఏజ్ హోమ్, క్రిస్టియన్ రెసిడెన్షియల్ హై స్కూల్ – వీటన్నిటినీ మాథ్యూ హెన్రీ ఆక్రమించుకున్నాడు. యోహాను గారు స్థాపించిన సంస్థలను మొత్తం అంగుళం కూడా ఎవరికీ మిగల్చకుండా ఆక్రమించుకున్న మాథ్యూ హెన్రీ, యోహాను గారి ఇతర పిల్లలు యోహాను గారు స్థాపించిన ప్రాపర్టీ ల మీద ఆశపడుతున్నట్లు చిత్రీకరించడం రోతగా ఉంది .
2024 లో తెనాలి మీటింగ్ హాల్ లో 3 రోజులు బైబిల్ కాన్ఫరెన్స్ పెట్టుకొంటాము అని అడిగితే మాథ్యూ హెన్రీ మా మీద భౌతిక దాడులకు తెగబడ్డాడు. ఒక వైపు కఱ్ఱలు తీసుకొని వీథి రౌడీ వలె ప్రవర్తించడం, మరొక వైపు బైబిలు తీసుకొని బోధలు చేయడం వీడికే చెల్లింది.

2018 లో జర్మనీ వారిని పల్లెకోన స్కూల్ కాంపౌండ్ నుండి వెళ్లగొట్టే వరకు మాథ్యూ హెన్రీ నిద్రపోలేదు. మరొక సారి జర్మనీ వారిని పలకరిస్తే, ‘నా గొంతు కోసుకొన్నట్లే’ అని అప్పట్లో బీరాలు పలికాడు. కరోనా వలన వచ్చిన ఆర్ధిక నష్టాల్లో అతని దృక్పథం మారింది. జర్మనీ వారి డబ్బుల కోసం ఇప్పుడు వారి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. డబ్బు కోసం దేనికైనా సిద్దపడే ఇలాంటి నీచుడు యోహాను గారి ఇతర పిల్లల మీద నిందలు వేస్తున్నాడు. అతని మాటలు నమ్మవద్దని మీకు తెలియజేసుకొంటున్నాను.