ఎఫెసీ పత్రిక పరిచయం

ఎఫెసీ పత్రిక -ఇది దేవుడు మన ముందు వడ్డించిన విందు భోజనం లాంటిది. మీరు ఆరగించి, ఆనందించాల్సిన ఎన్నో సత్యాలు ఇందులో వున్నాయి.

   ఈ ఎఫెసీ పత్రిక ను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చదవాలి. దీని సందేశం మనం అర్థం చేసుకొంటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. మనలను మనం ఏ విధముగా చూసుకొంటాము? దేవుని ఎలా చూస్తాము? క్రైస్తవ సంఘమును ఎలా చూస్తాము? ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాము? ఈ విశ్వాన్ని ఎలా చూస్తాము? ఈ పత్రిక ను అర్థం చేసుకొంటే అవన్నీ పూర్తిగా మారిపోతాయి. 

   నా చిన్న నాటి జ్ఞాపకాల్లో ఒకటి మా నాన్న యోహాను గారు ఒక సారి నన్ను పిలిచి, ‘పాలీ, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం కంఠస్తం చేయి’ అని చెప్పాడు. ఈ పత్రిక చాలా ముఖ్యమైనది అని ఆయన గ్రహించాడు. క్రైస్తవ్యం అంటే ఏమిటి? యేసు క్రీస్తు ప్రభువు మీ కొరకు చేసింది ఏమిటి? మీ పత్రిక మొదటి 14 వచనాలు చదవండి చాలు. అది ఒక అందమైన ముత్యాల హారం. విశ్వాసులుగా దేవుడు మీ కిచ్చిన గొప్ప ధన్యతలు ఇందులో వ్రాయబడ్డాయి. 

పరిచయం 

    ఈ ఎఫెసీ పత్రిక లో ప్రభువైన యేసు క్రీస్తు కేంద్ర స్థానములో మనకు కనిపిస్తున్నాడు. దేవుడు తన ఐశ్వర్యమును యేసు క్రీస్తు నందు మనకు ఇచ్చాడు. క్రీస్తు నందు అనే మాట మనకు పదే పదే ఈ పత్రికలో కనిపిస్తుంది. 

1:2 క్రీస్తు నందు మనకు సమాధానం ఇచ్చాడు 

1:5 క్రీస్తు నందు మనలను కుమారులనుగా స్వీకరించాడు 

1:6 క్రీస్తు నందు మనలను ఏర్పరచుకున్నాడు 

1:7 క్రీస్తు నందు మనకు విమోచన కలిగింది

      క్రీస్తు నందు మన అపరాధములను క్షమాపణ కలిగింది 

1:10 క్రీస్తు నందు మనలను సమకూర్చాడు 

1:12 క్రీస్తు నందు స్వాస్థ్యముగా ఏర్పరచాడు 

1:13 క్రీస్తు నందు తన ఆత్మ చేత మనలను ముద్రించాడు 

1:18 క్రీస్తు నందు మనకు తన శక్తిని కనుపరచాడు 

2:4 క్రీస్తు నందు మనలను ప్రేమించాడు 

2:7 క్రీస్తు నందు మనము లేపబడ్డాము 

2:10 క్రీస్తు నందు నూతన సృష్టిగా చేశాడు 

2:10 క్రీస్తు నందు దేవుని పనివారిగా చేశాడు 

3:6 క్రీస్తు నందు మనకు యూదులతో సమాన వారసత్వం చేశాడు 

3:16 క్రీస్తు నందు తన ఆత్మను మనలో పెట్టాడు 

4:13 క్రీస్తు నందు మనకు అనేక వరములు ఇచ్చాడు 

4:32 క్రీస్తు నందు మనలను క్షమించాడు 

5:2 క్రీస్తు నందు మనలను పరిమళ వాసనగా చేశాడు 

6:10 క్రీస్తు నందు మనకు శక్తి ఇచ్చాడు 

6:11,13 క్రీస్తు నందు మనకు ఒక సర్వాంగ కవచం ధరింపజేశాడు 

  ఆ విధముగా దేవుడు క్రీస్తు నందు ప్రతి విశ్వాసికి గొప్ప మేలులు ఇచ్చాడు. క్రీస్తు లేకుండా అసలు నా దగ్గరకు రావద్దు అని దేవుడు అంటున్నాడు. 

క్రీస్తు శరీరం: పాత నిబంధనలో చూస్తే దేవుడు ఇశ్రాయేలుకు అనేక ధన్యతలు ఇచ్చాడు. ఇశ్రాయేలు కంటే క్రైస్తవ సంఘం గొప్పది. ఎందుకంటే క్రైస్తవ సంఘము ను విమోచించడానికి దేవుడు తన స్వరక్తం చిందించాడు. క్రైస్తవ సంఘం దేవుని శరీరము అని పిలువబడింది. ఇశ్రాయేలు కు ఆ పేరు లేదు. 

మర్మములు: అనేక మర్మములు కూడా ఈ పత్రికలో మనకు కనిపిస్తాయి.  మర్మములు అంటే పూర్వం మరుగుచేయబడి ఇప్పుడు బయలు పరచబడినవి. పూర్వం రహస్యముగా ఉన్నవి ఇప్పుడు వెలుగు లోకి తేబడ్డాయి. ఈ మర్మములు కొన్ని ఈ ఎఫెసీ పత్రికలో మనం చూద్దాము. 

రచయిత: అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను వ్రాశాడు. ఆయన బెన్యామీను గోత్రికుడు. ఆయన అసలు పేరు సౌలు. తార్సు అనే వూరిలో జన్మించాడు. గమలియేలు అనే గొప్ప మేధావి దగ్గర ఆయన ధర్మశాస్త్రం క్షుణ్ణముగా అధ్యయనం చేశాడు. క్రైస్తవ్యాన్ని తీవ్రముగా ద్వేషించాడు. సిరియా దేశములో ఉన్న డమాస్కస్ అనే పట్టణానికి వెళ్తున్నాడు. అక్కడ ఉన్న క్రైస్తవులను హింసించాలి అనే పని మీద ఆయన వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ప్రత్యక్షమయ్యాడు. వెంటనే సౌలు క్రైస్తవుడయ్యాడు. పౌలు అనే క్రొత్త పేరు పెట్టుకొన్నాడు. అరేబియా ఎడారిలో 3 సంవత్సరాలు దేవుని శిక్షలో గడిపాడు. అంతియొకయ సంఘములో పరిచర్య చేశాడు. 

   అయితే పరిశుద్ధాత్ముడు పౌలును ప్రపంచ సువార్త కు ఎన్నిక చేసుకొన్నాడు. Apostle to the Gentiles అని ఆయనను పిలుస్తాము. అంటే అన్యజనులకు అపోస్తలుడు అయ్యాడు. 

   ఎఫెసు పట్టణము ప్రస్తుత టర్కీ దేశమునకు పశ్చిమాన ఉంది. అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఒక స్థానిక సంఘం నెలకొల్పాడు. కొన్ని సంవత్సరముల క్రితం నేను ఎఫెసు పట్టణము వెళ్లి పౌలు గారు తిరిగిన ప్రదేశాలు చూశాను.  ఎఫెసీ పట్టణములో అర్తెమి దేవికి గొప్ప ఆలయం ఉండేది. అపోస్తలుల కార్యములు 19 అధ్యాయములో మనం చదువుతాము. అక్కడ అర్తెమి దేవి ఆలయానికి లక్షల మంది భక్తులు వచ్చేవారు. దేమేత్రి అనే కంసాలి ఆ దేవికి వెండి గుళ్ళు చేయిస్తూ మంచి లాభసాటి వ్యాపారం చేస్తున్నాడు. పౌలు గారి సువార్త ప్రకటన వల్ల చాలా మంది రక్షణ పొంది ఆ వెండి రాళ్లు కొనడం ఆపివేశారు. అది చూసి ఆయనకు పౌలు మీద చాలా కోపం వచ్చింది. మా బిజినెస్ మొత్తం పాడు చేస్తున్నాడు అని ఆయన మీద వారు విరుచుకు పడ్డారు. అంత గొప్ప సువార్త సేవ పౌలు గారు ఎఫెసు లో చేశాడు. ఒక మంచి క్రైస్తవ సంఘం అక్కడ నెలకొల్పాడు. క్రీస్తు శకం 60 – 62 సంవత్సరముల మధ్య పౌలు గారు రోమ్ నగరములో ఒక చెర శాలలో ఉండి ఈ గొప్ప పత్రికను ఎఫెసు, దాని చుట్టు పట్ల ఉన్న ప్రాంతములలో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు ఈ పత్రిక వ్రాశాడు. 

Election – ఎన్నిక చేయ బడుట 

మొదటి అధ్యాయములో మనకు కనిపించే గొప్ప సత్యాల్లో ఒకటి దేవుని చేత ఏర్పరచుకొనబడుట. 

ఎఫెసీ 1:5-6 వచనములు చదువుదాము. 

మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

జగత్తు పునాది వేయబడకమునుపే, దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. 

యేసు ప్రభువు యోహాను సువార్త 17 లో ఒక మాట అన్నాడు: జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. యోహాను 17:24 

    దేవుడు ఈ ప్రపంచం పునాది వేయబడక మునుపే ప్రభువైన యేసు క్రీస్తును ప్రేమించాడు. అంటే యేసు క్రీస్తు భూమి మీద జన్మించక మునుపే దేవుని చేత ప్రేమించబడ్డాడు. 

  మనం కూడా ఈ భూమి మీద జన్మించకమునుపే దేవుడు మనలను ప్రేమించాడు. అయితే యేసు క్రీస్తు కు మనకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే. ఆయన భూమి మీద జన్మించక మునుపే పరలోకములో ఉన్న వాడు. మనం అలా కాదు. మనం భూమి మీద జన్మించక మునుపు మనకు ఉనికి (existence) లేదు. 

రోమన్, గ్రీకు దేవతలు 

   దేవుని యొక్క గొప్ప లక్షణం అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. క్రైస్తవ్యం లో  దేవుడు ఒక్కడే. ఆయన మానవ జాతికి వేరుగా ఉన్న వాడు. ఈ ఊరిలో ఒక రకముగా, ఇంకో ఊరిలో మరొక రకముగా ఆయన ఉండడు. ఆయన స్వభావంలో మార్పు లేదు. అయితే గ్రీకు, రోమన్ దేవతలు అలా కాదు. ఈ ఊరు నాది, ఆ ఊరి నీది అంటూ వారు రకరకాలుగా ఉంటారు. వారు మనుష్యులతో కలిసి పోయి ఉంటారు. మనుష్యులను భార్యలుగా, భర్తలుగా చేసుకొని మనుష్యులతో కలిసి ఈ దేవతలు ఉంటారు. అయితే క్రెస్తవ్యం బోధించే దేవుడు మనుష్యులతో కాపురం చేసే వాడు కాదు. 

     ఈ పురాతన మతాలను మిస్టరీ మతాలు అన్నారు. డేమేటర్ ఒక మిస్టరీ దేవత. డయోనైసస్ ఒక మిస్టరీ దేవత. ఈ దేవతల రహస్యాలు తెలుసుకోవడానికి ప్రజలు జోతిష్యులను ఆశ్రయించేవారు. ఈ దేవతలకు అనేక పూజలు, బలులు, అర్పణలు వారు చేస్తుండేవారు. వాటి ఎదుట ఉత్సవాలు చేస్తూ ఉండేవారు. ఈ ఉత్సవాల్లో తినడం, త్రాగడం, డాన్సులు వేయడం, లైంగిక కార్యాలు ఉండేవి. వీళ్ళు చేసే పనులు చూడలేక రోమన్ సెనెట్ క్రీస్తు శకం 186 లో డయోనైసస్ ఆరాధన ను అరికట్టే చర్యలు తీసుకొంది. 

     అపోస్తలుడైన పౌలు ఎఫెసు వెళ్ళేటప్పటికి ఆ ప్రాంతం మొత్తం అర్తెమి దేవత ఆరాధనలో మునిగిపోయి ఉంది. పౌలు గారు సువార్త ప్రకటించి ఆ ఊరిలో గొప్ప మార్పు తెచ్చాడు. అక్కడ విగ్రహాలు అమ్మే వ్యాపారస్తులకు పౌలు మీద చాలా కోపం వచ్చింది. ‘ఈ విగ్రహాలు ఒట్టివే. వాటిని నమ్మవద్దు. జీవం కలిగిన దేవుని వైపు తిరగండి’ అని పౌలు ప్రకటించడం వలన వారి విగ్రహాలు కొనే వారు లేరు. పూలు, విగ్రహాలు అమ్మే చోట నిలబడి గమనించండి. వారు ఎన్నో మోసాలు చేస్తూ ఉంటారు. 

పౌలు వలన వారి వ్యాపారం దెబ్బతింది. ‘ఎఫెసీయుల అర్తెమి దేవత మహా గొప్ప దేవత’ అని వారు పెద్దగా కేకలు వేశారు. పౌలు గారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తప్పించుకున్నాడు. 

   నేను ఎఫెసు వెళ్ళినప్పుడు ఈ అర్తెమి దేవత ఆలయం ఉన్న చోటికి వెళ్ళాను. ఇప్పుడు ఒక చిన్న పిల్లర్ మాత్రం అక్కడ మిగిలి ఉంది. 

అవకాశం, విధి 

   chance (అవకాశం), fate (విధి)  పురాతన ప్రజల జీవితాలను శాసిస్తూ ఉండేవి. ఛాన్స్ అంటే టైకే (tyche) . విధి అంటే హాయ్ మార్ మేనె (Heimarmene). దేవతల కంటే బలమైన శక్తులుగా ప్రజలు వీటిని చూసేవారు. విధి ఎలా వుంది? నా తల రాత ఎలా ఉంది? అని వారు విచారిస్తూ ఉండేవారు. మా విధి ని మార్చుకోవాలి అని వారు ఈ మిస్టరీ మతాల్లో చేరి, దేవతల సహాయం కూడా తీసుకొనేవారు. అనేక ఫిలాసఫర్లు, అనేక మతాలు, అనేక తీర్ధ యాత్రలు, అనేక బలులు ఈ తల రాత మార్చడానికి వారు వాడేవారు. 

   అటువంటి వారికి అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసు పత్రిక వ్రాశాడు. నా ఛాన్స్ ఏమిటి? నా ఫేట్ ఏమిటి? నా తల రాత ఏమిటి? నా విధి ఎలా ఉంది? అని మీరు పరుగెత్తవలసిన అవసరం లేదు. మీరు జగత్తు పునాది వేయకమునుపే దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈ ప్రపంచము సృష్టించబడక మునుపే మీరు దేవుని చేత ప్రేమించబడినవారు. అది ఎంత గొప్ప సత్యమో మీరొక సారి ఆలోచించండి.  ఈ దేవుడు అంత గొప్ప వాడు. 

  మనిషి బైబిల్లో దేవుని కూడా చిన్నగా మార్చాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎఫెసు లో మరియమ్మ ఆరాధన కూడా మొదలయ్యింది. ఎఫెసీయుల దేవతల రూపములోనే మరియమ్మ గారిని కూడా ఒక దేవతగా మార్చివేశారు. అటువంటి పిచ్చి పనులకు మనం దూరముగా ఉండాలి. 

అపోస్తలుడైన పౌలు గారు ఈ వాక్యభాగములో ఉపయోగించిన రెండు పదములు మీరు గమనించండి. 

Exelexato ἐξελέξατο

Proorisas προορίσας

   Exelexato అంటే నిర్ణయించుట; Proorisas అంటే ఏర్పరచుకొనుట.  

జగత్తు పునాది వేయకమునుపే అంటే ఈ విశ్వమును సృష్టించక మునుపే, దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నందు మిమ్ములను నిర్ణయించుకున్నాడు. ఏర్పరచుకున్నాడు. 

   ఈ సత్యాలు అర్థం చేసుకోవటం కష్టమే. మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. శామ్యూల్ కి 5 సంవత్సరములు. శారా కి 3 సంవత్సరములు. ఈ మధ్యలో నేను వారికి కొన్ని ఫోటోలు చూపిస్తున్నాను. అవి మేము గలాపగోస్ దీవులలో ఒక బీచ్ లో తీసిన ఫోటోలు. 2019 లో ఆ ఫోటోలు నేను తీశాను. శామ్యూలు  ఆ ఫోటోలు చూస్తూ ఉన్నాడు. శారా ఆ ఫోటోలు చూస్తూ ‘నేను ఎక్కడ ఉన్నాను, డాడీ నన్ను అడిగింది.‘శారా, నువ్వు అప్పటికి ఇంకా పుట్టలేదు’ అని చెప్పాను. ‘నేను పుట్టక మునుపు ఎక్కడ ఉన్నాను?’ అని అడిగింది. మూడు సంవత్సరాల పిల్ల చాలా ఆసక్తి కరమైన ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న నాకు ఆసక్తి కలిగించింది. 

మీరు పుట్టక మునుపు మీరు ఎక్కడ ఉన్నారు? 

తల్లి గర్భములో పడక మునుపు మీరు ఎక్కడ ఉన్నారు? 

మీ శరీరం లేనప్పుడు, మీ ఆత్మ లేనప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? 

మీరు దేవుని మైండ్ లో ఉన్నారు. మీరు దేవుని హృదయములో ఉన్నారు. 

జగత్తు పునాది వేయబడక మునుపే అంటే ఈ ప్రపంచం ఉనికి లోకి రాకమునుపే, ఈ విశ్వం ఉనికి లోకి రాక మునుపే దేవుడు మిమ్ములను చూసాడు. ఈ ప్రపంచములో మీరు పుట్టడం ఆక్సిడెంట్ కాదు. మీరు దేవుని నమ్ముకోవడం ఆక్సిడెంట్ కాదు. Exelexato అంటే దేవుడు మిమ్మును నిర్ణయించుకున్నాడు. Proorisas అంటే దేవుడు మిమ్మును ఏర్పరచుకొన్నాడు. 

  మొదటి నుండి దేవుడు నిర్ణయాలు తీసుకోవడం, ఏర్పరచుకోవడం చేస్తూనే ఉన్నాడు. ఈ విశ్వాన్ని సృష్టించాలి అని దేవుడు ఒక నిర్ణయం తీసుకొన్నాడు. దేవుడు ఆ నిర్ణయం తీసుకోపోతే ఈ ప్రపంచం ఉండేది కాదు, మనం ఉండేవాళ్ళం కాదు. 

  ఈ ప్రపంచం సృష్టించిన తరువాత మనిషిని సృష్టించాలి అని దేవుడు నిర్ణయం తీసుకొన్నాడు. దేవుడు ఆ నిర్ణయం తీసుకోపోతే మనుష్యులు ఉండేవారు కాదు. మనం ఉండేవాళ్ళం కాదు. 

 దేవుడు ఎన్నిక చేసుకునేవాడు. 

దేవుడు ఆదామును ఎన్నుకున్నాడు. 

హేబెలు ను ఎన్నుకున్నాడు. 

నోవహు ను ఎన్నుకున్నాడు. 

ఈ ప్రపంచములో ఉన్నారు. 

వారిలో నోవహును ఎన్నుకున్నాడు. 

అబ్రాహామును ఎన్నుకున్నాడు. కోట్లమంది ప్రజలు ఈ ప్రపంచములో వున్నారు.వారిలో దేవుడు అబ్రాహామును ఎన్నుకున్నాడు.కోట్ల మంది ప్రజలు అబ్రహాముకు చాలా మంది కుమారులు ఉన్నారు కానీ దేవుడు  ఇస్సాకును ఎన్నుకున్నాడు. 

ఇస్సాకు కుమారుల్లో యాకోబును ఎన్నుకున్నాడు. 

ఆయన 12 కుమారులను ఎన్నుకున్నాడు. వారిలో నుండి ఇశ్రాయేలీయులు వచ్చారు. 

భూమి మీద ఎంతో మంది వున్నారు. వారినే ఎందుకు ఎన్నుకున్నాడు? 

ఇశ్రాయేలీయుల గొప్ప తనం ఏమీ లేదు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు అంతే. 

మోషే ను ఎన్నుకున్నాడు. అది ఆయన  గొప్పతనం కాదు. అది దేవుని చిత్తం. అది దేవుని ఇష్టం. 

సమూయేలు, సౌలు, దావీదు, సొలొమోను, యెషయా, యిర్మీయా, దానియేలు, యెహెఙ్కేలు….

వారందరూ దేవుని చేత ఎన్నుకోబడ్డారు. 

   యేసు క్రీస్తు ప్రభువు కూడా పండ్రెండు మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఈ ప్రపంచములో కోట్లమంది జనం వున్నారు. వారిలో నుండి ఆ పండ్రెండు మందిని దేవుడు కోరుకున్నాడు. 

ఇల్లు ప్లాన్ 

ఒక ఇల్లు మీరు కట్టాలంటే ముందు ఒక ప్లాన్ గీసుకొంటారు. 

ఇన్ని పునాదులు వేద్దాము. 

ఇన్ని తలుపులు పెట్టుకొందాము. 

ఇన్ని ఇటుకలు కావాలి 

ఇంత సిమెంట్ కావాలి 

ఇక్కడ లివింగ్ రూమ్ ఉండాలి

ఇక్కడ వంటగది ఉండాలి 

ఇక్కడ బెడ్ రూమ్ ఉండాలి అని 

పక్కాగా ప్లాన్ వేసుకొని పని మొదలు పెడతారు. 

దేవుడు కూడా పక్కాగా ఒక ప్లాన్ గీసుకొని తన పని మొదలు పెట్టాడు. 

   ప్రకటన గ్రంథం 21 అధ్యాయములో మనం చదువుతాము. పరలోక దేశానికి 12 గుమ్మములు ఉన్నాయి. ఈ పండ్రెండు గుమ్మముల మీద యాకోబు కుమారులు 12 మంది పేరులు దేవుడు వ్రాయించాడు. 

రూబేను, షిమ్యోను, లేవి, యూదా, 

దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, 

ఇషాకారు,జెబూలూను, యోసేపు, బెన్యామీను 

   ఈ పండ్రెండు మంది పేరులు మాత్రమే నేను నా ఇంటి ద్వారముల మీద వ్రాస్తాను అన్నాడు. ఆ పండ్రెండు మంది పేరులే ఎందుకు వ్రాశావు. నా పేరు కూడా వ్రాయి అని దేవుని మనం అడగలేము. 

   పరలోక దేశానికి 12 పునాదులు కూడా  ఉన్నాయి. ఆ పునాదుల మీద పండ్రెండు మంది అపోస్తలుల పేరులు దేవుడు వ్రాశాడు. 

పేతురు, యాకోబు, యోహాను 

అంద్రెయ,ఫిలిప్పు, బర్తొలొమయి, 

మత్తయి, అల్ఫాయ కుమారుడగు యాకోబు, తోమా,

 తద్దయి, సీమోను, మత్తీయ – 

    ఈ పండ్రెండు మంది పేరులు దేవుడు పరలోకం పునాదుల మీద వ్రాశాడు. 

పాత నిబంధన మొత్తం యాకోబు యొక్క పండ్రెండు కుమారుల మీద వ్రాయబడింది. 

క్రొత్త నిబంధన మొత్తం యేసు ప్రభువు పండ్రెండు మంది శిష్యుల మీద వ్రాయబడింది. 

క్రొత్త నిబంధన దేవుని ఇంటికి పునాది. 

పాత నిబంధన తలుపులు లాంటిది. 

  ఈ ఇంటిని  ఎలా కట్టాలో, అందులో  ఏది ఎక్కడ ఉండాలో అందులోకి  ఎవరిని ఆహ్వానించాలో దేవునికి స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఈ భూలోక సంబంధమైన ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. 

   మొన్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. ఆ మ్యాచ్ జరిగే రోజు, సమయం, స్టేడియం, ఏ జట్టులో ఎవరు ఆడతారు, ఎవరు ఎంపైర్ లు గా వుంటారు? అవన్నీ ముందుగా నిర్ణయించబడ్డాయి.  భారత జట్టులో ఎవరు ఆడేది ముందుగా నిర్ణయించబడుతుంది. ‘నేను కూడా ఆడుతాను’ అని మనం బ్యాట్ తీసుకొని వెళ్తే మనల్ని లోపలికి రానివ్వరు. సెలెక్ట్ చేయబడిన వారికి మాత్రమే మైదానం లోకి అడుగు పెట్ట గలరు. దేవుడు కూడా తన జట్టులో ఆడేది ఎవరో ముందుగా నిర్ణయిస్తాడు. కెప్టెన్ పిలుస్తాడు: ఈ ఓవర్ నువ్వు బౌలింగ్ చేయి. ఇప్పుడు నువ్వు బాటింగ్ చేయి. దేవుడు కూడా ఎవరు తన తరుపున పని చేయాలో నిర్ణయిస్తాడు.

    దేవుడు ఎవరిని, ఎప్పుడు, ఎందుకు ఎన్నుకొంటాడో మనం ఊహించలేము. ఆయన నిర్ణయాలు మనకు మిస్టరీ గా ఉంటాయి. ప్రతి విషయం అర్ధం చేసుకోవాలని మనం పట్టుబట్టకూడదు.    మానవ స్వభావం దానికి ఒప్పుకోదు. ప్రతిదీ నాకు తెలియాల్సిందే అని మనం పట్టుబట్టకూడదు. 

  ఆల్బర్ట్ అయిన్స్టెయిన్ లాంటి సైంటిస్టులు థియరీ అఫ్ ఎవిరి థింగ్ అనే సిద్ధాంతమును ప్రతిపాదించారు. థియరీ ఆఫ్ ఎవిరి థింగ్ – ప్రతి దాని గురించి నాకు తెలియాల్సిందే.  అలాంటి వ్యక్తితో దేవుడు ఏమంటాడంటే, you just scratched the surface. You just scratched the surface. నీకు తెలిసింది చాలా తక్కువ. 

నువ్వు తెలుసుకోవలసినది ఎంతో వుంది. నువ్వు తెలుసుకోగలిగింది చాలా తక్కువ. 

    కాబట్టి మనకు తెలిసింది, మనం తెలుసుకోగలిగింది చాలా తక్కువ. ఎందుకంటే మనకు ఎన్నో పరిమితులు వున్నాయి. 

   మన సంతోషం మన జ్ఞానం మీద ఆధారపడి వుండకూడదు. ఆల్బర్ట్ ఐన్స్టెయిన్ గొప్ప సైంటిస్ట్. థియరీ ఆఫ్ రెలెటివిటీ అనే గొప్ప సిద్ధాంతమును ఆయన కనుగొన్నాడు. ఆయన వ్రాసింది అర్థం చేసుకోవాలంటేనే ఎంతో సైంటిఫిక్ మైండ్ ఉండాలి. మాథెమాటిక్స్ లో, ఫిజిక్స్ లో ఎంతో ట్రైనింగ్ ఉంటే తప్ప అవి అర్థం కావు. ఆల్బర్ట్ ఐన్స్టెయిన్ సిద్ధాంతాలు ఎంతో సంక్లిష్టమైనవి. ఒక సారి ఆయన భార్య ఎల్సా ను ఒక జర్నలిస్ట్ అడిగాడు. మీ భర్త ఐన్స్టెయిన్ వ్రాసిన థియరీ ఆఫ్ రెలెటివిటీ మీకు అర్థం అయిందా?. ఆమె యేమని సమాధానం ఇచ్చిందంటే, that is not required for my happiness. నా సంతోషానికి అది అవసరం లేదు. 

   ఆమె ఐన్స్టెయిన్ తో కలిసి జీవించడములోనే సంతోషం పొందింది. ఆయన సైంటిఫిక్ సిద్ధాంతాలు అర్థం చేసుకోవాలి అని ఆమె బుర్ర చించుకోలేదు. ఈ రోజు మనం కూడా దేవునితో కలిసి ప్రయాణించడములోనే మన ఆనందం పొందాలి. దేవుని మిస్టరీ లు ఛేదించడములో మనకు విశ్రాంతి ఉండదు. 

   చంద్రుని మీదకు వెళ్లాలంటే, క్వాంటమ్ ఫిజిక్స్ అక్కర లేదు. యూనివర్స్ యొక్క వేవ్ ఫంక్షన్ తెలుసుకోవలసిన అవసరం లేదు. న్యూటన్ సిద్ధాంతాలు తెలుసుకుంటే చాలు. అదే విధముగా పరలోకం వెళ్లాలంటే, బైబిల్ లో ఉన్న అన్ని మిస్టరీ లు మనము అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. 

  ఒకాయన ఏమన్నాడంటే if you reject the doctrine of election, you will lose your soul. If you try to understand it, you will lose your mind. 

ఈ సత్యాన్ని తిరస్కరిస్తే నీ ఆత్మను కోల్పోతావు.ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే నీ బుర్ర కోల్పోతావు. నేను చెప్పేదేమిటంటే, ఈ సత్యాన్ని తిరస్కరించబాకండి. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించబాకండి. నీ ఆత్మను కోల్పోవద్దు,నీ బుర్ర కోల్పోవద్దు, నీ హృదయములో దేవుని ప్రేమించు చాలు. అవిశ్వాసులు కూడా ఈ సత్యం వలన దేవుని నిందించకూడదు. ‘దేవుడు నాకు అన్యాయం చేశాడు. నన్ను ఎన్నుకోలేదు’ అని మనం అనకూడదు.  ‘నిన్ను నేను ఎన్నుకోలేదు’ అని దేవుడు నీకు చెప్పాడా? ‘నేను నిన్ను ఎన్నుకోలేదు, నా దగ్గరకు రాబాకు’ అని దేవుడు నీతో అన్నాడా? నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను’ అని యేసు ప్రభువు చెప్పాడు. దేవుడు నన్ను ఎన్నుకోలేదు, అందుకనే నేను దేవుని దగ్గరకు రావటల్లేదు అని ఎవరూ అనకూడదు. 

   నువ్వు వచ్చావా? దేవుని స్తుతించు. నీవు దేవుని చేత ప్రేమించబడ్డావు. దేవుని చేత నిర్ణయించబడ్డావు. దేవుని చేత ఏర్పరచుకోబడ్డావు. దేవుని చేత పిలువబడ్డావు. దేవుని చేత విమోచించబడ్డావు. ఎఫెసీ పత్రిక ప్రారంభములో కనిపిస్తున్న ఈ గొప్ప సత్యం మనం అర్థం చేసుకోవాలి. 

క్రీస్తు నందు దేవుని యొక్క ఐశ్వర్యం 

  ఎఫెసీ పత్రికలో మనకు కనిపించే మరొక ముఖ్య సత్యం ఏమిటంటే దేవుని యొక్క ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ప్రతి విశ్వాసిని వరించింది. దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు మనకు అర్థం కావాలంటే మనం ఆయన ఇంటికి వెళ్ళాలి. ఈ ఎఫెసీ పత్రికను దేవుని ఇల్లు లాగా మనం చూడవచ్చు. ఈ ఇంటిలోకి వెళ్లి మనం దేవుని ఐశ్వర్యం చూడాలి. ఎందుకంటే దేవుడు తన ఐశ్వర్యాన్ని మనతో పంచుకొంటున్నాడు. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ఇందులో మనకు కనిపిస్తుంది. 

   నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. దగ్గుతో బాధ పడుతున్నాడు. ఆయన చాలా సాధారణముగా కనిపించాడు. ఆయనకు నేను వేసిన ఫీజులో కొంత డిస్కౌంట్ ఇచ్చాను. ఆయన ఒక రోజు నన్ను ‘మా ఇంటికి రండి. కాఫీ తాగి వెళ్ళండి’ అన్నాడు. నేను ఆయన ఇంటికి వెళ్ళాను. అది ఒక కొండ ప్రక్కన తొలచబడి ఉంది. దాని ముందు ఒక అందమైన లోయ ఉంది. పెద్ద ఇల్లు. అందులో ఒక వైపు నుండి: ఇంకో వైపుకు నడవడానికి నాకు 15 నిమిషాలు పట్టింది. ఈయన చాలా ధనవంతుడు. అనవసరముగా ఈయనకు డిస్కౌంట్ ఇచ్చానే అని నాకు అప్పుడు అనిపించింది. బయట మనకు చాలా సాధారణముగా కనిపించే మనిషి ఇంత ధనవంతుడా అని నేను అనుకొన్నాను. నేను సమయం తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళాను కాబట్టి నాకు ఆయన ఐశ్వర్యం అర్థమయింది. 

     యేసు క్రీస్తు ప్రభువు కూడా మనకు సామాన్యముగా కనిపించవచ్చు. పశువుల పాకలో జన్మించి, తల వాల్చుటకు కూడా స్థలము లేకుండా జీవించిన వ్యక్తి నాకేమి ఇస్తాడు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆయన వెనుక చెప్పలేనంత పరలోకపు ఐశ్వర్యం దాగివుంది. 

ఈ ఎఫెసీ పత్రికలో నాలుగు ఐశ్వర్యాలు మనకు కనిపిస్తున్నాయి. 

ఇందులో మనకు కనిపిస్తుంది. 

1:7 లో దేవుని కృపామహదైశ్వర్యము Riches of His Grace 

2:7 దేవుని కరుణా మహదైశ్వర్యము Riches of His Mercy 

3:10 క్రీస్తు ఐశ్వర్య ము Riches of Christ 

3:17 దేవుని  మహిమైశ్వర్యము Riches of His Glory 

    ఎంత చక్కటి మాటలు! దేవుని కృపామహదైశ్వర్యము, దేవుని కరుణా మహదైశ్వర్యము,  దేవుని  మహిమైశ్వర్యము, క్రీస్తు ఐశ్వర్య ము 

1:7 Riches of His Grace 

1:7; 2:7 దేవుని కృపామహదైశ్వర్యము

1:7 –  దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది

దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు  విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి యున్నది. 

దేవుని కుమారుడు తన రక్తం ఎందుకు చిందించాడు? 

మనకు విమోచన ఎలా దొరికింది? 

మన అపరాధములకు క్షమాపణ ఎలా కలిగింది? 

దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి. 

ఇంగ్లీష్ లో మంచి అర్థం ఉంది. 

The Riches of His Grace 

The riches of His grace which He lavished upon us

తన కృపా మహదైశ్వర్యము మన మీద కుమ్మరించాడు. 

lavish 

ఎవరన్నా మంచి పార్టీ ఇస్తే, భలే లావిష్ గా చేశావే అంటాము. 

ఎవరన్నా మంచి విందు చేస్తే, చాలా లావిష్ గా చేశావే అంటాము. 

దేవుడు చాలా లావిష్ గా మన మీద తన కృపను కుమ్మరించాడు. 

దేవుడు మన పట్ల చూపే కృపలో ఐశ్వర్య వంతుడు. 

సర్వ కృపానిధి యగు దేవుడు (1 పేతురు 5:10) 

దేవుని కృప ఆకాశము కంటే ఎత్తయినది (కీర్తన 57:9)

   పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది (రోమా 5:21). ఐగుప్తు దేశములో ఒక బానిసగా అమ్మబడిన యోసేపుకు దేవుడు కృప చూపించాడు (అపోస్తలుల కార్యములు 7:10). ఏలీయా కాలములో ఇశ్రాయేలు దేశము పూర్తిగా పాడైపోయింది. బయలు దేవతకు మ్రొక్కని వారు 7000 మంది మాత్రమే మిగిలారు. ఆ మాత్రం అన్నా మిగిలారంటే అది దేవుని కృపే (రోమా 11:5). 1 పేతురు 1:10 – మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు. పాత నిబంధనలో కనిపించే ప్రవక్తలందరూ ఈ కృప గురించి ప్రవచించారు. 

2 కొరింథీ 8:9 –

మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.

ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై (తీతు 2:11). 

అత్యధికమైన తన కృపామహదైశ్వర్యం మనకు చూపించాడు. 

ὑπερβάλλον πλοῦτος τῆς χάριτος 

అత్యధికమైనవి దేవునికే సాధ్యం. పౌలు గారు నాలుగు సార్లు ఆ మాట వాడాడు. 

అత్యధికమైన మహిమ (2 కొరింథీ 3:10) 

అత్యధికమైన మహాత్యము (ఎఫెసీ 1:18) 

అత్యధికమైన జ్ఞానం (ఎఫెసీ 3:19) 

అత్యధికమైన కృప (2 కొరింథీ 9:14) 

   దేవుడు అత్యధికమైన మహిమ కలిగిన వాడు. ఆయన కన్నా ఎక్కువ మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. 

అత్యధికమైన మహాత్యము కలిగిన వాడు. ఆయన కన్నా ఎక్కువ మహాత్యము ఇంకెవ్వరికీ ఉండదు. 

అత్యధికమైన జ్ఞానం కలిగిన వాడు. ఆయన కన్నా ఎక్కువ జ్ఞానం ఇంకెవ్వరికీ ఉండదు. 

అత్యధికమైన కృప కలిగిన వాడు. ఆయన కన్నా ఎక్కువ కృప ఇంకెవ్వరికీ ఉండదు. 

ఈ అత్యధికమైన కృప వలన దేవునికి మన ఎడల దయ కలిగింది. ఈ కృప మనలను పాపము, నరకము ల నుండి రక్షించడం మాత్రమే కాకుండా మనలను పరలోకానికి కూడా తీసుకు వెళ్ళింది. 

Hyperballon: hyperbole 

     మా ఇంట్లో విందు చేస్తే వూరు మొత్తం వచ్చింది. సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా పరుగెత్తాను. గొప్పలు చెప్పుకోవటానికి మనం అతిశయోక్తులు వాడుతూ ఉంటాము. దేవుడు అలాంటి పని చేయడు. హైపర్ బోళా – దేవుని విషయములో సత్యమే. దేవుడు ఎవ్వరూ తప్పించుకోలేరు అంటే ఎవ్వరూ తప్పించుకోలేరు. నోవహు ఓడలో ఎనిమిది మంది ఎక్కారు. ప్రపంచములో మిగిలిన ప్రతి ఒక్కరూ జల ప్రళయములో జల సమాధి అయిపోయారు. మీ తల వెండ్రుకలలో ఒక్కటి కూడా నాశనం కాదు అని యేసు ప్రభువు అన్నాడు. ఆ మాట మీరు నమ్మవచ్చు ఎందుకంటే దేవుడు అత్యధికమైన శక్తి కలిగిన వాడు.

2:4-5 Riches of His Mercy 

రోమా 2:4 దేవుడు దయ చూపించుటలో ఐశ్వర్యవంతుడు. Rich in Kindness

2:4,5

4 అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, 

మనము మన అపరాధములచేత 

చచ్చినవారమై యుండినప్పుడు సయితము

 మనయెడల చూపిన తన మహా ప్రేమచేత

 మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.

5 కృపచేత మీరు రక్షింపబడియున్నారు.

దేవుడు కరుణా సంపన్నుడు. Rich in Mercy 

కరుణలో ఆయన ఐశ్వర్యవంతుడు 

అందుకనే మన పాపములలో చచ్చినవారమై మనం ఉండినప్పుడు మన యెడల దేవుడు మహా ప్రేమ ను చూపించాడు. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేత మనలను రక్షించాడు. చచ్చిన వారి దగ్గరకు వెళ్లాలంటే సామాన్యమైన విషయం కాదు. ‘గబ్బు, గబ్బు – దుర్వాసన. నేను అటు రాను’ అని మనం అంటాము. అలాంటి వారి దగ్గరకు నేను వెళ్లడం ఎందుకులే అని మనం సమర్ధించుకొంటాము. చచ్చిన స్థితిలో ఉన్న వాని దగ్గరకు వెళ్లాలంటే ఎంతో కరుణ ఉండాలి. కరుణా సంపన్నుడై ఉండాలి. 

Θεὸς πλούσιος ὢν ἐν ἐλέει

థియాస్ ప్లూసియస్ ఆన్ ఎన్ ఏలియై 

     నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను. నిర్గమ 20:6. దేవుడు మోషేతో అన్నాడు: యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా (నిర్గమ 34:6). దేవుడు ఏమన్నాడు? హెసెడ్ హపా స్తి.  నేను కనికరమును కోరుచున్నాను. బలిని కాదు. హోషేయ 6:6 

חֶ֥סֶד

חָפַ֖צְתִּי

   దేవుడు అబ్రహాము ను కరుణించాడు (ఆదికాండము 24:12,14). అబ్రహాము చచ్చిన స్థితిలో ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? అబ్రహాము, నేను నిన్ను, నీ సంతానాన్ని కరుణించాలని కోరుకొన్నాను. అబ్రహాము ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. నేను చచ్చే స్థితిలో ఉన్నాను దేవా. నాకు సంతానము ఏమిటి? నువ్వు నన్ను ఎన్నుకోవడం ఏమిటి? 

   చనిపోయేటప్పుడు యాకోబు తన కుమారుడు యోసేపు ను తన దగ్గరకు పిలిచాడు. అయ్యా, యోసేపు, నన్ను ఈ ఐగుప్తు దేశములో నన్ను పాతిపెట్టవద్దు. నా మీద కరుణ ఉంచి నన్ను నా తల్లిదండ్రులతో సమాధి చేయి. 

    యాకోబు చనిపోయే స్థితిలో ఉన్నాడు. చనిపోయిన వాడు ఇక ఏ పనీ చేయలేడు. చిన్న పని కూడా చేయలేడు. కరుణించు నాయనా అని తన కుమారుని బ్రతిమ లాడుకోవలసిన పరిస్థితి యాకోబు కు కలిగింది. యోసేపు తన తండ్రికి మాట ఇచ్చాడు. అతని కరుణించి, ఇచ్చిన మాటను బట్టి అతని మృతదేహానికి అంత్య క్రియలు జరిపించాడు. 

     రాహాబు అనే వేశ్య యెరికో గోడ మీద నివశిస్తున్నది. యెహోషువ వేగుల వారిని యెరికో పంపించాడు. ఇశ్రాయేలీయులు యెరికో మీద దండయాత్ర చేసి ప్రజలందరినీ ఊచకోత కోస్తారని ఆమెకు అర్థం అయ్యింది. ఆమె ఆ వేగుల వారిని బ్రతిమ లాడు కొంది. అయ్యా, నన్ను కరుణించండి. నన్ను చంపబాకండి. నా ఫ్యామిలీ ని, నా బంధువులను కూడా చంపబాకండి. 

   ఇశ్రాయేలీయులు ఆమెను కరుణించారు. నీ ఇంటికి ఎఱ్ఱని దారము కట్టుకో. లోపలే ఉండు. నిన్ను, నీ ఫామిలీ ని చంపము’ (యెహోషువ 2:14). రూతు తన భర్తను కోల్పోయి విధవరాలుగా ఉంది. నయోమి ఆమెతో అంది, ‘దేవుడు నిన్ను కరుణిస్తాడు’ (రూతు 1:8). 

  సౌలు రాజు దావీదును చంపాలని తరుము కుంటూ వెళ్తున్నాడు. సౌలు కుమారుడు యోనాతాను దావీదుకు స్నేహితుడు. దావీదు యోనాతానును బ్రతిమాలాడుకొన్నాడు. ‘యోనాతాను, మీ నాన్న నన్ను చంపాలని నిద్రాహారాలు మానుకొని నన్ను తరుముతున్నాడు. నాకు, మరణమునకు మధ్య అడుగు మాత్రం ఉంది. నన్ను కరుణించు యోనాతాను. నువ్వే నన్ను చంపేసెయ్’. దావీదుకు  జీవితము మీద విరక్తి కలిగింది. నన్ను కరుణించు, నన్ను చంపేసెయ్’ మెర్సీ కిల్లింగ్ అంటారు దీన్ని. (1 సమూయేలు 20:1-8). 

   యోనాతాను దావీదును కరుణించాడు. కొంతకాలానికి సౌలు రాజు, యోనాతాను యుద్ధములో ప్రాణాలు కోల్పోయారు. దావీదు ఇశ్రాయేలు దేశానికి రాజయ్యాడు. దేవుడు దావీదును కరుణించాడు (కీర్తన 18:50). దావీదు దేవుడు చూపించిన కరుణను బట్టి ఆయనను స్తుతించాడు (2 సమూయేలు 22: 51) 

ఒక రోజు అతనికి యోనాతాను గుర్తుకు వచ్చాడు. దావీదు తన సేవకులను అడిగాడు, ‘యోనాతానును బట్టి నేను కరుణించడానికి సౌలు కుటుంబములో ఎవరన్నా ఉన్నారా?’ వారు ఏమని చెప్పారంటే, ‘యోనాతానుకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు మెఫీబోషెతు. అతడు కుంటి వాడు. ఆ కుంటి వాణ్ని దావీదు రాజు కరుణించాడు. తన అంతఃపురములో తన బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసేటట్లుగా చేశాడు. חֶ֙סֶד֙ అంటే అదే. (2 సమూయేలు 9:7). 

   దావీదు ఎవరైనా ఆయనను కరుణిస్తే వారి కుటుంబానికి తిరిగి కరుణ చూపిస్తాడు. అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పారిపోవలసి వచ్చింది. చాలా మంది ఆ పరిస్థితిలో దావీదును కరుణించారు. 

చనిపోక ముందు దావీదు సొలొమోను రాజు ను పిలిపించి ఏమన్నాడు? సొలొమోను, నీ సోదరుడు అబ్షాలోము దగ్గర నుండి నేను పారిపోతున్నప్పుడు, ఫలానా, ఫలానా వారు నన్ను కరుణించారు. నువ్వు ఇప్పుడు వారిని కరుణించాలి. వారికి నీ బల్ల దగ్గర భోజనం పెట్టు అన్నాడు (1 రాజులు 2:7). దావీదు కరుణించబడ్డాడు. తన మీద కరుణ చూపించిన వారిని ఆయన మరచిపోలేదు. 

   సొలొమోను ను చంపాలని చాలా మంది ప్రయత్నించారు. సొలొమోను రాజైన తరువాత ప్రార్థన చేసాడు, ‘దేవా, నన్ను రాజును చేశావు. నువ్వు కరుణించడం వలనే నేను రాజును అయ్యాను’ అని దేవుని స్తుతించాడు. (2 దినవృత్తాంతములు 1:8)

   ఇశ్రాయేలీయులు బబులోను దేశములో 70 సంవత్సరములు దాస్యములో ఉన్నారు. వారిని తిరిగి ఇశ్రాయేలు దేశము తేవాలంటే అది మనుష్యుల వలన సాధ్యమయ్యేది కాదు. దేవుడు కరుణించాల్సిందే (ఎజ్రా 7:28; 9:9). ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడు, కరుణించే దేవుడు (నెహెమ్యా 9:17). 

   పర్షియా దేశములో ఎస్తేరు తల్లి, దండ్రులు లేకుండా పెరుగుతున్న యువతి. ఆమెను చూసినప్పుడు ఆ దేశము రాజు అహష్వేరోషు కు ఆమె మీద కరుణ కలిగింది (ఎస్తేరు 2:9). ఆ కరుణ వలన ఆమె తన ప్రజలను ఆ దేశములో మృత్యువాత పడకుండా కాపాడుకోంది. రాహాబు కరుణించబడి తన కుటుంబాన్ని కాపాడుకొంది. ఎస్తేరు కరుణించబడి తన దేశాన్ని కాపాడుకొంది. కరుణ ఎంతో శక్తి కలిగిన భావోద్వేగం. ఆ విధముగా కరుణ రక్షించేది. 

   ఇశ్రాయేలీయులు ఈ రోజు వరకు బ్రతికి ఉన్నారంటే అది దేవుడు అబ్రహామును కరుణించడం వలనే సాధ్యపడింది. హెసెడ్ (Hesed) లేకపోతే వారు ఎప్పుడో కనుమరుగు అయిపోయేవారు (మీకా 7:20). 

హెసెడ్: కరుణించేది, మాట నిలుపుకొనేది, ప్రత్యుపకారం చేసేది. 

    దేవుడు ఇశ్రాయేలీయులను ఎంతో కరుణించాడు. వారు దేవుని మీద తిరుగబడినప్పుడు, దేవుడు అన్యజనులను కూడా కరుణించాడు. ఇశ్రాయేలీయుల పట్ల, అన్య జనుల పట్ల – అందరి పట్ల దేవుడు కరుణ చూపించాడు. కరుణ చూపించడం ఆయనకు ఇష్టం. రోమా పత్రిక 11 అధ్యాయములో మనం చదువుతాము. 

అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు. రోమా 11:32 

  దేవుడు నినివే పట్టణస్తులను నాశనం చేయకుండా కరుణించాడు. అది చూసి యోనా గారికి దేవుని మీద కోపం వచ్చింది. నువ్వు ఇలాంటి వాడి వని నాకు బాగా తెలుసు. నేను నీ దగ్గర నుండి పారిపోయిందే అందుకు. నన్ను చంపు, పీడా వదలిపోద్ది’ అని దేవుని మీద కోపం ప్రదర్శించాడు. దేవుడు ఏమన్నాడు, ‘120 వేల మంది ఈ దేశములో ఉన్నారు. వాళ్లందరినీ చంపేయ మంటావా?’. 

(యోనా 4:2) 

ఆయన కరుణ చూపించడములో సంతోషించేవాడు (మీకా 7:18). అందును బట్టి మనం ఆయనను స్తుతించాలి. దేవుని మంచితనం అందులో కనిపిస్తుంది. మన పాపములలో మనం చచ్చిన వారముగా ఉన్నాము. అటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు కరుణించాడు. ఆయన కరుణా సంపన్నుడు. 

   నా చిన్న తనములో కరుణా మయుడు సినిమా వచ్చింది. యేసు ప్రభువు కరుణా మయుడు. మంచిదే. పాత నిబంధనలో కూడా దేవుడు కరుణామయుడే.

    కరుణించడమంటే life and death difference ఉంటుంది. మొన్న ఒకసారి కరుణించండి బాబూ అని ఒక అడుక్కుతినేవాడు నా వెంట పడ్డాడు. నేను ఆ అడుక్కుతినేవాడికి 5 రూపాయిలు వేశాను. ‘ఏంటి బాబు నువ్వు 5 రూపాయిలు వేశావు. మినిమం 10 రూపాయలు’ అన్నాడు. అడుక్కుతినే వాడు కూడా మినిమం ఇంత ఇవ్వాలి. మీరు దానం చేయకపోతే, పోవయ్యా, అని ప్రక్క కంపార్ట్మెంట్ లోకి వెళ్తాడు. మన దేశములో ఎంత పురోగతి వచ్చింది అని నాకు అనిపించింది. అడుక్కుతినే వారు కూడా కొన్ని రూల్స్ పెట్టారు. 

  దేవుడు చూపించే కరుణ అది కాదు. దేవుడు కరుణించకపోతే మీకు ఇంకెవ్వరి కరుణా మీకు సహాయము చేయదు. మన సిట్యుయేషన్ అలాంటిది. మనం మన అపరాధములలో, పాపములలో చచ్చినవారముగా ఉన్నాము. 

 సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు. కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు కీర్తన 103:4 

     దేవుడు మరణములో నుండి, సమాధిలో నుండి మనలను విమోచించి  కరుణాకటాక్షములను కిరీటముగా మన తల మీద పెట్టాడు. 

The Riches of His Glory 

3:17 దేవుని  మహిమైశ్వర్యము, 1:18 

రోమా 9:24 Riches of His Glory 

దేవుని పేరు 

దేవుని పేరే మహిమ కలిగిన పేరు (నెహెమ్యా 9:5). ఆయన పేరుకు మహిమ ఉంది (కీర్తన 29:2). దేవుని పేరుల్లో ఒకటి మహిమ గల రాజు (కీర్తన 24:8). King of Glory. దేవుని మహిమలో ఆయన రాజరికం కూడా కనిపిస్తుంది. మనము దేవుని మహిమ పరచాలి. 

మాకు కాదు, యెహోవా మాకు కాదు

నీ కృపాసత్యములనుబట్టి 

నీ నామమునకే మహిమ కలగునుగాక 

        (కీర్తన 115:1). 

సార్వభౌమాధికారం 

 మహిమ అంటే మనం వెలుగు, కాంతి ని ఊహించుకొంటాము. అయితే దేవుని మహిమ అంటే వెలుగు మాత్రమే కాదు. యెషయా ప్రవక్తకు దేవుని మహిమ ఎలా కనిపించింది? దేవుడు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉండుట ఆయన చూశాడు. లైట్లు వేసుకోవడం కాదు. అధికారం ఉండాలి. దేవుడు పరలోకములో నాలుగు లైట్లు వేసుకొని కూర్చోలేదు. ఆయన అత్యున్నత సింహాసనమందు కూర్చొని ఉన్నాడు. అది ఆయన మహిమ. సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉంది (యెషయా 6:3). దేవుని మహిమ ను చూసి యెషయా వణకి పోయాడు. నేనెంత పనికిరాని వాణ్ని అని ఆయన అనుకొన్నాడు (యెషయా 6:5). 

   దేవుని మహిమ ఆయన  ప్రత్యేకత, ఘనత, అధికారం, శక్తి, పరిశుద్ధత, సృజనాత్మకత  ల కలయిక గా చెప్పుకోవచ్చు. దేవుని మహిమ నిత్యమూ ఉండేది (కీర్తన 104: 31)

విశ్వం 

   ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని చదువుతాము 19 వ కీర్తనలో (కీర్తన 19:1) . అంటే ఈ విశ్వమే దేవుని మహిమను వివరించుచున్నది. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ దేవుని మహిమను మనకు చూపిస్తున్నాయి. 

   సర్వ సృష్టికి పైన దేవుని మహిమ అత్యున్నతమైనదిగా ఉంది (కీర్తన 108:5). 

ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉంది (కీర్తన 113:4). 

సూర్యనికి మహిమ ఇచ్చాడు. చంద్రునికి మహిమ ఇచ్చాడు. నక్షత్రాలకు మహిమ ఇచ్చాడు (1 కొరింథీ 15:41). తన మహిమ సర్వ భూమి మీద కనిపించాలని దేవుడు కోరుకొంటున్నాడు (కీర్తన 57;11). 

మానవుడు 

 దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.

మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. కీర్తన 8:5 

దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? 

నా మహిమ కోసము నేను మనిషిని సృష్టించాను అన్నాడు. యెషయా 43:7 

దేవుడు తన స్వరూపములో మనిషిని సృష్టించినప్పుడు, మనిషికి తన మహిమను కూడా ఇచ్చాడు. 

    దేవుని కంటే కొంచెము తక్కువగా మనిషిని సృష్టించాడు. పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమై ఉన్నాడు. స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది (1 కొరింథీ 11:7). 

దేవుని మహిమ పురుషుని మీద, స్త్రీ మీద ఉంది. 

దేవుని వలె మనం ఆలోచిస్తాము.

 ఆయన వలె విషయ పరిజ్ఞానం మనకు ఉంటుంది. 

ఆయన వలె న్యాయబద్ధముగా ఆలోచిస్తాము. 

ఆయన వలె ప్రేమిస్తాము. 

ఆయన వలె ఉపకారం చేస్తాము. 

    జంతువులు ఆ పనులు చేయలేవు. దేవుడు మహిమా ప్రభావములతో మనిషి తల మీద ఒక కిరీటం పెట్టాడు. ఏ జంతువు మీద దేవుడు ఆ కిరీటం పెట్టలేదు. 

   మనిషి మహిమకు దేవుడే ఆధారము (కీర్తన 62:7). దేవుడు లేకుండా మనిషికి మహిమ లేదు. మనిషి కూడా అన్నిటి కంటే ముఖ్యముగా దేవుని మహిమను కోరుకోవాలి (కీర్తన 63:2). 

ఆయన మహిమను కీర్తించాలి (కీర్తన 66:2). 

ఆయన మహిమ గల నామమును మనం నిత్యమూ స్తుతించాలి (కీర్తన 72:19). 

ఆయన మహిమను మనం ధ్యానం చేయాలి (కీర్తన 145:5). 

ఆయన చేసిన మహిమ కార్యములను గురించి మనం మాట్లాడుకోవాలి (కీర్తన 145:12).  

అన్యజనులలో దేవుని మహిమను ప్రచురించాలి (కీర్తన 96:3). మనిషి ఈ జీవితము తరువాత దేవుని మహిమలోకి చేర్చబడుతున్నాడు (కీర్తన 73:24). 

చెట్లు, జంతువులు 

  పువ్వులు చూడండి. సొలొమోను రాజు కు కూడా లేనంత మహిమను దేవుడు పువ్వులలో పెట్టాడు (మత్తయి 6:29; లూకా 12:27). గొఱ్ఱె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు (మత్తయి 12:12) 

  అందుకనే మనం జంతువులను, చెట్లను విగ్రహాలుగా చేసుకొని మ్రొక్కకూడదు. అలా చేయడం మన మీద దేవుడు పెట్టిన మహిమను వ్యర్థం చేయడమే. 

తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపము నకు మార్చిరి (కీర్తన 106:20). 

దేవుడు ఏమన్నాడు, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చు వాడను కాను (యెషయా 42:8). నా మహిమను మరి ఎవనికిని నేనిచ్చువాడను కాను (యెషయా 48:11).  

పౌలు గారు వారి మీద మోపిన నేరం అదే: 

వారు అక్షయుడగు దేవుని మహిమను 

క్షయమగు మనుష్యులయొక్కయు, 

పక్షులయొక్కయు, 

చతుష్పాద జంతువులయొక్కయు, 

పురుగులయొక్కయు, 

ప్రతిమాస్వరూపముగా మార్చిరి (రోమా 1:23). 

దేవుడు తన మహిమను ఇంకెవ్వరికీ ఇవ్వడు. 

అబ్రహాము 

   మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు (అపో కార్యములు 7:1). 

అబ్రహాము దేవుని మహిమపరచాడు. దేవుని మాటను నమ్మాడు. బలము పొందాడు. నీతి మంతునిగా ఎంచబడ్డాడు (రోమా 4:21-22). అబ్రహాము సంతానము ఈ రోజు వరకూ బ్రతికి బట్ట కట్టగలిగింది అంటే వారి తండ్రికి ప్రత్యక్షమైన దేవుడు మహిమ కలిగిన దేవుడు. 

మోషే 

     మోషే గారు సీనాయి కొండ మీద ఎక్కినప్పుడు దేవుని మహిమ సీనాయి కొండ మీద నిలిచింది (నిర్గమ 24:16). అది దహించు అగ్ని వలె కనిపించింది (నిర్గమ 24:17). 

దేవుడు తన ధర్మ శాస్త్రం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఆయన మహిమను చూశారు (ద్వితీయోప 5: 24). నీ మహిమను నాకు చూపించు అని మోషే దేవుని అడిగాడు (నిర్గమ 33:18). దేవుడు ఏమన్నాడు? 

మోషే, నా మొహం నువ్వు చూడలేవు. 

ఏ నరుడూ నన్ను చూసి బ్రతకడు. 

ఒక బండ సందులో నిలబడు. 

నా చేతితో నిన్ను కప్పుతాను. 

నా మహిమ నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నన్ను వెనుక నుండి చూడు అన్నాడు. 

మోషే దేవుని మహిమ ను చూశాడు. (నిర్గమ 33:18-23)

ఇశ్రాయేలీయులు 

వీరు ఇశ్రాయేలీయులు; 

దత్తపుత్రత్వమును 

మహిమయు 

నిబంధనలును 

ధర్మశాస్త్ర ప్రధానమును 

అర్చనాచారాదులును

 వాగ్దానములును వీరివి (రోమా 9:4). 

   ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు దేవుని మహిమను చూశారు. ఫరో చక్రవర్తి ని, ఈజిప్టు ప్రజలకు దేవుడు పది తెగుళ్లు పంపించి తీర్పు తీర్చినప్పుడు ప్రజలు దేవుని మహిమను చూశారు (సంఖ్యా 14: 22). సమస్త జనులకు ఆయన మహిమ కనబడింది (కీర్తన 97:6). తన ప్రజల మధ్య నివసిస్తూ వారి మహిమకు కారణముగా ఉండాలి అని దేవుడు ఆశించాడు (జెకర్యా 2:5). 

  ఇశ్రాయేలీయులకు అరణ్యములో ఆకలి అయ్యింది. వారు మోషే గారితో పోట్లాడారు. ‘ఈ అరణ్యములో ఆకలితో చావడానికా మమ్ములను ఇంత దూరము తీసుకొచ్చావు?’ అని చివాట్లు పెట్టారు. 

మోషే గారు వారితో ఏమన్నాడు? 

మీ సణుగుడు, గొణుగుడు ఆపండి. 

మీరు దేవుని మహిమను చూస్తారు (నిర్గమ 16:7). 

అప్పుడు దేవుని మహిమ ఒక మేఘములో వారికి కనిపించింది. దేవుడు ఆకాశము ను విప్పి వారికి మన్నా కురిపించి వారి ఆకలి తీర్చాడు. 

    ఆకాను పాపము ఒప్పుకొన్నప్పుడు దేవునికి మహిమ కలిగింది (యెహోషువ 7:19). ఇశ్రాయేలీయులను దేవుడు అనేక సార్లు నిలదీశాడు: నాకు రావలసిన మహిమ ఎక్కడ? (మలాకీ 1:6). తన మహిమను దేవుడు సీరియస్ గా తీసుకొంటున్నాడు. దేవా, నీ మహిమను బట్టి మాకు సహాయము చేయి అని దేవుని ప్రజలు ఎల్లప్పుడూ ప్రార్ధించారు (కీర్తన 79:9).  మనిషిని దేవుడు రక్షించినప్పుడు కూడా దేవునికి మహిమ కలిగింది (కీర్తన 21:5). దేవుని మహిమను బట్టే మనకు రక్షణ కలిగింది. మనం రక్షణ పొందినప్పుడు దేవునికి మహిమ కలిగింది. 

ప్రత్యక్ష గుడారం 

   ప్రత్యక్ష గుడారమును దేవుడు తన మహిమతో పరిశుద్ధ పరచాడు (నిర్గమ 29:  43). ఆయన మహిమ ఆ మందిరమును నింపింది (నిర్గమ 40: 34). 

దేవుని మహిమ ప్రజలందరికీ కనిపించింది (లేవీయ 9:23; సంఖ్యా 14:10). 

యాజకులు వేసు కొనే వస్త్రాలు కూడా దేవుని మహిమను ప్రతిబింబింపజేసినాయి (నిర్గమ 28:40). 

   కోరహు మోషే గారి మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని మహిమ ప్రత్యక్ష గుడారము మీద  ఇశ్రాయేలీయులకు కనిపించింది (సంఖ్యా 16:19,42). 

సొలొమోను దేవాలయము 

  సొలొమోను గారు దేవునికి నిర్మించిన దేవాలయమును దేవుని మహిమ నింపింది (2 దిన 7:1). దేవుని ఆలయములో ఉన్న వన్నీ ఆయనకు మహిమ అనుచున్నవి (కీర్తన 29:9). 

అన్యజనులు 

   భూరాజులందరూ దేవుని మహిమకు భయపడ్డారు (కీర్తన 102: 15). దేవుని మహిమను చూసి వారు ఆశ్చర్యపోయారు (కీర్తన 138:5). 

దేవుని మహిమ వెళ్ళిపోయింది 

దేవుని మహిమ ను మనం తేలికగా తీసుకోకూడదు. ఆయన మహిమ ఇశ్రాయేలీయులను విడిచి వెళ్లిపోవడం మనకు పాత నిబంధనలో కనిపిస్తుంది. 

  ఏలీ గారి కోడలు పురిటి నెప్పులతో బాధ పడేటప్పుడు, నీ భర్త చనిపోయాడు, దేవుని మందసము శత్రువులు తీసుకొని వెళ్లిపోయారు అని చెప్పినపుడు, ఆమె ఒక బిడ్డకు జన్మ ఇచ్చింది. ఆ పుట్టిన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టండి అని చెప్పింది. నా బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టండి అని చెప్పి ఆమె ప్రాణం విడిచింది. అంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది అని అర్థం (1 సమూయేలు 4:22). 

ప్రవక్తలు 

  ఇశ్రాయేలు దేశం పాడై పోయి నిరీక్షణ లేకుండా జీవిస్తున్న రోజుల్లో దేవుని ప్రజలకు ధైర్యం ఇచ్చింది ఏమిటి? ప్రవక్తలను ముందుకు నడిపించింది ఏమిటి? దేవుని మహిమ.        యెహెఙ్కేలు ప్రవక్త బబులోను లో బందీ గా ఉన్నాడు. నిరాశ, నిస్పృహలతో నిండిపోయి జీవిస్తున్నాడు. ఆ సమయములో దేవుడు ఆయనకు ఒక గొప్ప దర్శనం ఇచ్చాడు (యెహెఙ్కేలు 1:28). ఆ దర్శనములో దేవుడు తన సింహాసనము మీద కూర్చొని ఉన్నాడు. అది యెహోవా మహిమా స్వరూప దర్శనం అని పిలువబడింది. 

The vision of the Glory of God of Israel 

kebowd Elohe Yisrael Kammareh 

כְּב֖וֹד אֱלֹהֵ֣י יִשְׂרָאֵ֑ל כַּמַּרְאֶ֕ה

    నా ప్రజలను బబులోను నుండి విడిపిస్తాను అని మహిమ గల దేవుడు యెహెఙ్కేలు కు మాట ఇచ్చాడు. అన్య దేశములో దేవుని మహిమను చూశాడు ( యెహెఙ్కేలు 3:12; 3:23) దేవుని ఆత్మ ఆయనను ఎత్తికొని పోయింది. దేవుని మహిమ యెరూషములో తిరుగుట ఆయన చూశాడు (యెహెఙ్కేలు 9:3). దేవుని మహిమ పరలోకములో నుండి దిగి వచ్చింది. అయితే దేవుని ప్రజలు చేస్తున్న పాపాలు చూసి దేవుని మహిమ అక్కడ నుండి వెళ్ళిపోయింది (యెహెఙ్కేలు 10:18). దేవుని మహిమ యెరూషలేములో నుండి వెళ్లిపోవుచూ ఒలీవల కొండ మీద కాసేపు నిలిచింది (యెహెఙ్కేలు 11:23). దానియేలు ప్రవక్త మనుష్య కుమారుడు ఆకాశ మేఘారూఢుడై తన మహిమతో దిగిరావడం చూశాడు (దానియేలు 7:13). 

ఏలయనగా సముద్రము జలము లతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును (హబక్కూకు 2:14). 

నేను ఈ మందిరమును మహిమతో నింపుదును (హగ్గయి 2:7) 

The Riches of Christ 

3:8 Riches of Christ 

πλοῦτος τοῦ χριστοῦ

Romans 11:33 

πλούτου καὶ σοφίας,

 Riches of His Wisdom. 

ఎఫెసీ 1;2 మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

1:4 తన ప్రియుని యందు

 తాను ఉచితముగా మనకనుగ్రహించిన

 తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు

 దేవుని కృపా మహదైశ్వర్యము 

దేవుని మహిమైశ్వర్యము మనకు ఎలా లభించాయి? 

తన ప్రియుని యందు 

2:7  πλοῦτος τῆς χάριτος

 క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:4-8 

3:10 శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము

The Unfathomable Riches of Christ 

ఎఫెసీ 3:8-10 

దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,

పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి,శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్య మును అన్యజనులలో ప్రకటించుటకును

Grace of Christ

    కన్య మరియను దేవుడు ఎన్నిక చేసుకొన్నాడు. అది దేవుని కృప (లూకా 1:30). ప్రభువైన యేసు క్రీస్తు ఆమెకు జన్మించాడు. 

ఆయన దేవుని కృప యందు ఎదిగాడు (లూకా 2:40,52). 

యేసు క్రీస్తు పలికిన మాటలు దేవుని కృప తో నిండుకొని ఉన్నాయి (లూకా 4:22). ప్రజలు ఆయన మాటలు విని ఆశ్చర్యపోయారు. ఈయన యోసేపు కుమారుడు కాడా? ఇంతటి కృప కలిగిన మాటలు ఈయన ఎలా పలుకుతున్నాడు? అని వారు ఆశ్చర్యపోయారు. 

   యేసు క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు (యోహాను 1:14). ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృప పొందాము (యోహాను 1:16). 

   యోహాను 1:17  ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.

   మనలను రక్షించింది ప్రభువైన యేసు క్రీస్తు కృప మాత్రమే (అపోస్తలుల కార్యములు 15:11). ఆయన కృప లేకుండా రక్షణ లేదు. 

   దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు (హెబ్రీ 2:9). 

కృప వలన దేవుని విమోచన మనకు లభించింది, మనం ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాము (రోమా 3:24; గలతీ 2:21; 5:4; తీతు 3:6). 

కృప వలన మనకు నిత్య జీవం లభించింది (రోమా 5:21). 

కృప వలన మనకు దేవుని శాంతి లభించింది (1 థెస్సలొనీక 1:1). 

కృప తో పాటు దేవుని సమాధానం మనకు లభించింది (రోమా 1:3). 

పౌలు గారు దీవించేటప్పుడు కృపయు, సమాధానమును మీకు కలుగును గాక (2 థెస్సలొనీక 1:2; 1 తిమోతి 1:2; ప్రకటన 1:5) అని అంటాడు. ఎందుకంటే కృప లేకుండా సమాధానం లేదు. దేవుని కృప లేకుండా మీకు శాంతి ఉండదు. 

   భార్య భర్తల మధ్య ఉండే వైవాహిక జీవితం కూడా ఒక కృపా వరమే (1 పేతురు 3:7). 

విశ్వాస జీవితము అంటే దేవుని కృప యందు అభివృద్ధి చెందటమే (2 కొరింథీ 8:7). 

క్రైస్తవ విశ్వాసి ప్రతి రోజూ దేవుని యొక్క సర్వ సమృద్ధి పొంది, దేవుని మహిమ కొరకు జీవించడానికి దేవుడు సమస్త విధములైన కృపను విస్తారముగా వారికి ఇస్తున్నాడు. (2 కొరింథీ 9:8). క్రీస్తు కృపను బట్టి మనలో ప్రతి ఒక్కరూ పిలువబడ్డారు (గలతీ 1:6). 

కృప చేత మనం రక్షించబడ్డాము. మనలను రక్షించింది దేవుని కృపే (ఎఫెసీ 2:5). ప్రభువైన యేసు క్రీస్తు ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ దేవుడు ఈ కృప అనుగ్రహిస్తున్నాడు (ఎఫెసీ 6:24). ఈ లోకములో విశ్వాసికి తోడుగా ఉండేది దేవుని కృపే (కొలొస్స 4:18). 

మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక (రోమా 16:20, 1 థెస్సలొనీక 5:28). 

ఈ క్రీస్తు ఐశ్వర్యము 

యేసు క్రీస్తను ఒక మనుష్యుని కృప చేత మనకు ఈ ఐశ్వర్యం లభించింది (రోమా 5:15). 

యేసు క్రీస్తు అను ఒక మనుష్యుని కృప. 

 మన ప్రధానయాజకుడు

మన బలహీనతలయందు 

మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, 

సమస్త విషయములలోను 

మనవలెనే శోధింపబడినను, 

ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

గనుక మనము కనికరింపబడి

సమయోచితమైన సహాయముకొరకు

కృప పొందునట్లు 

ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీ 4:15,16 

        మనం కనికరించబడ్డాము. సమయోచితమైన సహాయముకొరకు కృప పొందుతున్నాము. ధైర్యముతో కృపాసనమునొద్దకు వెళ్లగలుగు తున్నాము. 

అది ఎలా సాధ్యపడింది? మన ప్రభువైన యేసు క్రీస్తు మన ప్రధాన యాజకుడిగా చేసిన పరిచర్య మూలముగానే. 

కృపకు మూలమగు ఆత్మ (హెబ్రీ 10:29) Spirit of  Grace 

Grace brought Holy Spirit to this world (Hebrews 10:29)

ఈ పరిశుద్ధాత్ముడు ని ఈ భూమి మీదకు పంపింది ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తే. 

ఎందులో కనిపించింది? 

    దావీదు దేవుని కృప పొంది ఒక గొప్ప దేవాలయం కట్టాలని అనుకొన్నాడు (అపోస్తలుల కార్యములు 7:46). క్రైస్తవ సంఘములో కనిపిస్తుంది. అపోస్తలులు దేవుని కృపా వాక్యమును బోధించారు (అపోస్తలుల కార్యములు 14:3; 20:32). దేవుని కృపా సువార్తను వారు బోధించారు (అపోస్తలుల కార్యములు 20: 24). వారు దేవుని కృపకు తమను అప్పగించుకొన్నారు (అపోస్తలుల కార్యములు 14:26; 15:40). ఆది క్రైస్తవ సంఘము ప్రజలందరి కృపను పొందింది (అపోస్తలుల కార్యములు 2:46). ఆ పరిస్థితి కల్పించింది దేవుడే. అపోస్తలులు చాలా బలముగా ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిస్తూ సువార్త ప్రకటించారు. దేవుడు ఎంతో అధికముగా తన కృపను వారి మీద ఉంచాడు (అపోస్తలుల కార్యములు 4:33). స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలు చేశాడు (అపోస్తలుల కార్యములు 6:8). దేవుని కృప వారికి అనేక కృపావరములు విరివిగా ఇచ్చింది (రోమా 12:6). క్రైస్తవ సంఘములు ఒక దానికి ఒకటి సహాయం చేసుకొన్నాయి. అది దేవుని కృప వలనే సాధ్యపడింది (2 కొరింథీ 8:1). నిశ్చల మైన దేవుని రాజ్యాన్ని సంఘానికి ఇచ్చింది దేవుని కృపే (హెబ్రీ 12:28). బర్నబా అంతియొకయ సంఘమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవుని కృపను చూసి ఎంతో సంతోషించాడు (అపోస్తలుల కార్యములు 11:23). 

అపోస్తలుడైన పౌలుకు దేవుని కృప లభించింది (రోమా 12:3). 

తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు (గలతీ 1:15) 

ఆయన అన్యజనులకు అపోస్తలునిగా నియమించబడ్డాడు అంటే అది దేవుని కృపే (ఎఫెసీ 3:2). 

నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను (1 కొరింథీ 15:10). 

నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు (1 కొరింథీ 15:10) 

దేవుని కృపను అనుసరించి ఆయన ఈ లోకములో నడుచుకొన్నాడు (2 కొరింథీ 1:12). 

ఆయన పొందిన శ్రమలలో దేవుని కృప ఆయనను బలపరచింది (ఫిలిప్పి 1:7) 

నా కృప నీకు చాలును (2 కొరింథీ 12). 

ప్రతి పరిచర్య ఒక కృపా వరమే (1 పేతురు 4:10) 

ప్రతి వరము ఒక కృపా వరమే (ఎఫెసీ 4:7) 

ఎవరికి కనిపించింది? 

పరలోకములో ప్రధానులకు అధికారులకు, 

దేవదూతలకు దేవుడు చూపించాడు. 

ఎవరికి ప్రకటించబడింది? 

   శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్య జనులకు ప్రకటించబడింది 

శోధింపశక్యము కాని: ఈ మాట రోమా పత్రిక 11 అధ్యాయములో కూడా వాడబడింది. 

దేవుని నిర్ణయాలు శోధింపశక్యము కానివి. దేవుని తీర్పులు శోధింపశక్యము కానివి. 

దేవుడు యూదులను, అన్యులకు ఏ విధముగా యేసు క్రీస్తు నందు సమకూర్చాడో రోమా 11 లో పౌలు వివరించాడు. 

  ఇశ్రాయేలీయులు దేవుని కి లోబడకుండా తమ స్వంత మార్గములలోకి వెళ్లిపోయారు. వారి తొట్రుపాటు వలన అన్య జనులకు రక్షణ కలిగింది (రోమా 11:12). వారి తొట్రుపాటు వలన లోకమునకు ఐశ్వర్యం కలిగింది. వారి క్షీణ దశ వలన అన్య జనులకు ఐశ్వర్యం కలిగింది. పౌలు గారు ఏమని ప్రశ్నించాడంటే, వారి తొట్రు పాటు వలనే అన్యజనులకు ఐశ్వర్యం కలిగితే, వారి పరిపూర్ణత మరెంత ఎక్కువగా ఐశ్వర్యం కలుగజేసేది? ఇశ్రాయేలీయులు పాడైపోవడం వలన దేవుడు మన యొద్దకు రాలేదు. 

వారు మంచి మార్గములో ఉంటే, ఇంకా ఎక్కువ ఆశీర్వాదం మన మీదకు వచ్చేది. ఇంకా ఎక్కువ ఐశ్వర్యం మన యొద్దకు వచ్చేది. 

దేవుడు అబ్రహాముతో అన్నాడు:

 నీ ద్వారా భూమి మీద సమస్త వంశముల ప్రజలను నేను ఆశీర్వదిస్తాను. 

దేవుడు ఒకరు ఒద్దు అంటే మరొకరి దగ్గరకు వెళ్లి అడుక్కునే వాడు కాదు. ఆయన ఐశ్వర్యవంతుడు. యూదులు వద్దన్నారని, యూదులు గెంటి వేశారని దేవుడు మన దగ్గరకు రాలేదు. ఎవరు వద్దన్నా, కాదన్నా ఆయన ఐశ్వర్యవంతుడే.(రోమా 11:36)

 ἀνεξιχνίαστοι anexichniastos

   క్రైస్తవ సంఘము అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం, శోధింపశక్యము కాని దేవుని జ్ఞానం – ఇందులో వున్నాయి. దేవుని కన్నా గొప్ప పరిష్కారాలు మనిషి కనిపెట్ట లేడు. నేను అమెరికా దేశము వెళ్లి 23 సంవత్సరాలు అయ్యింది. అమెరికా ప్రజలు ఒక రోజుల్లో బైబిలు ప్రకారం అన్ని చేస్తూ ఉండేవారు. అయితే కాల క్రమేణా వాడు బైబిలు ప్రక్కన పెట్టేసి తమ స్వంత ప్రణాళికలు వేసుకొన్నారు. 

   వారి ప్రణాళికలు పూర్తిగా విఫలం కావడం ఈ రోజు మనం చూస్తున్నాము. 

హింస ను ఎలా తగ్గించాలి? దేవుని కన్నా గొప్ప పరిష్కారం నీవు కనిపెట్టలేవు 

యువత డ్రగ్స్ వైపుకు వెళ్లకుండా ఎలా చేయగలవు? దేవుని కన్నా గొప్ప పరిష్కారం నీవు కనిపెట్టలేవు

అనేక రకాలైన ప్రజల మధ్య సమానత్వం, సమైక్యత ఎలా తేగలం? దేవుని కన్నా గొప్ప పరిష్కారం నీవు కనిపెట్టలేవు

ఆంటిసెమిటిజం లేక యూదు వ్యతిరేకత ఎలా తగ్గించగలవు? 

దేవుని కన్నా గొప్ప పరిష్కారం నీవు కనిపెట్టలేవు

స్థిరమైన కుటుంబాలు ఎలా నిర్మించగలవు? 

కులతత్వం, మత తత్త్వం ఎలా తగ్గించగలం? 

దేవుని కన్నా గొప్ప పరిష్కారం నీవు కనిపెట్టలేవు

  పరలోకములో అధికారులు, ప్రధానులు, – అందరూ ఆశ్చర్య పోయే టటువంటి జ్ఞానం నీకు ఉందా? దేవదూతలు సహితం ఆశ్చర్యపోయే జ్ఞానం మీకు ఉందా? పరలోకములో ప్రధానులు, అధికారులు , దేవదూతలు ఆశ్చర్యపోయేటంత జ్ఞానముతో దేవుడు క్రైస్తవ సంఘం నిర్మించాడు. క్రైస్తవ సంఘమా దానిది ఏముందిలే అని ఎప్పుడూ అనుకోవద్దు.

Mercy of Christ 

  ఆ తరువాత దేవుని కరుణా మహదైశ్వర్యము కూడా ప్రభువైన యేసు క్రీస్తు నందే మనకు లభించింది. ఆయన చేసిన ప్రసంగాలు దేవుని కరుణను మనుష్యులకు గుర్తుచేశాయి. 

   నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను (హోషేయా 6:6). మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ ప్రవచనం ఇశ్రాయేలీయులకు అనేక సార్లు గుర్తు చేశాడు. యేసు ప్రభువు మత్తయి గారి ఇంటిలో భోజనానికి కూర్చున్నాడు. మత్తయి టాక్స్ కలెక్టర్. వాళ్ళ కంటే అవినీతి పరులు ఎవరూ ఉండరు అని ప్రజలు అనుకునేవారు. పరిసయ్యులు యేసు ప్రభువును విమర్శించారు: ‘ఈయనేంటి పాపాత్ములతో కలిసి భోజనం చేస్తున్నాడు?’ అన్నారు. యేసు ప్రభువు వారికి హోషేయా మాటలు గుర్తుకు చేశాడు. దేవుడు కరుణ చూపించేవాడు (మత్తయి 9:13). 

   రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా.

నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనే ప్రవచనం అర్థం తెలుసుకోండి అన్నాడు. 

   మత్తయి సువార్త 12 అధ్యాయములో మీరు చూస్తే అక్కడ – ఒక రోజు యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి పంట చేనిలో నడుస్తున్నాడు. ఆ రోజు విశ్రాంతి దినం. శిష్యులకు ఆకలి అయ్యింది. వారు వెన్నులు త్రుంచి తినడం మొదలు పెట్టారు. పరిసయ్యులు అది చూసి యేసు ప్రభువును విమర్శించారు. ఏమనుకొంటున్నారు నీ శిష్యులు. ఈ రోజు విశ్రాంతి దినం. ఏది పడితే అది తినవచ్చా. 

      యేసు ప్రభువు ఏమన్నాడు? 

దేవాలయము కంటే గొప్ప వాడు ఇక్కడ ఉన్నాడు. 

మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు (మత్తయి 12:8). హోషేయ ప్రవచనం వారికి కూడా గుర్తు చేశాడు. 

కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. 

   ఆకలితో వారు అలమటిస్తున్నారు. కొంత కనికరించండి. వారు వెన్నులు త్రుంచి తింటే దేవుడు ఏమీ కోపబడ్డాడు. దేవుడికి కోపం రాదు కానీ వీరికి కోపం వస్తుంది. 

నేను దేవాలయం కంటే గొప్ప వాణ్ణి, విశ్రాంతి దినమునకు ప్రభువును. 

నేనే దేవుణ్ణి – నా మాట వినండి. వాళ్ళని కరుణించండి. కోప్పడబాకండి అన్నాడు. 

   యేసు క్రీస్తు ప్రభువు చేసిన పనుల్లో కూడా మనకు కరుణ కనిపిస్తుంది. యెరికో నుండి వెళ్ళేటప్పుడు ఇద్దరు గ్రుడ్డి వారు పెద్దగా కేకలు వేశారు. ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ములను కరుణించు. ఏయ్, అరవబాకండి అని ప్రజలు వారిని గద్దించారు. అయినప్పటికీ కరుణించయ్యా అని వారు కేకలు వేశారు. యేసు ప్రభువు వారిని కరుణించి వారికి దృష్టి ఇచ్చాడు. 

   ఒక గ్రామములో 10 మంది కుష్ఠ రోగులు యేసు ప్రభువును వేడుకొన్నారు. యేసు ప్రభువా, మమ్ములను కనికరించు. ఆయన వారిని కనికరించి వారి కుష్ఠ రోగమునుండి వారికి స్వస్థత ఇచ్చాడు. వారిలో ఒకడు గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచి ఆయనను ఆరాధించాడు (లూకా 17:16). మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల (రోమా 9:23). మనలను కరుణించాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ కరుణ యేసు క్రీస్తు ద్వారా మనకు లభించింది. దేవుని కరుణా మహదైశ్వర్యము ఆ విధముగా మనకు లభించింది. 

Glory of Christ 

ఆ తరువాత దేవుని మహిమైశ్వర్యము కూడా యేసు క్రీస్తు నందే మనకు లభించింది. 

యోహాను సువార్త 17 అధ్యాయములో యేసు ప్రభువు చేసిన ప్రధాన యాజకుని ప్రార్థన మనకు కనిపిస్తుంది. 

తండ్రీ, లోకము పుట్టకమునుపు 

నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో 

ఆ మహిమతో

నన్ను ఇప్పుడు

నీయొద్ద మహిమ పరచుము (యోహాను 17:5). 

    లోకము పుట్టక మునుపే యేసు క్రీస్తు ప్రభువు పరలోకములో దేవుని మహిమ కలిగి ఉన్నాడు. ఆయన భూమి మీదకు వచ్చినది కూడా దేవుని మహిమ కొరకే. అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌ (రోమా 16:27) అనే మాటలతో పౌలు గారు రోమా పత్రికను ముగించాడు. 

యేసు ప్రభువు జన్మ 

    యేసు ప్రభువు బెత్లెహేములో జన్మించినప్పుడు, 

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగింది అని దేవదూతలు  పాటలు పాడారు (లూకా 2:14).  

యేసు ప్రభువు జన్మించాడు అనే శుభవార్తను దేవుని దూత గొఱ్ఱెల కాపరులకు చెప్పినప్పుడు, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. 

దేవుని మహిమ యేసు క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఈ భూమి మీదకు వచ్చింది. 

   ఆ వాక్యము శరీరధారియై,

 కృపాసత్యసంపూర్ణు డుగా 

మనమధ్య నివసించెను; 

తండ్రివలన కలిగిన

 అద్వితీయకుమారుని 

మహిమవలె మనము 

ఆయన మహిమను కనుగొంటిమి (యోహాను 1:14). 

   అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను మనం కనుగొన్నాము. 

దేవుని మహిమ ఆయన లక్ష్యం

    నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను (యోహాను 5:41). యేసు ప్రభువును విమర్శించిన వారు మనుష్యుల మహిమను కోరుకున్నారు (యోహాను 5:44). వారిది హేరోదు రాజు మనస్తత్వం. హేరోదు రాజు ఉపన్యాసం చేసేటప్పుడు, ఇది దైవ స్వరం, మానవ స్వరం కాదు. అని ప్రజలు కేకలు వేశారు. ‘తప్పు, నన్ను దేవునితో పోల్చబాకండి’ అని గద్దించకుండా హేరోదు రాజు ఆ మాటలు విని ఆనందించాడు. అతడు దేవుని మహిమపరచనందున దేవుని దూత అతని మొత్తాడు. వెంటనే పురుగులు పడి చనిపోయాడు (అపోస్తలుల కార్యములు 12: 23). దేవుని మహిమపరచకపోతే మరణమే గతి. దేవుని మహిమపరచడములో జీవం ఉంది. మనల్ని మనం మహిమపరచుకొనడములో మరణం ఉంది. యేసు క్రీస్తు దేవుని మహిమ పరచాడు. తన మహిమ గురించి ఆయన వెదకలేదు.   ఆయన తన మహిమను వెదుక లేదు (యోహాను 8: 50)

బోధలు 

    దేవుని జ్ఞానము దేవుని మహిమ నిమిత్తము నియమించబడింది (1 కొరింథీ 2:7).    యేసు ప్రభువు శిష్యులు కూడా ఆయన మహిమ కొరకు ఎదురుచూశారు. యాకోబు, యోహాను యేసు ప్రభువును అడిగారు. నీ మహిమ యందు మేము ఇద్దరము నీకు చెరో ప్రక్కన కూర్చుంటాము (మార్కు 10:37). 

అద్భుతాలు 

    యేసు ప్రభువు అనేక అద్భుత క్రియలు చేసి తన మహిమను బయలుపరచాడు. కానా వివాహ విందులో ఆయన నీటిని ద్రాక్ష రసముగా మార్చినప్పుడు దేవునికి మహిమ కలిగింది (యోహాను 2:11). లాజరుకు జబ్బు చేసింది. ఆయన అక్క చెల్లెల్లు యేసు ప్రభువు కు కబురు పెట్టారు. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించు వాడు రోగిగా ఉన్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడు? లాజరుకు వచ్చిన జబ్బు మరణము కొరకు వచ్చినది కాదు. దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది (యోహాను 11:4). లాజరు చనిపోయాడు. యేసు ప్రభువు బేతనియp గ్రామానికి వెళ్ళాడు. రాయి తీయండి అన్నాడు. మార్త ఏమంది? ప్రభువా, లాజరు చనిపోయి 4 రోజులు అయ్యింది. ఇప్పటికి వాసన కొడుతూ ఉంటాడు. యేసు ప్రభువు ఆమెతో అన్నాడు. 

   నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు (యోహాను 11:40). లాజరూ, బయటికి రా – ఆ మహిమ కలిగిన పిలుపు విని లాజరు బయటికి వచ్చాడు. యేసు ప్రభువు చేసిన అద్బుతములలో దేవునికి మహిమ కలిగింది (లూకా 19:38). 

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు

మధుర స్వరమేయది మెల్లని స్వరమే యది

2. బలమైన నీ స్వరము 

బహుప్రభావము గలది

దేవదారుల విరచును

 ప్రజ్వలింప చేయునగ్నిని

3. అధ్భుత ప్రభుస్వరము 

అరణ్యము కదిలించును

ఆకుల రాలజేయును

 లేళ్ళ నీనజేయును

  కీర్తన 29 లో మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు అని మనం చదువుతాము. 

ఆయన స్వరం బలమైనది 

మహా జలముల మీద సంచరించేది 

దేవదారు వృక్షములను విరిచేది 

అరణ్యమును కదిలించేది 

అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేసేది 

లేళ్ళను ఈనజేసేది 

ఆకులు రాలజేసేది 

   అలాంటి మహిమ ఎవరికన్నా ఉందా? దేవుని మహిమ అలాంటిది. 

   దేవుని స్వరం శక్తి కలిగినది. యేసు ప్రభువు స్వరం ప్రకృతిని శాసించింది. 

సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద గాలి వీచింది. యేసు ప్రభువు స్వరం విని ఆ తుఫాను ఆగిపోయింది. పేతురు నీటి మీద నడిచాడు. 

   పేతురు పన్ను కట్టవలసి వచ్చింది. ఒక చేప ను ఆయన ఆదేశించాడు. ఒక చిన్న చేపను మనం ఆదేశించగలమా? తిమింగలం, షార్కులు – అవి కాదు. ఒక చిన్న చేప మన మాట వింటుందా? ‘వెళ్లి యోనాను మింగు’ పెద్ద తిమింగలం వెళ్లి యోనాను మింగింది. వెళ్లి ఒక నాణెం పేతురుకు ఇవ్వు. ఒక చిన్న చేప పేతురుకు నాణెం ఇచ్చింది. దేవుని స్వరం అటువంటి శక్తి కలిగింది. 

   యేసు క్రీస్తు ప్రభువు కూడా ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకొని ఐదు వేల మంది ఆకలి తీర్చలేదా? ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి ప్రజలు దేవుని మహిమపరచారు. ఆయన శక్తి వలన గ్రుడ్డి వారు చూసారు. చెవిటి వారు విన్నారు. మూగ వారు మాట్లాడారు. కుంటి వారు నడిచారు. మరణించిన వారు తిరిగి లేచారు. ప్రజలు ఆయన శక్తిని చూసి దేవుని మహిమపరచారు. (మత్తయి 15:31) 

రూపాంతరపు కొండ

   రూపాంతరపు కొండ మీద యేసు ప్రభువు పేతురు, యోహాను, యాకోబులతో ఉన్నప్పుడు యేసు ప్రభువు ముఖ రూపం మారిపోయింది. ఆయన వస్త్రాలు తెల్లగా ధగ ధగ మెరసిపోయినాయి. మోషే, ఏలీయా లు యేసు ప్రభువు తో మాట్లాడారు. దేవుని మహిమను చూసి శిష్యులు ఆశ్చర్య పోయారు. 

పేతురు గారు ఏమన్నాడు? 

ప్రభువా, నీకు ఒకటి, 

మోషే కు ఒకటి, 

ఏలీయా కు ఒకటి – మూడు పర్ణ శాలలు కడతాను అన్నాడు. 

ఒక మేఘము వచ్చి వారిని కమ్మింది. దేవుడు వారితో ఒక మాట అన్నాడు. ఈయన నా కుమారుడు (లూకా 9:35). 

ఈయన మహిమ వేరు. ఈయన దేవుని కుమారుడు. 

మోషే, ఏలీయా ల వంటి మానవుడు కాదు. 

యేసు క్రీస్తు ప్రభువు మహిమను చూసి యోహాను, యాకోబు, పేతురు ముగ్గురూ సాగిలపడ్డారు.

సిలువ 

   సిలువ లేకుండా మహిమ లేదు. ఎమ్మాయి మార్గములో ఇద్దరు శిష్యులు నడచి వెళ్తూ ఉన్నారు. యేసు క్రీస్తును సిలువ వేశారు. ఇక ఆయన కథ ముగిసింది అని వారు అనుకొన్నారు. యేసు ప్రభువు వారిని కలిసాడు. వారు ఆయనను గుర్తుపట్టలేదు. 

అవివేకులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి 

తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? (లూకా 24:26)

ఆయన మహిమ పరచబడాలంటే ముందు శ్రమ పడాలి. 

ఏ భేదమును లేదు; 

అందరును పాపముచేసి

దేవుడు అను గ్రహించు 

మహిమను పొందలేక పోవుచున్నారు. (రోమా 3:23). 

వారు మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేశారు (1 కొరింథీ 2:8).

They have crucified the Lord of glory 

κύριον τῆς δόξης ἐσταύρωσαν

Kurion tes Doxes 

   సాతానుడు యేసు ప్రభువుతో అన్నాడు: ఈ లోకాన్ని చూడు. ఈ లోక మహిమను నేను నీకు ఇస్తాను. నాకు సాగిలపడు. (మత్తయి 4:8; లూకా 4:6). సాతానుడు ఇస్తానన్న మహిమను యేసు ప్రభువు కోరుకోలేదు. దేవుడు ఇస్తానన్న మహిమను ఆయన కోరుకున్నాడు. 

యేసు క్రీస్తు పునరుత్తానము 

  యేసు క్రీస్తు సమాధి నుండి తిరిగి లేచాడు అంటే అది దేవుని మహిమ వలనే సాధ్యపడింది (రోమా 6:4). తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి లేపబడెను. 

రెండవ రాకడ 

దానియేలు, యెహెఙ్కేలు, యెషయా 

మనుష్య కుమారుడు దేవుని మహిమతో మేఘారూఢుడై వస్తాడు అని దానియేలు ప్రవక్త చెప్పాడు. దానియేలు గ్రంథం 7 అధ్యాయములో. యేసు ప్రభువు ఆ ప్రవచనం పదే పదే గుర్తుచేశాడు. 

మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. (మత్తయి 16:27). ఆయన తన మహిమ గల సింహాసనం మీద కూర్చుంటాడు (మత్తయి 19: 28). ఒలీవల కొండ మీద చేసిన ప్రసంగములో కూడా ప్రభువైన యేసు క్రీస్తు స్పష్టముగా చెప్పడం జరిగింది. 

ఆకాశమందు మనుష్య కుమారుని సూచన కనబడుతుంది.

మనుష్య కుమారుడు ప్రభావముతో, 

మహా మహిమతో, 

ఆకాశ మేఘారూఢుడై వస్తాడు (మత్తయి 24:30; 25:31; మార్కు 13:26; లూకా 21:27). తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా ఆయన వస్తాడు (మార్కు 8: 38).  నా ప్రజలను బబులోను నుండి విడిపిస్తాను అని మహిమ గల దేవుడు యెహెఙ్కేలు కు మాట ఇచ్చాడు. అన్య దేశములో దేవుని మహిమను చూశాడు ( యెహెఙ్కేలు 3:12; 3:23) దేవుని ఆత్మ ఆయనను ఎత్తికొని పోయింది. దేవుని మహిమ యెరూషములో తిరుగుట ఆయన చూశాడు (యెహెఙ్కేలు 9:3). దేవుని మహిమ పరలోకములో నుండి దిగి వచ్చింది. అయితే దేవుని ప్రజలు చేస్తున్న పాపాలు చూసి దేవుని మహిమ అక్కడ నుండి వెళ్ళిపోయింది (యెహెఙ్కేలు 10:18). 

దేవుని మహిమ యెరూషలేములో నుండి వెళ్లిపోవుచూ ఒలీవల కొండ మీద కాసేపు నిలిచింది (యెహెఙ్కేలు 11:23) 

నా మహిమను అన్యజనులలో అగుపరచెదను (యెహెఙ్కేలు  39:21). 

దేవుని మందిరం మహిమతో నిండిపోయి ఉండుట యెహెఙ్కేలు చూశాడు (యెహెఙ్కేలు 43:5). ఆ దృశ్యం చూసి ఆయన సాగిల పడ్డాడు (యెహెఙ్కేలు 44:4). 

దేవుని మహిమ తూర్పు దిక్కున కనిపించింది (యెహెఙ్కేలు  43:2) 

 ఒలీవల కొండ మీద దేవుని మహిమ నిలిచింది. ప్రభువైన యేసు క్రీస్తు ఒలీవల కొండ మీద నుండే పరలోకం వెళ్ళాడు. తిరిగి ఆయన ఒలీవల కొండ మీద పాదం మోపి ఈ ప్రపంచానికి రానై యున్నాడు. 

   యెషయా ఆయన మహిమను చూశాడు (యోహాను 12: 41).  యెషయా ప్రవక్త యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆయన విశ్రమ స్థలము మహిమతో నిండి ఉంటుంది అన్నాడు (యెషయా 11:10). మెస్సియా పాలనలో ఈ భూమి

 దేవుని మహిమతో నిండి ఉంటుంది అని చెప్పాడు (యెషయా 35:2; 40:5). 

యెరూషలేము నగరము కూడా మహిమాతిశయముతో ప్రకాశిస్తుంది

 (యెషయా 66:11). దేవుని మహిమ ప్రకటించబడుతుంది (యెషయా 66:19). 

లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చియున్నాది
యెహోవా మహిమ నీపై – ప్రాకాశముగా నుదయించె             

జనములు నీదు వెలుగునకు – పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ – కాంతీకి వచ్చెదరు                   

లెమ్ము, తేజరిల్లుము, 

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను (యెషయా 60:1). 

జనములు నీ వెలుగునకు వచ్చెదరు. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు (60:3). 

  ఆ విధముగా యేసు క్రీస్తు ప్రభువు రెండవ రాకడ కూడా దేవుని మహిమతో నిండి ఉంటుంది. 

క్రైస్తవ సంఘము 

     సంఘము యేసు క్రీస్తు కృపను బట్టి మహిమ పరచబడింది (2 థెస్సలొనీక 1:10-12). మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల (రోమా 9:23) 

నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని (యోహాను 17:22). 

నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను (యోహాను 17:24). 

   స్తెఫను ను రాళ్లు పెట్టి కొట్టి చంపారు. ఆయన చనిపోయేటప్పుడు ఆకాశము వైపు చూస్తే, దేవుని మహిమ ఆయనకు కనిపించింది. యేసు క్రీస్తు ప్రభువు దేవుని కుడి పార్శ్వమందు నిలబడి ఉండడం చూశాడు. ఆది క్రైస్తవ సంఘము వారు క్రీస్తు మహిమను చూశారు. అదే వారిని ముందుకు నడిపించింది. 

  సౌలు అక్కడ కూర్చొనే ఉన్నాడు. యేసు క్రీస్తు ఏమిటి? దేవుని కుడి పార్శ్వమందు నిలబడి ఉండడం ఏమిటి? అనుకొన్నాడు. దమస్కు లో ఉన్నటు వంటి క్రైస్తవులను హింసించడానికి బయలుదేరాడు. యేసు క్రీస్తు ప్రభువు గొప్ప వెలుగుతో ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మహిమను చూసి సౌలు కంటి చూపు పోయింది. గ్రుడ్డి వాడు అయిపోయాడు (అపో కార్యములు 22:11). 

ఎఫెసీ 3:21 – క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. 

ἡ δόξα ἐν τῇ ἐκκλησίᾳ

He doxa en te ekklesia 

The Glory in the Church 

క్రైస్తవ సంఘమును చూసి పరలోకములో దేవదూతలు ఆశ్చర్యపోతున్నారు. 

నిజముగా దేవుని జ్ఞానము ఎంత గొప్పది అని వారు దేవుని మహిమపరుస్తున్నారు. 

3:10 శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము

The Unfathomable Riches of Christ 

ఎఫెసీ 3:8-10 

8 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు

 చేసిన నిత్యసంకల్పము చొప్పున,

9 పరలోకములో ప్రధానులకును అధికారులకును, 

సంఘము ద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము

 ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి,

10 శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్య మును

 అన్యజనులలో ప్రకటించుటకును

  యేసు క్రీస్తు సంఘమును చూసి పరలోకములో  దేవదూతలు దేవుని మహిమపరుస్తున్నారు. ఈ మనుష్యులు హోప్ లెస్. వారు నరకానికి తప్ప దేనికీ పనికిరారు అని దేవదూతలు అనుకొన్నారు. అయితే అదే మనుష్యులను తీసుకొని వారిని విమోచించి యేసు క్రీస్తు నందు వారిని ఏకం చేశాడు. ఆ దేవుని జ్ఞానం చూసి దేవదూతలు సహితం ఆశ్చర్యపోతున్నారు అని పౌలు అంటున్నాడు. 

క్రైస్తవ నిరీక్షణ 

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట

ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవికావని యెంచు చున్నాను (రోమా 8:18). 

మనకు నిరీక్షణ ఇచ్చేది దేవుని మహిమే (రోమా 5:2). 

క్రైస్తవ పునరుత్తానము 

ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును (1 కొరింథీ 15:43) 

క్రైస్తవ స్వాతంత్రం 

కాబట్టి మీరు భోజనముచేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును 

దేవుని మహిమకొరకు చేయుడి (1 కొరింథీ 10:31). దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం (రోమా 8:18). 

క్రెస్తవ దాతృత్వం 

మనం ఒకరిని ఒకరు చేర్చుకొన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది (రోమా 15:7). 

  ఆ విధముగా దేవుని మహిమైశ్వర్యము మన ప్రభువైన యేసు క్రీస్తు నందు మనకు ప్రత్యక్షం అయ్యింది. ఆయన జన్మ, ఆయన బోధలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన సిలువ, పునరుత్తనము, ఆయన స్థాపించిన క్రైస్తవ సంఘం, రెండవ రాకడ – వీటన్నిటిలో దేవుని మహిమైశ్వర్యము స్పష్టముగా మనకు కనిపిస్తుంది. 

దేవుని ఐశ్వర్యం వలన విశ్వాసికి వచ్చే ప్రయోజనాలు ఏమిటి? 

    దేవుని కృపామహదైశ్వర్యం దేవుని మహిమైశ్వర్యము వద్దకు మనలను నడిపించింది. అది లేకుండా ఇది లేదు. విశ్వాసము వలన మనకు దేవుని కృప యందు ప్రవేశం కలిగింది. ఆ తరువాతే దేవుని మహిమ ను మనము కనుగొన్నాము (రోమా 5:2). ఇప్పుడు మనం ఏమి చేయాలి? 

దేవుని వలె ప్రవర్తించు 

   యేసు ప్రభువు మనకు చెప్పాడు. లూకా 6:32. అందరికీ కృప చూపించండి. దేవుడు తన కృపామహదైశ్వర్యం మనకు చూపించాడు కాబట్టి మనం కూడా ఇతరుల యెడల కృప చూపిస్తూ ఉండాలి. కృప క్రింద ఉన్నాను, ధర్మ శాస్త్రం క్రింద లేను అని పాపములు చేయకూడదు (రోమా 6:15). వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. ఎఫెసీ 4:29. మన సంభాషణలు ఉప్పు వేసినట్లు, రుచికరముగా, కృపా సహితముగా ఉండాలి (కొలొస్స 4:6). అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును (యాకోబు 4:6). మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగము చేయకూడదు (యూదా 1:4) 

యేసు క్రీస్తు పలికిన మాటలు దేవుని కృప తో నిండుకొని ఉన్నాయి (లూకా 4:22).

దేవుని స్తుతించు 

Charin is Grace; Chariti is Thankfulness; Charin అంటే gratitude 

ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని పౌలు అన్నాడు (1 తిమోతి 1:13). 

కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయండి (కొలొస్సయి 3:16). దేవుని కృపామహదైశ్వర్యమును చూసి అపోస్తలుడైన పౌలు దేవుని స్తుతించాడు. ఇతర విశ్వాసుల జీవితములలో దేవుని కృప విస్తరించడం చూసి ఆయన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు (1 కొరింథీ 1:4). 

 ప్రకటన 5:12 

వారు వధింపబడిన గొఱ్ఱపిల్ల, 

శక్తియు ఐశ్వర్యమును 

జ్ఞానమును బలమును 

ఘనతయు మహిమయు 

స్తోత్రమును పొందనర్హుడు 

దేవుని ఐశ్వర్యమును బట్టి మనం ఆయనకు స్తుతించాలి, మహిమ పరచాలి, ఆరాధించాలి. 

నీ అవసరాలు తీర్చుకో 

క్రైస్తవ విశ్వాసి ప్రతి రోజూ దేవుని యొక్క సర్వ సమృద్ధి పొంది, దేవుని మహిమ కొరకు జీవించడానికి దేవుడు సమస్త విధములైన కృపను విస్తారముగా వారికి ఇస్తున్నాడు. (2 కొరింథీ 9:8) 

ఫిలిప్పి 4:19 

కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున 

క్రీస్తుయేసునందు 

మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పి 4:19 

ప్రకృతి సంబంధమైన అవసరాలు, ఆత్మ సంబంధమైన అవసరాలు – ఈ రెండూ తీర్చగల ఐశ్వర్యం దేవుని యొద్ద ఉంది. 

ధైర్యముగా బ్రతుకు 
కొలొస్సయి 2:2-3 

వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, 

దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో

ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.

Riches of the Full Assurance 

సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము

సంపూర్ణ గ్రహింపు 

πᾶν πλοῦτος τῆς πληροφορίας

pan ploutos tes plerophorias 

All Riches of the Full Assurance 

ఈ క్రొత్త సంవత్సరములో మీకు కావలసినది అదే. 

Full Assurance 

Full Confidence

Full Hope

మీరు మార్కెట్ కి వెళ్లారు. షాపింగ్ చేద్దాము అనుకొన్నారు. 

వంకాయలు  ఒక కేజీ, ఉల్లిపాయలు ఒక కేజీ,మిరపకాయలు ఒక కేజీ, 10 కిలోలు బియ్యం కొనాలనుకొన్నారు. మీ జేబులో రెండు వేల రూపాయలు వున్నాయి. ఆ విషయం మీకు తెలుసు. ఆ విషయము మీకు తెలిస్తే మీరు ఆ కూరగాయలు ధైర్యముగా కొనుక్కొంటారు. ఆ విషయము మీకు తెలియకపోతే. ఆ వంకాయలు, మిరపకాయలు చూసినప్పుడు మీకు భయం వేస్తుంది. నేను వాటిని కొనలేను. నాకు ఆ శక్తి లేదు అని మీరు అనుకొంటారు. మీ జేబులో రెండు వేల రూపాయలు ఉన్నాయండి అని నేను మీకు చెబితే మీరు వాటిని చూసుకొని ధైర్యముగా షాపింగ్ చేస్తారు. దేవుడు మనతో అంటున్నది అదే. నేను నీ జేబులో క్రీస్తు ఐశ్వర్యం పెట్టాను. ధైర్యముగా బ్రతుకు. ఈ లోకములో నీకు కలిగే బాధలు, శ్రమలు, కష్టాలు, అప్పులు, నిరాశ, నిస్పృహలు, ఆందోళన, అనారోగ్యం వాటిని చూసి కృంగిపోకు’. అయితే సాతానుడు ఆ మాట మనకు చెప్పడు. నీ దగ్గర దరిద్రం తప్ప ఏమీ లేదు. నీ భవిష్యత్తు చీకటితో నిండి ఉంది. దేవుడు నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు వేస్ట్. నీ జీవితం వేస్ట్ అని అంటాడు. అయితే సాతాను చెప్పే మాటలు మనం వినకూడదు. దేవుడు మనతో ఏమంటున్నాడంటే, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యముతో జీవించు. 

πᾶν πλοῦτος τῆς πληροφορίας

pan ploutos tes plerophorias 

All Riches of the Full Assurance అంటే అదే. 

plerophorias అంటే యేసు క్రీస్తు ప్రభువు నందు దేవుడు మనకు 

ఇచ్చిన ఐశ్వర్యం చొప్పున మన జీవితములో ప్రతి రోజునూ దేవుని 

కృపతో, కరుణతో, మహిమతో నింపుకొంటూ ధైర్యముగా, నిశ్చయతతో జీవించడం. 

సకలైశ్వర్యము 

మీ క్రొత్త సంవత్సరములో ఏమి జరుగుతున్నది? నాకేమి కలుగ బోతున్నది? 

నేనేమై పోతాను అని అయోమయం జగన్నాధం లాగా బ్రతకవద్దు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము తో బ్రతుకు

సకలైశ్వర్యము 

ఏమి జరుగుతున్నది? నాకేమి కలుగ బోతున్నది? అని అయోమయం జగన్నాధం లాగా బ్రతకవద్దు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము తో బ్రతుకు. అభయం. ఇక నేను దేని గురించి విచారించనవసరం లేదు. ఆ శారీరక అవసరాల గురించి నేను విచారించాను. ఎందుకంటే నా దేవుడు ఐశ్వర్యవంతుడు నా రక్షణ గురించి నేను విచారించాను. ఎందుకంటే దేవుడు తన కృపలో ఐశ్వర్యవంతుడు నా ఆత్మ గురించి నేను విచారించను. నా అజ్ఞానము గురించి నేను విచారించను. ఎందుకంటే దేవుడు తన జ్ఞానములో ఐశ్వర్యవంతుడు నా బలహీనతల గురించి నేను విచారించను. ఎందుకంటే దేవుడు తన మహిమలో ఐశ్వర్యవంతుడు. 

దేవుని కృప, దేవుని శాంతి రెండూ కలిసి వెళ్తున్నాయి (1 కొరింథీ 1:3). మన హృదయములను స్థిరపరచేది దేవుని కృపే (హెబ్రీ 13:9)

నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. 

భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది

శుభప్రదమైన నిరీక్షణతో బ్రతుకు 

2 థెస్సలొనీక 2:16: మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును

యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. (1 పేతురు 1:13). 

మంచి నిర్ణయాలు తీసుకో 

ఈ లోక సంబంధమైన ధనం అస్థిరమైనది (1 తిమోతి 6:17). అది తుప్పు పట్టిపోతుంది (యాకోబు 5:3).  అది పాడై పోయేది (ప్రకటన 18: 19) ఈ

 లోకములో మీకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఒక్క రోజు కూడా ఎక్కువ బ్రతకలేరు. అయితే దేవుని యొక్క ఐశ్వర్యం స్థిరమైనది. 

హెబ్రీ 11:24-26 

మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె 

క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,అల్పకాలము పాప భోగము 

అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,ఫరో కుమార్తెయొక్క 

కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు

బహుమానమందు దృష్టి యుంచెను.

   ఐగుప్తు ధనము కంటే దేవుని ఐశ్వర్యం గొప్పది. ఫరో ప్యాలస్ లో జీవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఏమిటో, పిచ్చి మాలోకం. ఇదంతా వదిలి వేసుకొని అరణ్యములోకి వెళ్తున్నాడు అని చాలా మంది అనుకొన్నారు. అయితే మోషే క్రీస్తు మర్మం చూశాడు. దేవుడు ఇచ్చే ఐశ్వర్యం గొప్పది అనుకొన్నాడు. 

పౌలు గారిని కూడా అలానే అవమానించారు. పౌలా, నువ్వు వెఱ్ఱివాడివి. అధిక విద్య వలన నీకు పిచ్చి పట్టింది అన్నారు. అయితే పౌలు గారు క్రీస్తు మర్మం గ్రహించాడు. దేవుడు ఇచ్చే ఐశ్వర్వం గొప్పది అనుకొన్నాడు. ఈ లోక సంబంధమైన ధనాన్ని పెంటగా భావించాడు. 

యేసు క్రీస్తు ప్రభువు నందు దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని నీవు గుర్తించి, దానితో నీ జీవితమును సమృద్ధిగా నింపుకొందువు గాక! 

Leave a Reply