రవి జకరియస్ : మస్సాజ్ సెంటర్లో పాపాలు

రవి జకారియస్ గారు గొప్ప క్రైస్తవ సువార్తికుడు. ఇప్పుడు  ఆయన మీద కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవి గారు ఒక ఆధునిక ప్రవక్తగా పిలువబడ్డాడు. చక్ కోల్సన్ గారు ఒక సారి రవి జకారియాస్ మన ఆధునిక యుగ ప్రవక్త అని పిలిచాడు. ఆయన వైట్ హౌస్ కి వెళ్లి అమెరికా అధ్యక్షులతో మాట్లాడేవాడు. ఆయనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది.  మే నెలలో ఆయన చనిపోయినప్పుడు మనం కన్నీరు పెట్టాము. మేము ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశాము. 

ఇప్పుడు కొంతమంది మహిళలు ఆయన మీద ఆరోపణలు చేశారు. రవిగారు చాలా సంవత్సరాలు వెన్ను నొప్పి తోబాధపడ్డాడు. మసాజ్ సెంటర్లకు వెళ్లి యువతుల చేత మసాజ్ చేయించుకొనేవాడు. ఆ మహిళలు రవిగారి మీద ఫిర్యాదులు చేశారు. రవి గారు మాతో అసభ్యముగా మాట్లాడేవాడు, మా మీద అనుమతి లేకుండా చేతులు వేసే వాడు.వారి మాటలు చాలామంది నమ్మలేదు. ఈ వారం రవి గారు స్థాపించిన RZIM సంస్థ వారి వెబ్ సైట్ లో ఒక వివరణ ఇచ్చింది. ఆ మహిళలు చేసిన ఆరోపణలు నిజమే. రవి గారు ఈ మసాజ్ సెంటర్లకు వెళ్ళినప్పుడు వారితో అసభ్యముగా మాట్లాడిన విషయం నిజమే. వారి మీద చేతులు వేసిన మాట నిజమే అని వారు ఆ మహిళల ఆరోపణలు దృఢపరచారు. 

   అది చదివి నాకు  చాలా బాధవేసింది. రవి గారు చాలాగొప్ప మేధావి. ఎంతో కష్టపడేవాడు. అనేక దేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు. ఆయన వెన్నునొప్పి విషయములో తప్పు నిర్ణయంతీసుకొన్నాడు. మసాజ్ సెంటర్లకు వెళ్లి మసాజ్లు చేయించుకోవటం ప్రారంభించాడు. అక్కడ వచ్చిన శోధనలు తట్టుకోలేకపోయాడు. ఆయనకున్న మంచి పేరు పాడై పోయింది. ఆయన రెపుటేషన్ మొత్తం బూడిదయ్యింది. సమ్సోను చేసిన తప్పు అదే. దేవుడు వెళ్లొద్దు అనే ప్రదేశాలకు వెళ్ళాడు. దెలీలా మీద చేయి వేశాడు. ఆయన జీవితం కొద్ది రోజుల్లో బూడిద అయ్యింది. మనం మసాజ్ సెంటర్లకు దూరముగా ఉండాలి. అక్కడ చీకటి గదుల్లో యువతులతో మనం మసాజ్ చేయించుకొంటే మనకు శోధనలు రావడం ఖాయం. మరి నా నొప్పులు ఎలాపోతాయి అని మీరు అడగవచ్చు. అలాంటి వారు ఫిజియో థెరపీచేయించుకోవాలి. ఒళ్ళు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి ఉన్న వారుమగ వాళ్ళు మగ  వాళ్ళ చేత, ఆడవారు ఆడవారి చేత మస్సాజ్ లు చేయించుకొంటే అలాంటి శోధనలు రాకుండా ఉంటాయి. ఇలాంటి గొడవలు జరుగకుండా ఉంటాయి. రవి జకరియస్ కొన్ని పాపాలు చేసిఉండవచ్చు. అయితే ఆయన బోధించిన సత్యాలు దేవుని సత్యాలు. ఆయన కొన్ని విషయాల్లో విఫలమయినప్పటికీ ఆయన బోధించిన సత్యాలు మనం వదలిపెట్టకూడదు.  రవి గారి కుటుంబం కోసం మనం ప్రార్ధన చేయాలి.

    దేవుడు తన ప్రవక్తలకు ప్రత్యేక జీవనవిధానాన్ని ఆజ్ఞాపించాడు. వారు ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, ఏమి త్రాగవచ్చు, ఏమి త్రాగకూడదు, ఏ ప్రదేశాలకు వెళ్లొచ్చు, ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు, ఎవరిని ముట్టుకోవచ్చు, ఎవరిని ముట్టుకోకూడదు దేవుడు వారికి స్పష్టముగా చెప్పాడు. పాత నిబంధనలో ప్రవక్తల జీవితాలు మనం చదివితే మనకు ఆ సత్యము అర్థం అవుతుంది.యెషయా పాపాన్ని తీవ్రముగా ద్వేషించాడు ఎందుకంటే పరిశుద్దుడైన దేవుని దగ్గరగా చూశాడు (యెషయా 6) 

Leave a Reply