ప్రపంచ చరిత్రలో అంత్యంత ముఖ్యమైన సంఘటన ఏమిటి?
విశ్వ సృష్టా?
దేవుడు అబ్రహామును పిలుచుటా?
మోషే, ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రము దాటుటయా?
దావీదు ఇశ్రాయేలు దేశము రాజు అగుటయా?
అశోకుడు భారత దేశ చక్రవర్తి కావడమా?
అబ్రహాము లింకన్ అమెరికా లో బానిసత్వము నిర్మూలించుటయా?
రెండవ ప్రపంచ యుద్ధములో హిట్లర్ ఓడిపోవుటయా?
గాంధీ ప్రపంచానికి అహింసా సిద్ధాంతమును భోదించుటయా?
అయితే, వీటన్నిటికంటే ముఖ్యమైన సంఘటన, ప్రపంచ చరిత్రలోనే అతి గొప్ప సంఘటన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ.
ఈ రోజు ప్రపంచము ఎంతో ఉద్రిక్తతలతో, హింసతో, యుద్ధాలతో నిండుకొని ఉంది. ఉగ్రవాదులు తలకాయలు నరికివేస్తున్నారు. నరహత్యలు, రక్తపాతము, కాందిశీకులు మనిషి ప్రాణాలు అంటే వారికి విలువ లేదు. ఒక దేశము మరొక దేశము మీదకు తెగబడుట చూస్తున్నాము. ప్రపంచ యుద్ధాలలో కోట్ల మంది ప్రాణాలు కోల్పోవడము మనం చూసాము. నేను ఒక సారి న్యూ యార్క్ నగరమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఐక్య రాజ్య సమితి భవనము ప్రదేశానికి వెళ్ళాను. యెషయా ప్రవక్త మాటలు ఆ భవనము ముందు పెద్ద, పెద్ద అక్షరాలతో చెక్కబడిఉన్నాయి.
వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను
తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు
జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును
యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును. యెషయా 2:4
యెషయా ప్రవక్త మాటలు నెరవేర్చాలి అని ఐక్య రాజ్య సమితి కోరుకొంటుంది. అది మంచి ఆశయమే. అయితే అనేక యుద్ధాలను, సంఘర్షలను ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉంది.ఈ ప్రపంచములో శాంతిని ఎలా నెలకొల్పాలో అర్ధం కాక ఐక్య రాజ్య సమితి చేతులెత్తేసింది.
ఈ అమానుషాలను ఆపేదెవరు?
ఈ హత్యాకాండలను ఆపేదెవరు?
ఈ దుర్మార్గాలను ఆపేదెవరు?
ఈ రక్తపాతాన్ని, అవినీతిని ఆపేదెవరు?
ఈ ఉగ్రవాదులను ఆపేదెవరు?
తుఫానులు, కరువులు, భూకంపాలను ఆపేదెవరు?
గాంధీ లాంటి శాంతికాముకులు కోరుకొన్న ప్రపంచము ఎప్పుడు వస్తుంది?
ఆ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క సమాధానము ఉంది: ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ.
ఈ ప్రపంచము ఇంతకు ముందెన్నడూ చూడని శాంతి, సమాధానము, సౌభాగ్యము, సంతోషము, సస్యశ్యామలత యేసు క్రీస్తు పాలనలో వస్తుంది. ఆయన పాలన గురించి ఏడు విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుచున్నాను.
1.విధానము: దేవుడు ఏ పని చేసినా ఒక పద్దతి ప్రకారము చేస్తాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను (గలతీ 4:4) అని మనము చదువుతాము.
దేవుడు నిర్ణయించిన సమయములో యేసు క్రీస్తు మొదటి సారి ఈ లోకమునకు వచ్చాడు. రెండువేల సంవత్సరాల క్రితము యూదులు అన్యజనుల కాళ్ళ క్రింద బానిసలుగా నలుగుతున్నారు. మోషే లాంటి నాయకుణ్ణి పంపి వారిని విడిపించి ఆ తరువాత యేసు క్రీస్తు ను పంపితే బాగుండేది అని మనం అనుకోవచ్చు. అయితే దేవుని టైం టేబుల్ లో ఆ విధముగా లేదు.రోమన్ల క్రింద యూదులు బాధలు పడుతున్నప్పుడు యేసు ప్రభువు మొదటి సారి ఈ లోకమునకు వచ్చాడు. దేవుడు నిర్ణయించిన సమయములోనే యేసు క్రీస్తు ఈ లోకానికి వస్తాడు. ఆయన ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు అని కొంతమంది తేదీలు చెబుతున్నారు, నవ్వులు పాలవుతున్నారు. మనము ఆ పనులు చేయకూడదు.
ఇక్కడ నేను మరొక విషయము మీకు చెప్పవలసి ఉంది. సంఘము ఎత్తబడుట (Rapture), యేసు క్రీస్తు రెండవ రాకడ (Second Coming) ఇవి రెండు వేర్వేరు సంఘటనలు. ఆ రెండిటి మధ్య మీరు కన్ఫ్యూస్ కావద్దు.
క్రైస్తవ సంఘము ఎత్తబడుట (Rapture): ఇది ప్రభువైన యేసు క్రీస్తు విశ్వాసుల కొరకు వచ్చే సమయము. ఆయన అప్పుడు భూమిమీద కాలు మోపడు. ఆయన మధ్యఆకాశములో ఉండి చేసే పిలుపు విని విశ్వాసులు అందరూ భూమి మీద నుండి లేపబడి ఆయనను కలుసుకొంటారు. అందరూ కలిసి పరలోకము వెళ్తారు. అక్కడ పెండ్లి కుమారుని విందు జరుగుతుంది. మంచి విశ్వాసులకు బహుమానములు ఇవ్వబడతాయి. ఆ ఉత్సవాలు 7 సంవత్సరాలు కొనసాగుతాయి. విశ్వాసులు పరలోకములో క్రీస్తు సన్నిధిలో ఆనందముతో గడిపే సమయములో భూమి మీద పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ ఏడేండ్ల శ్రమలు ప్రపంచ ప్రజలను అతలాకుతలం చేస్తాయి. అంత్య క్రీస్తు పాలన క్రింద బ్రతుకు ఘోరముగా మారుతుంది. ఆ 7 సంవత్సరాలు ముగిసిన తరువాత క్రీస్తు తన వారితో భూమి మీద పాదము మోపుతాడు. అదే క్రీస్తు రెండవ రాకడ.
సంఘము ఎత్తబడుటకు, రెండవ రాకడకు 7 సంవత్సరాల వ్యవధి ఉంది.
1 థెస్సలొనీక 5:2 లో ఆయన దొంగ వలె వస్తాడు అని ఉంటే, ప్రకటన 1:7 లో ప్రతి నేత్రము ఆయనను చూచును అని వ్రాయబడి ఉంది.
రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. (1 థెస్సలొనీక 5:2)
ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్. (ప్రకటన 1:7)
సంఘము కొరకు ఆయన దొంగవలె వస్తాడు, లోక పాలన కోసము దొర వలె వస్తాడు. సంఘము ఎత్తబడే సమయములో ఈ లోకస్తులకు ఆయన కనిపించడు. రెండవ రాకడ సమయములో ప్రతి ఒక్కరికి కనిపిస్తాడు.
మొదటి రాకడ గురించి చేయబడిన ప్రవచనాలన్నీ నెరవేరినాయి. అదే విధముగా రెండో రాకడ గురించి చెప్పబడిన ప్రవచనాలు కూడా నెరవేరుతాయి.
క్రీస్తు కన్యక ద్వారా జన్మిస్తాడు (యెషయా 7:14)
ఆయన బెత్లెహేములో జన్మిస్తాడు (మీకా 5:2)
ఆయన ఐగుప్తు వెళ్తాడు (హోషేయ 11:1)
ఆయన దావీదు సంతానములో జన్మిస్తాడు (యెషయా 11:2)
గాడిద మీద కూర్చొని యెరూషలేములో ప్రవేశిస్తాడు (జెకర్యా 9:9)
ఒక మిత్రుని చేతిలో ద్రోహానికి గురవుతాడు (కీర్తన 41:9)
ఆయన శిష్యులు ఆయనను వదిలి పారిపోతారు (జెకర్యా 13:7)
ఆయన కొట్టబడతాడు, ఉమ్మివేయబడతాడు (యెషయా 50:6)
ఆయన వస్త్రాలు వారు చీట్లు వేసి పంచుకొంటారు (కీర్తన 22)
ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరువబడదు (కీర్తన 34:30)
ఆయన ప్రక్కలో పొడవబడుతాడు (జెకర్యా 12:10)
ఒక ధనవంతుని సమాధిలో ఆయన పాతిపెట్టబడతాడు (యెషయా 53: 9)
ఆయన సమాధి నుండి సజీవుడిగా తిరిగి లేస్తాడు ( కీర్తన 16:10)
ఆ ప్రవచనాలన్నీ యేసు ప్రభువు జీవితములో నెరవేరినాయి.
ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. (మత్తయి 24:35) అని ఆయన తెలియజేశాడు. మొదటి రాకడలో పొల్లు పోకుండా నెరవేరిన ప్రవచనాలన్నీ నెరవేరునట్లు, దేవుని ప్రవచనాలు రెండవ రాకడలో కూడా నెరవేరుతాయి. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల్లో 30 శాతము మాత్రమే మొదటి రాకడ లో నెరవేరినాయి. మిగిలిన 70 శాతము రెండవ రాకడలో నెరవేరుతాయి.
- వివరణ
బైబిలు గ్రంథములో రెండవ రాకడ ఆద్యంతము వివరించబడింది. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు అనేక ప్రవచనాలు రెండవ రాకడను తెలియజేశాయి. అమెరికా దేశములో బిల్లీ సండే అనే గొప్ప బేస్ బాల్ క్రీడాకారుడు ఉండేవాడు. ఆయన 20 శతాబ్దము ప్రారంభములో సువార్త పరిచర్యతో గొప్ప ఆత్మీయ మేలుకొలుపు ఆ దేశములో కలిగించాడు. ఆయన ఒక సారి బైబిల్ గ్రంథమును ఒక పెద్ద భవంతితో పోల్చాడు.
With the Holy Spirit as my Guide, I entered this Wonderful Temple called the Bible. I entered the portico of Genesis, walked down through the Old Testament Art Gallery, where pictures of Enoch, Noah, Abraham, Moses, Joseph, Isaac, Jacob, and Daniel hung upon the wall.
I passed into the music room of Psalms, where the Spirit swept the keyboard of nature and brought forth a dirge-like wail of the weeping prophet Jeremiah to the grand impassioned strain of Isaiah, until it seemed that every reed and pipe in God’s great organ of nature responded to the tuneful harp of David, the sweet singer of Israel.
I entered into the beautiful chapel of Ecclesiastes, where the Preacher’s voice was heard, and into the conservatory room of Sharon and the Lily of the Valley’s sweet-scented spices filled and perfumed my life.
I entered the business office of Proverbs, then into the observatory room of the Prophets, where I saw telescopes of various sizes, some pointed to far-off events, but all concentrated upon the Bright and Morning Star which was to rise above the moon-lit hills of Judea for our Salvation.
I entered the audience room of the King of Kings and caught a vision of His glory from Matthew, Mark, Luke and John; passing on into the Acts of the Apostles, where the Holy Spirit was doing His work in forming the Infant Church. Then into the correspondence room, where sat Paul, Peter, James, John, and Jude penning the letters.
I stepped into the throne room of Revelation where all towered in glittering peaks, and I got a vision of the King sitting upon His throne in all His glory and I cried:
All Hail the power of Jesus name!
Let angels prostrate fall;
Bring forth the royal diadem,
And crown Him Lord of all!
పరిశుద్ధాత్ముడు నా మార్గదర్శకునిగా బైబిల్ అనే అద్భుత ఆలయములో నేను ప్రవేశించాను. ఆదికాండము అనే గదిలో గుండా బయలుదేరి, పాత నిబంధన చిత్రాల గదిలో ప్రవేశించాను. అక్కడ హానోకు, నోవహు, అబ్రహాము, మోషే, యోసేపు, ఇస్సాకు, యాకోబు, దానియేలు చిత్రాలు గోడల మీద కనిపించాయి.
అక్కడ నుండి కీర్తనలు అనే సంగీతము గదిలోకి వెళ్ళాను. అక్కడ యిర్మీయా యొక్క విషాద గీతాలు, యెషయా యొక్క ప్రవచన కీర్తనలు, దావీదు యొక్క సుమధుర గీతాలు విన్నాను.
అక్కడ నుండి ప్రసంగి గదిలోకి వెళ్లి సొలొమోను ఉపదేశము విన్నాను. పరమగీతములో షారోను పొలములో పూయు పుష్పము, లోయలలో పుట్టు పద్మము సువాసన నా జీవితమును నింపినాయి. ఆ తరువాత సామెతలు గదిలోకి వెళ్లి దేవుని జ్ఞాన పలుకులు విన్నాను.
అక్కడ నుండి ప్రవక్తల పుస్తకములు అనే అంతరిక్ష శాలలోకి వెళ్ళాను. అక్కడ ఉన్న టెలిస్కోపు లలో నుండి చూడగా, యూదా కొండల మీద మన రక్షణ కొరకు వెలిసిన ప్రకాశమానమైన వేకువ చుక్క నాకు కనిపించింది.
అక్కడ నుండి సువార్తల గది లోకి వెళ్ళాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను లలో యేసు ప్రభువు నాకు రాజుగా, సేవకునిగా, మనుష్య కుమారునిగా, దేవునిగా కనిపించాడు.
అక్కడ నుండి ఉత్తరాల గదిలోకి వెళ్లి పౌలు, పేతురు, యాకోబు, యోహాను, యూదా లు వ్రాసిన పత్రికలలో యేసు క్రీస్తు సౌందర్యమును చూశాను.
చివరిగా ప్రకటన అనే సింహాసనము గదిలోనికి వెళ్లి రాజుల రాజు, ప్రభువుల ప్రభువు యేసు క్రీస్తు సింహాసనము మీద కూర్చొని ఉండుట చూశాను. అక్కడ గొఱ్ఱపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని పరిశుద్ధులు చేయుచున్న కీర్తనలు నాకు వినిపించాయి.
బిల్లీ సండే గారు ఎంతో చక్కగా తన మాటల్లో బైబిల్ ని ఒక గొప్ప భవంతిగా, అందులోకి వెళ్తే ఒక్కొక్క గదిలో మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు ఒక్కొక్క రూపములో కనిపిస్తున్నట్లు వివరించాడు. చివరి గదిలో ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా మనకు కనిపిస్తున్నాడు.
పాతనిబంధన సారాంశము ఆయన యొక్క రాకడే.
అబ్రహాము ఎవరి దినము చూడాలని ఆశించాడో ఆ క్రీస్తు (యోహాను 8:56)
నాలాంటి మరో ప్రవక్త వస్తాడని మోషే ప్రవచించిన క్రీస్తు (ద్వితీయోప 18:18)
నక్షత్రము యాకోబులో ఉదయించును అని యాకోబు ప్రవచించిన క్రీస్తు (సంఖ్యా 24:17)
అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచెదను అని సమూయేలు ప్రవచించిన క్రీస్తు (2 సమూయేలు 7:13)
నా విమోచకుడు సజీవుడు అని యోబు నిరీక్షించిన క్రీస్తు (యోబు 19:25)
అతని బట్టి మనుష్యులు దీవింపబడెదరు అని సొలొమోను కీర్తించిన క్రీస్తు (కీర్తనలు 72:17)
ఆయన తన ప్రజలకు విమోచన కలుగ జేయును అని దావీదు ప్రవచించిన క్రీస్తు (కీర్తన110:9)
ఆయన అన్యజనులకు వెలుగై ఉండును అని యెషయా ప్రవచించిన క్రీస్తు (యెషయా 49:7)
ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అని దానియేలు ప్రవచించిన క్రీస్తు (దానియేలు 7:14)
నీతి సూర్యుడు మీ మధ్యలో ఉదయిస్తాడు అని మలాకీ ప్రవచించిన క్రీస్తు (మలాకీ 4:2)
ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతో పరలోకము నుండి దిగివస్తాడు అని పౌలు ప్రకటించిన క్రీస్తు (1 థెస్సలొనీక 4:16)
అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు ఇవ్వటానికి రాబోవుచున్నాడు అని పేతురు ప్రకటించిన క్రీస్తు (1 పేతురు 1:4)
ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని యోహాను ప్రవచించిన క్రీస్తు (ప్రకటన 1:7)
ఈ ప్రవక్తలందరూ, భక్తులందరూ ప్రవచించిన యేసు క్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు.
రెండు వేల సంవత్సరాల క్రితము ప్రభువైన యేసు క్రీస్తు ఏ విధముగా పరలోకానికి తిరిగి వెళ్ళాడో మనము అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయములో చదువుతాము.
ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను,
అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచు చుండిరి.
ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి
గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచు చున్నారు?
మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన
యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో
ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి
అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి.
అపొ. కార్యములు 1:9-12
యెరూషలేములో ఒలీవల కొండ మీద నుండి యేసు క్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి ఆ కొండ మీదకే తిరిగి వస్తాడు. జెకర్యా ప్రవక్త దాని గురించి వివరించాడు.
- ఆ దిన మున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న
ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ
తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ
ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును
గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.
జెకర్యా 14:4
పోయిన సారి యెరూషలేము వెళ్ళినప్పుడు నేను ఒక మధ్యాహ్నము ఈ ఒలీవల కొండ మీదకు నడచి వెళ్ళాను. అది ఎంతో అందమైన కొండ. అక్కడ నుండి చూస్తే యెరూషలేము నగరము ఎంతో చక్కగా మనకు కనిపిస్తుంది.
యేసు ప్రభువు ఆ కొండ మీద తన పాదము మోపి యెరూషలేము లోకి ప్రవేశించి తన వెయ్యేళ్ళ పాలన ప్రారంభిస్తాడు.
ఆ రోజున యెరూషలేము ప్రపంచ రాజధానిగా ఉంటుంది. లండన్ కాదు, వాషింగ్టన్ కాదు, బీజింగ్ కాదు, ఢిల్లీ కాదు – ప్రపంచ ప్రజలందరూ యెరూషలేము వైపు చూస్తారు.
దీనికి ఒక విధానము ఉంది. ఒక ప్రధాన మంత్రి పర్యటనకు వస్తే ఆయన ఏ రోజు వస్తాడు, ఏ వాహనంలో వస్తాడు, ఏ రూట్ లో వెళ్తాడు, ఎవరెవరిని కలుసుకుంటాడు, ఎక్కడ భోజనము చేస్తాడు, ఎక్కడ విశ్రాంతి తీసుకొంటాడు – ఆ వివరాలన్నీ అధికారులు ముందుగా వ్రాసుకొని క్రమబద్దీకరిస్తారు. అదే విధముగా యేసు క్రీస్తు ప్రభువు రెండవ రాకడ ఒక క్రమ పద్దతిలో జరుగుతుంది.
- విభ్రాంతి
మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు పాపములో కూరుకుపోయిన ఇహలోక ప్రజలు ఏ విధముగా స్పందిస్తారో బైబిలు మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది.
“ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని
వారికిని ప్రతిదండన చేయునప్పుడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న
మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే”. 2 థెస్సలొనీక 1:7-8
ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి…….దానియేలు 7:13
అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశ మందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు
ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి…… మత్తయి 24:30
ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు;
ప్రతి నేత్రము ఆయనను చూచును,
ఆయనను పొడిచినవారును చూచెదరు;
భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
ప్రకటన గ్రంథం 1:7
యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు భూజనులందరూ రొమ్ము కొట్టుకొంటారు. యేసు క్రీస్తు దేవుడు కాదు, ఆయన సగటు మానవుల వలె చరిత్రలో కలిసిపోయాడు. ఆయన తిరిగి రాడు, మా పాపములకు తీర్పు తీర్చడు అని సంతోషముతో నిండుకొనిఉన్న ప్రజలను ఆయన రాకడ ఊహించని షాక్ కి గురిచేస్తుంది.
భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు
ప్రపంచము యేసు క్రీస్తును చివరిసారి సిలువ మీద చూసింది. ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత అవిశ్వాసులకు కనిపించలేదు. విశ్వాసులకు మాత్రమే కనిపించాడు. ఆయన రెండవ సారి వచ్చినప్పుడు అవిశ్వాసులందరికీ కనిపిస్తాడు.
ఆయన రెండవ రాకడ మొదటి రాకడకు భిన్నముగా ఉండబోవుచున్నది.
మొదటి సారి కేవలము ఇశ్రాయేలు దేశమునకు మాత్రమే వచ్చిన ఆయన రెండవ సారి వచ్చినప్పుడు ఈ ప్రపంచము మొత్తము ఆయనను చూడబోవుచున్నది.
మొదటిసారి, సాత్వికుడు గా వచ్చిన ఆయన, రెండవ సారి, మహిమా, ప్రభావములతో రాబోవుచున్నాడు
మొదటిసారి, రక్షకుడుగా వచ్చిన ఆయన, రెండవ సారి శిక్షకుడు గా రాబోవుచున్నాడు.
మొదటిసారి, తలవాల్చుకొనుటకు సహితం స్థలం లేకుండా బ్రతికిన ఆయన, రెండవ సారి
వచ్చినప్పుడు, ఈ భూలోకం మొత్తాన్ని స్వతంత్రించు కొబోవుచున్నాడు
మొదటి సారి, యెరూషలేము లో హింసించబడి, ఈడ్వబడి, అవమానించబడిన ఆయన, రెండవసారి, యెరూషలేమును తన పాద పీఠము గా చేసుకొనబోవుచున్నాడు
మొదటి సారి, అన్యాయపు తీర్పును పొందిన ఆయన, రెండవ సారి వచ్చినప్పడు, తానే లోకమంతటి కి న్యాయం తీర్చే, న్యాయాధిపతిగా రాబోవుచున్నాడు.
మొదటిసారి, గొర్రెపిల్ల వలె దీనుడు గా వచ్చిన ఆయన, రెండవ సారి, తన శత్రువులను చీల్చి, చెండాడే యూదా గోత్రపు సింహము వలె రాబోవుచున్నాడు.
మొదటి సారి, దాసుడుగా వచ్చిన ఆయన, రెండవ సారి, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా రాబోవుచున్నాడు
మొదటి సారి, మనకు పాపక్షమాపణ ఇచ్చుటకు వచ్చాడు, రెండవసారి పాపాన్ని శిక్షించటానికి వస్తున్నాడు. ఈ ప్రపంచము ఊహించని సమయములో ఆయన ప్రత్యక్షమవుతాడు. అది విభ్రాంతి కి గురవుతుంది.
- విధేయత
ఈ సమయములో విధేయత కూడా మనుష్యులలో కనిపిస్తుంది.
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు
అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు
ప్రజలు అతనికి విధేయులై యుందురు. ఆదికాండము 49:10
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాజరికం మనము ఇక్కడ చూస్తున్నాము. ‘ప్రజలు అతనికి విధేయులై యుందురు’ అని ఈ ప్రవచనములో చెప్పబడింది. ఆయన మొదటి రాకడలో ఇది జరుగలేదు. ప్రపంచ ప్రజలు ఆయనను గౌరవించి, విధేయత చూపించలేదు.
ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.
- ఆయన తన స్వకీ యుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
యోహాను 1:10-11
యేసు ప్రభువు మొదటి రాకడలో ‘లోకమాయనను తెలిసికొనలేదు.ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.’ కానీ, రెండవ రాకడలో ప్రజలు అతనికి విధేయులై యుందురు.
2 కీర్తనలో కూడా కొన్ని మాటలు చూద్దాము.
- నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను
- కట్టడను నేను వివరించెదను
యెహోవా నాకీలాగు సెలవిచ్చెను
నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను.
- నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను
ఇచ్చెదను.
- ఇనుపదండముతో నీవు వారిని నలుగ గొట్టెదవు
కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
మొదటి రాకడలో ఆయన పిలాతు ముందు మౌనంగా ఉన్నాడు. ఆయనకు శక్తి లేక కాదు కానీ తన శక్తిని అదుపులో పెట్టు కున్నాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన శక్తిని ఈ ప్రపంచం ప్రత్యక్షంగా చూస్తుంది.
- నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను
ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయనయొక్క ఆత్మీయ శక్తిని ఈ ప్రపంచం చూసింది, కానీ ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయనయొక్క భౌతిక శక్తి ఈ ప్రపంచానికి కనిపిస్తుంది .
- ఇనుపదండముతో నీవు వారిని నలుగ గొట్టెదవు
కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
ఒక మట్టి కుండను ఇనుప రాడ్ తో కొట్టితే ఆ మట్టి కుండ ఎలా మారుతుందో ఊహించండి. యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రపంచం ఆయన ముందు ఒక మట్టి కొండవలె ఉంటుంది. ఆయన శక్తిని చూసి ఈ ప్రపంచం ఆయనకు విధేయత చూపిస్తుంది.
5.. విలాపం
ఆ తరువాత ఆయన వచ్చినప్పుడు విలాపము కూడా వినిపిస్తుంది.
ప్రకటన గ్రంథం 1:7
ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు;
ప్రతి నేత్రము ఆయనను చూచును,
ఆయనను పొడిచినవారును చూచెదరు;
ఇక్కడ ఆయనను పొడిచిన వారు అంటే యూదులు యేసు ప్రభువు ఎరుషలేముకు వెళ్లినప్పుడు ఆయనను చూసి యూదులు ఏడుస్తారు.
వారి చరిత్ర మొత్తం యూదులు దేవుని మహిమను చూస్తూనే ఉన్నారు.ఐగుప్తులో నుండి దేవుడు తన శక్తితో వారిని విడిపించినప్పుడు వారు దేవుని మహిమను చూశారు. ఎర్ర సముద్రము చీల్చినప్పుడు, ఆకాశములో నుండి మన్నాను కురిపించి వారికి ఆహారము పెట్టినప్పుడు, బండలో నుండి నీరు తెచ్చి వారి దాహము తీర్చినప్పుడు, వారి శత్రువులను వారి ఎదుట నుండి ప్రారదోలినప్పుడు, యొర్దాను నదిని వారి ముందు నిలిపినప్పుడు, యెరికో గోడలు కూలగొట్టినప్పుడు, కనాను దేశమును వారు ఆక్రమించుకొనినప్పుడు….అనేక సార్లు వారు దేవుని మహిమను చూసారు.
ఆ తరువాత యేసు ప్రభువు కూడా వారి ముందు అనేక అద్భుతములు చేసి వారి ఎదుట దేవుని మహిమను చూపించాడు. అయితే ఆయన రోమీయుల కాడి క్రింద నుండి వారిని విడిపించని కారణముగా, తమ హృదయములలో పాపమును ప్రేమించుట ద్వారా వారు ఆయనను అంగీకరించలేదు. ప్రభువైన యేసు క్రీస్తు తన పూర్ణ శక్తి తో రెండవసారి వచ్చినప్పుడు వారి ప్రతిస్పందన వేరుగా ఉంటుంది.
జెకర్యా 12:10
దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు
ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన
నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,
తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
మా రక్షకుణ్ణే మేము పొడిచి చంపామా అని వారు తీవ్రముగా దుఃఖిస్తారు. లూకా సువార్త 19 అధ్యాయములో యేసు ప్రభువు యూదుల కఠినత్వమును చూసి కన్నీరు పెట్టుట మనము చూస్తాము. అయితే ఆయన రెండవ సారి వచ్చినప్పుడు వారికి కఠిన హృదయము ఉండదు. వారు మారు మనస్సు పొంది కన్నీరు పెట్టుట చూసి ప్రభువు వారిని ఓదార్చుతాడు. వారి తండ్రి అయిన అబ్రాహాము కు వాగ్దానము చేసిన దేశమును వారికి ఇస్తాడు.
6.. విశ్రాంతి
ప్రభువైన యేసు క్రీస్తు తిరిగివచ్చినప్పుడు మనకు విశ్రాంతి లభిస్తుంది. 2 థెస్సలొనీక పత్రికలో మనము చదువుతాము.
“ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి
అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని
వారికిని ప్రతిదండన చేయునప్పుడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న
మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే”.
2 థెస్సలొనీక 1:7-8
ఇక్కడ రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి.
ప్రతిదండన – విశ్రాంతి
ఆయన రెండవ రాకడ లో రెండు పార్శ్వాలు వున్నాయి: ప్రతిదండన, విశ్రాంతి
సువార్తను వ్యతిరేకించి, పాప క్షమాపణ పొందని వారికి ప్రతిదండన చేయబోవుచున్నాడు.
సువార్తను నమ్మి, రక్షింపబడి,దేవుని ప్రజలుగా మారిన వారికి విశ్రాంతి ని ఇవ్వబోవుచున్నాడు.
నిత్యమూ రక్తపాతముతో యుద్ధాలు, ఘర్షణలతో గడుపు తున్న ప్రపంచ దేశాలకు కూడా ఆయన పాలనలో విశ్రాంతి లభిస్తుంది.
మీకా 4:3
ఆయన మధ్యవర్తియై అనేక జన ములకు న్యాయము తీర్చును,
దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును.
వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను
తమ యీటెలను మచ్చు కత్తులు గాను సాగకొట్టుదురు,
జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును,
యుధ్దముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు.
- వికాసం
ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వచ్చిన తరువాత ఈ ప్రపంచము ఎన్నో కీలకమైన మార్పులకు గురవుతుంది. మత్తయి 24 : 30 చూద్దాము:
మనుష్య కుమారుడు ప్రభా వముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదను……
ప్రతి ఎన్నికల సమయములో మనము రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు వింటాము. అందరికి అన్ని వసతులు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయము ఎదుగుదల, యువతకు ఉపాధి, మహిళలకు చేయూత, ఆర్ధిక వ్యవస్థ పెంపొందుట, అవినీతి రహిత ప్రభుత్వము, ఆహార భద్రత, గృహ నిర్మాణము, ,మేలైన విద్య, పరిశ్రమల అభివృద్ధి, నేరాలు లేకుండా చేయుట, చట్టబద్ధ పాలన, ఇంకెన్నో వాటి గురించి వారు చాలా విషయాలు మేనిఫెస్టో లలో వ్రాస్తారు. అయితే వాటిలో కొన్నింటిని మాత్రమే పూర్తిగా నెరవేర్చగలరు. ఎందుకంటే, మంచి ఆశయాలు ఉన్నప్పటికీ వాటిని నెరవేర్చే శక్తి వారికి లోపిస్తుంది. అయితే ప్రభువైన యేసు క్రీస్తు తన శక్తితో, ప్రభావముతో ప్రపంచాన్ని సమూలముగా మార్చివేస్తాడు.
జెకర్యా 14 : 8 లో మనము చదువుతాము.
ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాల మందును చలికాల మందును ఆలాగుననే జరుగును.ఆ కాలములో ప్రకృతి ఎలా వికసిస్తుందో యెషయా ప్రవక్త తెలియజేశాడు.
తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును
చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును
దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.
ఆవులు ఎలుగులు కూడి మేయును
వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.
పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లా డును
మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును.
నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు
నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు
లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.
ఆయన వచ్చినప్పుడు ప్రకృతి గొప్ప మార్పులకు లోనవుతుంది.
బైబిల్ లో చివరి ప్రార్ధన: ప్రభువైన యేసూ, రమ్ము.
మిత్రమా, ఆయన రాకడకు నీవు సిద్ధపడ్డావా? ఆయన యందు విశ్వాసముంచి ఆయన నీ రక్షకునిగా అంగీకరించావా?